రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ న్యాల్కల్ మండలం వివిధ మండలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి కార్యవర్గ సభ్యుడు సునీల్ ధత్, న్యాల్కల్ ఎంపీటీసీ శ్రీశైలం, గోపాలరెడ్డి, దేవదాస్, తుల్జారాం, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్ నౌబత్ జగనాథ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సుధీర్ భండారి బక్కాయ గుప్తా సమక్షంలో జహీరాబాద్ పట్టణ కమిటీని నియమించినట్లు జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ గారు తెలిపారు ఈ సందర్భంగా పూల సంతోష్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని నియమనిబంధన పాటించాలని రాబోయే స్థానిక జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగిరి విధంగా ప్రతి పదాధికారి కార్యకర్త పని చేయాలని క్రమశిక్షణతో పార్టీకి చేయాలని కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
కర్నూల్ రోడ్డు లో మురికి కాలువ ని oడి రోడ్డుపై మురికి నీరు
రోడ్డు పై నడిచే ప్రజలకు దుర్వసాన
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు సంగం ఫంక్షన్ హాల్ ఎదురుగా మెయిన్ రోడ్డు మురికి కాలువ నిండి రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుండడం వల్ల రోడ్డుపై నడిచి వెళ్లే ప్రజలు వాహనదారులు దుర్వాసనకు ఇబ్బందులకు గురవుతున్నారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నది వర్షాకాలం ప్రారంభమైనది మురుగనీరు జామ్ కావడం వల్ల దోమలు ఈగలు పురుగులు కాలు వ పై వాలి ప్రజలకు కుట్టినచో మలేరియా డెంగ్యూ ఇతర వ్యాధులు ప్రబలించి రోగాల బారిన పడే అవకాశం ఉన్నదని ప్రజలంటున్నారు వెంటనే జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మెగా రెడ్డి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకొని పై మురికి నీరు రోడ్డు పై ప్రవహించకుండా కాలువ నిర్మాణం చేపట్టాలని ప్రజలు ఒక ప్రకటనలో కోరారు
కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్.
మరిపెడ కురవి నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ని జుజ్జూర్ తండాలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా హాజరైన కురవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద వాడికి సొంత ఇంటి నిర్మాణం అని ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని ద్రుడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు,జిల్లాలో జూన్ పదవ తారీకు వరకు ప్రోసిడింగ్ కాపీలు మంజూరు చేసి బేస్మెంట్ లెవెల్ పూర్తిచేసిన అన్నిటికీ డబ్బులు వెంటనే ఇస్తామన్నారు , గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి పేదవారికి సొంత ఇల్లు నిర్మాణ పథకం ప్రవేశ పెట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావలసిన ఇసుక రిచ్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి శ్రీనివాస్ గౌడ్, జుజుర్ తండా గ్రామ అధ్యక్షుడు బానోత్ రవి, ఉపాధ్యక్షుడు ధరావత్ మోతిలాల్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు డాక్టర్ ధరావత్ వీరన్న నాయక్, పూల్ సింగ్ నాయక్ , నవీన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి భవాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమకృత కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది.రాబోయే అంతర్జాతీయ జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ని చేపడుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులు, యువకులు,వృద్ధులు,జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, సహాయ నోడల్ అధికారులు డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత,రాజన్న సిరిసిల్ల జిల్లా డి.పి.ఎం తిరుపతి యోగ శిక్షకులు బొల్లాజీ శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉందా..
గోదారి జలాలపై తెలంగాణ నీటివాటా కోల్పోయే ప్రమాదం.
చంద్రబాబుతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి.
బిఆర్ఎస్ రాష్ట్ర నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
నర్సంపేట నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉన్నదా అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు. నర్సంపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడిపై రైతులు,ప్రజలు చైతన్యం కావాలని ఈ సందర్భంగా కోరారు.తన గురువు చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై ఆంధ్ర ప్రాజెక్టులకు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి గోదావరి జలాలను ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి కాలేశ్వరంపై అవినీతి కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా వినియోగించకుండా రైతుల పొలాలను ఎండబెడుతూ ఆంధ్రాలో నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు కోసం గోదావరి నీటిని లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో కలిసి తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేసే దేవాదుల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు రామప్ప పాకాల రంగాయా చెరువు లాంటి ప్రధాన ప్రాజెక్టులను ఎండబెట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వలన గోదావరి జలాలపై తెలంగాణ నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఉందని, నిన్న తెలంగాణ జాతిపిత కెసిఆర్ ను గోష్ కమిషన్ ముందు పిలిపించి రాక్షసానందం పొందిన రేవంత్ సర్కార్ కు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న నేపంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.నేడు గ్రామాలలో,పట్టణాలలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నదని ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.ఈ సమావేశంలో రాయుడి రవీందర్ రెడ్డి,నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,వేములపల్లి ప్రకాష్ రావు,సుకినే రాజేశ్వర్ రావు, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బానోతు సారంగపాణి, గందె శ్రీనివాస్ గుప్త, చెట్టుపెళ్లి మురళిదర్ రావు, కామిశెట్టి ప్రశాంత్, కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు అర్హులకు ఇవ్వాలి.కార్యకర్తలకు కాదు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ మాట్లాడుతూగుంట భూమి కూడా లేని పేదల పేర్లు తొలగించి భూస్వామిని పేరు పెట్టించడం జరిగిందిఅని ఇది ప్రజల ప్రభుత్వం అని గొప్పలు చెప్పి కార్యకర్తల ప్రభుత్వంగా ఇందిరమ్మ ఇల్లు కార్యకర్తలకు,కుటుంబ సంబంధితులకు మాత్రమే ఇల్లు ఇప్పిస్తున్నారు అని ఇది సమంజసం కాదని ఇలా చేస్తే ఒంటెద్దు పోకడ గా వెళ్తే ప్రజలు త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని అర్హులందరికీ న్యాయం చేయాలని అన్నారు మాజీ జెడ్పి టిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ. ఇప్పటికి కైనా న్యాయ విచారణ చేసి అర్హులందరికీ ఇల్లు ఇవ్వాలని లేని యెడల దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని హెచ్చరించారు.నిరుపేదల పక్షాన పోరాటం చేయడానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటది అని తెలిపారు. అర్హులు కి ఇల్లు ఇవ్వకుండా నాయకులకు ఇల్లు ఇస్తూ ఇష్టరీతినా వ్యవహరిస్తే తప్పకుండ ప్రజల నుండి శిక్ష అనుభవిస్తారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్,బి ఆర్ ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు నవీన్, బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు ఎరుగొండ రాజేందర్, మడికొండ రవీందర్ రావు, జిల్లా మండల నాయకులు దామెర రాజు, వీరాస్వామి, పెరుమాండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం..
మందమర్రి నేటి ధాత్రి
బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం.. అనే నినాదంతో కూడిన కరపత్రాల ద్వారా ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం పై సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు పట్టణ కూడలిలో అవగాహన కల్పించారు.అనంతరం సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడారు. బాలలు, బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. అందుకే బాలలకు తగిన విద్యాభ్యాసం, శిక్షణ అందించి విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యతగా గుర్తించాలన్నారు..వ్యవసాయ సంస్కరణలు, ఉపాధి కల్పన పథకాలు, పేదల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించటం, అవ్యవస్థీకృత రంగాలను ప్రోత్సహించటం, సహకార సంఘాల ఏర్పాటు, సాంఘిక భద్రతా పథకాల రూపకల్పన వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉపయోగపడతాయన్నారు. అందువల్ల ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. బాలలను కార్మికులుగా మార్చే హక్కు ఎవరికీ లేదని, బాలలను కార్మికులుగా మార్చిన వారిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, వారి సంకెళ్ళను తెంచే బాధ్యత మనందరిపై ఉందన్నారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు, సైకాలజిస్ట్ డా. అంబాల సమ్మయ్య, సభ్యులు రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.
గుండెపుడి, రాంపురం పాఠశాల లో సామూహిక అక్షరాభ్యాసం.
మరిపెడ నేటిధాత్రి:
విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతియేటా నిర్వహించే ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కార్య క్రమాన్ని 2025 – 26 విద్యా సంవత్సరానికి ఈ నెల జూన్ 6 – 19వ తేదీ వరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్, గుండెపుడి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నామ చేతుల మీదుగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు, పేద మధ్య తరగతి పిల్లలకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేస్తుందన్నారు,సర్కారు బడుల్లోని వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు వివరించరు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు,అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ, ఉపాధ్యాయులు నివేదిత, దోమల లింగన్న గౌడ్,మురళి, సునీత,మాధవి, రాంపురం పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి గణేష్, గ్రామ పెద్దలు, బందు పరశురాములు, బందు వీరన్న, ఎడ్ల ఉపేందర్, ఆశా వర్కర్లు బందు మంజుల, మమత, చింతపల్లి ఉమా,తదితరులు పాల్గొన్నారు.
-86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 8 మంత్రి పదవులా..!
-ఇదెక్కడి సామాజిక న్యాయం
-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రాష్ట్ర మంత్రివర్గంలో ఓసీలకు ఉత్తమ శాఖలను కేటాయించి..బీసీలకు ఉత్తిత్తి శాఖలను కేటాయించడం దేనికి నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా? అని ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న అగ్రవర్ణాలకు అత్యంత కీలకమైన..బడ్జెట్ ఉన్న 7 మంత్రి పదవులను కేటాయించి..86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత లేని..బడ్జెట్ లేని 8 మంత్రి పదవులను కేటాయించడం ఇదెక్కడి సామాజిక న్యాయమంటూ నిలదీశారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే అందుకనుగుణంగా రాష్ట్రంలో కులగణన చేపట్టి..రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ..చట్టాన్ని చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. మిగిలి ఉన్న మిగతా 3 మంత్రి పదవులను బీసీలకు కేటాయించాలని, అదేవిధంగా మంత్రివర్గంలో మార్పులు చేసి ప్రాధాన్యత కలిగిన పదవులను బీసీలకు కేటాయించాలని వేముల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.
మందమర్రి సింగరేణి పాఠశాల కళ్యాణి ఖని లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలని కార్మికులు విద్యార్థులు కోరుతున్నారు. డ్రాయింగ్ మాస్టర్ లేక విద్యార్థులు వారి నైపుణ్యాన్ని కోల్పోతున్నారని సింగరేణి ప్రాంతంలో 9 సింగరేణి పాఠశాలలు ఉండగా ఒక్క పాఠశాలలోనే డ్రాయింగ్ టీచర్ కొనసాగుతున్నాడు. ఆ ఉపాధ్యాయుడు కూడా త్వరలో కొద్ది నెలలో రిటైర్డ్ కాబోతున్నాడని సింగరేణి పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ ఉపాధ్యాయులను నియమించాలని కార్మికులు విద్యార్థులు కోరుతున్నారు. సింగరేణి కోల్ బెల్టు ప్రాంతమైన కొత్తగూడెం మణుగూరు ఇల్లందు భూపాలపల్లి గోదావరిఖని సెక్టార్ 2 సీసీసి మందమర్రి గోలేటి లో డ్రాయింగ్ టీచర్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారు న్యూస్ టుడే కు ఆవేదన చెప్పారు. ఎన్ ఈ పి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం విద్యార్థులకుబోధనతోపాటుసృజనాత్మకత విద్యను అందించుటకు చాలా దోహదపడుతుందిని డ్రాయింగ్ టీచర్లను నియమించాల్సిందిగా సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీకి విద్యార్థుల తల్లిదండ్రులు విన్నపం చేస్తున్నారు. సింగరేణి పాఠశాలలో ఎన్నోమార్పులు తీసుకొచ్చిన సెక్రెటరీ విద్యార్థులు నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం డ్రాయింగ్ పోస్టును నియమించాలని సింగరేణి కార్మికులు విద్యార్థులు కోరుతున్నారన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని విద్యానగర్ సెక్టర్ లో గల మందమర్రి నాలుగవ కేంద్రం,ఒకటవ జోన్ లోని మూడవ కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని గురువారం రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి, సిడిపిఓ హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా బడిబాట ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ లో నూతనంగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, అంగన్వాడీ కేంద్రాలు అమ్మ ఒడిలాంటివి అని, పిల్లల భవిష్యత్తుకు పునాదులు లాంటివని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టి డబ్ల్యూ ఓ రోఫ్ ఖాన్, సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ సరిత, అంగన్వాడి టీచర్లు, ఆయమ్మలు, పిల్లల తల్లితండ్రులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
— ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య • సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్న డీఈవో రాధా కిషన్
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని కూడా ప్రభుత్వమే అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో కూడా ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని ఆయన కొనియాడారు. ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వచ్చే విధంగా చూడాలన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సంఘాన్ని యాదగిరి, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, ఉపాధ్యాయులు నవీన్ రత్నాకర్, మోహన్, మమత, జ్యోతిలక్ష్మి ఉన్నారు.
హిస్టారికల్ కోర్ట్ రూ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే..
1919లోబ్రిటీష్ హాయాంలో జరిగిన దారుణ మారణ కాండ జలియన్ వాలా బాగ్‌కు మూల కారకుడైన అప్పటి పంజాబ్ జనరల్ మైఖైల్ ఓ డ్వేయర్ ఆ వార్త బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తాడు.
ఆపై తమకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని ఆ సమయంలో వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడైన అడ్వకేట్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)ను డ్వేయర్ కోరుతాడు.
కానీ ఆక్కడ జరిగిన మారణకాండ విషయం తెలుసుకున్న ఆయన అందుకు ససేమిరా అని అక్కడిక్కడే తన పదవికి సైతం రాజీనామా చేసి డయ్యర్‌పైనే కేసు వేస్తాడు.
Kesari Chapter 2
దీంతో జనరల్ మరో ప్రముఖ అడ్వకేట్ నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్.మాధవన్)ని ఆశ్రయించడంతో కేసు రసవత్తరంగా మారుతుంది.
ఈ క్రమంలో శంకర్ నాయర్, మెక్‌కిన్లేల మధ్య ఎలాంటి వాదనలు జరిగాయి, నాటి దురాగతాన్ని ఎలా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు.
చివరకు కథ ఎన్ని మలుపులు తిరిగిందనే కథకథనాల చుట్టూ సినిమా సాగుతూ నాటి జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను తలుచుకుని ఎమోషనల్‌గా ఫీలయ్యే విధంగా మూవీ నడుస్తుంది.
ఇప్పుడీ చిత్రం జూన్ 13 శుక్రవారం నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమా చూడలేక పోయిన వారు, మల్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు ఎలాంటి సమస్య లేకుండా ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో కలిసి ముఖ్యంగా పిల్లలకు నాటి జలియన్ వాలా బాగ్ ఘటనను తెలియజేస్తూ మూవీ వీక్షించవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్ అన్నారు. దేశాయిపేట షాదిఖానాలో రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వరంగల్ మండల తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కవిత మాట్లాడుతూ భూముల్లో ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ పరంగా కొలతల్లో పాస్ పుస్తకాల్లో సమస్యలు ఏమైనా ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం భూమి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.
వరంగల్ మండల తహసిల్దార్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజలు భూ సమస్యల మీద కార్యాలయాల చుట్టు తిరుగుతున్న క్రమంలో అధికారులు ఒక్కోసారి అందుబాటులో లేకపోవడం వాళ్ళు వెనుక తిరగడం జరిగేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న భూభారతి చట్టం ద్వారా సమస్యలు ఉన్నచోటకే అధికారులు వెళ్లి గ్రామ సభలు నిర్వహించి రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించడం సమస్య ఎదుర్కొంటున్న వారికి ఇదొక మంచి అవకాశం అని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని భూ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొనగా బాధితులు దరఖాస్తులు సమర్పించుకున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కాసింపల్లి లో భూ భారతి అవగాహన సదస్సు నిర్వహించిన భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు డిప్యూటీ తాసిల్దార్ అంజలి రెడ్డి అనంతరం భూ భారతి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఆర్ ఐ రామస్వామి సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ముందే ఓటీటీకి వచ్చి షాకిచ్చిన లేటెస్ట్ స్పొర్ట్స్ కామెడీ మూవీ…
ప్రేమలు హీరో నస్లెన్ మరో ముగ్గురు యువ నటులు కీలక పాత్రల్లో నటించగా థియేటర్లలో మంచి విజయం సాధించిన మలయాళ అనువాద చిత్రం ఓ రోజు ముందే ఓటీటీకి వచ్చి షాకిచ్చింది.
ప్రేమలు హీరో నస్లెన్ (Naslen) మరో ముగ్గురు యువ నటులు కీలక పాత్రల్లో ఏప్రిల్ నెలాఖరున థియేటర్లలోకి వచ్చి మంచి పాజిటివ్ టాక్‌తో విజయం సాధించిన మలయాళ అనువాద చిత్రం అలప్పుజ జింఖానా (Alappuzha Gymkhana). తెలుగు కన్నా ముందే ఏప్రిల్ 10న కేరళలో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. గతంలో టొవినో థామస్, కళ్యాణి ప్రియదర్శన్ కాంబోలో తల్లుమాల (Thallumaala) అనే సినిమాతో కేరళను షేక్ చేసిన ఖలీద్ రహమాన్ (Khalid Rahman) ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించడం విశేషం. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం రూ. 70 కోట్ల వరకు వసూళ్లు చేసి కేరళ నాట హయ్యెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో టాప్5లో నిలిచింది. సుమారు 55 రోజుల తర్వాత ముందస్తుగా ప్రకటించిన డేట్ కన్నా ఓ రోజు ఎర్లీగానే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాకిచ్చింది.
సినిమా టికెట్లు
కథ విషయానికి వస్తే.. జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత, పెద్దోడు, చిన్నోడు, సెహనావాస్ ఐదుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే ఇంటర్ ఫలితాల్లో ఒకరు మాత్రమే పాస్ అవుతారు.ఇక రెగ్యులర్‌గా కాలేజికి వెళ్లి చదువుకోవడం మన వళ్ల కానీ పని అని డిసైడ్ అయి కొత్తగా ఏదైనా ట్రై చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం బాక్సింగ్ పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో పాస్ మార్కులతో బయట పడొచ్చని ఫ్లాన్ చేస్తారు. ఈక్రమంలో సమీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడమీలో శిక్షణ కోసం చేరుతారు. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ తీసుకునే క్రమంలో వారు ఆ పని సరిగ్గా చేయలేక, సీరియస్‌నెస్ లేక బాక్సింగ్ కోచ్ ముందు, అమ్మాయిల ఎదుట చేసే విన్యాసాలు, జిమ్మిక్కులు ఆపై డిస్ట్రిక్ లెవల్, స్టేట్ లెవల్ టోర్నమెంట్స్ ఆడాల్సి రావడంతో చివరకు ఆ కుర్రాళ్లు ఏం చేశారు, చివరకు ఎలా ముగించారనే ఆసక్తికర కథకథనాలతో సినిమా సాగుతుంది.
కాగా ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఫుల్ ఫన్ మోడ్‌లోనే సాగుతూ ప్రేక్షకులకు తీరిక ఇవ్వని వినోదంతో ఆకట్టుకుంటుంది. అయితే మూవీలో ఫలానా వాడు హీరో అని చెప్పలేం. నస్లైన్ తప్ప అందరూ మనకు ఏమాత్రం పరిచయం లేని మొహాలే అయినా ఐదుగురి పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. వారి చుట్టే కథ తిరుగుతూ వారి నటన, డైలాగులు, వన్ లైనర్స్ వాటినన్నింటినీ మరిచి పోయేలా చేస్తుంది. మూవీ స్టార్ట్ అయిన నిమిషం నుంచే పంచులు, తెలుగు ఫేమస్ మీమ్స్ అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వద్ద జాతకం చూపించి చెప్పాలా వంటి వన్ లైనర్స్ తో కిక్ ఇస్తారు. ఫస్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్, అమ్మాయిలకు సైట్ కొట్టే సరదా సరదా సన్నివేశాలతో నవ్విస్తారు.
ఇక సెకండాఫ్ అంతా బాక్సింగ్ కోర్టులో యాక్షన్ సీన్లతో ఆటాడేసుకుంటారు. మిత్రులు ఒక్కొక్కరు బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లే ముందు తోటి మిత్రులు ఇచ్చే బిల్డప్‌లు, వచ్చేపాట, డైలాగులు సీటులో కూర్చోనియకుండా నవ్విస్తాయి. ఎక్కడా అసభ్యత, అశ్లీలతలకు చోటివకుండా పాత్రల మధ్య సందర్భోచిత కామెడీతో ఆలరిస్తారు.ఇక క్లైమాక్స్ హీరో ఇంట్లో సన్నివేశం సినిమాకే హైలెట్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో అదిరిపోతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 12 నుంచి సోనీల లివ్ (SONY LIV) ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. చివరి వరకు మంచిగా ఎలాంటి బాదరబందీ లేకుండా హాయిగా మనస్పూర్తిగా నవ్వుకోవాలంటే, ఎలాంటి లాజిక్‌లు వెతక్కుండా కుటుంబం అంతా కలిసి ఈ సినిమా చూసి తీరాల్సిందే.
అయితే నగరంలో జరుగుతున్న వరుస హత్యల కేసుని డీల్ చేస్తున్న పోలీస్ అధికారి రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ బాధ్యత అరవింద్ తీసుకుంటాడు.
ఆపై కూడా వరుస హత్యలు కొనసాగుతూనే ఉన్నా హంతకుడు, హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎంతకీ లభించవు.
ఈ క్రమంలో చివరకు ఆరో హత్య దగ్గర లభించిన ఓ చిన్న క్లూతో కేసులో కదలిక వచ్చి ఒక్కొక్కరిగా హత్యకు గురైన వాళ్ల వివరాలు బయటకు వస్తాయి.
కానీ హత్యలు చేసేది ఎవరనే విషయం మాత్రం తెలియదు.
చివరకు అరవింద్ ఏం చేశాడు.
హంతుకుడిని పట్టుకో గలిగాడా?
లేదా అతను ఈ దారుణాలు చేయడానికి కారణమేంటి?
ట్విన్ బర్డ్ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి?
ఈ కథలో బెంజిమన్ పాల్, ఫ్రాన్సిస్ ఎవరు?
అన్నది కథ.
సినిమా ఆరంభమైన 10 నిమిషాలలోనే ఇన్వెస్టిగేషన్ మొదలై..
ప్రేక్షకులకు స్పైన్ చిల్లింగ్ ఇస్తూ సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.
అంతేగాక సీరియల్ కిల్లర్ బ్యాగ్రౌండ్ స్టోరీ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది.
మరి కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సైతం ఆకట్టుకుంటాయి.
ఇక ఫ్రీ ఇంటర్వెల్‌కు ముందే కిల్లర్ బయటపడ్డప్పటికీ చివర్లో వచ్చే ట్విస్టు సైతం గూస్‌బమ్స్ తెచ్చేలా ఉంటుంది.
ఇప్పుడీ సినిమా జూన్ 13 శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోనే కాకుండా మరో మూడు ఓటీటీల్లో (ఆహా తమిళ్, టెన్ కొట్టా, సింప్లీ సౌత్) స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో మిస్సయిన వారు, మంచి థ్రిల్లర్ చిత్రం చూడాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలెవన్ (Eleven) సినిమాను మిస్ అవకుండా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఇదిలాఉంటే నవీన్ చంద్ర నటించిన మరో థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్ సైతం ఈ సినిమా విడుదల రోజే థియేటర్లలోకి రాగా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కూడా ఓకే రోజు రావడడం గమనార్హం.
సినిమా రివ్యూవర్లపై.. దయ్యం పగ! డీడీ నెక్స్ట్ లెవెల్ ఓటీటీకి వచ్చేసింది
పాపులర్ తమిళ కమెడియన్ సంతానం హీరోగా నటించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ ఓటీటీకి తెలుగులోనూ వచ్చేసింది.
పాపులర్ తమిళ కమెడియన్ సంతానం (Santhanam) హీరోగా నటించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ (DD Next Level).
సెల్వ రాఘవన్ (Selva raghavan), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), గీతికా తివారి (Geethika Tiwary) తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ (S. Prem Anand) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
గతంలో సంతానం నటించిన హర్రర్, కామెడీ సినిమా డీడీ రిటర్న్స్ కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం మే16న ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం పాలైంది.
ఇప్పుడీ సినిమా నెల తిరగకుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
కథ విషయానికి వస్తే.. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే కృష్టమూర్తి (సంతానం) తరుచూ కొత్త సినిమాల రివ్యూలు ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటుంటాడు.
ఒకసారి ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ అనే సినిమా స్క్రీనింగ్‌కు హాజరు కావాలని మూవీ ఫ్యారడైజ్ అనే థియేటర్ నుంచి కృష్టమూర్తి, మరికొంతమంది రివ్యూవర్స్‌కి ప్రత్యేక ఆహ్వానం వస్తుంది.
దీంతో ఈ సినిమా చూడడానికి కృష్ణమూర్తి అక్కడ చిక్కుకుపోతాడు.
గతంలో తన రివ్యూ వళ్ల నష్టపోయిన నిర్మాత దయ్యంగా మారి ట్రాప్ చేసి ఇక్కడకు తీసుకు వచ్చినట్లు తెలుసుకుంటాడు.
అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు గానీ సాధ్య పడదు..
పైగా ఆ థియేటర్లో రన్ అవుతున్న సినిమాల్లో వచ్చి పడతాడు.
ఈక్రమంలో కృష్ణమూర్తి ఆ సినిమాలో నుంచి ఆపై దయ్యం, థియేటర్ నుంచి ఎలా బయట పడ్డాడనే నేపథ్యంలో సినిమా సాగుతుంది.
వినడానికి, చూడడానికి ఈ మూవీ ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగాఫెయిల్ అయి సెకండాఫ్ కాస్త ఇబ్బంది పెడుతుంది.
అయినా ఒక సారి ఈ సినిమాను చూసేందుకు ప్రయత్నించవచ్చు.
ఇప్పుడీ చిత్రం జీ5 (zee 5) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
హర్రర్ చిత్రాలు ఇష్టపడే వారు ఒకసారి ఈ ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ (DD Next Level) చిత్రాన్ని ట్రై చేయవచ్చు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.