ఓసీలకు ఉత్తమ శాఖలు..!

ఓసీలకు ఉత్తమ శాఖలు..!

-బీసీలకు ఉత్తుత్తి శాఖలు..!!

-17 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 7 మంత్రి పదవులు

-86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 8 మంత్రి పదవులా..!

-ఇదెక్కడి సామాజిక న్యాయం

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

రాష్ట్ర మంత్రివర్గంలో ఓసీలకు ఉత్తమ శాఖలను కేటాయించి..బీసీలకు ఉత్తిత్తి శాఖలను కేటాయించడం దేనికి నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా? అని ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న అగ్రవర్ణాలకు అత్యంత కీలకమైన..బడ్జెట్ ఉన్న 7 మంత్రి పదవులను కేటాయించి..86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత లేని..బడ్జెట్ లేని 8 మంత్రి పదవులను కేటాయించడం ఇదెక్కడి సామాజిక న్యాయమంటూ నిలదీశారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే అందుకనుగుణంగా రాష్ట్రంలో కులగణన చేపట్టి..రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ..చట్టాన్ని చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. మిగిలి ఉన్న మిగతా 3 మంత్రి పదవులను బీసీలకు కేటాయించాలని, అదేవిధంగా మంత్రివర్గంలో మార్పులు చేసి ప్రాధాన్యత కలిగిన పదవులను బీసీలకు కేటాయించాలని వేముల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version