రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు పరిష్కారం
వరంగల్ తహశీల్దార్ మహ్మద్ ఇక్బాల్.
వరంగల్ నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్ అన్నారు. దేశాయిపేట షాదిఖానాలో రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వరంగల్ మండల తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కవిత మాట్లాడుతూ భూముల్లో ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ పరంగా కొలతల్లో పాస్ పుస్తకాల్లో సమస్యలు ఏమైనా ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం భూమి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.
వరంగల్ మండల తహసిల్దార్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజలు భూ సమస్యల మీద కార్యాలయాల చుట్టు తిరుగుతున్న క్రమంలో అధికారులు ఒక్కోసారి అందుబాటులో లేకపోవడం వాళ్ళు వెనుక తిరగడం జరిగేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న భూభారతి చట్టం ద్వారా సమస్యలు ఉన్నచోటకే అధికారులు వెళ్లి గ్రామ సభలు నిర్వహించి రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించడం సమస్య ఎదుర్కొంటున్న వారికి ఇదొక మంచి అవకాశం అని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని భూ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొనగా బాధితులు దరఖాస్తులు సమర్పించుకున్నారు.