ఓటీటీకి వ‌చ్చేసిన‌.. కేసరి ఛాప్ట‌ర్2!

ఓటీటీకి వ‌చ్చేసిన‌.. కేసరి ఛాప్ట‌ర్2!

డ‌య్య‌ర్‌ను.. ఢీకోట్టిన‌ శంకరన్‌ నాయర్ స్టోరి

 

 

 

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన బాలీవుడ్ చిత్రం కేసరి ఛాప్ట‌ర్ 2

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన బాలీవుడ్ చిత్రం కేసరి ఛాప్ట‌ర్ 2 (Kesari Chapter 2).

అక్ష‌య్ కుమార్ (Akshay Kumar), మాద‌వ‌న్ (R. Madhavan), అన‌న్యా పాండే Ananya Panday) కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా క‌ర‌ణ్ త్యాగ్ (Karan Singh Tyagi) ర‌చన‌, ద‌ర్శ‌క‌త్వం చేశారు.

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ (Dharma Productions) బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్ (Karan Johar) మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మించారు.

హిస్టారిక‌ల్ కోర్ట్ రూ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సుమారు 50 రోజుల త‌ర్వాత‌ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వస్తే..

1919లోబ్రిటీష్ హాయాంలో జ‌రిగిన దారుణ మార‌ణ‌ కాండ‌ జ‌లియ‌న్ వాలా బాగ్‌కు మూల కార‌కుడైన అప్ప‌టి పంజాబ్ జ‌న‌ర‌ల్ మైఖైల్ ఓ డ్వేయ‌ర్ ఆ వార్త బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా చేస్తాడు.

ఆపై త‌మ‌కు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాల‌ని ఆ స‌మ‌యంలో వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడైన‌ అడ్వ‌కేట్ శంకరన్‌ నాయర్‌ (అక్షయ్‌ కుమార్‌)ను డ్వేయ‌ర్ కోరుతాడు.

కానీ ఆక్క‌డ జ‌రిగిన మార‌ణ‌కాండ విష‌యం తెలుసుకున్న ఆయ‌న అందుకు స‌సేమిరా అని అక్క‌డిక్క‌డే త‌న ప‌ద‌వికి సైతం రాజీనామా చేసి డ‌య్య‌ర్‌పైనే కేసు వేస్తాడు.

 

Kesari Chapter 2

 

దీంతో జ‌న‌ర‌ల్ మ‌రో ప్ర‌ముఖ అడ్వ‌కేట్‌ నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్‌.మాధవన్‌)ని ఆశ్ర‌యించ‌డంతో కేసు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది.

ఈ క్ర‌మంలో శంక‌ర్ నాయ‌ర్‌, మెక్‌కిన్లేల మ‌ధ్య ఎలాంటి వాద‌న‌లు జ‌రిగాయి, నాటి దురాగ‌తాన్ని ఎలా బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేశారు.

చివ‌ర‌కు క‌థ ఎన్ని మ‌లుపులు తిరిగిందనే క‌థ‌క‌థ‌నాల చుట్టూ సినిమా సాగుతూ నాటి జ‌లియ‌న్ వాలాబాగ్ దుర్ఘ‌ట‌న‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్‌గా ఫీల‌య్యే విధంగా మూవీ న‌డుస్తుంది.

ఇప్పుడీ చిత్రం జూన్ 13 శుక్ర‌వారం నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో ఈ సినిమా చూడ‌లేక పోయిన వారు, మల్లీ చూడాల‌నుకునే వారు ఇప్పుడు ఎలాంటి స‌మ‌స్య లేకుండా ఇంటి ప‌ట్టునే ఉంటూ ఫ్యామిలీతో క‌లిసి ముఖ్యంగా పిల్ల‌ల‌కు నాటి జ‌లియ‌న్ వాలా బాగ్‌ ఘ‌ట‌న‌ను తెలియ‌జేస్తూ మూవీ వీక్షించ‌వ‌చ్చు.

డోంట్ మిస్ ఇట్‌.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version