లేబర్ ఆఫీసర్ ఉన్నట్టా లేనట్టా.

లేబర్ ఆఫీసర్ ఉన్నట్టా లేనట్టా?

లేబర్ కార్డుల రెన్యువల్ కోసం ఎదురుచూపులు. .

కొత్త కార్డుల మంజూరు దేవుడేరుగు..

అర్హత ఉండి కార్డులు పొందలేకపోతున్న భవన నిర్మాణ కార్మికులు..

కార్డులు రెన్యువల్ లేక ప్రభుత్వ సహాయం నష్టపోతున్న బాధితులు..

నేటి ధాత్రి స్పెషల్ స్టోరీ..

రామాయంపేట జూన్ 13 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

 

 

 

 

 

 

 

రామాయంపేట లేబర్ కార్యాలయం కేవలం చూడడానికి మాత్రమే కనబడుతుంది..

లేబర్ ఆఫీసర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు కార్మికులకు గురవుతున్నారు.

కొందరు భవన నిర్మాణ కార్మికులతో పాటు లేబర్ కార్డులు ఉన్నవారు రెన్యువల్ కోసం కార్యాలయం చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు.

అలాగే కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు రోజుల తరబడి ఎదురుచూపులు చూస్తున్నారు.

కార్డుల మంజూరు కోసం దరఖాస్తులు చేసుకోవడంలో ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని చెప్పడానికి కూడా కార్యాలయం ఖాళీగా ఉంటుంది.

దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

Construction Workers

 

 

అత్యవసర సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుండి అందే సహాయం కూడా కార్మికులకు కాదని పరిస్థితి నెలకొంది.

గతంలో కొందరు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన వారికి నేటి వరకు ప్రభుత్వ సహాయం అందని పరిస్థితి దాపురించింది.

ఈ విషయంలో పూర్తిగా లేబర్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణమని కార్మికుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తూతూ మంత్రంగా వచ్చి ఒకటి రెండు గంటలు ఉండి వెళ్లిపోవడం పట్ల కార్మికులతో పాటు ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది.

కార్మిక సంఘం నాయకులు సైతం ఈ విషయంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిన వాటిని అమలు చేయడంలో స్థానిక లేబర్ ఆఫీసర్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది.

నిత్యం ప్రమాదకర పరిస్థితులు పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు అర్హత ఉన్న కార్డులు ఇవ్వకపోవడంతో పాటు రెన్యువల్ చేయకపోవడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

అందుబాటులో ఉండాలి.

సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి..

లేబర్ కార్మికుల విషయంలో స్థానిక లేబర్ ఆఫీసర్ ఎప్పుడు అందుబాటులో ఉండటం లేదు.

దీంతో కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పాత వారితో పాటు కొత్త లేబర్ కార్డులు దరఖాస్తు చేసుకునే వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Construction Workers

 

 

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి మంచి పథకాలకు అర్హులైన కార్మికులు దూరమవుతున్నారు.

ఈ విషయంలో త్వరలోనే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనలు చేపడతాం.

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి చేసిన ఎంపీడీఓ ఎమ్ ఈ ఓ.

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి చేసిన ఎంపీడీఓ ఎమ్ ఈ ఓ

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకములు మరియు యూనిఫామ్స్ ఎంపీడీఓ సురేష్ మండల విద్యాధికారి హరిప్రసాద్ లు విద్యార్థిని విద్యార్థులకు అందచేశారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మాదేవి, డిపిఎం నాగేశ్వరరావు, ఏపిఎం పద్మ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి.

“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి”

“భూ సమస్యల పరిష్కారానికి భూభారతి”

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

దేవరకద్ర నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ..

భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.

భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వచ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని..

రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యను అధికారులు పరిష్కరిస్తారన్నారు.

 

MLA G. Madhusudhan Reddy

 

 

అనంతరం గ్రామంలో వడ్డెర, యాదవ సంఘాల కమ్యూనిటీ హాల్స్ పెండింగ్ పెండింగ్ పనులకు, కుర్వ సంఘం కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మరియు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు తెలుగు బాలమ్మ ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కరెంటు షాక్ తో గేదె మృతి.

కరెంటు షాక్ తో గేదె మృతి
జమ్మికుంట నేటిధాత్రి:

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల ధర్మారం రెండవ వార్డులో శ్రీమతి మారపెల్లి పద్మ గారి పాడి గేద ప్రమాదవశాత్తు కరెంట్ పోలుకు కరెంటు సర్క్యూట్ కావడంతో గేద అక్కడికక్కడే మరణించడం జరిగినది సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగినది
మారపల్లి పద్మ ధర్మారం

రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి.

రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి : మండల వ్యవసాయ అధికారి వెంకటేశం.
ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం రైతు భరోసా పథకం లో భాగంగా
ఝరాసంగం మండలంలోని రైతులందరూ వానకాలం 2025 సీజన్ కి సంబంధించిన తేదీ 05.06.2025. వరకు ఎవరికైతే నూతనంగా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అయిన రైతులు రైతు భరోసా పథకం కొరకు దరఖాస్తు చేసుకోవలని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు..
కావాల్సిన పత్రాలు:
1. రైతు భరోసా అప్లికేషన్ ఫారం
2. పట్టదార్ పాస్ పుస్తకం
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. బ్యాంకు అకౌంట్ జిరాక్స్
మీ యొక్క సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ నెల 20 వ తేదీ వరకు సమర్పించాలని తెల్పడం జరిగింది..

రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

తహసీల్దార్ రజిత

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

 

వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ను భూ సమస్యలు ఉన్న వారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం కోవాలి అని ముఖ్య అతిథిగా వచ్చిన తహసీల్దార్ రజిత అన్నారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూ సమస్యలను పరిశీలించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం భూమి ఎక్కువ తక్కువ ఉన్న, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలోఉన్న

భూ సమస్యలు, సర్వే నంబర్ లేకపోవడం, పట్టా పాస్ బుక్ లు లేకపోవడం, ఒక్కరి భూమి మరొకరి మీద పట్టాకు ఎక్కినటువంటి సర్వే నంబర్లను సరిచేసి పాత రికార్డు ప్రకారం పరిశీలించి సరి చేయడం సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తిగా క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో టి టిపి సి సి నెంబర్ కర్ర భగవాన్ రెడ్డి, ఇల్లంతకుంట టెంపుల్ ధర్మకర్త జున్నుతుల మధుకర్ రెడ్డి, యూత్ నాయకులు హరీష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, బండి మహేష్, అనిల్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు ఆత్మశాంతి కలగాలి.

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు ఆత్మశాంతి కలగాలి

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అత్యంత బాధాకరం

మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి

మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న
మొగులపల్లి నేటి ధాత్రి:

 

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న అన్నారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే ఇదొక దురదృష్టకరమైన సంఘటనని, మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని, మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, ఏకంగా విమాన ప్రమాదంలో 230 మంది ప్రయాణికులతో పాటు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది, విమానం ఒక మెడికల్ కాలేజీ పై కూలడంతో ఎంతోమంది విద్యార్థులు క్షేత్రగాత్రులు అయ్యారని, మరికొంతమంది విద్యార్థులు మరణించారని, ఇలా ఇంతమంది ఒకే ప్రమాద దుర్ఘటనలో మరణించడం మనదేశంలో ఇదే ప్రథమమని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే భారతీయులంతా ఒక్కటై బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందే విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని, ఇందుకు కారణమైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని, ఎన్నో ఆశలతో విమానంలో బయలుదేరిన వారు తమకు తెలియకుండానే మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మోటే ధర్మన్న వేడుకుంటున్నట్లు తెలిపారు.

ఈ నెల 14న శనివారం జాతీయ లోక్ అదాలత్.

ఈ నెల 14న శనివారం జాతీయ లోక్ అదాలత్

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జరగబోయే
ఈ నెల 14వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు, కక్షిదార్లు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు సంబంధించిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించు కోవాలని ఈ కార్యక్రమం ద్వారా న్యాయ సంబంధిత సమస్యలు తెలుపవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

ట్రైన్ కు కృషి చేసిన మంత్రి పొన్నంకు ధన్యవాదాలుతెలిపిన ప్రణవ్.

కరీంనగర్-తిరుపతి ట్రైన్ కు కృషి చేసిన మంత్రి పొన్నంకు ధన్యవాదాలుతెలిపిన ప్రణవ్
హుజురాబాద్ నేటిధాత్రి:

 

ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో ప్రజల సౌకర్యార్థం కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ సదుపాయాన్ని వారానికి రెండు సార్లు నడిపేలా అనేక మార్లు కేంద్రానికి విజ్ఞాపన చేసి,కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు,కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవి,స్ధానిక ఎంపీ బండి సంజయ్ కు హుజురాబాద్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్..గతంలో ఎంపీగా ఉన్న సమయంలో పొన్నం జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేశారని,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జమ్మికుంట రైల్వే స్టేషన్ ను మోడల్ రైల్వే స్టేషన్ గా మార్చి ఆధునీకరణ చేశారని అన్నారు.ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి సంజయ్ రైల్వే స్టేషన్ ల అభివృద్ధికి తగిన నిధులు తీసుకురావాలని మరిన్ని ట్రైన్ సర్వీసులు జమ్మికుంట లో ఆగేలా చూడాలని,అలాగే నిత్యం ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నీ త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

ఎటూ పోయావు వానమ్మా…

ఎటూ పోయావు వానమ్మా…

రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

జూన్ మాసం వచ్చి 14 రోజులు గడిచిన తొలకరి పలకరించలేదు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం కోసం రోజు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు వరుణుడు కరుణించక పోవడంతో వానకాలం పంట సీజన్ ఆరంభంలో నిరాశ చెందుతున్నారు ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు నష్ట పోవలసిన పరిస్థితి వస్తుంది ఒక నెల ముందుగానే ప్రారం భించాలని దిశా నిర్దేశం చేసింది. చినుకులు లేకపోవ డంతో విత్తనాలు విత్తుకుంటే అధిక దిగులు వస్తాయని రైతులు ఆలోచించారు ఎప్పటిలాగే రైతులు వానా కాలంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేక పోయింది వరుణుడు మొఖం చాటేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ నెలలో విత్తనాలు వేసుకుంటే రైతన్నలకు వాన కాలంలో అనావృష్టి వెంటాడుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాకే నల్ల రేగడిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో రైతులు వర్షం వస్తుందని నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి ఎదురుచూస్తున్నారు ఈసారి ఎండతీవ్రత విపరీ తంగా ఉండడంతో మండలం లోని చెరువులు, కుంటలలో నీళ్లు లేక వెలవెలబోతు న్నాయి ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎదురుచూస్తున్నాం..

మండలం రైతు ముసికే అశోక్

వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం సీజన్ లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతికి కొచ్చే సమయంలో వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టం పరు స్తుంది ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షాలు రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది

వర్షాలు వచ్చిన తర్వాతనే విత్తనాలు వేయాలి

మండల వ్యవసాయ అధికారి గంగాజమున

వర్షాలు వచ్చిన తర్వాత విత్తనాలు వేయాలి ముం దస్తుగా విత్తనాలు వేసి రైతులు నష్టపోవద్దు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని ప్రచారం చేశాo.రైతులు అప్రమత్తంగా ఉండాలి.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు ఎంపీడీవో సుధాకర్ మరియు హౌసింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మైండ్ దొబ్బే క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. స‌డ‌న్‌గా ఓటీటీకి!.

మైండ్ దొబ్బే క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. స‌డ‌న్‌గా ఓటీటీకి! ఎందులో అంటే

 

 

 

 

 

 

ఎలాంటి హాడావుడి లేకుండా, ప్ర‌చార ఆర్బాటాలు లేకుండా రూపొంది గ‌త నెల మే9న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా బ్లైండ్ స్పాట్.

 

 

ఎలాంటి హాడావుడి లేకుండా, ప్ర‌చార ఆర్బాటాలు లేకుండా రూపొంది గ‌త నెల మే9న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా బ్లైండ్ స్పాట్ (Blind Spot).

న‌వీన్ చంద్ర (Naveen Chandra), అలీ రెజా (Ali Reza), రాశి సింగ్ (Rashi Singh), ర‌వి వ‌ర్మ (Ravi Varma), గాయ‌త్రి భార్గ‌వి కీలక పాత్ర‌లు పోషించారు.

మూవీ రిలీజ్ అయ్యాక ప‌బ్లిక్ నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్ప‌టికీ ఎలాంటి ప్ర‌చారం లేక పోవ‌డంతో జ‌నాల‌కు రీచ్‌ కాలేక పోయింది.

ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి ఆశ్చ‌ర్య‌ ప‌రిచింది.

రాకేష్ వర్మ (Rakesh Varma) ఈ సినిమాతో దర్శక‌, ర‌చ‌యిత‌గా ఎంట్రీ ఇచ్చాడు.

యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేసింది. 

 

సినిమా పుస్తకాలు

Blind Spot

జయరామ్ (రవివర్మ), దివ్య (రాశి సింగ్) భార్యాభర్తలు వీరికి ఓ చిన్న పాప ఉంటుంది.

వీరి ఇంట్లో లక్ష్మి (గాయత్రీ భార్గవి) పని మనిషిగా వ‌ర్క్‌ చేస్తుంటుంది.

అయితే ఒక రోజు రాత్రి దివ్య తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపిస్తుంది.

స‌మాచారం అందుకున్న పొలీసాఫీస‌ర్ విక్రమ్ (నవీన్ చంద్ర) కేసు టేక‌ప్ చేసి ఇంటి కొచ్చి అంతా ప‌రిశీలించి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని డిసైడ్ అవుతాడు.

ఈ నేప‌థ్యంలో విక్ర‌మ్ ప‌రిశోధ‌న స్టార్ట్ చేసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్ర‌తి ఒక్క‌రినీ ఇంట‌రాగేట్ చేస్తూ వెళుతుంటాడు.

ఈ సంద‌ర్భంగా వారు చెప్పే అన్స‌ర్ సైతం అనుమానాస్ప‌దంగా గోచ‌రిస్తుంటాయి.

వాళ్లు చెప్పే జ‌వాబులు నిజంగా అనిపించినా అందులో ఎక్క‌డో, ఎవ‌రో అబ‌ద్ధం చెబుతున్నార‌ని అనిపిస్తుంటుంది.

ప్రతిసారీ ఓ కొత్త విషయం తెలుసుకుంటాడు.

ఈ నేప‌థ్యంలో విక్ర‌మ్ అస‌లు హంత‌కుడిని ప‌ట్టుకోగ‌లిగాడా, లేదా అస‌లు దివ్య ఎలా చ‌నిపోయిందనే ఇంట్రెస్టింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్ తో సాగుతుంది.

కాగా.. ఇది రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే మ‌ర్ట‌ర్ థ్రిల్ల‌ర్ అయిన‌ప్ప‌టికీ చూసే వారికి ప్ర‌తి క్ష‌ణం ఉత్కంఠ‌ను క‌లుగ జేస్తూ త‌ర్వాత ఏం జ‌రుగ‌బోతుంద‌నే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.

ఒక హ‌త్య ప‌ది మంది అనుమానితులు వీరిలో అస‌లు హంత‌కుడిని క‌నిపెట్టే క్ర‌మంలో అంతా అనుమానితులుగా అనిపించ‌డం, పోలీసులు వ్య‌వ‌హ‌రించే విధానం బాగా చూయించారు.

సినిమా ఆరంభ‌మైన తొలి ఐదు నిమిషాల్లోనే డైరెక్ట్ క‌థ స్టార్ట‌వ‌డం చివ‌రి వ‌ర‌కు హంత‌కుడెవ‌ర‌నే పాయింట్‌తో స‌స్పెన్స్‌ను మెయింటెన్ ఏశారు.

Blind Spot

 

 

 

చివ‌రిలో వ‌చ్చే ట్విస్టు లు సైతం అదిరిపోయేలా ఉంటాయి.

ర‌వి వ‌ర్మ‌, ప‌ని మ‌నిషి పాత్ర‌లు కీ రోల్ పోషించాయి.

ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కు వ‌చ్చేసింది.

ఎక్కువ‌గా మిస్ట‌రీ థ్రిల్ల‌ర్లు ఇష్ట‌ప‌డే వారు ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ బ్లైండ్ స్పాట్ (Blind Spot) చిత్రాన్ని మిస్ చేయ‌కుండా ఫ్యామిలీతో చూసేయ‌వ‌చ్చు.

చేపల ఉత్పత్తిని పెంచుతూ మత్స్యకారుల సామాజిక.!

చేపల ఉత్పత్తిని పెంచుతూ మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలి.

మత్స్యకారులకు తెప్పలు వలల పంపిణీ.

రాష్ట్ర పంచాయితి రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా నేటిధాత్రి:

జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచుతూ, మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని, రాష్ట్ర పంచాయితి
రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రం లోని గిరిజన భవన్ లో యు ఎస్ టి, నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో జీవంతరావుపల్లి గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన కుటుంబాలకు 25 తెప్పలు చేపలు పట్టే వలలు రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. , గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జీవంతరావుపల్లి గ్రామంలో అధికంగా ఉన్న మత్యకారులకు నిర్మాణ్ సంస్థ వారు తెప్పలు , వలలు అందించడం చాలా అభినందిందనీయం అని నిర్మాణ్ సంస్థ వారికి అభినందించారు.

మిత్రమండలి వినోదం.

మిత్రమండలి వినోదం.

 

 

 

 

 

ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, విష్ణు ఓయ్‌, ప్రసాద్‌ బెహరా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మిత్రమండలి’. నిహారిక ఎన్‌.ఎం కథానాయిక. విజయేందర్‌ ఎస్‌. దర్శకత్వంలో కల్యాణ్‌ మంతిన…

ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, విష్ణు ఓయ్‌, ప్రసాద్‌ బెహరా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మిత్రమండలి’. నిహారిక ఎన్‌.ఎం కథానాయిక. విజయేందర్‌ ఎస్‌. దర్శకత్వంలో కల్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు, బీవీ వర్క్స్‌తో కలసి సమర్పిస్తున్నారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్‌ ‘మిత్రమండలి’ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బన్నీ వాసు సమర్పిస్తున్న తొలి చిత్రం ఇది. టీజర్‌ చాలా బావుంది. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు. బన్నీ వాసు మాట్లాడుతూ ‘వినోదాత్మకంగా, ఉల్లాసంగా సాగే నలుగురు స్నేహితుల కథ ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి’ అన్నారు. ‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌తో వస్తున్నాం’ అని విజయేందర్‌ ఎస్‌. అన్నారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమిదని నిర్మాతలు తెలిపారు.

రైతులతో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల అవగాహన సదస్సు.

రైతులతో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల అవగాహన సదస్సు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం. రేపాక గ్రామంలో. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క బాబు చెక్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల మరియు వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో జూన్ 13న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు 10 అంశాల పైన అవగాహన కల్పించారు పంటలకు సిఫారసు చేసిన మోతాదులోని యూరియాను ఉపయోగించడం పచ్చి రొట్ట ఎరువుల వర్మి కంపోస్ట్ పశువుల ఎరువుల వాడడం భూసార పరీక్షల ఫలితాలను బట్టి పంటకు. ఎరువులు అందించడం రసాయన ఆధారిత పురుగుమందులను అవసరం మీదకు మాత్రమే ఉపయోగించడం మరియు పంటల్లో పద్ధతులు పాటించడం పంట వైభవ సమయంలో. పంట బీమా పొందడానికి మరియు నష్టపరిహారం కోసం పంట కోసం కొనుగోలు చేసిన వివిధ విత్తనాల రసాయనిక ఎరువుల మరియు రసాయనిక మందుల కొనుగోలు రసీదులను భద్రపరచడం సాగునీటి యజమాన్యం. బిందు మరియు తుంపర్ సేద్యం మల్చింగ్ పద్ధతుల సుస్థిరమైన వ్యవసాయం కోసం పంట మార్పిడి మరియు పంట వైవిధ్యాకరణ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడం. పి జె టి ఏ యు. యూట్యూబ్ ఛానల్ మరియు బీజేపీ యూ వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని ఉపయోగించడం ద్వారా వ్యవసాయ సంబంధిత సమాచారం తెలుసుకోవడం వర్మీ కంపోస్టు తయారీ మరియు. పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన. పంట బీమా పథకాలు వెదురు మొక్కలు మరియు. ఆయిల్ పామ్ సాగు. అనంతరం రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటలకు సంబంధించిన పలు విషయాలపై చర్చించి సందేహాలను నివృతం చేసుకున్నారు రైతులు ఈ కార్యక్రమం తెలుసుకున్న అంశాలను తప్పకుండా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల అసోసియేట్ డిఎన్ డాక్టర్ సునీత దేవి. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రాజేందర్. డాక్టర్ జె చిరంజీవి. మండల వ్యవసాయ అధికారి కే సంజీవ్. ఉద్యాన శాఖ అధికారి వి గోవర్ధన్. వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్. గౌతమి లక్ష్మణ్. వ్యవసాయ కోర్స్. అభ్యసిస్తున్న. విద్యార్థులు ఏ సాత్విక. ఎస్ బాలకృష్ణ. రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను తక్షణమే నిలిపివేయాలి.

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను తక్షణమే నిలిపివేయాలి.

 

 

 

 

 

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్‌ రాంరెడ్డి చెప్పారు…

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్‌ రాంరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆంధ్రా సినిమాలకు ఇవ్వవద్దని హైకోర్టులో ఫిటిషన్‌ వేశామని, శుక్రవారం వాదనలు వినిపించబోతున్నామని వారు చెప్పారు. కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు.

విద్యా వ్యాపారని అరికట్టండి.

విద్యా వ్యాపారని అరికట్టండి.

అడ్మిషన్ ఫీజు పేరిట 5,000 వసూళ్లు.

బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్.

 మిర్యాలగూడ నేటిధాత్రి:

మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీ నీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ భవన్ లో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో పుట్టగొడుగుల పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలలు& కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి అడ్మిషన్ ఫీజు పేరిట 5000, రూపాయలు అత్యధిక ఫీజు వసూళ్లు చేస్తున్న కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు ప్రైవేటు పాఠశాలలో పిల్లల్ని చదివించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కత్తి మీద స్వాముల మారిందని ఆయన అన్నారు పాఠశాలలలోని లక్షల రూపాయల ఫీజులు ఎలా కట్టాలో అని ఆందోళనకరంగా ఉన్నారు ప్రైవేటు పాఠశాల ల్లో చదివే విద్యార్థులకు అండగా ఉండవలసిన ప్రభుత్వం పాఠశాలల యాజమాన్యాలకు తొత్తుగా మారి విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక శోభకు గురిచేస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు నిర్ణయించిన ఫీజు కే విద్యార్థులను చదివించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మిర్యాలగూడలో విద్యా వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ కూడా అరికట్టవలసినటువంటి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆయన హెచ్చరించారు పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాల లో చదువుకునే దుస్థితి లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ప్రైవేటు పాఠశాలలపై ఒక కమిటీని నిర్ణయించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఫీజుల దోపిడి నీ అరికట్టక పోతే మాత్రం అన్ని ప్రజా సంఘాలు ,విద్యార్థి సంఘాలతో ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దాసరాజు జయరాజ్, సిద్ధం రాజు, నాయిని భాస్కర్, అంజి గౌడ్, గంగాధర్, ఉపేందర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

సీనియర్‌ నిర్మాత మహేంద్ర కన్నుమూత.

సీనియర్‌ నిర్మాత మహేంద్ర కన్నుమూత

 

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్‌ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్‌ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్‌ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం…

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్‌ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్‌ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్‌ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న మహేంద్ర తన స్వస్థలమైన గుంటూరులోని రమేశ్‌ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నటుడు, నిర్మాత మాదాల రవి ఆయనకు అల్లుడు. కుమారుడు జీతూ కొన్నేళ్ల క్రితమే మరణించారు. ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించిన మహేంద్ర తర్వాత నిర్మాణరంగంలోకి ప్రవేశించి గీతా ఆర్ట్‌ పిక్చర్స్‌, ఎ.ఎ. ఆర్ట్స్‌ బేనర్లపై 36 చిత్రాలు నిర్మించారు. 1977లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ నిర్మాతగా మహేంద్ర తొలి సినిమా. రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘అర్జున’ ఆయన చివరి చిత్రం.

యుద్ధభూమిలో యోధుడు.

యుద్ధభూమిలో యోధుడు

 

 

 

 

 

 

గోపీచంద్‌ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్‌ 33-వర్కింగ్‌ టైటిల్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు…

గోపీచంద్‌ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్‌ 33-వర్కింగ్‌ టైటిల్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూపొందించిన భారీసెట్లో చిత్రీకరణ జరుగుతోంది. గోపీచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా గురువారం చిత్రబృందం పోస్టర్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేసింది. గోపీచంద్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించారు. యుద్ధభూమిలో వీరతిలకం ధరించిన యోధుడిగా ఆయన కనిపించారు. ఏడో శతాబ్దానికి చెందిన ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని ఓ పాయింట్‌తో సంకల్ప్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని యూనిట్‌ తెలిపింది.

పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం.

పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

తొలి ప్రయత్నమే అక్షరాభ్యాసం-డీఈవో వాసంతి

నడికూడ నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బడిబాటలో భాగంగా శుక్రవారం రోజున సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశానికి హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారినీ వాసంతి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా సరస్వతి మాత విగ్రహానికి పూలమాలవేసి టెంకాయ కొట్టి అనంతరం వేద మంత్రోత్సవాల మధ్య పండితులు మంత్రాలు చదవగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది.డి ఈ ఓ విద్యార్థులను తన ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయడం జరిగింది.అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్ రెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాలస్వామి,చర్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు,మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి,భీముడి లక్ష్మి,తాళ్లపల్లి మంజుల, శీలం సరిత విద్యార్థులను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం డిఇఓ అక్షరం అంటే నశించనీదని,అభ్యాసం అంటే నేర్చుకోవడం అని అర్థం. వీటిని నేర్చుకోవడానికి చేసే తొలి ప్రయత్నమే అక్షరాభ్యాసం అని అన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నాణ్యమైన విద్య లభిస్తుందని,మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేపించాలని, చర్లపల్లి ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఉన్నదని అన్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని డిఇఓ మేడం అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కున్సోతు హనుమంతరావు సిఎంఓ బద్దం బాల్ రెడ్డి,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాలస్వామి,చర్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు,అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమా,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజ్ కుమార్,మేకల సత్యపాల్,ఐ ఆర్ టి రమేష్,అంగన్వాడీ టీచర్స్ బీమడి లక్ష్మీ, నందిపాటి సంధ్యా,తాళ్లపల్లి మంజుల,శీలం సరిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version