కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది.

కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది

భూక్య రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూక్యా రమేష్ నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, పిసిసి సభ్యులు దశ్రు నాయక్,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బండారు దయాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,మాజీ సర్పంచ్ సారయ్య, ఎలేందర్,గ్రామ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్టిపిపిలో ఉద్యోగులను బదిలీ చేయాలి.

ఎస్టిపిపిలో ఉద్యోగులను బదిలీ చేయాలి

నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల ఎస్టిపిపి లో అనేక ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా సింగరేణి శాఖలో గత పది సంవత్సరాల కు పైబడి ఒకే దగ్గర ఒకే హోదాలో విధులు నిర్వహిస్తున్న అనేకమంది ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ కి బిఏంఎస్ యూనియన్ తరపున యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ ఎస్టిపిపి లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న అటెండర్ నుండి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నా వారందరూ ఒకే సంస్థలో ఒకే దగ్గర ఒకే విధంగా విధులు నిర్వహిస్తున్న వారిని వెంటనే గుర్తించి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఒకే దగ్గర పది సంవత్సరాల కు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేసే జీవో ఉందని ఆ జీవోను మళ్లీ సమీకరించి ఐదు సంవత్సరాలకు పైబడిన వారిని కూడా బదిలీ చేసే విధంగా ఒక కొత్త జీవోను తీసుకురావాలని బలరాం నాయక్ ని కోరారు.సంస్థలలో ఒకే దగ్గర విధులు నిర్వహించడం వల్ల సింగరేణి పవర్ ప్లాంట్ లో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ నాయకులు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ లక్ష్మారెడ్డి,ప్రధాన కార్యదర్శి దుస్సా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణ చెయాలి. 

రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణ చెయాలి. 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి .

వనపర్తి నేటిదాత్రి :

 

శుక్రవారం, హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినడం ఆపేశారని, దీన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న సోనామసూరీ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు.
రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి, సన్న బియ్యం రవాణాపై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు నిరు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తోన్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభించామని, దీనికి కృషి చేసిన అధికారులకు,సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణాను వేగవంతం చేయాలని, రేషన్ దుకాణాల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉండాలని సూచించారు. సంచుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు .కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు వేగంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సన్న బియ్యం రవాణాను, నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నా. రు సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లికి చెందిన గిత్త సాయిచరణ్ తండ్రి ప్రసాద్ అనే యువకుడు పూర్తి వికలాంగుడు తండ్రి కూడా చిన్నతనంలో చనిపోయారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయిచరణ్ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి తనకు చాలా ఇబ్బంది అవుతుందని ఎలక్ట్రికల్ చార్జింగ్ వెహికల్ కోసమని రెండు రోజుల క్రితం చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యంని కలువగా వెంటనే స్పందించి వికలాంగుల జిల్లా సంక్షేమ సంఘం అధికారితో ఫోన్ లో మాట్లాడి సాయిచరణ్ కు వెహికిల్ తొందరగా అందచేయాలని అధికారులతో మాట్లాడి శుక్రవారం ఎలక్ట్రీకల్ ఛార్జింగ్ వెహికిల్ ను అందజేసిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్.మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా సాయి చరణ్ మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతిమ మజిలీకి కష్టాలా?

అంతిమ మజిలీకి కష్టాలా?

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని బేడబుడగజంగం కులస్తులకు దహన కార్యక్రమాల నిమిత్తం గుండి రెవెన్యూ శివారులో సర్వేనెంబర్ 518లో రెండు ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఈస్థలానికి స్పష్టమైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి పాడెను స్మశాన వాటికకు తీసుకు వెళ్లడానికి ఇతరుల పొలాల గట్ల వెంబడి అష్టకష్టాలు పడుతూ అంతిమ సంస్కారాలు నిర్వహించడం కష్టంగా మారింది. అంతిమ ఘడియల్లో స్మశాన వాటికకు స్పష్టమైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వారి కష్టాలు తెలపడానికి వర్ణణరహితంగా మారింది. గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని బేడ బుడగజంగా కులస్తులు వాపోతున్నారు. కొద్ది రోజుల క్రితం రామడుగు తహసీల్దార్ వెంకటలక్ష్మి స్మశాన వాటిక కోసం రహదారి విషయమై సర్వేయర్ ను తీసుకువచ్చి విచారణ చేపట్టి నెలలు గడుస్తున్నా సరైనా రోడ్డు మార్గం చూపించకపోవడంతో మాకు దిక్కెవరంటూ బేడ బుడగజంగ కులస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సర్వే జరిపి ఈసర్వే నంబర్ కి వెళ్లడానికి సరైనా రోడ్డు మార్గం కల్పించవలసినదిగా బేడా బుడగజంగం కులస్తులు అధికారులను పత్రికా ముఖముగా వేడుకొనుచున్నారు.

ఎస్సి, ఎస్టీ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.

ఎస్సి, ఎస్టీ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

*సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

 

 

 

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదని,ఎట్టి పరిస్థితుల్లో నిధులు పక్క దారి పట్ట వద్దని , ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులు మేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు రాగా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. పోలీసు వారి చే గౌరవ వందనం స్వీకరించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి.గితే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుశ్రము నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్ లతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగారాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో 4 వేల 313 ఎకరాలకు సంబంధించి 6029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1614 మంది రైతులకు 2860 ఎకరాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పెండింగ్ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతులందరికీ పట్టాలు అందాలని 10 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామనిఅన్నారు.సబ్సిడీ కింద ప్రభుత్వం మంజూరు చేసే మొత్తం సద్వినియోగం జరిగి యూనిట్లకు గ్రౌండ్ అయ్యే విధంగా ప్రత్యేక చోరువ చూపాలని అన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ లలో సోలార్ ప్యానల్ ఫెన్సింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు 7 రోజుల్లో సిద్ధం చేయాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి విడుదల అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని,బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనిఅన్నారు. పోలీస్ కేసులకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు కొరకు తహసిల్దార్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ఎస్సీ ఎస్టీలకు 100% పని దినాలు కల్పించాలని, వేసవి దృష్ట్యా పని ప్రదేశాలలో చల్లని త్రాగునీరు, నీడ, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.సంక్షేమ హాస్టల్స్ లలో ప్రభుత్వం రూపొందించిన డైట్ మెన్యూ ను తూచ తప్పకుండా పాటించాలనిఅన్నారు. స్వయం ఉపాధి కల్పన పథకం కింద రాజీవ్ వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ యువతకు అర్హత మేరకు రుణాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ శాఖలలో ఎస్సీ,ఎస్టీ అధికారులకు రోస్టర్ పాయింట్ ప్రకారం పదోన్నతులు సజావుగా పారదర్శకంగా వచ్చేలా వ్యవహరించాలని,ప్రభుత్వ కార్యాలయాల్లో నియామకాలలో సైతం 15% ఎస్సీలకు రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల సూచనలు, ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. సభ్యులు వివిధ అంశాల పై కోరిన సమాచారాన్ని, ప్రతిపాదనలను నిర్దిష్ట సమయంలో అందించాలని అన్నారు.
ఎస్సీ,స్టడీ సర్కిల్ కోసం భూమి కేటాయింపు చేయడం జరిగిందని, అక్కడ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులను జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏ.ఎస్పీ. శేషాద్రిని రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా భాయి, డిఎస్పీ. చంద్ర శేఖర్ రెడ్డి,జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు,వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

భారత్ సంస్కృతుల సంగమం…!

భారత్ సంస్కృతుల సంగమం…!

– మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి
– వైభవంగా శ్రీ కాలభైరవ విగ్రహ ప్రతిష్టాపన
– హాజరైన ప్రముఖ పీఠాధిపతులు
– భక్తిశ్రద్ధలతో ముగిసిన ఉత్సవాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల, వర్గాల సమష్టి కలయిక అని మహామండలేశ్వర్ బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 డాక్టర్. మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ , ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని ధర్మాపూర్ లో వెలసిన శ్రీ లలిత కోటి పార్దివ లింగ దేవస్థానంలో శ్రీ శ్రీ కాలభైరవ ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పంచవటి కాశీనాథ్ బాబా, బసవలింగ అవధూత గిరి మహారాజ్, వీరేశ్వర శివాచార్య మహా స్వామీజీ, రాచయ్య స్వామి తదితరులు హాజరయ్యారు.

Sri Kalabhairava

దేవాలయంలో గణపతి పూజ, గోపూజ, రుద్రాభిషేకం అనంతరం వేద బ్రాహ్మణులు నిర్ణయించిన శుభమూర్తము ఉదయం 8:30 నిమిషాలకు శ్రీ కాలభైరవ ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వివిధ ఆశ్రమాల పీఠాధిపతులు మాట్లాడుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా భక్తులు నాలుగు రకాలు ఉంటారని వారు ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థి, జ్ఞానులు ఉంటారన్నారు.

ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. భగవత్ నామస్మరణతోనే మనిషికి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు, గురువులు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన వ్యవస్థాపకులు సుధీర్ పాటిల్, దేవాలయ కమిటీ అధ్యక్షులు నేతి జ్ఞానేశ్వర్, ఓం ప్రకాష్ గోయల్, భీమన్న పాటిల్, హరీష్ పాటిల్, దినేష్ పాటిల్ గ్రామస్తులు భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు.

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ పై విన్నుత్న నిరసన. 

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ పై విన్నుత్న నిరసన. 

సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద మోకాళ్లపై కూర్చొని సంకెళ్లతో నిరసన

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని చేనేత చౌక్ లో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడానికి నిరాసిస్తూ ఈరోజు సిరిసిల్ల చేనేత చౌక్ లో కూర్చొని సంకెళ్లతో నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై లాఠీచార్జ్ చేయడం సిగ్గుచేటు ఈ సందర్భంగా అన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని చెట్లను నరికి వేసుకుంటే అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే లాఠీచార్జి చేయించడం చాలా దురదృష్టమై అన్నారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులు పెడుతుంటే ఇదేనా మీ ప్రజా పాలన ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం చరిత్రలో ఎక్కడ ఉండలేదని అన్నారు విద్యార్థి లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిన బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు చెట్లను కొట్టేస్తే అక్కడ ఉన్న మూగ జీవాలు తల్లఢిల్లుతున్నాయి అని గుర్తు చేశారు మేధావులారా ఇంత జరిగినా ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు విద్యార్థులతో పాట ప్రొఫెసర్ల చూడకుండా చిట్కబడడం చాలా దురదృష్టమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల లాక్కోవడం మానేయాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాస్ ముద్దం అనిల్ కాసర్ల వినయ్ దేవరాజ్ ముజ్జు నవీ గణేష్ రాజు వినయ్ నరేష్ వేణు మోహన్ పరమేష్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…..

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం.

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం
• ఎమ్మెల్యే రోహిత్ రావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

విద్య, వైద్యన్నీ అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించి జై బాపు, జైసంవిధాన్ లో భాగంగా మండలం లో ర్యాలీ నిర్వహించారు. అలాగే సన్న బియ్యం, ఆరోగ్య ఉప కేంద్రన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధినీ కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపిస్తుందని కొనియడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్య కళాశాల ను కాంగ్రెస్ హయాంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమాదేవి, కాంగ్రెస్ నాయకులు చౌదర సుప్రభాతరావు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్, సత్యనారాయణ, లింగం గౌడ్, గుమ్ముల అజయ్, దేశెట్టి సిద్దారములు, సత్యనారాయణ రెడ్డి,శ్యామల మహేష్, అధికారులు ఉన్నారు.

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం.!

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం. చౌకగా ప్రభుత్వ సన్నబియ్యం పేదలకు పంపిణి

ఎస్సి సేల్ మండల అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్

మొగులపల్లి ఏప్రిల్ 4 నేటి ధాత్రి

మండలంలోని ములకలపల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలతో. కాంగ్రెస్ పార్టీ మొగులపల్లి మండల కమిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్. రేషన్ షాపులో అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. చౌక ధరల దుకాణం నుండి చౌకగా పేదల ఇండ్లకు చేరిన సంపన్నుల సన్నబియ్యమని ఓనపాకాల ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో. చౌక ధరల దుకాణం ద్వారా నాసిరకం దొడ్డు బియ్యం సరఫరా జరిగేదని ఆ బియ్యాన్ని ప్రజలు ఎవరు కూడా తినేవారు కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల ద్వారా సన్న వడ్లను కొనుగోలు చేసి క్వింటాకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు రేషన్ కార్డు దారులు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి అన్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతుల వద్ద సన్న ధాన్యాన్ని 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించి రాష్ట్రంలోని చౌక దరల దుకాణం ద్వారా అర్హులైన వారికి 6 కిలోల చొప్పున1.81.686 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెల ప్రభుత్వం ద్వారా సరఫరా జరగనుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని రేషన్ డీలర్లు పౌరసరఫరాల రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో. సన్న బియ్యం సంక్షేమ పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులను వేడుకున్నారు. సన్న బియ్యం పంపిణిలో డీలర్లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

సీసీ కెమెరాల పాత్ర కీలకం డిజిపి.

నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం డిజిపి

వనపర్తి నేటిదాత్రి :

 

ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర డి జి పి జితేందర్ ప్రజల ను కోరారు
అమరచింత మండలం మస్తిపూర్ గ్రామంలో మస్తీపూర్ గ్రామస్తుడైన ఐజిపి రమేష్ రెడ్డి గ్రామస్తులు సహకారంతో సహకారం ఏర్పాటు చేసినతో సీసీ కెమెరాలను 46 అధునాతన సీసీ కెమెరాలను అమరచింత మండలం మస్తిపూరు గ్రామంలో ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ ఆర్ గుర్నాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐ జి రమేష్ రెడ్డి ఐపీఎస్ గారు, మల్టీజోన్ ఐజి. సత్యనారాయ జోగులాంబ జోన్ డిఐజి, ఎల్ ఎస్ చౌహన్ వనపర్తి జిల్లా ఎస్పీ,రావుల గిరిధర్ తో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిజిపి జితేందర్ మాట్లాడుతూ.నేరాలను నియంత్రించడంలో నిందితులను దొంగ.తనాలను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు వనపర్తి
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను డిజిపి కోరారు.సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన తెలుస్తుందని, ఎక్కడ ఎలాంటి అలజడి జరిగిన వెంటనే పోలీసులు చేరుకుని నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సిసి కెమెరాలకు జిపిఎస్ కనెక్ట్ చేయడం వల్ల అమరచింత మస్తీపూర్ నుండి జిల్లా కమాండ్ కంట్రోల్ కు మరియు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి వీక్షించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.నేరాలు నియంత్రించవచ్చని తద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని, సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం మరియు అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించే అవకాశం ఉంటుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు వివిధ సంఘటన లు జరిగిన సమయంలో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని డి జి పి తెలిపారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ
సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని, సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పనిచేస్తాయని అన్నారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ ఆర్, గుర్నాథ్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐజి శ్రీ రమేష్ రెడ్డి ఐపీఎస్ గారు, మల్టీజోన్ -2 ఐజి, శ్రీ సత్యనారాయణ ఐపీఎస్, గారు , జోగులాంబ జోన్ డిఐజి, శ్రీ ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్, గారు వనపర్తి ఎస్పీ, శ్రీ, రావుల గిరిధర్ ఐపీఎస్, గారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు వనపర్తి ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి గారు, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు గారు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, అమరచింత ఎస్సై, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను.!

పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే మంజూరు చేయాలి.

మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి

నాగారం నేటిదాద్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే పేద ప్రజలకు మళ్లీ అందించాల్సిందిగా కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ పరిధిలో 80 చెక్కులు మరియు కీసర ఆర్డీవో డివిజన్ పరిధిలో సుమారు 2000 చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడం వల్ల ఇరువురి పార్టీల సమన్వయలోపం వల్ల చెక్కుల పంపిణీ సమయానికి మంజూరు చేయకపోవడంతో ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని ఆర్డీవో గారికి తెలియజేశారు
ఈ విషయంపై ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఎమ్మార్వోలకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బిజ్జా శ్రీనివాస్ గౌడ్, బుద్దవరం లక్ష్మీ, మరియు నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి దిలీప్ కుమార్.

చొప్పదండి శాసనసభ్యులు డా.మేడిపల్లి సత్యంకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా నాయకులు మామిడి దిలీప్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఎఐసిసి అగ్రనేతలు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలని యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి, పిహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకుని విద్యారంగం మీద అపారమైన పట్టు ఉన్న నాయకులు మేడిపల్లి సత్యంకు రాష్ట్ర విద్యాశాఖ భాద్యతలను అప్పగిస్తే విద్యాశాఖలో కీలక అభివృదిని సాధించగలరని మామిడి దిలీప్ కుమార్ పేర్కొన్నారు.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి

గంగారం, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగోండ్ల గ్రామం లో డీలర్ ఒక కొత్త ప్రచారం చేస్తున్నాడు రేషన్ షాప్ లో సన్నబియ్యం వచ్చాయని సాయంత్రం సమయంలో గ్రామం లో డప్పు సాటింపు చేపించి మరి బియ్యం పంపిణి చేస్తున్నారు ప్రజలు ఉదయమే రేషన్ షాపు కు వస్తున్నారని రేషన్ కార్డు లబ్ధిదారులందరికి సన్నబియ్యం పంపిణి చేయడం జరుగుతుందని..
అన్నారు,,,,

మాజీ చీఫ్ విప్ రావుల పరామర్శ.!

వనపర్తి లో మృతురాలు కుటుంబాన్ని మాజీ చీఫ్ విప్ రావుల పరామర్శ.

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తిలో 23వ వార్డుకు చెందిన శారద విద్యామందిర్ అధినేత ,ఉపాధ్యాయురాలు శ్రీమతి వి.యస్.కళావతి గారు ఇటీవల గుండెపోటుతో మరణించారు ఈ.విషయం తెలుసుకున్న మాజీ చీఫ్ విప్ రావుల చంద్రశేఖర్ రెడ్డి మృతు రాలు నివాసానికి వెళ్లి కుమారులు శ్రీను,మురళీ పాండులను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు . రావుల వెంట మీడియా ఇంచార్జి నందిమల్ల.అశో క్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,నందిమల్ల. రమేష్, జోహే బ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి, తోట.శ్రీను తదితరులు ఉన్నారు

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న.!

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

సరైన వైద్య నిపుణులను నియమించాలి

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సరైన వైద్య నిపుణులను నియమించాలని యంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ జోడించండి కిరణ్ కుమారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉందని, పేరుకే 100 పడకల ఆసుపత్రి అని నాతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ దీనిని వంద పడకల ఆసుపత్రిగా గుర్తించలేదని, 30 పడకల ఆసుపత్రికి పరిమితమైందని, బడ్జెట్ విషయంలోనూ అదే విధంగా ఉందని, స్పెషలిస్టు డాక్టర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జనరల్ ఫిజీషియన్ కూడా లేరని, సరైన డాక్టర్లు,వైద్య పరికరాలు లేక జబ్బులతో వచ్చిన రోగులను మంచిర్యాలకు పంపిస్తున్నారని, ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని, పలుమార్లు సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ 30 పడక ల ఆసుపత్రిగా కొనసాగుతున్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చే విధంగా చర్యలు తీసుకొని బడ్జెట్ను ఇప్పించాలని, ఆసుపత్రికి సరిపోయే సిబ్బందిని, స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని,24/7 గంటలు ఎమర్జెన్సీ సేవలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని,టెక్నీషియన్ లను అందుబాటులో ఉంచాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరొక గైనకాలజిస్ట్ డాక్టర్ ను నియమించి ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఎప్పటికప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఆసుపత్రి సమస్యలను తెలుసుకుంటూ ఉండాలని, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్,తేజ తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం.

పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం:ఎమ్మెల్యే కడియం
దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఓ చారిత్రాత్మక నిర్ణయం అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.చిల్పూర్ మండలంలోని శ్రీపతి పెళ్లి, మల్కాపూర్, చిన్న పెండ్యాల గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డుదారులకు శుక్రవారం సన్న బియ్యం పంపిణీ చేసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు.రాష్ట్రంలో పెద్దవాళ్లు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే రకమైన అన్నం తినాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

Sanna Rice

 

ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి ఎన్టీ రామారావు ఎలా గుర్తుండిపోయారో ఈ రోజు సన్న బియ్యం పంపిణీ చెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా అదే స్థాయిలో గుర్తిండిపోతుందని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ మార్గల్లో రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే బియ్యం పేదల కడుపు నింపాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఒక్కరికీ 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందని అన్నారు.సన్న బియ్యం పంపిణీ లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని ప్రభుత్వం అందించే సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వచ్చే వర్షాకాలంలోపు మల్లన్న గండి లిఫ్ట్ పనులను పూర్తి చేసి చిల్పూర్ మండలానికి సాగునీరు అందించే బాధ్యతనాదని హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి ప్రతీ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాని వెల్లడించారు.ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాలువల వెంట తిరుగుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కాలువల నిర్మాణం, పూడికతీత, చెట్ల తొలగింపు వంటి పనులను వేగవంతం చేసి పంటలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మరో ఏడాది కాలంలో నియోజకవర్గం లోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్దే నా ఏకైక ఎజెండా అని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే వరకు విశ్రమించనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,మండల రేషన్ డీలర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ గ్రామంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో సల్లూరి ప్రతిమ ఆంజనేయులుకు 9 వేల రూపాయలు లింగంపల్లి రాజు భూమయ్యకు తొమ్మిది వేల రూపాయలు బాజా రమ్యకు 15వేల రూపాయలు తంగళ్ళపల్లి ప్రమీలకు 15 రూపాయలు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులకు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తేజ మహేందర్ రెడ్డి కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మాజీ ఎంపిటిసి స్వప్న లింగం రాగి పెళ్లి కృష్ణారెడ్డి పోతరాజు కొండయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు

పేదరిక నిర్మూలనకు చదువు వజ్రాయుధం.

‘పేదరిక నిర్మూలనకు.. చదువు వజ్రాయుధం’

భూత్పూర్/ నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను తల్లిదండ్రులు అందించి.. చదివించాలన్నారు. పేదరిక నిర్మూలనకు చదువు ఒక ఆయుధమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version