శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన దేవాలయం.

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన దేవాలయం

ఆలయ అభివృద్ధికి నగదు అందజేత

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం లో.,ఏప్రిల్ 6వ, తారీకు నిర్వహించనున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేయటం జరిగింది, అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించబోనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలో భాగంగా మొదటిగా ఆలయంలో వేద పండితులు చేత తొలక్కం పారాయణం జరుగుతుంది ఏప్రిల్ ఆరో తారీకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది . తదుపరి హోమాలు అదేవిధంగా గ్రామ పర్యటనలో భాగ ంగా రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ 11 వ తారీకు నాగబెల్లి తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అని తెలిపారు
రామాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్, శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది . అదేవిధంగా గణపురం చెందిన కీర్తిశేషులు అమరాజి మొగిలి జ్ఞాపకార్థం కుమారుడు అమరాజి సతీష్, ఆలయ అభివృద్ధి కొరకు 10, వేల 116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి దయ్యాల భద్రయ్య పాండవుల భద్రయ్య మోటపోతుల రాజన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం.

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం

రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క..

కొత్తగూడ, నేటిధాత్రి :

 

ప్రజా పాలన లోనే వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల యొక్క చిరకాల ఆకాంక్ష అయిన ఇళ్ల స్థలాల మంజూరు సమస్యను కూడా పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు.

గురువారం నాడు టీయూడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక శాసన సభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకు ములుగు క్యాంప్ కార్యాలయంలో ఐజేయు సభ్యులు కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులను అన్యాయాలకు గురి చేసినటువంటి దుస్థితి గత పాలకులదేనని, కెసిఆర్ కు వత్తాసు పలికే కొన్ని మీడియా యాజమాన్య సంస్థలతో కుమ్మక్కై మీడియా రంగాన్ని అనేక విభాగాలుగా విభజించి ఫోర్త్ ఎస్టేట్ అనే రంగాన్ని పూర్తిగా కనుమరుగు అయ్యే విధంగా వ్యవహరించిన తీరు నాటి పాలకుల పాపమేనని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఇళ్ల స్థలాల మంజూరు,ఆరోగ్యశ్రీ ,హెల్త్ కార్డుల మంజూరు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించే విధంగా

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో విధి విధానాలు చేపడుతున్నామని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు చిరకాల ఆకాంక్ష కోరికైనా ఇళ్ల స్థలాల మంజూరుకు కచ్చితంగా తన వంతు కృషి ఉంటుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల అధ్యక్షుడు ఎస్. కె .సల్మాన్ పాషా, జిల్లా నాయకులు శెట్టి పరశురాం, మహమ్మద్ అజ్మీర్, మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్, దేశ వెంకటేశ్వర్లు, మండల ప్రచార కార్యదర్శిలు తీగల ప్రేమ్ సాగర్, ఈక నరేష్, ఉబ్బని శ్రీహరి, గంగిశెట్టి రాకేష్ వర్మ, ముఖ్య సలహాదారులు బొజ్జ సునీల్, యూనియన్ నాయకులు చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, తాటి సుదర్శన్, బిక్షపతి, గట్టి సుధాకర్, అశోక్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు…

కల్లుగీత కార్మికుడికి తీవ్ర గాయాలు.

కల్లుగీత కార్మికుడికి తీవ్ర గాయాలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం గ్రామ నీకి చెందిన గడ్డమీది వెంకటేశ్వర్లు కల్లుగీత కార్మికుడు రోజు వారి వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడటం జరిగింది. తోటి మిగతా కార్మికులు చూసి హాస్పిటల్కు తీసుకుపోగా సీరియస్ గా ఉన్నాడు వరంగల్కు తీసుకుపోవాలి తెలిపారు గార్డెన్ హాస్పిటల్ లో ఉన్నాడు ఈ ప్రమాదంలో గీతకార్మికుడైనా గడ్డమీది వెంకటేశ్వర్లు కి ప్రక్కటేముకలు,తొంటెముక, వెన్నుముక,భుజం ఎముకలతో పాటుగా కాలు కి గాయాలు కావడం జరిగింది.. నిరుపేద గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిని శివశంకర్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు

రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో.

రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

ప్రతి రేషన్ షాపు ముందు నరేంద్రమోడీ ఫోటో పెట్టాలి — బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబీ దేవ్

కల్వకుర్తి మున్సిపాలిటీ సిల్లారుపల్లిలోని 9వ రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ పథకం బిజెపి నాయకులు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈఉగాదికి ప్రారంభించిన 6కేజీల సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా 5కేజీలు ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని అందుకు అనుగుణంగా కలెక్టర్లు ఆర్డీవోలు ఎమ్మార్వోలు రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని లేని యెడల బిజెపి నాయకులు ఉరువాడ తిరిగే ప్రజల ముందుకు మీ కుట్రలను బయట పెడతామని కల్వకుర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్ హెచ్చరించారు…
ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వివేకానంద, మాజీ అధ్యక్షులు నరసింహ, గంగాధర చారీ,బీజేవైఎం జిల్లా సెక్రెటరీ నరేష్ చారి, నాయకులు శ్రీకాంత్, పర్వతాలు, శివ, అరవింద్ రెడ్డి, కుమార్, రేషన్ డీలర్ మహమ్మద్ సిరాజుద్దీన్, లబ్ధిదారులు పాల్గొన్నారు

కామరెడ్డి లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

కామరెడ్డి పల్లి గ్రామంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

సొమ్ము కేంద్రానిది సోకేమో రాష్ట్ర ప్రభుత్వానిదా

బిజెపి మండల అధ్యక్షులు కాసాగాని రాజ్ కుమార్ గౌడ్

పరకాల నేటిధాత్రి

మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా
అందరికీ ఆహారం పౌష్టిక సమాజం భాగంగా ప్రతి పేదవాడికి కడుపు నింపే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పతకంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పథకంలో 5 కిలోల బియ్యం కేంద్రప్రభుత్వం 1 కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని అన్నారు.

Modi.

 

కరోనా సమయం నుండి 2028 వరకు కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఉచితంగా ఇస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక వ్యక్తికి ఒక కిలో ఇస్తూ మొత్తం మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది అందుకోసమే లబ్ధిదారులకు తెలియజేసే విధంగా రేషన్ షాప్ వద్ద నరేంద్రమోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.అలాగే ప్రతి రేషన్ షాప్ డీలర్లు రేషన్ షాప్ ల వద్ద నరేంద్ర మోడీ ఫోటో పెట్టేలా చొరవ తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిడి మహేందర్ రెడ్డి,62 వ బూత్ అధ్యక్షులు తండ కుమారస్వామి,శెక్తి కేంద్ర ఇంచార్జి ఎదునూరి లింగయ్య, మాజీ సర్పంచ్ చిర్ర చక్ర పాణి, బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్, ప్రమోద్ కుమార్,తడుక సురేష్,వి ఎన్ రెడ్డి,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

రాష్ట్ర ప్రభుత్వం హెచ్.సి.యు. భూములను వేలం వేసే ఆలోచనను రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రామారపు వెంకటేష్,మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్.సి.యు.) భూముల్ని కాపాడాలని, హెచ్.సి.యు. విద్యార్థులపై లాఠీచార్జి నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు సెక్రటేరియట్ ముట్టడించాలని పిలుపునిచ్చిన సందర్భంగా గురువారం నిర్వహించే సచివాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్ళనీయకుండా తెల్లవారు జామున ఇంటి వద్దకు వచ్చి ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది.
ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్ లు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్.సి.యు. విద్యార్థుల పట్ల కర్కశంగా, అత్యంత పాశవీకంగా వ్యవహరిస్తూ, అక్రమ లాఠీ చార్జీలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీ ఛార్జి కి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.
హెచ్.సి.యు. భూములను కార్పొరేట్, పెట్టుబడిదారులకు అప్పగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హెచ్సీయూలో చెట్లను నరికి వేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీసే చర్యలను విరమించుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూములను, విశ్వవిద్యాలయాల భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని తెగ నమ్మాలని చూడటం కంచే చేను మేసిన చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, భవిష్యత్ విద్యార్థుల ప్రయోజనాలకు, యూనివర్సిటీలో పరిశోధనల అభివృద్ధికి, నాణ్యమైన ప్రయోగశాలల నిర్మాణానికి ఉపయోగపడే భూములను వేలం వేసే పద్ధతులను విడనాడాలని ప్రభుత్వాన్ని ఈసందర్బంగా డిమాండ్ చేశారు.

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు తెలంగాణ భవన్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది, సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ మాజీ చైర్ పర్సన్ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి పూలమాలవేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ అండ కలిగిన స్థానిక భూస్వాములు, దొరల అరాచకాల నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు మధ్య వీరోచిత పోరాటం చేశారు అని తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, కుంభాల మల్లారెడ్డి, తదితర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన AMC చైర్మన్.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్

రామడుగు, నేటిదాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎఏంసి చైర్మన్ మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రేషన్ డీలర్ నార్ల మంగ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణమహోత్సవం.

కన్నుల పండువగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణమహోత్సవం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు డింగరి సత్యనారాయణ చార్యులు, కిరణాచార్యుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈకళ్యాణోత్సవంలో మోర బద్రేశం స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, దాసరి బాబు అనురాధ దంపతులు స్వామివారికి పుస్తె మట్టలను అందజేశారు. వెంకటేశ్వర ఆలయం నుండి స్వామి వారిని ఎదుర్కొని ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కన్నుల పండుగగా, అంగరంగా శ్రీలక్ష్మినరసింహస్వామి కళ్యాణం కొనసాగింది. కళ్యాణ ఉత్సవం అనంతరం భక్తులు మహిళలు కొబ్బరికాయలు కొట్టి పూజలు ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈకళ్యాణోత్సవానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు తిరుపతి, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు, మాల స్వాములు, గ్రామస్తులు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.

ఘనంగా సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

రఘునాథపల్లి ( జనగామ) నేటి ధాత్రి:-

 

మండల కేంద్రంలో పేర్ని రవి కురుమ ఆధ్వర్యంలో తెలంగాణ సాయిధరైతంగ పోరాటం తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను కురుమ సంఘం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
భూమికోసం ,భుక్తి కోసం ,వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపి నిజాం నిరంకుశ తూటాలకు బలి అయినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తలుచుకుంటే మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి దొడ్డి కొమురయ్య తెలంగాణలో బానిసత్వాన్ని నిర్మూలించాలని గ్రామ గ్రామాన సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరిచినటువంటి వ్యక్తి దొడ్డి కొమురయ్య కాబట్టి ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటూ.

ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా నాయకులు గొరిగె రవి కురుమ, మాల్ల యాకయ్య , పేర్ని వీరస్వామి, మరాటి జంపయ్య, దేవర మహేందర్, పేర్ని వెంకటేష్ ,పేర్ని అనిల్ ,దేవర కుమార్ ,కొలుపుల రాజు, పేర్ని శ్రీశైలం యాదగిరి ,నర్సయ్య, పేర్ని వీరయ్య, దేవర సత్తయ్య,కురుమ సంఘం పెద్దలు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు.!

ఘనంగా సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

నాగారం మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారి 98 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి అన్నం రాజ్ సురేష్ , కురుమ సంఘం అధ్యక్షుడు జెన్నేయాదగిరి , ప్రధాన కార్యదర్శి నోములనాగరాజు కురుమ, సలహాదారుడు చిన్నం భాస్కర్ కురుమ ,జంగారెడ్డి, రెడ్డినాయక్, నాగరాజు,కురుమ సంఘం సభ్యులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్..

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సంగీతం శ్రీనివాస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ
నేడు బిజెపి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆహార భద్రత చట్టంను (ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా)ను
తీసేయడానికి ప్రయత్నించింది కేంద్ర బిజెపి ప్రభుత్వం, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పన్నును కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తుంది. నేడు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన అటువంటి నిధులు కేవలం 100 రూపాయలలో కేవలం 42 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది.అంతేతప్ప వేరే రాష్ట్రాల్లో బీహార్ గాని, ఉత్తరప్రదేశ్ కాని రాష్ట్రాలలో పది రూపాయలకు 8 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం పై వివక్షత చూపుతో చూస్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఆహార భద్రత చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పేదలందరికీ ఉచితంగా సరఫరా చేస్తుంది.అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర దేవరాజు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెలుముల తిరుపతిరెడ్డి స్వరూప, సిరిసిల్ల మహిళా పట్టణ అధ్యక్షురాలు కామూరి వనిత నలినీకాంత్, మ్యాన ప్రసాద్, గోలి వెంకటరమణ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులుగా కట్ల మహేష్ ఎన్నిక.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులుగా కట్ల మహేష్ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాలమండలం లోని చల్లగరిగే గ్రామంలో
శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ ఆదేశాల మేరకు గురువారం రోజున చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్* అధ్యక్షతన చల్లగరిగే యూత్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది..చల్లగరిగే గ్రామ యూత్ అధ్యక్షులు గా కట్ల మహేష్ ఉపాధ్యక్షులుగా:దూడపాక శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్*గా: సిరిపేల్లి నరేష్ ప్రధాన కార్యదర్శి*గా దూడపక సురేందర్ సహాయ కార్యదర్శిగా పినగాని సురేష్, గొల్లపెల్లి నగేష్ సెక్రటరీగా అల్లె ప్రవీణ్ ప్రచార కార్యదర్శులుగా గువ్వ శ్రీకాంత్.కార్యవర్గ సభ్యులు గా
.గొల్లపెల్లి అనిల్
దూడపాక లక్ష్మణ్
.అల్లె తిరుపతి
దూడపాక రాజు
.వేమునూరి రాకేష్ లను ఎన్నుకున్నారు,
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండిరాజు మండల యూత్ నాయకులు గోపగాని శివ చిరంజీవి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మికుడికి తీవ్రంగా గాయాలు.

గీత కార్మికుడికి తీవ్రంగా గాయాలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రానికి చెందిన గడ్డమీది వెంకటేశ్వర్లు అనే గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీది నుంచి జారి కింద పడగా తోటి కార్మికులు చూసి మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పటల్ కు తరలించగా గాయాలు పరిస్థితి తీవ్రంగా ఉండడం వలన వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది

పేదలకు సన్న బియ్యం పంపిణి.

పేదలకు సన్న బియ్యం పంపిణి

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

Distribution of fine rice to the poor

బిజనేపల్లి మండలం కేంద్రం, మంగనూర్ గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగా, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది” అని తెలిపారు. రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథక ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు..

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలవ్వాలని, బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ పథకం విజయవంతంగా అమలుకావడానికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

కాంగ్రెస్ నాయకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ప్రభుత్వ చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం విప్లవాత్మక మార్పు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు.గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7,8,10 చౌకధర దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. పేదలు,ధనికులు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటేనని భావంతో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రజాపాలన ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తున్న అన్ని సరుకుల పంపిణీని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసి దొడ్డు బియ్యం మాత్రమే పంపిణీ చేసి పేదల పట్ల పక్షపాత వైఖరి ధోరణి అవలంబించిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పొలం సత్యం, పనాసరాజు, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, శ్యాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ,సత్యం, చంద్రయ్య, పుల్లూరి కళ్యాణ్, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి 75వ జన్మదిన వజ్రోత్సవ మహాసభలు.

శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి 75వ జన్మదిన వజ్రోత్సవ మహాసభలు,

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 03:

శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి 75వ జన్మదిన సందర్భంగా వజ్రోత్సవ మహాసభలు, తిరుపతి శృంగేరి శంకర మఠంలో నిర్వహించారు.
శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర శారదాంబ గుడిలో విశేష పూజా కార్యక్రమాలు అలాగే రాముల వారి గుడి ఉత్తరమాడవీధిలోని శంకరమఠంలో ఆది శంకరాచార్యుల వారికి అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు.
సాయంత్రం లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, సౌందర్య లహరి పారాయణ సుమారు 70 మంది ముత్తైదువులతో ఈ పారాయణ జరిగింది.
ప్రముఖ ప్రవచనకర్త కుప్ప విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వేద శాస్త్ర పండితుల సభలు నిర్వహించినారు.
శ్రీ శాస్త్రి ఈరోజు ఆదిశంకరాచార్య గురు పరంపర గురించి శృంగేరి శంకరమఠ భారతి తీర్థ స్వామి, విధు శేఖర భారతి స్వామి వార్ల గురించి విశేషంగా ప్రవచనం అందించారు.
ఈరోజు విశేషంగా శ్రీ భారతీయ తీర్థ స్వామి వారి కృపతో గండ్రకోట లక్ష్మీ మనోహర్ ఈ తిరుపతి శంకర మఠం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమం మొత్తం ధర్మాధికారి రాళ్లపల్లి రామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది.
తిరుపతి శంకర మఠం మేనేజర్ నడింపల్లి కృష్ణ పూర్ణచంద్ర, సురభి మురళి పాల్గొన్నారు.

శివాలయ పునర్నిర్మాణానికి బీరవోలు దంపతులు.

శివాలయ పునర్నిర్మాణానికి బీరవోలు దంపతులు 2 లక్షలు విరాళం.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బీరువోల నిర్మల – త్రిలోక రెడ్డి దంపతులు నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్నటువంటి నూతన శివాలయ ప్రతిష్టాపనకు 200116/- అక్షరాలా (రెండు లక్షల నూట పదహారు రూపాయలు) విరాళం ఇస్తామని ప్రకటించడం జరిగింది..అందులో భాగంగా గురువారం రోజున 50000 /- ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో శివాలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్, ప్రధాన కార్యదర్శి సర్వ శరత్, కోశాధికారి మందల రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు కొక్కుల సారంగం, తీగల నాగరాజు, తిప్పణవేణి రవి, బొమ్మ శంకర్, అనగాని రాజయ్య, మోతుకూరి రాజు, కాల్వ సమ్మిరెడ్డి, చెక్క నర్సయ్య, .ప్రధాన అర్చకులు రఘునందన్ శర్మ పాల్గొన్నారు.

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసులు నిర్బంధం ఆపాలి

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల అమ్మే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్ చేశారు.విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్‌ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని అపాలని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ హెచ్.సీ.యు భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందని విమర్శించారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు అనేక మాయ మాటలు చెప్పారని ఇప్పుడు అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు.తమ ప్రభుత్వ మనుగడ కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవడం కరెక్ట్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకొని అమ్మకానికి పెట్టిందని ఇప్పటికైనా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని కోరారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌,ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు.ఐదు రోజుల నుండి పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవేశించడాన్ని , ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్‌ స్థలంలో కూడా చదును చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మొద్దని ప్రశ్నిస్తున్నా విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించారని కొంతమంది విద్యార్థులను రిమాండ్ చేసారని అన్నారు పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య అని ఎద్దేవా చేశారు.ఈ రకమైన పద్ధతులలో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామికమని దీనిని రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్ బుర్రి ఆంజనేయులు,హన్మకొండ సంజీవ కలకోట అనిల్ వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, గణిపాక ఇంద్ర యాక లక్ష్మి, లక్క రాజు, ఐటిపాముల వెంకన్న పైస గణేష్, నాగరాజు నర్సింహా రాములు,ఎల్లయ్య, వీరన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం..

నూతన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గొల్లగూడెం గ్రామ ప్రజలు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో 20 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచేందుకు కృషి చేస్తుందని , గొల్లగూడెం గ్రామపంచాయితీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, గ్రామ పంచాయతీ అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని తెలియజేశారు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం ఎమ్మార్వో నాగ ప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్ , సీఐ వెంకటేశ్వర్లు , ప్రభుత్వ అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , పోలబోయిన శ్రీవాణి ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version