కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు…

కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు

◆-: బీఆర్ఎస్ నేత బండి మోహన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరా బాద్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో పలు గ్రామాలలో ఎస్సీలు తమకు ఓటు వేయలేదని అగ్రవర్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయడం, దూషిం చడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. అగ్రవర్ణాలు దాడి చేస్తే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, పోలీ సులు బాధితులపైనే కేసులు చేస్తామంటూ బెదిరించడం హేయమైన చర్యగా చెప్పారు. గ్రామస్తుడి ఇల్లు కూల్చేసిన సర్పంచ్ ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన ఆధారాలు బాధితులు చూపించినప్పటికీ పోలీసులు పట్టించు కోకపోవడం దారుణం అన్నారు. జహీరాబాద్ పరిధిలోని సజ్జాపూర్, కప్పాడ్ గ్రామాలలో జరిగిన ఘటనలు పునరావృతమైతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

అక్రమ నిర్మాణం అపవల్సిందే…..!

అక్రమ నిర్మాణం అపవల్సిందే…..!

◆:- నోటీసు జారిచేసిన రెవిన్యూ సిబ్బంది

◆:- ఇదివరకే నోటీసు జారిచేసిన గ్రామ పంచాయతీ అధికారులు

◆:- అయిన పట్టించుకోని వైనం

◆:- చివరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను తప్పుదోవ పట్టించిన ఇల్లు నిర్మానితులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూమికి సంబందించిన 21సర్వనంబర్ లో బ్యాగరి రాములు ఇల్లు అక్రమ నిర్మాణం చేపట్టడంతో గత 15రోజుల క్రితం పంచాయతీ అధికారులు నోటీసులు జారిచేసి అక్రమ కట్టడాన్ని జేసీబీతో కూల్చివేయడం జరిగింది.అనంతరం కోహిర్ మండల రెవిన్యూ అధికారులు స్థానిక తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని 21సర్వే నంబర్ భూమి ప్రభుత్వ పరిధిలోనిది అని ఈ సర్వే నంబర్ లో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనంకు కేటాయించిందని మండల సంబంధిత అధికారులు తెలియజేశారు.

ఈ విషమై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచారణ చేపట్టి సజ్జపూర్ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వెళ్లిన అనంతరం మల్లి మంగళవారం సజ్జపూర్ గ్రామనికి వచ్చి బాధిత కుటుంబానికి 25వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి పల్లె ప్రకృతి వనంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణానికి భూమి పూజ చేసి వెళ్లి పోవడం జరిగింది. ఇదిలా ఉండగా బుధవారం ప్రభుత్వ భూమి అయిన పల్లె ప్రకృతి వనంలో మల్లి అక్రమ నిర్మాణం చేపట్టడంతో స్థానిక రెవిన్యూ అధికారులు నోటీసులు జారిచేసి నిర్మాణాన్ని ఆపేయవలసిందిగా నిర్మస్తున్న వారిని ఆదేశించారు.

 

ఇది ప్రభుత్వ భూమి అని అన్ని రికార్డుల్లో తెలిసిన తర్వాత కూడ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సైతం తప్పుదోవ పట్టించడం ఏంటని ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడవల్సింది పోయి అగ్రమనకు గురవుతున్న చోద్యం చూస్తూ ఇష్టనుసారంగా వ్యవహరించడం సరైంది కాదని రెవిన్యూ అధికారులు అంటున్నారు. గ్రామంలోని 21సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో ఎవరైన సరే అగ్రమంగా ఇండ్ల నిర్మాణం షెడ్ ల నిర్మాణం చేపడితే ప్రభుత్వ పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.

వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్…

వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం గ్రామ చర్చ్ ముందు సిసి రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉన్న చెత్తను గమనించి గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ వెంటనే స్పందించి అక్కడి నుంచి చెత్తను తీసేయాలని అక్కడ ఉన్న ప్రజలను ఏ ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామపంచాయతీ కార్మికులకు చెప్పి చెత్తను తీసివేయించడం జరిగింది. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వెంటనే స్పందించి గ్రామ పరిశుభ్ర గురించి ఆలోచించి వెంటనే సంధిస్తున్నారు.

చర్చి ముందు చెత్తను ఉంచకుండా చెత్తకుండీ నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలిపారు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగానే గ్రామ పంచాయితీ కార్యదర్శి వీరన్న పటేల్ గారి తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తు.గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికులలో ప్రతి ఉదయం చెత్త సేకరణ, వివిధ వార్డులతో పాటు ప్రధాన రోడ్డును పరిశుభ్రత చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు,

ఆ సినిమా మీద ఆశలు వదులుకో వెంకీ.. కష్టం

ఆ సినిమా మీద ఆశలు వదులుకో వెంకీ.. కష్టం

 

 

 

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు భాషా పరిమితులు ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. కథ బాగుంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే మన వాళ్లు బ్రహ్మరథం పడుతున్నారు.

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు భాషా పరిమితులు ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. కథ బాగుంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే మన వాళ్లు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలకు మన టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్ రావడానికి అసలైన పునాది వేసింది మాత్రం దృశ్యం (Drishyam) సినిమానే. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal), దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇండియన్ సినిమా దగ్గర ఒక సంచలనం. ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అయ్యి భారీ వసూళ్లను సాధించింది.విక్టరీ వెంకటేష్ కెరీర్ కాస్త ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో దృశ్యం ఆయనకు కొత్త ఊపిరి పోసింది. రాంబాబు పాత్రలో వెంకీ ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదలైనప్పటికీ.. రికార్డు స్థాయి వ్యూస్‌తో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు అసలు చిక్కు దృశ్యం 3 తో మొదలైంది. ప్రస్తుతం జీతూ జోసెఫ్ దృశ్యం 3 పనుల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇదే ఇప్పుడు మన వెంకీ మామకు, తెలుగు మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. ఏ సినిమా అయినా నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. మలయాళ వెర్షన్ థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఆ కథ ఏంటి, ఆ సస్పెన్స్ ఏంటి అనేది అందరికీ తెలిసిపోతుంది.పోనీ తెలుగులో వెంటనే రీమేక్ చేద్దామా అంటే.. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఆ చిత్రం షూటింగ్ పూర్తయ్యే వరకు వెంకీ మరో సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు. మరోవైపు హిందీలో అజయ్ దేవగన్ కూడా దృశ్యం 3 కోసం సిద్ధమవుతున్నారు. అక్కడ వారు మలయాళ కథతో సంబంధం లేకుండా కొత్త కాన్సెప్ట్‌తో వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక ఏప్రిల్‌లో మలయాళ వెర్షన్ వచ్చేస్తే.. ఆ కోర్ పాయింట్ లీక్ అయిపోతుంది. సోషల్ మీడియా ట్రెండ్‌ నడుస్తున్న ఈ రోజుల్లో సీక్రెట్‌ను దాచడం అసాధ్యం. ఆ సస్పెన్స్ రివీల్ అయ్యాక, మళ్ళీ అదే కథతో తెలుగులో రీమేక్ చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనివల్ల తెలుగులో దృశ్యం 3 రీమేక్ అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. మలయాళ వెర్షన్‌ను తెలుగులోకి నేరుగా డబ్ చేసి రిలీజ్ చేయడం. రెండు.. కథలో భారీ మార్పులు చేసి వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మలచడం. ఏది ఏమైనా, రాంబాబు తెలివితేటలు ఈసారి తెలుగులో ప్రేక్షకులను మెప్పిస్తాయా.. లేదా వెంకీ మామ ఈ సీక్వెల్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

పాలన పదేళ్లు.. ప్రగతి నూరేళ్లు!

రాసుకుంటూ పోతే అభివృద్ధి జాడలు వందలు.

`పదేళ్లు నెంబర్‌ వన్‌ గా గుర్తింపులు.

`అభివృద్ధి, సంక్షమం సమపాళ్ళు!

telangana leader kcr

`సమగ్రభివృద్ధిలో తెలంగాణా పరుగులు

`పేదరిక నిర్మూలనలో అనేక మైలురాళ్లు.

`సాగురంగంలో ఒక్క తెలంగాణాలోనే విప్లవాత్మక ఫలితాలు.

`వ్యవసాయ రంగంలో అన్ని రాష్టాలను ఆదిగమించి దిగుబడులు.

telangana leader kcr

`అన్ని రంగాలలో జాతీయ స్థాయి లో సింహ భాగం అవార్డులు.

`పల్లె ప్రగతిలో గణనీయమైన మార్పులు.

`పచ్చని వనాలు, పసిడి సిరులు, పాడి పంటలు.

`స్వచ్ఛమైన పల్లె వాతావరణం లో ప్రజల ఆరోగ్యాలు.

`రైతుకు పెట్టుబడి సాయాలు.. సకాలంలో ఎరువులు.

`ఊరిలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు.

`ఎండిన ఊరి చెరువుల్లో పుష్కళంగా నీటి సవ్వడులు.

`ఊరే కల్పతరువుగా కుల వృతులకు ఆదాయ వనరులు.

`ఎవరిని కదిలించినా చెప్పే మాట ఒక్కటే కేసీఆర్‌ తెలంగాణా దేవుడు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:

శకునం చెప్పే బల్లి కూడా కుడితిలోపడిపోతుంది. ఒక్క అబద్దం వెయ్యి అబద్దాలను మోసుకొస్తుంది. అబద్దాలు ఆడని పరిస్దితిని సృస్టిస్తుంది. అబద్దాలు ఆడకుండా వుండలేని స్దితిలోకి నెట్టేస్తుంది. నిజం చెప్పడానికి నోరు రాకుండా చేస్తుంది. కళ్లుండి చూడకుండా చేస్తుంది. ఇది అబద్దం పవర్‌…ఆ పవర్‌ రాజకీయం. అరాజకీయం చేయాలనుకున్నప్పుడు అబద్దాలే ఆడతారు. సర్వం అబద్దాల మయం చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ దేవన పల్లి కవిత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ పార్టీ ఏం పీకి కట్టలు కట్టిందని పార్టీ పేరు మార్చుకున్నారు? దేశ రాజకీయాలకు ఎందుకు వెళ్లాలనుకున్నారు? అనే ప్రశ్న సందించారు. తెలంగాణ ప్రజల కళ్లతో చూస్తే పదేళ్ల ప్రగతి కనిపిస్తుంది. ప్రత్యర్దుల కళ్లతో చూస్తే ఏడారి మాత్రమే దర్శనమిస్తుంది. కళ్ల ముందు రత్నాలు కూడా గులక రాళ్లే అనిపిస్తుంది. కేసిఆర్‌ పదేళ్లలో చేసిన అభివృద్ది ప్రజల ముందే వుంది. అది ప్రత్యర్దులకు కనిపించదు. విమర్శలకు మాత్రమే పనికొస్తుంది. కవితకన్నా కాంగ్రెస్‌ నయం. పదేళ్లలో అవినీతి జరిగిందని చెబుతోంది. అంటే పనులు జరిగినట్లు పరోక్షంగా కాంగ్రెస్‌ ఒప్పుకున్నది. అందుకే కాళేశ్వరం గురించి పదే పదే ప్రస్తావిస్తుంది. కాని కవిత అసలు ఏం జరగలేదంటోంది. కాళేశ్వరం కూడా ఆమె కంటకి కనిపించడం లేదు. పదేళ్లలో తెలంగానలో వచ్చిన మార్పులు ఏమీ కనిపించడం లేదు. బాణం ఇప్పటి వరకు అన్న మీద, హరీష్‌ మీద గురిపెట్టింది. ఇప్పుడు ఏకంగా కేసిఆర్‌ మీదకే తిప్పింది. తప్పంతా తండ్రిదే అనే అర్దమొచ్చేలా మాట్లాడుతోంది. కేసిఆర్‌ పదేళ్లలో ఏం చేయలేరంటే ప్రజలు కూడా నమ్మరని తెలిసినా పగపట్టినట్లు చెబుతోంది. కాని ఆమె కోసం కాకపోయినా ఈ తరం యువత కోసమైన కొన్ని తెలియాలి. అంటే తెలంగాణకు ముందు రోజులు ఎలా వుండేవో ఒక్కసారి కళ్లు ముందు కనిపించాలి. సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతం ఒక ఎడారి గా మార్చబడిన ప్రాంతం. ఎడారిలోనైనా ఖర్జురాలు పండే ప్రదేశాలు వుంటాయి. కాని తెలంగాణ కరువు రక్కసి బారిన పడి విలవిలాడిరది. పాలకులు సృష్టించిన విద్వంసంలో చిక్కిశల్యమైంది. కొన్ని శతాబ్దాలుగా అన్ని రంగాలలో గణనీయమైన గతిని సంతరించుకున్న తెలంగాణ ఉమ్మడి పాలకుల చేతిలో పడి విలవిలలాడిరది. ఒకప్పుడు తెలంగాణలోని ప్రతి పల్లె ఒక గంగాళం. ఊరుకు కనీసం రెండు చెరువులు. ఊరు చుట్టూ పొరుగు గ్రామాల చెరువులు. ఇలా తెలంగాణ అంతా నీటితో కళకళలాడిన కాలం వుంది. నిజాం పాలనలో కూడా కరువు లేదు. కష్టం లేదు. ప్రజలు అన్నమో రామచంద్రా అనలేదు. అందుకే నిజాం కాలంలో కూడా భూముల పంచాయితీ వుందే తప్ప నీళ్ల గోస లేదు. పాడి పంటలు పుష్కలంగా వున్నాయి. అందుకే రైతులనుంచి ఆ రోజుల్లో రాజులు 6శాతం శిస్తు వసూలు చేసుకున్నారు. అయినా రైతులు ఆకలి బాదలు ఎదుర్కొలేదు. పరిపూర్ణమైన పంటలు పండిరచుకున్నారు. తెలంగాణలో సగర్వంగా రైతులు జీవించారు. కాకతీయుల కాలం తవ్విన చెరువులు బావులు ఇంకా మన కళ్లముందే వున్నాయి. రహదారుల వెంట కూడా మంచి నీటి బావులు తవ్వి ప్రజల దాహార్తిని ఆ రోజుల్లో రాజులు తీర్చారు. అందుకే డిల్లీ నుంచి కూడా రాజులు తెలంగాణ మీద దండయాత్రలకు వచ్చారు. అంతెందుకు దక్షిణాదిలో తెలంగాణ దాటితే ఏ డిల్లీ రాజు ముందుకు వెళ్లలేదు. అంత సంపద తెలంగాణలోనే దొరికింది. నీళ్ల కొదువలేదు. తమిళనాడు, కర్నాటక ప్రాంతాలలో కావేరీ జలాల వివాదంతో పంటలు లేక యుద్దాలు చేసుకున్న రాజులున్నారు. చోర, చేళ, పాండ్య రాజుల కూడా రైతులకు నీళ్లివ్వలేకపోయారు. ఇప్పటికీ జలాల వివాదాలలో ఆ రెండు రాష్ట్రాలు మునిగితేలుతూనే వున్నాయి. కాకతీయ కాలంతో పాటు అంతకు ముందే తెలంగాణలో వున్న చెరువులను చూసి తమిళనాడు రాజులు కూడా చెరువులు తొవ్వించుకున్నారు. రాయల కాలంలో రత్నాల మాట వినడమే తప్ప చూడలేదు. కాని నైజాం కాలంలో గోల్కొండ రాజ్యంలో వజ్రవైడూర్యాలు విదేశీయులు వచ్చి కొనుగోలును చూసిన వారున్నారు. అందుకు సాక్ష్యాలు కూడా వున్నాయి. ఆ రోజుల్లోనే పది వేల కోట్ల రూపాలయ జాకబ్‌ డైమండ్‌ పేపర్‌ వెయిట్‌గా పెట్టుకున్న నిజాం రాజున్నాడు. రాజులు సంపన్నులైతే సహజంగా ప్రజలు కూడా ధనవంతులన్నట్లే లెక్క. ఆంధ్ర ప్రాంతం కూడా కరువుతో అల్లాడిన ప్రాంతామే. ఎప్పుడైతే రాజమండ్రి, విజయవాడలలో కాటన్‌పుణ్యమా? అని బ్యారేజీలు నిర్మాణం జరిగాయి. అప్పటి నుంచి పంటలు మొదలయ్యాయి. కాని తెలంగాణలో ఏ ప్రాజెక్టులు లేకపోయినా, చెరువులే కల్పతరువులై సిరుల పంటలు పండిరచాయి. అలాంటి తెలంగాణ మళ్లీ కేసిఆర్‌ పాలనలో ప్రజలు చూశారు. సుమారు 60 ఏళ్ల కాలంలో ఆనవాలు కోల్పోయిన చెరువులన్నీ తెలంగాణలో కేసిఆర్‌ పాలనతో ప్రత్యక్ష్యమయ్యాయి. అదీ కేసిఆర్‌ అంటే. నిజానికి ఏ తెలంగాణ వ్యక్తి ఊహించలేదు. ఏ తెలంగాణ వాది చెరువులకు పూర్వ వైభవం వస్తుందని అనుకోలేదు. ఒక వేళ చెరువులు బాగు చేయాలనుకున్నా సాద్యం కాదనుకున్నారు. కాని సాద్యం కాదనుకున్న వాటిని సుసాద్యం చేయడమే కేసిఆర్‌ పట్టుదల. రాదననుకున్న తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ వచ్చేది లేదు, సచ్చేది లేదన్న వారి కళ్లముందే తెలంగాణ తెచ్చి చూపించిండు. నిజాం కాలంలోనే కరంటు చూసిన తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో చీకటి చేసిన్రు. చెరువులను చెడగొట్టి, తెలంగాణ సాగును సర్వనాశనం చేశారు. చెరువులు ఆగం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్లక్ష్యం చేశారు. ఉమ్మడి రాష్ట్రం రాకముందే నిజాం నిర్మాణం చేయాలనుకున్న ప్రాజెక్టులను ఆపేశారు. ఆఖరుకు నిజాం సాగర్‌కు సరైన మరమ్మత్తులు చేయలేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రాజెక్టుల పేరు శంకుస్దాపనలు చేయడం…జనాలను మభ్య పెట్టారు. నీళ్లు, నిధులన్నీ ఏపికి తీసుకెళ్లారు. చెరువులు నింపలేదు. ప్రాజెక్టులు కట్టలేదు. ఆఖరుకు రైతులు బోర్లు వేసుకోకుండా వాల్టా చట్టం తెచ్చారు. కరంటు ఇవ్వకుండా సాగు సాగకుండా చేశారు. మంచి నీళ్లకు దిక్కులేకుండా చేశారు. ఇన్ని సకల దరిద్రాలను నెత్తిన రుద్దిన ఆంద్రా పాలకుల నుంచి తెలంగాణను విముక్తి చేసింది కేసిఆర్‌ కాదా? పదేళ్లలో ఇవన్నీ పునరుద్దరించింది కేసిఆర్‌ కాదా! తెలంగాణలో చెరువులన్నీ బాగు చేసింది కేసిఆర్‌ కాదా! తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరంటు తెచ్చింది కేసిఆర్‌ కాదా! ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలు తప్ప వెలుగులు లేవు. సాగుకు నీళ్లు లేవు. కాని తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే చెరువులోకి నీళ్లు రాలేదు. మూడు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరంటు రాలేదా? ఐదేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగలేదా! ప్రపంచంలోనే అతి పెద్ద బహులార్ధక ఎత్తిపోతల పథకంగా చరిత్ర సృషించలేదా! కాళేశ్వరం నీళ్లన్నీ తెలంగాణ మొత్తం పారలేదా! ఇలా పదేళ్లలోనే ఇంతటి ప్రగతిని చూపించిన నాయకుడు దేశంలోనే ఎవరైనా వున్నారా! చరిత్ర తిరగేసినా కనిపిస్తారా! నాగార్జున సాగర్‌ , శ్రీశైలం లాంటి ప్రాజెక్టుల మూడున్నర దశాబ్దాల పాటు కట్టారు. జూరాల లాంటి 9 టిఎంసిల రిజర్వాయర్‌ ముప్పై ఏళ్లు కట్టారు. కాని 50 టింఎసిల మల్లన్న సాగర్‌ మూడేళ్లలలో పూర్తి చేశారు. దానితోపాటు పదలు సంఖ్యలో ఏక కాలంలో పది టిఎంసిలకు పైగా నిలువ సామర్ధ్యం వున్న రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. ఇవన్నీ పనులు కాదా! కవిత కంటికి కనిపించకుండాపోయాయా? ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ పోరాటం , కష్టాలు ఒడువని ముచ్చట కాలోజీ ఎలా చెప్పాడో కేసిఆర్‌ పాలనలో జరగిన ప్రగతిని చెప్పుకుంటూ పోతే కూడా ఒడువని ముచ్చటే…తరతరాలకు తరగని చరిత్రే.. భవిష్యత్తు తరాలకు వెలుగులు పంచిన పాలనే..కేసిఆర్‌ పదేళ్ల పాలన స్వర్ణయుగమే! రామరాజ్యంలో కూడా అరమరికలువుంటాయి. ఏ ప్రభుత్వంలోనైనా కొన్ని పూర్తి కాని పనులుంటాయి. కాని వాటిని ముందేసుకొని, అందుతున్న ఫలాలను గుర్తించని వారికి ఎంత చెప్పినా వినిపించవు. చూపించినా కనిపించవు.

మహిళా బ్యాంకులో రంగవల్లుల పోటీ

మహిళా బ్యాంకులో రంగవల్లుల పోటీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పాకాల మహిళా బ్యాంకులో రంగవల్లుల పోటీలు మ్యాక్స్ అధ్యక్షులు పెండెం రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విభిన్న రకాల ఆలోచనలతో మహిళలు తీర్చిదిద్దిన అందమైన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈసందర్భంగా పాకాల మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని రాజేశ్వరి అన్నారు.100 మంది పైగా మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి బహుమతి తాటిపాముల నాగలక్ష్మి, రెండవ బహుమతి క్యాథమ్ స్రవంతి, మూడవ బహుమతి గుమ్మపెళ్లి శైలజ లకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మ్యాక్స్ కార్యదర్శి ఇమ్మడి పద్మ, దేవులపల్లి వాణి, గుడిశాల వనజ,బొమ్మగాని మంజుల, గొర్రె రాదా,కీసర,విజయ,ప్రసన్న,నల్ల భారతి,కుడిపూడి అరుణ,గుర్రపు అరుణ, పెండెం స్పందన,పాలడుగుల అనితతో పాటు మ

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ…

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా పుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఫ్రాడ్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలపై వీడియోల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలపై ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు.
సైబర్ మోసానికి గురైన వారు ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి, సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, బాధ్యతాయుత డిజిటల్ పౌరులుగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అధిక వేగం కారణంగా జరిగే ప్రాణాంతక ప్రమాదాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులు అవగాహనతో పాటు బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించి, తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, డీటీవో సంధాన్ ,సీఐలు, ఎస్ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్…

వివాహ వేడుకలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని గౌరీ ప్యాలెస్ లో నయీమ్ గారి కుమారుని వివాహ వేడుకలు పాల్గొని నూతన వరుణ్ కి వివాహ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ వారితో పాటు కాంగ్రెస్ నాయకులు అక్బర్ సంగారెడ్డి జిల్లా యువర్ జన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి నవీద్ అయూబ్ పరాన్ ఖాదిరి యూసుఫ్ ఖదీర్ తదితరులు ఉన్నారు,

ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జెన్కో మాదిగ ఉద్యోగులు…

ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జెన్కో మాదిగ ఉద్యోగులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం నూతన సంవత్సరం సందర్భంగా చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన మాదిగ ఉద్యోగులు
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ డివిజనల్ ఇంజనీర్ నందిపాటి భాస్కర్, సీనియర్ కెమిస్ట్ మోతే తిరుపతి ల ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్, అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లను విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తాడూరి రఘుపతి వారి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సంబంధిత సమస్యల పరిష్కారానికి చీఫ్ ఇంజనీర్ సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కెటిపిపి మాదిగ ఉద్యోగులు చీఫ్ కెమిస్ట్ కె. నాగయ్య, పి. శేఖర్ ఎ.ఇ. ప్రవీణ్ ఎ.ఇ. గొపి ఎ.ఇ. కొడెపాక రత్నాకర్, చిలువేరు మల్లయ్య, బొమ్మకంటి రాజేందర్, అల్లూరి శ్రీనివాస్, బిరెల్లి రాజు, బొచ్చు శంకర్, రమేష్, విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు కార్మికులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన టి ఆర్ పి నాయకులు…

ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన టి ఆర్ పి నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం కేంద్రంలోబుధవారం రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి చీఫ్ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం, జిల్లా అధ్యక్షులు రవి పటేల్ పిలుపు మేరకు బీసీ సప్లాన్ తెలంగాణ రాష్టంలో అమలు చేయాలనీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో ఆర్డీవో లకి వినతి పత్రాలు అందచేశారు.
ఇందులో భాగంగా గణపురం మండల తహసీల్దార్ సత్యనారాయణ స్వామి కి కూడా బీసీ లకి అనాదిగా బడ్జెట్ లో జరుగుతున్న అన్యాయం గురించి వివరించి వెంటనే తెలంగాణ లో బీసీ సప్లాన్ అమలులోకి రావాలని వినతి పత్రం అందచేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో గణపురం మండల అధ్యక్షుడు గండు కర్ణాకర్,బస్వరాజపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అంబటి అశోక్ మండల నాయకులు ఈరగోని తిరుపతి పాల్గొన్నారు

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

అధికారుల ఆదేశాలు బే ఖతర్..!

#నోటీసులు జారీ చేసి సరిపెట్టుకున్న అధికారులు.

#ప్రజల ఆరోగ్యం పై ఇంత నిర్లక్ష్యమా..

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో నెలకొల్పిన రెడ్ మిక్స్ ప్లాంట్ కర్మాగారం ద్వారా వచ్చేదుమ్ము ధూళితో డిపిఎం 38 కెనాల్ భూమిపై ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వాహనాలు నడపడంతో సిసి రోడ్డుతో పాటు కెనాలకు ప్రమాదం ఉందని అదేవిధంగా కస్తూరిబా గాంధీ విద్యార్థులతో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్న యజమానులకు కెనాల్ పై ఉన్నదారిపై అనుమతి లేకుండా వాహనాలు నడపరాదని నోటీసులు జారీచేసిన కూడా నిర్వాహకులు అధికారుల ఆదేశాలను బే ఖతర్ చేయడంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అధికారుల ఆదేశాల సైతం పట్టించుకోకుండా ప్లాంట్ నిర్వాహకులు యధావిధిగా వాహనాలు నడపడం లో ఆంతర్యం ఏమిటని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

#ప్లాంటు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
ఐబి ఏఈ పవిత్ర.

రెడ్ మిక్స్ ప్లాంట్ నుండి భారీ వాహనాలు డిబిఎం 38 కెనాల్ పై ఉన్న రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు నడపడం జరుగుతుందని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని. మరల కెనాల్ పైనుండి యధావిధిగా వాహనాలు కొనసాగించడం పట్ల జిల్లా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్లాంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు

కార్మికుడిని ఆదుకున్న బిల్డింగ్ రంగం ఏఐటియుసి…

కార్మికుడిని ఆదుకున్న బిల్డింగ్ రంగం ఏఐటియుసి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి పట్టణంలోని కొమురయ్య భవన్ ఏఐటీయూసీ ఆఫీస్ నందు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తుండగా ప్రమాదం జరిగిన కార్మికుడికి ఆర్థిక సహాయం 15000 అందించిన భవన నిర్మాణ కార్మిక సంఘం సహకారంతో ప్రమాదం జరిగిన కార్మికుడికి నగదు అందించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిల్డింగ్ రంగం నాయకులు
ఈ సందర్భంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకటేష్ మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణానికి చెందిన కార్ మాస్ కాలనీ నివాసం ఉంటున్న కన్నే వేణి సత్యం అనే కార్మికుడు గత 20 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ తరుణంలో గత నెల క్రితం భవన నిర్మాణం చేస్తుండగా కింద పడిపోయాడు అతనికి రెండు హరి రపాదాలలో గుత్తులు విరగగా నడవలేని స్థితికి చేరుకోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుల దృష్టికి తీసుకురాగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడిని ఆర్థిక సాయం కోరగా తలకొంత డబ్బులు జమ చేసుకొని యూనియన్ ఆఫీసులో భూపాలపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆ రెల్లి వినోద బిల్డింగ్ రంగం యూనియన్ ఆధ్వర్యంలో నగదు రూపేనా కన్నెవేని సత్యం భార్య కి 15 వేల నగదు రూపాయలు అందజేయడం జరిగిందన్నారు
తను నిరుపేద కుటుంబానికి చెందిన వాడైనందున కార్మికులు అతనికి జరిగిన సంఘటనకు చలించిపోయి కార్మికులు తోటి కార్మికుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు బిల్డింగ్ కనెక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తరఫున కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు
కార్మికులంతా కూడా కలిసికట్టుగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ తోటి సహచర కార్మికులందరికీ భరోసా ఇచ్చే విధంగా ఉండాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు లేబర్ కార్డు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే వారి కుటుంబాలకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని తక్షణము లేబర్ కార్డు లేని ప్రతి కార్మికుడు లేబర్ కార్డు చేసుకోవాలని దాని ద్వారా కార్మికుడికి చాలా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు చాలామంది కార్మికులు కార్డు పొందియుండి రెన్యువల్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగా వివాహ కానుక ప్రస్తుత సౌకర్యం సహజ మరణం యాక్సిడెంట్లు డెత్ మెడికల్ క్లైమూల వంటి అనేక సంక్షేమ పథకాలను కోల్పోవాల్సి వస్తుందని కార్మికులకు తెలియజేశారు కార్మికులు పనిచేసే చోట సేఫ్టీ భద్రత ప్రమాణాలు పాటించి పనులు నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులకు అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద గారికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు 11 రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతరాజు సతీష్ గంగ సారపు శ్రీనివాస్ గార్లకు కార్మిక వర్గం నాయకత్వం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మేకల సమ్మయ్య చిలకని రాజయ్య తమ్మిశెట్టి సతీష్ మహమ్మదువలి సిద్ధం రాజు ఇంజాల శ్రీనివాస్ అనపర్తి సురేష్ మామిడిపల్లి చరణ్ తదితరులు పాల్గొన్నారు

భారతీయ సాంప్రదాయం ముగ్గుఎంపీఓ _మార్గవి…

భారతీయ సాంప్రదాయం ముగ్గుఎంపీఓ _మార్గవి

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నడికూడ మండలం ఎంపీఓ మార్గవి విచ్చేసి మాట్లాడుతూ ముగ్గు అనేది ఇంటి వాకిలి ఇంటి లోపల అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం అని అన్నారు.ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే పిండితో ముగ్గులు వేస్తారనీ,ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారనీ,గచ్చులు వేసిన ఇంటి వెలుపలి,లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను గాని,సుద్ధముక్కలను గాని తడిపి వేస్తారని అన్నారు. ఆధునిక కాలంలో ఇంటి లోపలి ముగ్గులు కొందరు పెయింట్తో వేస్తున్నారని ఇవి రోజు వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయని కొన్ని రకాల పింగాణి పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన అంచుల వెంబడి వేసుకుంటున్నారని అన్నారు.

ప్రైవేటుకు దీటుగా చర్లపల్లి పాఠశాల

నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ఫోటోతో కూడిన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కున్సోత్ హనుమంతరావు,ఎంపీ ఓ మార్గవి విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులతో కూడిన క్యాలెండర్ ను ముద్రించడం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తుందని నిదర్శనమని అన్నారు అంతేకాకుండా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో లకవత్ దేవ,పుల్లూరి రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి నందిపాటి సంధ్య తదితరులు పాల్గొన్నారు.

నఖిలి ఓట్లను తొలగించాలిఅధికారులకు వినతిపత్రం అందజేసిన సీపిఎం నాయకులు…

నఖిలి ఓట్లను తొలగించాలిఅధికారులకు వినతిపత్రం అందజేసిన సీపిఎం నాయకులు

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలో గల 22 వార్డులలో ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని సిపిఎం పార్టీ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో విజయలక్ష్మి కి మరియు మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా వారు పట్టణ సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలోని ఓటర్ లిస్టులను వార్డుల వారిగా పరిశీలించి దొంగ ఓట్లను తొలగించాలన్నారు.అదేవిధంగా ఓటు వేసే సమయంలో ఆధార్ కార్డు ఉంటూనే ఓటు వేసేందుకు అనుమతివ్వాలని కోరారు.2వార్డులో చనిపోయిన వారివి మరియు వివాహం జరిగి ఐదు సంవత్సరాలు గడుస్తున్న వారి ఓటును తొలగించలేదని అలాంటి వారు ఇరు చోట్ల ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అలాంటి వాటిని గమనించి తొలగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్,బొచ్చు ఈశ్వర్ పాల్గొన్నారు.

జనవరి 11నుంచి హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలు.

జనవరి 11నుంచి హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలు.

వరంగల్ నేటిధాత్రి.

 

ఈ నెల 11, 12, 13 తేదీల్లో వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఉన్న హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీద్ బాబా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాషూక్-ఎ-రబ్బాని దర్గాలో ఉత్సవాల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. నవీద్ బాబా తెలిపిన ప్రకారం, జనవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు దర్గా పీఠాధిపతి నివాసంలో ఫాతిమాతో ఉరుఫ్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీన రాత్రి 9 గంటలకు సందల్ సాని మరియు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. 13వ తేదీన ఖురాన్ పఠనం అనంతరం హజ్రత్ సయ్యద్ షా హైదర్ ఇల్లాలుద్దీన్ ఖాద్రి జిలానీకి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖలతో పాటు జిల్లా అధికారులు సమన్వయంతో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీద్ బాబా కోరారు.

అంతక్రియలో పాడే మోస్తున్న బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు…

అంతక్రియలో పాడే మోస్తున్న బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇడబోయిన సంతోష్ నానమ్మ ఈడ బోయిన పెద్ద ఐలమ్మ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి అంతక్రియ లో పాడే మోసిన బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి నగరంపల్లి గ్రామ సర్పంచ్ కొడారి హైమావతి ధనంజయ
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దంసాని శ్రీకాంత్ నాయకులు తొట్ల రాజగోళ్ళ వావిలాల మొగిలి ఈడ బోయిన శ్రీను భాష బోయిన నాగరాజు రాకేష్ సిద్దు తదితరులు పాల్గొన్నారు

నూతన గ్రంథాలయం నిర్మించాలని జిల్లా చైర్మన్ కు వినతి పత్రం అందజేత…

నూతన గ్రంథాలయం నిర్మించాలని జిల్లా చైర్మన్ కు వినతి పత్రం అందజేత.

చిట్యాల, నేటిదాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా చైర్మన్ కోట రాజబాబు ని చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి, అంతులు ఆదేశాల మేరకు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం చిట్యాల గ్రంధాలయం గ్రామపంచాయతీలో ఉండడం ద్వారా పరిపాలనకు ఇబ్బందికరంగా మారిందని ఇరుకు గదిలో గ్రంథాలయం ఉండడం జరిగిందని, కావున* నూతన గ్రంధాలయ భవనాన్ని నిర్మించి గ్రంధాలయ పాఠకులకు సౌకర్యం కలిగించాలని బుధవారం రోజున పంచి బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డ్ మెంబర్ తౌటం నవీన్ గ్రామపంచాయతీ పాలవర్గం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అనంతరం గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ తప్పకుండా*నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది*ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు సభ్యుడు తౌటం నవీన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గు మ్మడి శ్రీదేవి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , దొడ్డికిష్టయ్య, గ్రంథాలయ ఇన్చార్జి గంగాధర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

హిందూ స్మశాన వాటికకు భూమి పూజ..

హిందూ స్మశాన వాటికకు భూమి పూజ..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7,8,9,10 వ వార్డ్ ప్రజల సౌకర్యార్థం అమ్మ గార్డెన్ ఏరియాలోనీ ఆర్ ఆర్ నగర్ ప్రాంతంలో హిందూ స్మశాన వాటికకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. సుమారు 50 లక్షల పట్టణ ప్రగతి, 15వ ఫైనాన్స్ నిధులతో స్మశాన వాటిక కు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు.అమ్మ గార్డెన్ ఏరియాలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నానని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రఘునాథరెడ్డి, ఎమ్మార్వో సతీష్ కుమార్,పుర కమిషనర్ గద్దె రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, గోపతి భానేష్, నాయకులు,ప్రజలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి…

మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

బస్తీబాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు కార్లమార్క్స్ కాలనీ లో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్బంగా గండ్ర మాట్లాడుతూ.
భూపాలపల్లి ప్రాంతంలో గతంలో మంచినీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఆ పరిస్థితిని గమనించి, పూర్తి స్థాయిలో సమస్యకు పరిష్కారం చూపిన నాయకత్వం కేసిఆర్ దే అని చెప్పక తప్పదు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలు అందుతున్నాయంటే, అది కేసిఆర్ దూరదృష్టి గల పాలన ఫలితం.
అదే విధంగా, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను ప్రతి ఇంటికీ అందించిన ఘనత కూడా కేసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది.
ఒకప్పుడు చిన్న గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న భూపాలపల్లి జిల్లా స్థాయికి ఎదగడం, ఒక ఎస్పీ, ఒక కలెక్టర్‌తో పరిపాలన కొనసాగించగలగడం ఇవన్నీ కేసిఆర్ పాలనలో సాధ్యమయ్యాయి.

భూపాలపల్లి జిల్లాను రద్దు చేయాలనే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విజ్ఞులైన భూపాలపల్లి పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు గమనించాలి.

ఇలాంటి ప్రజావిరుద్ధ నిర్ణయాలకు భూపాలపల్లి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఇప్పటికే పది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంత కాలం తర్వాత మళ్లీ జిల్లాలపై కొత్త ముచ్చట్లు ఎందుకు తెరపైకి తెస్తున్నారు? దీని వెనుక ఉద్దేశ్యం ఏమిటి? మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పిర్రు కదా, ఇప్పటివరకు ఆ హామీ నెరవేరిందా?
వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు, అది ఎక్కడ అమలైంది…?
భూపాలపల్లి ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు, అవసరమైతే సరైన సమయం లో సరైన సమాధానం ప్రజాస్వామ్య బద్ధంగా బదులు ఇస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
24వ వార్డులో గతంలో సీలింగ్ సర్ప్లస్ భూముల్లో మీరు అందరూ ఇళ్లను నిర్మించుకున్న సమయంలో, నేను ప్రభుత్వంతో పోరాడి మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగేలా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు
కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి భూపాలపల్లి వంటి మారుమూల ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేశారు. భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ వచ్చి చూడవచ్చు.
కలెక్టర్ కార్యాలయం కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు, జూనియర్ కళాశాల కావచ్చు, అంతేకాదు ఒక మెడికల్ కాలేజ్ కూడా భూపాలపల్లి వంటి మారుమూల ప్రాంతానికి రావడం అంటే ఇది చిన్న విషయం కాదు.
గతంలో కేవలం ఒక సెంటర్‌గా ఉన్న భూపాలపల్లి, ఈ రోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో కూడిన వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగింది.
భూపాలపల్లి పట్టణాభివృద్ధి కోసం నేను తెచ్చిన నిధులకు శంకుస్థాపనలు వేస్తావ్, టెండర్ పిలిచి పనులు ప్రారంభం అయిన వాటిని నీకు కాంట్రాక్టర్ మర్యాద చేయలేదని ఆ పనులు క్యాన్సిల్ చేసి నీ ఊరికి తీసుకెళ్ళి పట్టణాభివృద్ధిని అడ్డుకుంటున్నావ్. నిజంగా భూపాలపల్లిని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కొత్త నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్. అని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశంలో పాల్గొన్న సర్పంచి ఉప సర్పంచ్.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండలం కేంద్రంలో ని నాలుగవ ,ఐదవ కేంద్రం అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి, జ్యోతి ఏర్పాటు చేసిన ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశమునకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ , ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ హాజరైనారు. ముందుగా ప్రజా ప్రతినిధులను శాల్వాలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని జయప్రద సూపర్వైజర్ హాజరై కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆట,పాట, కథ ద్వారా క్రమశిక్షణతో కూడిన ఎల్కేజీ, యూకేజీ నర్సరీ సంబంధించిన విద్యను బోధించి ప్రైమరీ స్కూల్ కు సంసిద్ధులుగా తయారు చేయడం, రుచిగా, వేడిగా, క్వాలిటీ, క్వాంటిటీ ప్రకారం తల్లులకు, పిల్లలకు భోజనం పెట్టడం పిల్లల బరువులు తీయడం, లోప పోషణ గుర్తించడం బాలమృతం, ఎగ్స్ పంపిణీ చేయడం, కిశోర బాలికలకు, పల్లి పట్టీలు ఇవ్వడం, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, దత్తత, అనాధ బాలబాలికలను గుర్తించి హాస్టల్లో చేర్పించడం జరుగుతుందని వివరించారు. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అప్పుడే పిల్లలందరూ అన్ని రంగాలలో ముందంజలో ఉంటారని వివరించారు. సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ కేంద్రాలలో ఎటువంటి సమస్యలు ఉన్న, అవసరాలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపినారు. వారి చేతుల మీదుగా ముగ్గురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పల్లి పట్టీలు, బాలమృతం పంపిణీ చేయనైనది. వార్డు మెంబర్స్ తౌటమ్ నవీన్ మైదం శ్రావ్య ఏఎన్ఎం సుమలత , ఆశ వర్కర్ అధిక సంఖ్యలో మహిళలు కిశోర బాలికలు హాజరైనారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version