మోటార్ వాహన చట్టం కఠినంగా పాటించాలి – ఎస్ఐ బోరగాల అశోక్

మోటార్ వాహనాల చట్టాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం

-ఎస్ఐ బోరగాల అశోక్

 

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టిన రోడ్డు భద్రత కార్యక్రమాన్ని మొగుళ్ళపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్, సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు-కోటేశ్వర్ రావు దంపతులు, పంచాయతీ సెక్రెటరీ నరేష్ లు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన ప్రజలు, యువకులనుద్దేశించి ఎస్ఐ బోరగాల అశోక్ మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపడం వలన విలువైన ప్రాణాలను కోల్పోతున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలను అప్పగిస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియమాలు, మోటర్ వాహనాల చట్టాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రాన్ని నిర్మించగలమన్నారు. రోడ్డు భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

చిట్యాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణకోసం డిఫెన్సివ్ డ్రైవింగ్ నిర్వహణ.

మండల వ్యాప్తంగా” అరైవ్ అలైవ్” పై అవగాహణ.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

చిట్యాల మండలం కేంద్రం లో చిట్యాల పోలీస్ వారు తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ” అరైవ్* అలైవ్ ” మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్” కార్యాక్రమం నిర్వహించడం*జరిగింది.
ఇందులో భాగంగా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని , రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుందని అట్టి ప్రమాదాలను నివారించడానికి ప్రధానంగా రోడ్లపై అవగాహన పెంచడానికి, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానానికిచేరేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను* *తెలియజేయడానికి రూపోందించినది అరైవ్ అలైవ్ మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్ అని చిట్యాల పోలీస్ స్టేషన్ సీఐ మల్లేష్ యాదవ్ ఎస్సై శ్రవణ్ , తెలియజేశారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు:*
మన రోడ్లను మరింత సురక్షితం* చేయడం, వాహన చోదకుల ఆలోచన* దృక్పథంలో మార్పు తేవడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సేఫ్ డ్రైవింగ్* *అలవర్చడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించడం, హెల్మేటు మరియు సీటు బెల్టు వాడకం పెంపు, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్ వాడకం గురించి హెచ్చరికలు, పాదాచారుల భద్రత మొదలగునవి తెలియజేయడం జరుగుతుంది.
ఇట్టి ‘ అరైవ్ అలైవ్ మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్” కార్యక్రమాలు ఇక మీదట అన్ని స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులలో పనిచేసే వారికి, గ్రామాలలో, రహదారికి* ఇరువైపుల గల ప్రధాన జంక్షన్లలో మొదలగు ప్రాంతాలలో చిట్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చిట్యాల పోలీస్ సీఐ మల్లేష్ యాదవ్. తెలిపారు,
*ఈ కార్యక్రమం ల్లో చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ 4వ వార్డు సభ్యులు తౌటం నవీన్, పోలీస్ సిబ్బంది మరియు చిట్యాల గ్రామ యూత్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ…

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా పుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఫ్రాడ్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలపై వీడియోల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలపై ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు.
సైబర్ మోసానికి గురైన వారు ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి, సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, బాధ్యతాయుత డిజిటల్ పౌరులుగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అధిక వేగం కారణంగా జరిగే ప్రాణాంతక ప్రమాదాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులు అవగాహనతో పాటు బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించి, తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, డీటీవో సంధాన్ ,సీఐలు, ఎస్ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version