భూపాలపల్లి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి: గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి

ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బిఆర్ఎస్ పార్టీ పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఓటు కు ఉండే ప్రాముఖ్యత మీరు గుర్తించాలి
నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు హన్మకొండ నుండి భూపాలపల్లికి రావాలంటే పెద్ద పెద్ద బొందలు ఉన్న రోడ్లు ఉండే… మరీ ఆ రోడ్డే అలా ఉంటే మన భూపాలపల్లి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఉహించుకోండి.
నేను బస్సులో, కారులో నేను వస్తుంటే సార్ ఇగో మా రోడ్లు అని ప్రజలు చూపెడుతుండే.
భూపాలపల్లిని సరిగ్గా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి గ్రామ పంచాయతీ గా ఉన్న భూపాలపల్లిని నగర పంచాయతీ చేసి కొన్ని గ్రామాలను భూపాలపల్లి లో కలిపి మున్సిపాలిటీ చేయడం జరిగింది.
దాని వల్ల భూపాలపల్లి ఒక్క జిల్లా స్థాయికి ఎదిగింది జిల్లా కేంద్రం అయిన భూపాలపల్లి పై ఎందుకో రేవంత్ రెడ్డి కి కళ్ళు మండుతున్నాయి. ఇన్ని జిల్లాలు అవసరం లేదని మేడారంలో మంత్రివర్గ సమావేశం పెట్టి జిల్లాలను కుదించేందుకు ఒక్క కమిటీ ఏర్పాటు చేసిన జిల్లాల్ని తొలగించే దాంట్లో మొదటి జిల్లా భూపాలపల్లి అనే విదంగా చేసిండు.

ముఖ్యమంత్రికి పరిపాలన చేసే శక్తి లేదు,ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే ధైర్యం లేదు.
మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రతి ఇంటికి వచ్చినాయి, రోడ్లు, సైడ్రైన్స్ ప్రజలకి మెరుగైన సౌకర్యాలు వచ్చినాయి.
జిల్లా అయింది కాబట్టి భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వచ్చింది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 100 పడకల ఆసుపత్రి నిర్మించి ప్రతి రోజు వైద్య సేవలు ఎలా ఉన్నాయో అని ప్రతి నెలకి ఒక్కసారి హాస్పిటల్ విజిట్ చేశాము కానీ
జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేసిన మీ పక్కనే ఉన్న హాస్పిటల్ ఒక్కసారి విజిట్ చేయమని కోరినం, అది చేత కాకపోతే ఒక్క స్పెషల్ ఆఫీసర్ వేయమని కోరిన కనీసం పట్టించుకోవడం లేదు.
ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి అంట మీ అమూల్యమైన ఓటు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై వేసి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి…

మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

బస్తీబాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు కార్లమార్క్స్ కాలనీ లో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్బంగా గండ్ర మాట్లాడుతూ.
భూపాలపల్లి ప్రాంతంలో గతంలో మంచినీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఆ పరిస్థితిని గమనించి, పూర్తి స్థాయిలో సమస్యకు పరిష్కారం చూపిన నాయకత్వం కేసిఆర్ దే అని చెప్పక తప్పదు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలు అందుతున్నాయంటే, అది కేసిఆర్ దూరదృష్టి గల పాలన ఫలితం.
అదే విధంగా, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను ప్రతి ఇంటికీ అందించిన ఘనత కూడా కేసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది.
ఒకప్పుడు చిన్న గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న భూపాలపల్లి జిల్లా స్థాయికి ఎదగడం, ఒక ఎస్పీ, ఒక కలెక్టర్‌తో పరిపాలన కొనసాగించగలగడం ఇవన్నీ కేసిఆర్ పాలనలో సాధ్యమయ్యాయి.

భూపాలపల్లి జిల్లాను రద్దు చేయాలనే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విజ్ఞులైన భూపాలపల్లి పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు గమనించాలి.

ఇలాంటి ప్రజావిరుద్ధ నిర్ణయాలకు భూపాలపల్లి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఇప్పటికే పది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంత కాలం తర్వాత మళ్లీ జిల్లాలపై కొత్త ముచ్చట్లు ఎందుకు తెరపైకి తెస్తున్నారు? దీని వెనుక ఉద్దేశ్యం ఏమిటి? మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పిర్రు కదా, ఇప్పటివరకు ఆ హామీ నెరవేరిందా?
వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు, అది ఎక్కడ అమలైంది…?
భూపాలపల్లి ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు, అవసరమైతే సరైన సమయం లో సరైన సమాధానం ప్రజాస్వామ్య బద్ధంగా బదులు ఇస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
24వ వార్డులో గతంలో సీలింగ్ సర్ప్లస్ భూముల్లో మీరు అందరూ ఇళ్లను నిర్మించుకున్న సమయంలో, నేను ప్రభుత్వంతో పోరాడి మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగేలా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు
కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి భూపాలపల్లి వంటి మారుమూల ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేశారు. భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ వచ్చి చూడవచ్చు.
కలెక్టర్ కార్యాలయం కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు, జూనియర్ కళాశాల కావచ్చు, అంతేకాదు ఒక మెడికల్ కాలేజ్ కూడా భూపాలపల్లి వంటి మారుమూల ప్రాంతానికి రావడం అంటే ఇది చిన్న విషయం కాదు.
గతంలో కేవలం ఒక సెంటర్‌గా ఉన్న భూపాలపల్లి, ఈ రోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో కూడిన వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగింది.
భూపాలపల్లి పట్టణాభివృద్ధి కోసం నేను తెచ్చిన నిధులకు శంకుస్థాపనలు వేస్తావ్, టెండర్ పిలిచి పనులు ప్రారంభం అయిన వాటిని నీకు కాంట్రాక్టర్ మర్యాద చేయలేదని ఆ పనులు క్యాన్సిల్ చేసి నీ ఊరికి తీసుకెళ్ళి పట్టణాభివృద్ధిని అడ్డుకుంటున్నావ్. నిజంగా భూపాలపల్లిని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కొత్త నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్. అని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version