నిర్లక్ష్యంతో రూ.40 లక్షల డ్రైనేజీ పనులు గల్లంతు

గత పాలకుల నిర్లక్ష్యంతో 40 లక్షల డ్రైనేజీ పనుల గల్లంతు

-దోమలతో రోగాల బారిన పడుతున్న గ్రామస్తులు

ముత్తారం :- నేటి ధాత్రి

గ్రామాల పరశుభ్రత,అభివృద్దే ధ్యేయంగా గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సుమారు 40 లక్షలతో నిర్మాణం చేసిన డ్రైనేజ్ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అస్తవ్యస్తంగా మారింది.గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెరాస పాలకుల పట్టింపులేని కారణంగా,పాలకులే డ్రైనేజ్ పూడ్చి వేయడంతో పాటు వారి అనుచరులు సహితం అదే బాటలో నడిచి డ్రైనేజ్ నుండి నీరు బయటకు వెళ్ళకుండా చేశారు.అప్పుడు డ్రైనేజ్ నిర్మాణం పనులు చేసిన గుత్తేదారు మద్య మద్యలో వదిలేసి,నిర్మాణం అసంపూర్తిగా చేసారు.దీంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచి పోవడంతో చెత్తా చెదారం జమ అయి అవి దోమలకు ఆవాసాలుగా మారాయి.

దీంతో నిరుపేదలైన గ్రామస్తులు రోగాల బారినపడి లక్షలాది రూపాయలు ఆసుపత్రిలో ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోయారు.దీనికి తోడు ఎవరి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి కాని డ్రైనేజ్ లతో పనేంటి అని అధికారులతో మాట్లాడిస్తున్నారని వాపోతున్నారు.ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించు కోవడం లేదు. డ్రైనేజ్ ని కూడిపిన వారే మాజీ ప్రజాప్రతినిధులు కావడం,అధికారులతో సన్నిహితంగా ఉంటూ,అడిగిన వారిని పట్టించుకోవడం లేదని,దీంతో తమ గోడు ఎవరికి చెప్పలేని స్థితిలో ఉన్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని తెలిపారు.పైగా డ్రైనేజ్ సిల్ట్ ను తీసివేయమన్న వారిని పోలీసులతో సైతం బెదిరించిన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోని పూడ్చివేసిన డ్రైనేజ్ లను పునరుద్దరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పోత్కపల్లిలో డ్రైనేజీ సమస్య కారణంగా అనారోగ్యాలు

పోత్కపల్లి లో అధ్వానంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ..

అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. గ్రామంలోని రెండు మూడు వార్డులు డ్రైనేజీ పూర్తిగా గడ్డి తో కప్పబడి ఉంది.వీటి వల్ల దోమలు ఎక్కువడడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. గ్రామపంచాయతీకి నూతన పాలకవర్గం వచ్చి దాదాపుగా నెల రోజులు గడుస్తున్న ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి గ్రామంలో డ్రైనేజీ పారిశుద్ధ పై ప్రత్యేక దృష్టి వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

గ్రామంలో అలంకరిస్తున్న గ్రామ నూతన సర్పంచ్…

గ్రామంలో అలంకరిస్తున్న గ్రామ నూతన సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల నూతనంగా గెలుపొందిన సర్పంచ్ ఝరాసంగం గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సవాలుగా మారాయి.మురికి కాలువల్లో చెత్త పేరుకుపోవడం దోమలు వ్యప్తి చెంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడడం ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నూతనంగా గెలుపొందిన సర్పంచ్ వినోదా బాలరాజ్ ఉప సర్పంచ్ చొరవ తీసుకొని పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయించారు. ఝరాసంగం సర్పంచ్ కార్మికులను ఏర్పాటు చేసి గ్రామంలోని మురికి కాలువలు శుభ్రం చేయించి గ్రామ వీధులలో మురికి నీరు నిలవకుండా ప్రధాన కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని కార్మికులతో శుభ్రం చేయించారు. సర్పంచ్ వినోదా బాలరాజ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, మురికి కాలువలు శుభ్రం చేయించడం ప్రజలకు ఇబ్బంది కలవకుండా చూడడం గ్రామ పంచాయతీ పాలకుల బాధ్యత అని అన్నారు.

వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్…

వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం గ్రామ చర్చ్ ముందు సిసి రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉన్న చెత్తను గమనించి గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ వెంటనే స్పందించి అక్కడి నుంచి చెత్తను తీసేయాలని అక్కడ ఉన్న ప్రజలను ఏ ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామపంచాయతీ కార్మికులకు చెప్పి చెత్తను తీసివేయించడం జరిగింది. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వెంటనే స్పందించి గ్రామ పరిశుభ్ర గురించి ఆలోచించి వెంటనే సంధిస్తున్నారు.

చర్చి ముందు చెత్తను ఉంచకుండా చెత్తకుండీ నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలిపారు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగానే గ్రామ పంచాయితీ కార్యదర్శి వీరన్న పటేల్ గారి తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తు.గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికులలో ప్రతి ఉదయం చెత్త సేకరణ, వివిధ వార్డులతో పాటు ప్రధాన రోడ్డును పరిశుభ్రత చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version