సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ…

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా పుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఫ్రాడ్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలపై వీడియోల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలపై ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు.
సైబర్ మోసానికి గురైన వారు ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి, సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, బాధ్యతాయుత డిజిటల్ పౌరులుగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అధిక వేగం కారణంగా జరిగే ప్రాణాంతక ప్రమాదాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులు అవగాహనతో పాటు బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించి, తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, డీటీవో సంధాన్ ,సీఐలు, ఎస్ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వాట్సాప్ హెచ్చరిక: డబ్బు దొంగిలించే కొత్త స్కామ్.. జాగ్రత్త!…

వాట్సాప్ హెచ్చరిక: డబ్బు దొంగిలించే కొత్త స్కామ్.. జాగ్రత్త!

◆:- ఎస్సై క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ మాట్లాడుతూ వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని, వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి, అనధికారిక లావాదేవీలు చేసే కొత్త మోసంపై వాట్సాప్ అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది. మోసగాళ్లు బ్యాంకులు, ప్రభుత్వ అధికారుల వేషంలో నమ్మిస్తూ, నకిలీ వెబ్సైట్లకు లింకులు పంపి, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు సేకరిస్తున్నారు. వాట్సాప్ ఎవరూ మెసేజ్ ద్వారా సున్నితమైన సమాచారం అడగరని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని, టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయాలని, అనుమానాస్పద మెసేజ్లను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version