నిరోషా కుటుంబానికి ఆర్థిక సహాయం..

నిరోషా కుటుంబానికి ఆర్థిక సహాయం

కల్వకుర్తి /నేటి దాత్రి

నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం రేవల్లి గ్రామానికి చెందిన నిరోషా వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి నిరోషా ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు సోమవారం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, జంగయ్య, బలరాం, బాల నాగయ్య, శివుడు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు..

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు

శాలువాతో సత్కరించిన అరుణ ఫర్టిలైజర్ యాజమాని వెంకన్న

పరకాల:నేటిధాత్రి
వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగూర్ల వెంకన్న మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ సందర్బంగా అరుణ ఫర్టీలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందే వెంకటేశ్వర్లు హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.గత 35 సంవత్సరాలుగా ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్అండ్ సీడ్స్ రంగంలో వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ కి ఎనలేని సేవలు అందిస్తూ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ ఎరువుల పురుగుమందులు విత్తనంపై దుకాణాల యజమానుల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తూ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు గందే వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.

పనులు నిలిపివేయడంతో మాఫియా దాడి..

కోహిర్ మండల్లో మట్టి అక్రమ తరలింపు. పనులు నిలిపివేయడంతో మాఫియా దాడి

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాల వ్యాపారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. మరియు రెవెన్యూ శాఖ మరియు మన్నింగ్ శాఖ అధికారుల మౌనం అక్రమ గని కార్మికుల మనోధైర్యాన్ని పెంచింది. ఇటీవల, శుక్రవారం రాత్రి, మాద్రిలోని కోహిర్ మండల్ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాల సమయంలో, మాద్రి గ్రామ ప్రజలపై మట్టి మాఫియా కర్రలతో దాడి చేసి, అక్రమ మట్టి తవ్వకాన్ని అడ్డుకున్నప్పుడు వారిని గాయపరిచింది. గాయపడిన వారిలో ముహమ్మద్ వసీం పటేల్, ముహమ్మద్ అజీం మరియు ఇతరులు ఉన్నారు. మరియు ఈ దాడిలో ముహమ్మద్ వసీం పటేల్ తీవ్రంగా గాయపడ్డాడు మరియు వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరియు మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరియు గాయపడిన వారి వివరాల ప్రకారం, వక్ఫ్ భూమిలో అక్రమంగా పంట కోతలు జరుగుతున్నాయని, అదే సమయంలో, పంట కోస్తున్న వారిని వివరాలు అడిగినప్పుడు, వారిపై కర్రలతో దాడి చేశారని తెలుస్తోంది. మరియు ఈ అక్రమ మైనింగ్ రెండు వైపుల నుండి కొనసాగుతోంది. మరియు దాడిలో గాయపడిన వారు శనివారం కోహిర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరియు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు ఈ అక్రమ మైనింగ్‌ను ఆపాలని గ్రామస్తులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం..

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గోని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు యంపి, మాజీ మంత్రి. టి జి ఐ డి సి మాజీ చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహిరాబాద్ పట్టణం: జహిరాబాద్ పట్టణం లో ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించిన ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం లో పాల్గోని స్వామి వారిని దర్శించుకుని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు.నిర్వహకులు ఈ సందర్భంగా జ్ఞాపికను అందచేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు ,మంకల్ సుభాష్ గారు,శుక్లవర్దన్ రెడ్డి, అశోక్,రాకేష్ గుప్త,ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు..

ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Ramadan fasting initiations started

 

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండగ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. జహీరాబాద్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో గల ముస్లింలు ఉపవాస దీక్షను పాటిస్తున్నారు.. ఉపవాస సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి వాహనాల తనిఖీ చేయరాదని, చాలన్లు విధించరాదని, నమాజ్ వేళ్లే సమయంలో వాహనాలు తనిఖీ చేయరాదని జహీరాబాద్ ఈద్గా కమిటీ సభ్యులు స్థానిక పట్టణ ఎస్సై కాశీనాథ్ ను కోరారు. దీంతో పాటుగా ఉపవాస దీక్షలు విరమించే సమయంలో విద్యుత్ అంతరాయము రాకుండా చూడాలని విద్యుత్ సరఫరా లో ఏదైనా అంతరాయం ఉంటే ముందే సూచించాలని విద్యుత్ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ మాసం అతి పవిత్రంగా భావించి ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు చేస్తూ సాయంత్రానికి ఉపవాస దీక్ష విరమిస్తారు. ఈ మాసంలో ముస్లింలు పవిత్రంగా ఉంటూ అల్లాను ధ్యానిస్తూ ఐదు సార్లు నమాజు చేస్తూ ఉపవాసలు కొనసాగిస్తారు. అధికారులను కలిసి ఈద్గా కమిటీ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మాజీద్, మొహమ్మద్ ఇనాయత్ అలీ, మొహమ్మద్ అక్బరుద్దీన్, మొహమ్మద్ ఆయుబ్, తదితరులు ఉన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

A spirited gathering of alumni 1994-94 batch students

ఝరాసంగం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1994-94 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నాటి గురువులతో కలిసి వైభవంగా నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన విద్యార్థులు అందరు ఒకే వేదికపై కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చదివిన బడి, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన గురువులు పాపిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మల్లేశం, అజుముద్దీన్, చంద్రశేఖర్, మాణిక్యప్పలా పాదాలకు నమస్కరించి ఆశీర్వచనలు తీసుకుని పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. పూర్వ విద్యార్థులు ఆర్ నర్సింలు, విజయేందర్ రెడ్డి, శశికళ, అమరావతి, అస్లాం, రిహానా, నాగన్న, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, విజయ్ కుమార్, ముక్తార్, అనిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ టార్చర్‌ మేం భరించలేం!

`సబ్‌ రిజిస్ట్రార్ల ఆందోళన, ఆవేదన.

`మంత్రి పొంగులేటికి, ఉన్నతాధికారులకు రిజిస్ట్రార్ల లేఖ.

`మీడియా ముసుగులో వచ్చే వారిని తట్టుకోలేం!

`ఎవరు అసలో..ఎవరు నకిలో తెలియడం లేదు.

`మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తించలేం.

`సమయమంతా వారికి కేటాయించడంతోనే సరిపోతోంది.

`సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతోంది.

`వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి.

`అసత్య వార్తలన్నింటికీ జవాబుదారీలం కాలేము.

`జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేము.

`సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్‌ చేయలేము.

`రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారు పది మంది!

`లేని పోని వార్తలతో వచ్బే జర్నలిస్టులు పదుల సంఖ్యలు.

`గాలి వార్తలు..వసూల్‌ రాజాలు!

`లేని పోని వార్తలు సృష్టిస్తున్నారు.

`ప్రజల్లో రిజిస్ట్రార్లను మరింత చులకన చేస్తున్నారు.

`రిజిస్ట్రేషన్‌కు వచ్చే వాళ్లంతా అనుమానంగా చూస్తున్నారు

`డాక్యుమెంట్‌ రైటర్లు, సోషల్‌ మీడియా జర్నలిస్టులు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు

`డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పనలు రాస్తున్నారు

`రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారని వార్తలు రాస్తున్నారు

`నిజాలకన్నా అబద్దాలకే విలువెక్కువైంది

`మా జీవితాలు అనుమానాలతో సతమతమౌతున్నాయి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అని సామెత. కానీ అసలు దర్జా, దర్పం వెలగబెట్టే వారికి కూడా కష్టాలుంటాయా? వస్తాయా? ఇబ్బంది పెడతాయా? ఊపిరి సలపకుండా చేస్తాయా? అంటే అవునని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ ఎవరూ వినని సందర్భం, సందేహం కావడంతో ఒకింత ఆశ్చర్యమే అనిపిస్తుంది. కాకపోతే అది నిజం. ఈ మధ్య తెలంగాణలోని సబ్‌ రిజిస్ట్రార్లు ఈ టార్చర్‌ మేం భరించలేం! బాబోయ్‌ అంటున్నారు. నిజంగానే రిజిస్ట్రార్లు ఈ మాటలు అంటున్నారా? అని ఆరా తీస్తే అవుననే అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సబ్‌ రిజిస్ట్రార్లు తీవ్ర అందోళన చెందుతున్నారు. ఆవేదనకు గురౌతున్నారు. మేము ఈ కొలువు చేయలేకపోతున్నామని గొల్లు మంటున్నారు. ఉద్యోగం చేయలేమని చెబుతున్నారు. దాంతో కొంతమంది సబ్‌ రిజిస్ట్రార్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కి, ఇతర ఉన్నతాధికారులకు ఓ లేఖ రాసినట్లుగా సమాచారం అందుతోంది. నిత్యం కార్యాలయాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఆ లేఖలో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయం నేటిధాత్రి దృష్టికి వచ్చింది. ఆ లేఖ సారాంశం అందింది. తెలంగాణ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నిత్యం వచ్చే జర్నలిస్టులతో వేగలేకపోతున్నామన్నది ఆ లేఖ సారాంశం. ప్రతి రోజు పదుల సంఖ్యలో వచ్చే జర్నలిస్టులలో అసలు జర్నలిస్టులు ఎవరు? జర్నలిస్టుల ముసుగులో వచ్చిందెవరో తేల్చుకోలేక రిజిస్ట్రార్లు సతమతమౌతున్నారట. మీడియా ముసుగులో వచ్చే వారిని తట్టుకోలేకపోతున్నామని సబ్‌ రిజిస్ట్రార్లు లేఖ రాశారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చే జర్నలిస్టులలో ఎవరు అసలో..ఎవరు నకిలో తెలియడం లేదు. మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తించలేమంటున్నారు. పదుల సంఖ్యలో జర్నలిస్టులు రావడం సమయం కోరడం, వారు ప్రశ్నల మీద ప్రస్నలు అడగడం జరుగుతోంది. తమకు సంబంధం లేని అంశాలను, వారి ఊహలను మా నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏ వార్త ఎందుకు రాస్తున్నారో, ఎవరిని అడిగి రాస్తున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా జర్నలిస్టులు రాసే ప్రతి విషయానికి సమాధానం చెబుతూ వెళ్తే కొలువు చేయడానికి సమయం సరిపోవడం లేదు. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఒక రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయన్న పూర్తి సమాచారం నెట్‌లో దొరుకుతుంది. అయినా అర్థం పర్థం లేని వార్తలు రాస్తున్నారు. కట్టు కథలు అల్లి వీడియోలు తయారు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తూ వండి వారుస్తున్నారు. ఆ వార్తలకు తలా తోక వుండడం లేదు. నిజంగానే ఏదైనా పొరపాటు జరిగితే జర్నలిస్టులకు రాసే హక్కు వుంది. కానీ జరగనవి జరిగినట్లు కల్పిత కథలు సృష్టించి మా మనోభావాలను దెబ్బ తీస్తున్నారని రిజిస్ట్రార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలపై అటు ఇతర జర్నలిస్టులకు సమాధానం చెప్పుకోవడమే కాదు, పై స్థాయి అధికారులకు కూడా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. వచ్చే వార్తలలో ఏవి నిజమో..ఏవి అబద్ధమో అర్థం కాక ఉన్నతాధికారులు వివరణలు అడుగుతున్నారు. ఇలా రోజంతా ఆ తలనొప్పితోనే గడిచిపోతోంది. దాంతో మా రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్ని సార్లు తిరగాలంటూ ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఏదో ఆశించే రిజిస్ట్రార్లు కాలయాపన చేస్తున్నారని అనుమానపడుతున్నారు. మేం ఎదురుకుంటున్న ఈ సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదు. మీడియా అర్థం చేసుకోవడం లేదు. రోజుల్లో సగానికి పైగా సమయమంతా వారికి కేటాయించడంతోనే సరిపోతోంది. మా బాధ ఎవరూ పట్టించుకోవడం లేదు. వినిపించుకోవడం లేదు. జర్నలిస్టులను రానివ్వకపోతే ఏదో జరుగుందని మళ్ళీ వార్తలు రాస్తారు. సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతోంది. జర్నలిస్టులకు వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి. జర్నలిస్టులు రాసే ప్రతి వార్తకు,అసత్య వార్తలన్నింటికీ జవాబుదారీలం కాలేము. ఇలా నిరంతరం జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేము. నిజంగానే ఏదైనా అవకతవకలు జరిగితే రుజువులతో సహా వార్తలు రాయండి. నిందారోపణలే లక్ష్యంగా వార్తలు రాసి మనో భావాలు దెబ్బ తీయొద్దని సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్‌ చేయలేము. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారు పది మంది! లేని పోని వార్తలతో వచ్బే జర్నలిస్టులు పదుల సంఖ్యలుగా వుంటున్నారు. గాలి వార్తలు..వసూల్‌ రాజాలు!గా మారిన వాళ్లంతా తెల్లారి లేస్తే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలోనే వుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారి పనులు తొందరగా ముగించాలా? లేక జర్నలిస్టులకు సమాధానాలు చెప్పుకుంటూనే కూర్చోవాలో అర్థం కావడం లేదు. వీళ్ల పరిస్థితి ఇలా వుంటే డాక్యుమెంట్‌ రైటర్ల ఆగడాలు మరో రకంగా వుంటున్నాయి. కొత్తగా వచ్చిన రిజిస్ట్రార్లకు చుక్కలు చూపిస్తున్నారు. లేని పోని వార్తలు సృష్టించి, కొంత మంది జర్నలిస్టులకు సమాచారం అందిస్తున్నారు. అది నిజమనుకొని ఎలాంటి ఆధారాలు కూడా అడక్కుండానే కొంత మంది జర్నలిస్టులు వార్తలు రాసేస్తున్నారు. ప్రజల్లో రిజిస్ట్రార్లను మరింత చులకన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చే వాళ్లంతా అనుమానంగా చూస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్లు, సోషల్‌ మీడియా జర్నలిస్టులు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పనలు రాస్తున్నారు. రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారని వార్తలు రాస్తున్నారు. నిజాలకన్నా అబద్దాలకే విలువెక్కువైంది. మా జీవితాలు అనుమానాలతో సతమతమౌతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని సబ్‌ రిజిస్ట్రార్లు కోరుతున్నారు.

ప్రకంపనలు సృష్టిస్తున్న సీపీఎం ముసాయిదా

మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ లేదా నియోఫాసిస్ట్‌ కాదన్న సీపీఎం

భగ్గుమన్న కాంగ్రెస్‌, సీపీఐ

కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న సీపీఎం మారిన వైఖరి

ఎల్‌డీఎఫ్‌పై ఎదురుదాడిని పెంచిన కాంగ్రెస్‌

సీపీఎం వ్యూహాన్ని విపక్షాలు అర్థం చేసుకోవడంలేదా?

వచ్చే ఏడాదిలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు

చాపకింద నీరులా వ్యవహరిస్తున్న బీజేపీ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులు, భారతీయ జనతాపార్టీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు పరస్పర విరుద్ధ భావజాలాలు కలిగినవన్న సంగతి మనకు తెలిసిందే. నిజం చెప్పాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతానికి, భాజపా అనుసరించే జాతీయవాద సిద్ధాంతానికి ఉప్పు`నిప్పు సంబంధమంటే అతిశయోక్తి కాదు. అటువంటిది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) వచ్చే ఏప్రిల్‌ నెలలో పార్టీ కాంగ్రెస్‌ జరుగనున్న నేపథ్యంలో ఒక ముసాయిదాను విడుదల చేసింది. భాజపాను ఫాసిస్ట్‌, నియో`ఫాసిస్ట్‌ పార్టీగా ఎప్పుడూ తనదైన శైలిలో విమర్శించే సీపీఐ(ఎం) ఈసారి ముసాయిదాలో నరేంద్రమోదీ ప్రభుత్వం ‘నియో`పాసిస్ట్‌’ లేదా ‘ఫాసిస్ట్‌’గా పిలవడానికి అవసరమైన అర్హతలు లేవని పేర్కొనడం దేశంలో ఒక్కసారి రాజకీయ ప్రకంపనలు రేకెత్తించింది. ఈ ముసాయిదా విడుదల కాగానే కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ)లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిజం చెప్పా లంటే ఈ ముసాయిదా విపక్షపార్టీల మధ్య కొత్త విభేదాలను సృష్టించడమే కాదు, వాటిల్లో నెల కొన్న నిలకడలేని రాజకీయాలను మరోసారి బట్టబయలు చేసింది.

విషయమేంటంటే వచ్చే ఏప్రిల్‌ నెలలో సీపీఐ(ఎం) పార్టీ 24వ కాంగ్రెస్‌ మీటింగ్‌ జరుగనుంది. పార్టీ రాజకీయ తీర్మానానికి సంబంధించి ముసాయిదా నోట్‌ను రూపొందించి తన రాష్ట్ర శాఖలకు పంపింది. ఇటువంటి ప్రతి పార్టీ కాంగ్రెస్‌ సమావేశానికి ముందు ఇటువంటి ముసాయిదానుపంపడం రివాజు. అయితే ఇప్పటివరకు బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌పై పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై సీపీఎం యూటర్న్‌ తీసుకోవడమే ఈ ముసాయిదాలోని ఆశ్చర్యం కలిగించే విశేషం! నిజానికి బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లను ఫాసిస్ట్‌ అజెండాతో ముందుకెళ్లేవిగా సీపీఎం ఎప్పుడూ విమర్శిస్తూ రావడం కద్దు. మాజీ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో మోదీ ప్రభుత్వాన్ని, ఫాసిజాన్ని సమాంతర రేఖలుగా వివరించడానికి ప్రయత్నించారు. ఇదిలావుండగా సీపీఎం తన అభిప్రాయాన్ని సమర్థించుకోగా, సహచర సీపీఐ మాత్రం ఈ ‘తప్పిదాన్ని’ సరిదిద్దుకోవాలని డిమాండ్‌ చేసింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా సీపీఎం మరియు సీపీఐలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ ఒక అడుగు ముందుకేసి సీపీఎం కేవలం తన ఉనికికోసమే ఈవిధంగా మాటమార్చిందంటూ విరుచుకుపడిరది.

సీపీఎం, సీపీఐ మరియు కాంగ్రెస్‌లు జాతీయస్థాయిలో ఒకే కూటమిలో వుండగా, కేరళలో మా త్రం సీపీఎం, సీపీఐల కూటమితో ఏర్పడిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలో వుంది. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని యు.డి.ఎఫ్‌. ఈ రాష్ట్రంలో విపక్షంలో వుంది. సీపీఎం తాజా వైఖరి నేపథ్యంలో ప్రముఖ రచయిత తుషార్‌ గాంధీ ‘ఎక్స్‌’వేదికలో ఈవిధంగా పోస్ట్‌ చేశారు. ‘‘కేరళ సీపీఎం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అంగీకరించడంలేదు. అంటే ఇప్పుడు సీపీఎం తన ఎర్ర జెండానుమడతపెట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌ను కేరళలోకి ‘రెడ్‌ కార్పెట్‌’ వేసి మరీ ఆహ్వానించాలని చూస్తున్నదనుకోవాలా? ఇప్పుడు ‘లాల్‌’ కాస్తా ‘భగ్వా’గా మారిపోయిందా?’’ అంటూ ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం ‘నియో`ఫాసిస్ట్‌’ లక్షణాలను ప్రదర్శిస్తున్నప్పటికీ, దాన్ని ‘ఫాసిస్ట్‌ లేదా నియో` ఫాసిస్ట్‌’గా పిలిచేందుకు అవసరమైన యోగ్యతలు దానికి లేవని సీపీఎం ముసాయిదా స్పష్టం చేసింది. ‘మేం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ లేదా నియో`ఫాసిస్ట్‌ అని ఎప్పుడూ పేర్కొనలేదు. ఇదేసమయంలో భారత్‌ను నియో`ఫాసిస్ట్‌ రాజ్యంగా పరిగణించడంలేదు. మేం చెప్పేదల్లా ఒక్కటే. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగమైన బీజేపీ పదేళ్లుగా దేశాన్ని పాలిస్తోంది. ఈ కాలంలో బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో రాజకీయ సుసంఘటితను సాధించాయి. దీని ఫలితంగా నియో`ఫాసిస్ట్‌ లక్షణాలు వ్యక్తమవడం మొదలైంది’ అని సీపీఎం ముసాయిదా తీర్మానం పేర్కొంది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్‌ పార్టీ అభిప్రాయాన్ని గట్టిగా సమర్థించారు. ‘‘మేం ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా వ్యవహరించలేదు. ఫాసిజం మళ్లీ పురుడుపోసుకుందన్న మాట కూడా మేం ఎప్పుడూ అనలేదు. నిజంగా ఫాసిజం దేశంలోని ప్రవేశిస్తే రాజకీయ నిర్మాణం ఒక్కసారిగా మారిపోతుంది.’ అని బాలన్‌ పేర్కొన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌)లు తమ అభిప్రాయానికి భిన్నంగా దేశంలోకి ఫాసిజం వచ్చేసిందని భావిస్తున్నాయి, అని కూడా బాలన్‌ పేర్కొ న్నారు. నిజానికి దేశంలోకి ఫాసిజం వచ్చిందని భావిస్తే అందుకు రుజువులు చూపండి అని బాలన్‌ కోరినట్టు మళయాల న్యూస్‌ పోర్టల్‌ ‘మాధ్యమం’ పేర్కొంది.

మధ్యంతరాసామ్రాజ్యయుగంలో పురుడుపోసుకున్న క్లాసికల్‌ాఫాసిజానికి మరియు నియోాఫాసిజానికి మధ్య వున్న తేడాను తాము గుర్తించామని, ఇది కేవలం నియోాలిబరలిజంలో చోటుచేసుఉన్న సంక్షోభం నుంచి పుట్టుకొచ్చింది మాత్రమేనని సీపీఎం పేర్కొంది. నియోాఫాసిజం నిజా నికి ప్రజాస్వామ్య చట్రంలో నిరంకుశ లక్షణాలు కలిగివుంటుందని, క్లాసికల్‌ాఫాసిజం మాదిరిగా కాకుండా ఇది పూర్తిగా ఎన్నికల వ్యవస్థనే తిరస్కరిస్తుందని వివరించింది.
కేరళ అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత సీపీఎం వైఖరిని, కేరళ కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి యత్నాలు మొదలుపెట్టింది. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్‌ ‘ప్రస్తుత సీపీఎం వైఖరి పూర్తిగా దాని వ్యాపారధోరణికి నిదర్శనం’ అని విమర్శించింది. కేరళలో సీపీఎంను ఇకనుంచి ‘కమ్యూనిస్ట్‌ జనతా పార్టీ’ (సీజేపీ)గా పిలవాలంటూ ఎద్దేవా చేసింది. సీపీఎంకు, బీజేపీకి మధ్య అంతర్గతంగా ‘అంగీకారం’ కుదిరిందా? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఫాసిస్ట్‌ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ కాదనడమంటే ఆపార్టీకి సీపీఎం కోవర్ట్‌గా వ్యవహరిస్తోందా? అన్న అనుమానం వ్యక్తం చేసింది.
‘సీపీఎం ఉన్నతస్థాయిలో తీసుకొచ్చిన కొత్త సిద్ధాంతం నేపథ్యంలో ఇప్పటివరకు సెక్యూలర్‌ విలువలకోసం పోరాడే పార్టీగా భావించేవారు, నేటివరకు వామపక్షంగా పరిగణిస్తూ తప్పుచేశామన్న భావనకు గురవుతారు. గత అసెంబ్లీ, లోక్‌సభ మరియు ఇతర ఉప`ఎన్నికల్లో క్రమంగా రైట్‌ వింగ్‌వైపుకు మారుతున్న పరిణామాలు, సీపీఎంను దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా స్థానం లేకుండా చేస్తున్నాయి. అంతేకాదు ఈ పార్టీ ప్రస్థానం ముగింపు దశలో ఉన్నదన్న సత్యాన్ని వెల్లడిస్తున్నాయి’ అని కేరళ కాంగ్రెస్‌ పేర్కొంది.

కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వి.డి. సతీశన్‌ మాట్లాడుతూ ప్రస్తుత సీపీఎం వైఖరి, బీజేపీతో దానికున్న రహస్య ఒప్పందాన్ని వెల్లడిస్తోందని ఆరోపించారు. ‘కేరళలో సీపీఎం ఎప్పుడూ ఫాసిజంతోశాంతిగానే వ్యవహరిస్తోంది. సంఫ్‌ుపరివార్‌తో అది ఒక అంగీకారానికి వచ్చింది. ఈ సంబంధాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ కాదంటూ కొత్త ముసాయిదాను ముందుకు తెచ్చింది. మోదీతో చేతులు కలపడానికి, సంఘపరివార్‌తో శాంతి ఒప్పందం ద్వారా వారికి లంగిపోవడానికి సీపీఎం సిద్ధపడిరది’’ అని సతీశన్‌ ఆరోపించారు.
కేవలం కాంగ్రెస్‌ మాత్రమే కాదు సీపీఐ కూడా సీపీఎం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేరళప్రభుత్వంలో సీపీఎంకు జూనియర్‌ భాగస్వామిగా కొనసాగుతున్న సీపీఐ, ‘సీపీఎం ముసాయిదా లో చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి’ అని డిమాండ్‌ చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అంటేనే ఒక ఫాసిస్ట్‌ సంస్థ. ఆర్‌ఎస్‌ఎస్‌ కింద పనిచేసే మోదీ నేతృత్వంలోని బీజేపీ కూడా ఫాసిస్ట్‌ ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో సీపీఎం తన పంథాను సరిదిద్దుకోవాలని కేరళ సీపీఐ ప్రధాన కార్యదర్శి బినోయ్‌ విశ్వం డిమాండ్‌ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
విషయాన్ని పరిశీలిస్తే కేరళలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీపీఎం, వ్యవహారజ్ఞానంతో సమ తుల్య వైఖరితో అడుగులు ముందుకేస్తుంటే, సీపీఐ మాత్రం తన వైఖరిలో ఏవిధమైన మార్పులే కుండా పూర్వపు పంథాతోనే ముందుకెళుతుండటం వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ఇక కాంగ్రెస్‌ కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకమే కనుక, అధికారంలోకి రావడానికి సీపీఎం వైఖరిని ఒక అవకాశంగా తీసుకొని మరింత దూకుడుగా ముందుకెళ్లే వైఖరిని అనుసరిస్తోంది. ఏది ఏమైనా సీపీఎం తాజాగా మారిన తన వైఖరితో విపక్షాలను ఒక్క కుదుపునకు లోను చేసిందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేరళలో క్రమంగా బీజేపీ ఓటింగ్‌ శాతం పెరుగుతున్న నేపథ్యంలో, ఇది ఇలాగే వచ్చే ఎన్నికల్లో కూడా జరిగితే తాము నష్టపోక తప్పదన్న అభిప్రాయానికి సీపీఎం వచ్చి వుండాలి. అందుకనే రాష్ట్రంలోని హిందువుల్లో పెరుగుతున్న జా గృతి పవనాలను గుర్తించే తాను బీజేపీకి వ్యతిరేకం కాదన్న ముద్రను సుస్థిరం చేసుకుంటే, వచ్చే అసెంబ్లీ హిందూ ఓట్లను కాపాడుకోవచ్చన్నది సీపీఎం వ్యూహం కావచ్చు. ఓట్లశాతం పెరుగు తున్నా కేరళలో బీజేపీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునే స్థాయికి ఇంకా ఎదగలేదు. కానీ పెరుగుతున్న బీజేపీ అనుకూల ఓటింగ్‌ అధికార ఎల్‌డీఎఫ్‌ను దెబ్బతీస్తుంది. ఈ వ్యూహంతోనే తాను బీజేపీకి వ్యతిరేకం కానన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే, బీజేపీ ఎట్లాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక, ఆ పార్టీకి అనుకూల ఓట్లను తమవైపుకు తిప్పుకోవచ్చన్న సీపీఎం వ్యూహం నిజమైతే సహచర పార్టీలు తొందరపడి సీపీఎంను విమర్శిస్తున్నాయనుకోవాలి. ఇదే సమయంలో భాజపా కూడా ఈ ట్రాప్‌లో పడకుండా తన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటూనే మరింత చొచ్చుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాల్సి వుంటుంది.

రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చెయ్యాలి.

రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చెయ్యాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న రంజాన్ మాసం ఏర్పాట్లుపై సమీక్ష సమావేశం నిర్వహించడం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడిఓసి కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, మున్సిపల్, విద్యుత్, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు.

Ramzan

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్, పంచాయతి అధికారులను ఆదేశించారు. సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర
వ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యుత్తు అధికారులకు సూచించారు. ఏదేని విద్యుత్తు సమస్య వచ్చినా తక్షణమే స్పందించేందుకు మసీదు పెద్దలకు ఆ ప్రాంతం యొక్క లైన్ మెన్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి, కాటారం, మహాదేవ పూర్ మండలాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రార్ధనా మందిరాల వద్ద పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు ఉండాలని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస ప్రార్థనలు చేస్తారని వారికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా రంజాన్ పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు తెలియజేసిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ అధికారి శైలజ, డిఎస్పి సంపత్ రావు, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, డిపిఓ నారాయణ రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ శ్రీనివాస్ ఈడీఎం శ్రీకాంత్.!

మీ సేవా కేంద్రాలు నిర్దేశించిన రుసుము కంటే అదనంగా తీసుకుంటే చర్యలు

తహసీల్దార్ శ్రీనివాస్ ఈడీఎం శ్రీకాంత్

భూపాలపల్లి నేటిధాత్రి

శనివారం భూపాలపల్లి మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సేవల అందుబాటు, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు.
ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు అంతరాయం లేకుండా సేవలు అందించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే మీ సేవా కేంద్రాల కర్తవ్యం తెలిపారు. మీ సేవా కేంద్రాల ద్వారా అందించు సేవలకు సంబంధించి ధరల పట్టిక ఏర్పాటు చేయాలని మీ సేవా కేంద్రం నిర్వహకులను ఆదేశించారు.

సైన్స్ డే రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారి ఆధ్వర్యంలో.!

సైన్స్ డే రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారి ఆధ్వర్యంలో పోస్టర్ ప్రజెంటేషన్ నిర్వహణ

హన్మకొండ, నేటిధాత్రి :

తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళశాల వరంగల్ వెస్ట్ నందు సైన్స్ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు పోస్టర్ ప్రసెంటేషన్ ను నిర్వహించారు. విద్యార్థినిల విజ్ఞాన సముపర్జనకు మరియు మనో వికాసానికి గాను ఫిల్డ్ ట్రిప్ లో భాగంగా రీజనల్ సైన్స్ సెంటర్, వరంగల్ ను సందర్శించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డా.గోళి.శ్రీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎస్.మాలతి, మైక్రో బయాలజీ ఎచ్ వో డి కె. గీతా రాణి మరియు కె. శ్రీవిధ్య పాల్గొన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందిన శంకరజ్యోతి.

ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందిన శంకరజ్యోతి

పరకాల నేటిధాత్రి
పరకాలనియోజకవర్గ పరిధిలోని దామెర మండలం కోగిలివాయి గ్రామానికి చెందిన జి.సరోజన అదిరెడ్డి దంపతులకు 3వ పుత్రుడు ఐన గట్ల అనిల్ రెడ్డి సతీమణి శంకరజ్యోతికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్ డీ పట్టా లభించింది.ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ గురుకులం డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న శంకరజ్యోతికి గణితంలో A స్టడీ ఆన్ రెగ్యులర్ డామినేషన్ ఇన్ లీటక్ట్ గ్రాఫ్స్ అనే అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి పట్టా లభించింది.మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో తన విద్యనుఅభ్యసించినారు.గణితంలో ఇబ్బందులు పడే వారికి సులభంగా అర్ధమయ్యే విధముగా ఉండేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పిహెచ్ డీ పూర్తి చేసినట్లు శంకరజ్యోతి తెలిపారు.తనకి సహాయ సహకారాలు అందించిన ఉస్మానియా యూనివర్సిటీ గణిత విభాగంలోని ప్రొఫెసర్స్ కి,అలాగే అమ్మ,నాన్న పద్మావతి సోమిరెడ్డి మరియు కుటుంబ సభ్యులకు అందరికి ధన్యవాదాలు తెలియజేశారు.

బాణాల రాంబాబుకు పెద్ది ఘన నివాళులు.

బాణాల రాంబాబుకు పెద్ది ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మున్సిపల్ 23 వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి బాణాల ఇందిరా భర్త బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాల రాంబాబు గుండెపోటుతో మరణించగా రాంబాబు పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి దంపతులు పూలమాలవేసి నివాళులర్పించారు.రాంబాబు భార్య మాజీ కౌన్సిలర్ ఇందిరతో పాటు కుటుంబాన్ని ఓదార్చారు.అనంతరం స్థానిక నాయకులతో కలిసి పెద్ది అంతిమ యాత్రలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ,ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ బాధ్యులు, మాజీ కౌన్సిలర్స్, పట్టణ ఉపాధ్యక్షులు, పట్టణ పార్టీ ప్రచార కార్యదర్శి,వార్డు అధ్యక్షులు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు వివిధ అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన రైతుల వాగ్దానాలను నెరవేర్చాలి.

ఎన్నికల ముందు ఇచ్చిన రైతుల వాగ్దానాలను నెరవేర్చాలి

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడీ శ్రీనివాస్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వరంగల్ పట్టణంలోని అబ్బనికుంటలో గల తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం సంఘ ఉపాధ్యక్షులు ఊరటి అంశాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సోమీడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని, రైతుబంధు ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామని మాటఇచ్చి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచిన నేటికీ పూర్తిస్థాయిలో రైతులకు అందించలేదని ఆరోపించారు.దీంతో రైతులు పెట్టుబడి సహాయం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోవడం సరికాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణమే రైతుబంధు, రుణమాపిని రైతాంగానికి అందించాలని, ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మిర్చి పండించిన రైతులకు రూ. 11,500 ప్రకటించడం జరిగిందికాదని, మిర్చి రైతులు ఎకరాకు లక్ష పైకి పెట్టుబడి పెట్టి పండిస్తే కొన్నిచోట్ల విత్తనాల నకిలీ, పంటకు తెగులుచోకి దిగుబడి ఎకరాకి ఐదు ఆరు , క్వింటాళ్లు మాత్రమే పండుతుందని,ఇటువంటి సమయంలో పెట్టుబడి కూడా రాలేని పరిస్థితిలో మిర్చి రైతులు అయోమయంగా ఉన్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతులకు మద్దతు ధర 25 వేల చొప్పున కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపాలని రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల బుచ్చిరెడ్డి,మోకిడి పేరయ్య, జెండా అంబయ్య, నల్ల విజేందర్, జంగ జనార్ధన్ రెడ్డి, రేముడాల దామోదర్ రెడ్డి, సిరుల రవీందర్, తిప్పారపు రాజు, సోమిడి సాంబయ్య, బొల్లు ఎల్లయ్య, గూగులోతు లచ్చులు, సముద్రాల రాజమౌళి, బరుపాటి రవీందర్, ఇంకా తదితరులు పాల్గొన్నారు

మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత..

స్పందించిన అధికారులు

పెద్దపల్లి “నేటిధాత్రి”
మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత.. టోల్‌గేట్ తొల‌గింపు.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వ‌ద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్‌గేట్‌ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించారు.
“నేటిధాత్రి”పత్రికలో ఫిబ్రవరి 11 వ తారీకున వచ్చిన అధికారుల అండదండలతో కోట్లకు పడగలెత్తుతున్న దళారీలు అనే కథనంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించారు.

మానేరు నది వ‌ద్ద‌కు చేరుకున్న మంథని సీఐ రాజు, ఆర్‌ఐ శ్రీధర్‌ల ఆధ్వర్యంలో అధికారుల బృందం అక్కడికి చేరుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేట్‌నును తొలగించారు. ఎలాంటి వసూళ్ల‌కు పాల్పడవద్దని అక్కడ టోల్‌గేట్ నిర్వాహకులను హెచ్చరించారు. దీంతో నిన్న మొన్నటి వరకు అనధికారికంగా వసూలు చేసిన టోల్ టాక్సీ బెడద ఆయా గ్రామాల ప్రజలకు తప్పింది. ఆ మట్టి రోడ్డుపై ప్రయాణం చేసే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను వెలికి తీసిన “నేటిధాత్రి” కి వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.

మాదిగ అమరవీరులకు నివాళులు.

మాదిగ అమరవీరులకు నివాళులు.

రామయంపేట మార్చి ఒకటి నేటి ధాత్రి (మెదక్)

మాదిగ దండోరా ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు శనివారం రామాయంపేటలో మాదిగ అమరవీరు సంస్మరణ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమంలో ఉద్యమం చేస్తూ జాతి కొరకు అమరులైన అమరులను జాతి ఎన్నటికీ మర్చిపోదన్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని నివాళులర్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పాతూరి రాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్ మాదిగ, నాయకులు అక్కిరి గారు రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు బొర్ర అనిల్ కుమార్, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటపురం బాబు, రత్నం,మురళి, జాన్,
కర్రె రమేష్, బొర్ర సంజీవ్, స్వామి,రాము తదితరులు పాల్గొన్నారు.

కోట గుళ్ళ లో ముగిసిన శివరాత్రి మహోత్సవాలు.

కోట గుళ్ళ లో ముగిసిన శివరాత్రి మహోత్సవాలు

సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పరిరక్షణ కమిటీ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఈనెల 26న ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు 28 శుక్రవారంతో ముగిసినట్లు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజులపాటు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శివరాత్రి మహోత్సవాల నిర్వహణకు ఆలయ ధర్మకర్తలు, పోషకులు, నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు, జర్నలిస్టు సోదరులకు, పోలీస్, విద్యుత్, వైద్య శాఖ గణపురం గ్రామపంచాయతీ సిబ్బంది, తదితర అధికారులకు ఆలయానికి తరలివచ్చిన భక్తులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. గత 18 సంవత్సరాలుగా ఆలయ నిర్వహణలో చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సైన్స్ ఫెర్లో అద్భుత ప్రదర్శనలు.

సైన్స్ ఫెర్లో అద్భుత ప్రదర్శనలు.

… చూపరులను ఆకట్టుకున్న విద్యార్థుల ప్రతిభ.

రామయంపేట నేటి ధాత్రి

మెదక్ విద్యార్థులు కేవలం చదివే కాకుండా అన్ని రంగాల్లో ముందుంటారని ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిరూపించారు. రామాయంపేట పట్టణంలోని వివేకానంద విద్యాలయంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో పలు ప్రదర్శనలు విద్యార్థుల మేజర్సుకు అద్దం పడుతున్నాయి. విద్యార్థుల ప్రదర్శించిన పలు ప్రదర్శనలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉన్నాయి.

science

ప్రకృతి సేద్యం విధానం.
.. ప్రదర్శన చూపించిన విద్యార్థిని వైష్ణవి.
స్థానిక వివేకానంద విద్యాలయంలో మూడవ తరగతి చదువుతున్న సిహెచ్ వైష్ణవి ప్రకృతి సేద్యం పట్ల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రకృతి సేద్యానికి పేడ ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రదర్శనలలో చూపడం జరిగింది. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యకరమైన పంటలు, కూరగాయలు పండించుకునే విధానాన్ని విద్యార్థిని చక్కగా ప్రదర్శించడం జరిగింది.

వేస్టేజ్ తో కరెంట్ తయారీ విధానం.
.. విద్యార్థి నీరాజాక్ష్.
వేస్టేజ్ పదార్థాలను ఉపయోగించి కరెంటు తయారుచేసుకునే విధానాన్ని విద్యార్థి నీరాజాక్ష్ ప్రదర్శనలు అద్భుతంగా చూపించడం జరిగింది. వ్యర్థాలను ఉపయోగించి కరెంట్ తయారీతోపాటు, గ్యాస్ తయారీ విధానాన్ని ప్రదర్శనలో చూపించడం జరిగింది. వ్యర్థాలను ఇలా ఉపయోగిస్తే భవిష్యత్తులో వేస్టేజ్ కూడా వృధాగా పోదని ఈ ప్రదర్శన ద్వారా తెలుస్తోంది. విద్యార్థి ప్రదర్శన చాలామందిని ఆకర్షించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నీరాజ్యాక్ష్ ను అభినందించారు.

తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా చూడాలి.

తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా చూడాలి

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు

పరకాల నేటిధాత్రి
రాష్ట్ర సర్కారు పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు ఆర్డిఓ డాక్టర్, కె.నారాయణ కు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో వరి పంట సాగులో ఉన్నదని,యాసంగి వరి పంటకు దోమ పోటు,అగ్గి తెగులు,వడగండ్ల వానలతో కోలుకోలేని విధంగా గతంలో రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని గుర్తు చేశారు.మామిడి పంట కూడా చాల సందర్భాలలో పంట కోసే ముందు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వెల్లడించారు.పంటల భీమా పథకం అమలులో ఉంటే, రైతు ప్రభుత్వం దయాదాక్షి ణ్యములపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదని,హక్కుగా పూర్తి స్థాయిలో నష్ట పరిహారం పొందే వీలుంటుందని చెప్పారు.లేనిచో ప్రభుత్వం ఇచ్చే అతి తక్కువ పరిహారం తో సరి పెట్టుకొని అప్పుల పాలై పెద్ద ఎత్తున వడ్డి సంవత్సర కాలం కడుతూ నష్టపోవలిసి ఉంటుందని వివరించారు.ఇప్పటికే పంటలు ఎండుతున్నట్టు,రైతు ఆత్మహత్యలు అక్కడక్కడ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నవని,రాష్ట్రములో రుణ మాఫీ పూర్తి స్థాయి లో అమలు కాక,రైతు భరోసా కొరకు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలో తెలువని పరిస్థితి లో రైతులు దిగులుతో ఉన్నారని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితిలో ప్రకృతి వికటించి పెద్ద ఎత్తున నష్టం జరిగినచో రైతు తట్టుకోలేడని ఆవేదనతో తెలిపారు. ప్రస్తుతానికి ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన అమలు చేసే అవకాశం లేనందున భవిష్యత్తు లో పంట నష్టం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్న వరి,మిరప మొక్కజొన్న మామిడి పంటల రైతులకు అండగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని పంటల భీమా పథకం అమలు పరిచే కంపెనీల తో చర్చలు జరిపి, వారిని ఒప్పించి అతి తక్కువ ప్రీమియం తొ ఇప్పటినుంచి పంటలు చేతి కి వచ్చే వరకు పంటల భీమా పథకం అమలు చెయ్య వలిసినదిగా విజ్ఞప్తి చేశారు.రైతును పూర్తి స్థాయిలో ఆదుకొనే చర్యలు వెంటనె చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు సురావు బాపూరావు,లోనే సతీష్,కోడెం రవీందర్ తదితరులు రైతులు పాల్గొన్నారు.

ప్రత్యక్షంగా చూస్తూ. ..ఆసక్తి కనబరుస్తూ… ఆకట్టుకున్న బర్డ్స్ ఫెస్టివల్.

ప్రత్యక్షంగా చూస్తూ. ..ఆసక్తి కనబరుస్తూ… ఆకట్టుకున్న బర్డ్స్ ఫెస్టివల్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

birds festival

అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF), నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF) సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిది లో గల బొక్కల గుట్ట సమీపంలోని గాంధారి వనం, గాంధారి ఖిల్లా లో శనివారం బర్డ్స్ ఫెస్టివల్ నిర్వహించారు.ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మంచిర్యాల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, ములుగులోని అటవీ కళాశాల విద్యార్థులు వివిధ బృందాలుగా విడిపోయి అనేక రకాల పక్షులను వీక్షించారు.పలు రకాల పక్షులను ప్రత్యేక్షంగా చూస్తూ ఆసక్తిగా కొనసాగిన ఈ బర్డ్స్ ఫెస్టివల్ ఎంతగానో ఆకట్టుకుంది. WWF, NCF ప్రతినిధులు హర్ష త్రివేని, అమృత, సమాక్షి లు ఇక్కడికివిచ్చేసిన వారికి వివిధ రకాల పక్షులను చూపిస్తూ వాటి వివరాలను వివరించారు. పక్షుల కిలకిలా రాగాలు వింటూ వాటిని ప్రత్యక్షంగా చూస్తూ వాటి జీవ వైవిధ్యం గురించి తెలుసుకున్నారు. పక్షులు పర్యావరణానికి ఏ విధంగా మేలు చేస్తాయో, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇలాంటి బర్డ్స్ ఫెస్టివల్స్ వల్ల తెలియని విషయాలు తెలుసుకోవచ్చని, తద్వారా వాటిని కాపాడుకోవాలనే చైతన్యం వస్తుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో అటవీ రేంజ్ అధికారులు అప్పలకొండ, శివకుమార్ ,ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్,ఇంచార్జి రేంజ్ అధికారి సుభాష్, డిప్యూటీ రేంజ్ అధికారులు హాఫిజూద్దీన్, సంతోష్, ఎఫ్ ఎస్ ఓ, బీట్ అధికారులు రామకృష్ణ, పోశెట్టి, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version