ఎన్నికల ముందు ఇచ్చిన రైతుల వాగ్దానాలను నెరవేర్చాలి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడీ శ్రీనివాస్
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వరంగల్ పట్టణంలోని అబ్బనికుంటలో గల తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం సంఘ ఉపాధ్యక్షులు ఊరటి అంశాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సోమీడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని, రైతుబంధు ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామని మాటఇచ్చి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచిన నేటికీ పూర్తిస్థాయిలో రైతులకు అందించలేదని ఆరోపించారు.దీంతో రైతులు పెట్టుబడి సహాయం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోవడం సరికాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణమే రైతుబంధు, రుణమాపిని రైతాంగానికి అందించాలని, ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మిర్చి పండించిన రైతులకు రూ. 11,500 ప్రకటించడం జరిగిందికాదని, మిర్చి రైతులు ఎకరాకు లక్ష పైకి పెట్టుబడి పెట్టి పండిస్తే కొన్నిచోట్ల విత్తనాల నకిలీ, పంటకు తెగులుచోకి దిగుబడి ఎకరాకి ఐదు ఆరు , క్వింటాళ్లు మాత్రమే పండుతుందని,ఇటువంటి సమయంలో పెట్టుబడి కూడా రాలేని పరిస్థితిలో మిర్చి రైతులు అయోమయంగా ఉన్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతులకు మద్దతు ధర 25 వేల చొప్పున కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపాలని రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల బుచ్చిరెడ్డి,మోకిడి పేరయ్య, జెండా అంబయ్య, నల్ల విజేందర్, జంగ జనార్ధన్ రెడ్డి, రేముడాల దామోదర్ రెడ్డి, సిరుల రవీందర్, తిప్పారపు రాజు, సోమిడి సాంబయ్య, బొల్లు ఎల్లయ్య, గూగులోతు లచ్చులు, సముద్రాల రాజమౌళి, బరుపాటి రవీందర్, ఇంకా తదితరులు పాల్గొన్నారు