జీవజాతి పరిరక్షణకు పాటుపడాలి.

జీవజాతి పరిరక్షణకు పాటుపడాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

అంతరించిపోతున్న జీవజాతి పరిరక్షణకు సమాజంలోని ప్రతీ ఒక్కరు పాటుపడాలని ఆర్డీఓ
ఉమారాణి పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ జీవ వైవిధ్య పరిరక్షణ దినోత్సవం సందర్బంగా స్థానిక స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ఆర్డివో ఉమారాణి చేతుల మీదుగా జీవ వైవిధ్య పరిరక్షణ వాల్ పోస్టర్లు ఆర్డిఓ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జీవ వైవిద్యాన్ని కాపాడుకుందామన్నారు. సృష్టిలోని ప్రతీ జీవరాశిని బతుకనిద్దాం వాటిని కాపాడుకుందాం అని అన్నారు.ప్రతిభా సంస్థ నిర్వాహకులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ప్రకృతితో సామరస్యం, స్థిరమైన అభివృద్ధి అనే ఇతివృత్తంతో జరుపుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రా రెడ్డి, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్,వాలంటీర్ కాసుల వెంకటాచారి, వెంకన్న ఆఫీస్ ఇంచార్జి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

కోట గుళ్ళ లో ముగిసిన శివరాత్రి మహోత్సవాలు.

కోట గుళ్ళ లో ముగిసిన శివరాత్రి మహోత్సవాలు

సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పరిరక్షణ కమిటీ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఈనెల 26న ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు 28 శుక్రవారంతో ముగిసినట్లు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజులపాటు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శివరాత్రి మహోత్సవాల నిర్వహణకు ఆలయ ధర్మకర్తలు, పోషకులు, నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు, జర్నలిస్టు సోదరులకు, పోలీస్, విద్యుత్, వైద్య శాఖ గణపురం గ్రామపంచాయతీ సిబ్బంది, తదితర అధికారులకు ఆలయానికి తరలివచ్చిన భక్తులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. గత 18 సంవత్సరాలుగా ఆలయ నిర్వహణలో చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version