రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి.

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి

నర్సంపేట నేటిధాత్రి:

 

రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్న రైతు భరోసా రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయా రైతులకు అందించాలని బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత రైతు భరోసా ఎకరాకు రూ 15 వేలు ఇస్తాం అని చెప్పి ఇవ్వకుండా రైతులకు ఎకరాకు రూ 19 వేలు బాకీ ఉన్నదని అట్టి రూపాయలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టి అధికారంలోకి వచ్చిన తరువాత
2023 – 24 రబీ లో ఒక్కో ఎకరాకు రూ,2500/- ఇవ్వకుండా మొత్తం
మొత్తం నాలుగు సీజన్లకు కలిపి ఒక ఎకరా ఉన్న రైతు కు రైతు భరోసా రూ.పంతొమ్మిది వేల రూపాయలు బాకీ ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహారాములు, క్లస్టర్ ఇన్చార్జి లు మోతే జై పాల్ రెడ్డి,మోతే పద్మ నాభా రెడ్డి,కోడారి రవి,మోటురి రవి,కందుల రాజి రెడ్డి,సంగెం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి.

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి.

#ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధానోపాధ్యాయుడు ఉడత రాజేందర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

మండలంలోని కొండైల్ పల్లి గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించవలసిందిగా కోరుతూ ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్ ,సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి 3కోడిగుడ్లు ,నాణ్యమైన ఉచిత విద్య, వెనుకబడిన విద్యార్థుల పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన, అర్హత గల ఉపాధ్యాయులచే విద్య బోధన చేయడం జరుగుతుందని. ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రుపై ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఈర్ల సుమలత, అంగన్వాడి టీచర్ రజిత ,ఆశ కార్యకర్త జ్యోత్స్న, పాఠశాల ఉపాధ్యాయులు పోరిక రవికుమార్, మాజీ ఎస్ఎంసి చైర్మన్ ఊరటీ నరేష్, గ్రామస్తులు లింగారెడ్డి , ముకుంద రెడ్డి, ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇండ్లు కంప్లీట్ చేసుకోండి బిల్లులు చెల్లిస్తాం..

ఇండ్లు కంప్లీట్ చేసుకోండి..బిల్లులు చెల్లిస్తాం..

త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకోవాలి.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

దుగ్గొండి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనుల పరిశీలన..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.సోమవారం దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈవో రామ్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణాలు కంప్లీట్ చేసుకోండి. బిల్లులు కూడా వెంటనే చెల్లించబడతాయని లబ్ధిదారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.అందుకు సంబంధించిన ఇనాగ్రేషన్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తానని లబ్ధిదారులతో కలెక్టర్ వివరించారు.

Collector Dr. Satya Sarada..

 

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రావిచంద్రా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి లెక్కల అరుంధతి,హౌసింగ్ పీడీ గణపతి, డిఇ విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మాదిగ అమరవీరులకు నివాళులు.

మాదిగ అమరవీరులకు నివాళులు.

రామయంపేట మార్చి ఒకటి నేటి ధాత్రి (మెదక్)

మాదిగ దండోరా ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు శనివారం రామాయంపేటలో మాదిగ అమరవీరు సంస్మరణ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమంలో ఉద్యమం చేస్తూ జాతి కొరకు అమరులైన అమరులను జాతి ఎన్నటికీ మర్చిపోదన్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని నివాళులర్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పాతూరి రాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్ మాదిగ, నాయకులు అక్కిరి గారు రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు బొర్ర అనిల్ కుమార్, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటపురం బాబు, రత్నం,మురళి, జాన్,
కర్రె రమేష్, బొర్ర సంజీవ్, స్వామి,రాము తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version