మాదిగ జర్నలిస్టుల ఫోరం పోస్టర్ ఆవిష్కరించిన సోదా..

మాదిగ జర్నలిస్టుల ఫోరం పోస్టర్ ఆవిష్కరించిన సోదా

పరకాల నేటిధాత్రి
ఆగస్టు 12వ తేదీన హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం 2వ మహాసభల పోస్టర్ ను జర్నలిస్ట్ లతో కలిసి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి పెండెల సుమన్,మాదిగ జర్నలిస్టుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షులు చందల రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్,నడి కూడా మండల అధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సభ్యులు చుక్క సతీష్,జిల్లా నాయకులు పెండెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి ఇంచార్జ్ కొలిక పోగు వెంకటేశ్వరరావు మాదిగ. ‌

జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి
భూపాలపల్లి ఇంచార్జ్ కొలిక పోగు వెంకటేశ్వరరావు మాదిగ. ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఇన్చార్జీలతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కొలికపోగు వెంకటేశ్వరావు మాదిగ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో అన్ని మండలాల్లో ఇన్చార్జీలు కో ఇన్చార్జిలు గ్రామ కమిటీల నిర్మాణం గద్దెలు త్వరితగతిన పూర్తి చేసి జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ అవిద్భవ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జీడి సంపత్ మాదిగ అంతడుపు ల సారయ్య మాదిగ పల్లి శ్రీను మాదిగ బండారు రాజ్ కుమార్ మాదిగ నేర్పటి శ్రీను క్రాంతి బండారు బాబు జీ సమ్మయ్య సారయ్య రాజు తదితరులు పాల్గొన్నారు

మీరాకుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన అబ్రహం మాదిగ.

మీరాకుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన అబ్రహం మాదిగ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ మీరాకుమార్ ని ఢిల్లీలోని ఆమె నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అబ్రహం మాదిగ. భారతీయ సామాజిక దార్శనికుడు, సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు డా. బాబూ జగ్జీవన్ రామ్ కూతురుగా ఆయన రాజకీయ వారసురాలిగా ఎన్నో పదవులను అధిరోహించారు. పలుమార్లు కేంద్ర మంత్రిగా, భారతదేశపు తొలి మహిళా లోకసభ స్పీకర్ గా భారతదేశానికి ఎనలేని సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలిపిన ధీరవనితగా అభివర్ణించారు. రావి ఆకుపై వేసిన మీరాకుమార్ చిత్రాన్ని ఆమెకు బహుకరించారు. ప్రముఖ కవి రచయిత డప్పోల్ల రమేష్ రచించిన డా. బాబూ జగ్జీవన్ రామ్ సంక్షిప్త జీవిత చరిత్ర ఆంగ్లానువాదం డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్, విషనరీ ఆఫ్ ఇండియా సొసైటీ “ పుస్తకాన్ని అందజేసి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మీరాకుమార్ ను కలిసిన వారిలో ఆయనతో పాటు ఉల్లాస్ మాదిగ ఉన్నారు.

మాదిగ,ముదిరాజులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి.

మాదిగ,ముదిరాజులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పాముల రమేష్.

హన్మకొండ,నేటిధాత్రి:

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని
హన్మకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు
పాముల రమేష్ కోరారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ,కాంగ్రెస్ జాతీయ నాయకులకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలను అదేవిధంగా ముదిరాజులను 10 సంవత్సరాల పాటు రాజకీయ వివక్షతకు గురిచేస్తూ అణగదొక్కడం జరిగిందన్నారు. మతోన్మాద బిజెపి పార్టీశక్తులు పావులుగా మార్చుకునే వారి కుట్రలను గమనిస్తున్నాం.బిజెపి పార్టీ 1996లో కాకినాడలో వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఆ విషయాన్ని తుంగలో తొక్కిందన్నారు.గత శాసనసభ ఎన్నికల ముందు క్యాబినెట్ సెక్రెటరీతో హడావిడిగా ఎస్సీ వర్గీకరణ కమిటీ వేసి ఇప్పటివరకు రిపోర్టు తెప్పించలేదని తెలిపారు.బిజెపి పార్టీ మాదిగల పట్ల, ముదిరాజుల పట్ల ప్రేమ ఉంటే ఆ సామాజిక వర్గాల నుంచి కేంద్ర మంత్రులుగా తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు.

మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం.

మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ని స్థానిక బస్టాండ్ వద్ద ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన అన్ని పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ కు సుదీర్ఘ పోరాటం కొనసాగించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పంజా మహేందర్ ,జిల్లా నాయకులు కొమ్మాట సుధాకర్ ,మండల అధ్యక్షుడు కొమ్మాట అమర్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎల్లం, స్వామి, శమల మహేష్ ,రాజు, స్వామి,వినోద్ తదితరులు పాల్గొన్నారు

మాదిగ అమరవీరులకు నివాళులు.

మాదిగ అమరవీరులకు నివాళులు.

రామయంపేట మార్చి ఒకటి నేటి ధాత్రి (మెదక్)

మాదిగ దండోరా ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు శనివారం రామాయంపేటలో మాదిగ అమరవీరు సంస్మరణ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమంలో ఉద్యమం చేస్తూ జాతి కొరకు అమరులైన అమరులను జాతి ఎన్నటికీ మర్చిపోదన్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని నివాళులర్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పాతూరి రాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్ మాదిగ, నాయకులు అక్కిరి గారు రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు బొర్ర అనిల్ కుమార్, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటపురం బాబు, రత్నం,మురళి, జాన్,
కర్రె రమేష్, బొర్ర సంజీవ్, స్వామి,రాము తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version