జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో మాదిగ అమరవీరులకు నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జ్ మాల చంద్రమౌళి మాదిగ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మూడు దశాబ్దాల మాదిగల లో ఉండబడే 59 ఉపకులాల ఏబిసిడిల వర్గీకరణ ఉద్యమ పోరాటంలో రాజకీయ పార్టీలు మాదిగల పట్ల ఏ బి సి డి ల వర్గీకరణ పట్ల చేస్తున్న అలసత్వం నిర్లక్ష్యం కారణంగా గాంధీభవన్ ముట్టడి కార్యక్రమంలో ప్రాణత్యాగాలు చేశారు వర్గీకరణ ఈ ప్రభుత్వాలు జరగనియ్యవని మనస్సు బరువెక్కి మా ప్రాణాలు బలిపెడితే నన్న ప్రభుత్వాలు వర్గీకరణ చేస్తాయని భావించిన మరికొందరు సోదరులు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగినది వారి ప్రాణ త్యాగాలే ఆగస్టు 1న వచ్చినటువంటి వర్గీకరణ తీర్పు అని మేము భావిస్తున్నామని చంద్రమౌళి మాదిగ అన్నారు అంతే కాకుండా వారి ప్రాణత్యాగాలను వృధా పోనీయమని వర్గీకరణ కాకుండా మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని వారి ఆత్మల సాక్షిగా మాట ఇస్తున్నామని కళాకారుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ మచ్చ దేవేందర్ మాదిగ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ మాదిగ పట్టణ అధ్యక్షులు రేణికుంట్ల రవి మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ నియోజకవర్గ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ నేరుపటి అశోక్ మాదిగ ఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి మడిపల్లి సుమన్ మాదిగ ఎంవైఎస్ జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సిరుపంగ చంటి పట్టణ ప్రధాన కార్యదర్శి మంచినీళ్ల వైకుంఠం మాదిగ బోడికల సమ్మయ్య మాదిగ బొడికల శ్రీకాంత్ మాదిగ గుర్రం సమ్మన్న మాదిగ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మార్చి 01: తిరుపతి జిల్లా, రామచంద్రాపురం మండలం, చిట్టతూరు కాలేపల్లి రెవెన్యూ గ్రామంలోని చిట్టత్తూరు ఆది ఆంధ్ర వాడకు చెందిన స్మశాన వాటికను ఆక్రమణలను తొలగించి, దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేశారు. ఆర్ సి పురం తహసిల్దార్ కే వెంకటరమణ ఆదేశాల మేరకు శనివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మండల సర్వేయర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సర్వేనెంబర్ 358 /13 సర్వే 00.38 సెంట్లు స్మశాన స్థలాన్ని గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఆక్రమించుకోవడంతో దళితవాడ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే నిర్వహించి ఆక్రమణలను వీఆర్వో వెంకటరమణ, నరసింహులు,జి రాజశేఖర్, బాబు, కమ్యూనిటీ సర్వేయర్ మణి, వీఆర్ఏ బాల, సుబ్రహ్మణ్యం, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి లు తొలగించారు. స్మశాన వాటిక చుట్టూ జెసిబి తో ఫ్రెంచ్ ఏర్పాటు ఏర్పాటుచేసి దళితులకు స్మశాన వాటిక సౌకర్యం కల్పించారు. స్మశాన వాటిక స్థలంలో మామిడి చెట్ల ఉన్నాయి.ఆ మామిడి చెట్లను కూడా గ్రామస్తులు ఉపయోగించుకునేలా రెవెన్యూ అధికారులు అప్పజెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లగా ఆక్రమణకు గురైన స్మశాన వాటిక ఏర్పాటు చేసినందుకు గ్రామానికి చెందిన దళితులు అధికారులకు, కృతజ్ఞతలు తెలిపారు..
వార్త ఏమిటి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రోడ్లు భవనాల విశ్రాంతి గృహం ఆవరణలో శనివారం ఉదయం ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు, ఎంఐఎం అద్యక్షులు అత్తర్ అహ్మద్ తెలిపారు. ఈకార్యక్రమంలోపలువురుఎంఐఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జహీరాబాద్: 3 నుంచి ఉర్దూ మధ్యమ పాఠశాలల సమయం మార్పు: డీఈవో
జహీరాబాద్. నేటి ధాత్రి:
రంజాన్ నెల సందర్భంగా ఉర్దూ మాధ్యమ పాఠశాల వేళలో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1: 30 వరకు పాఠశాలలు జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు.
మాదిగ అమర వీరుల దినోత్సవం సందర్బంగా ఐబీలో ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఇంచార్జి ఆధ్వర్యంలో ఘనంగా అమరవీరుల చిత్ర పటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ…తరతరాలుగా అణిచివేయబడిన కులాలు చైతన్యమై వారి హక్కుల కొరకు ఉద్యమాలు మొదలై వారి అస్తిత్వ పునాదులను నిర్మించుకునే ఈ ప్రక్రియలో జరుగుతున్న పోరాటమే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమం లక్ష్య సాధనలో భాగంగా 2009 ఫిబ్రవరి 28న గాంధీభవన్ ఘటనలో వీరమరణం పొందిన అమరులు పొన్నాల సురేందర్ మాదిగ,మహేష్ మాదిగ,దేవేందర్ మాదిగ,ప్రభాకర్ మాదిగ,గత పోరాటంలో వీర మరణం పొందిన తెల్ల బండ్ల రవి అదే ఉద్యమ ప్రస్థానంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ప్రాణాలర్పించిన దర్శనలా భారతి మాదిగ గార్లు వర్గీకరణ సాధనలో వారి త్యాగం మరువలేనిది. స్వాతంత్ర మరియు తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన అమరుల తీరుగానే మాదిగ జాతి కొరకు ఈ సమాజంలో మార్పు కొరకు జరిగిన అనేక ఉద్యమాలలో పాలుపంచుకొని ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలు స్మరించుకుంటూ దేశ ,రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనగా మార్చి 1న మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.భవిష్యత్తులో జరగబోయే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సామాజిక న్యాయం దిశగా ముందుకు సాగాలని దానికి సబ్బండ వర్గాలు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందుకు అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో… జైరాజ్ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షలు,కే నవీన్ కుమార్ మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి, టీంకు జహీరాబాద్ ఎమ్మార్పిఎస్ అధ్యక్షులు ,మండల ప్రధాన కార్యదర్శి సుకుమార్, చంద్రయ్య మాజీ సర్పంచ్ మామిడిగి, నర్సిoములు,ప్రభాకర్, నిర్మల్, అజయ్, కిట్టు, అనిల్, సుందర్, జీవన్,ప్రశాంత్, లాజర్, కర్నె శ్రీనివాస్ పాల్గొన్నారు.
జహీరాబాద్ లో రంజాన్ మాస నమాజ్_ఇ_తారావీహ్_రోజు_3_ పారే ప్రార్థన స్థలాల పేర్లు
జహీరాబాద్. నేటి ధాత్రి:
విశ్రాంతి లేదా విశ్రాంతి అని అర్థం, తరావీహ్ అనేది రంజాన్ సమయంలో ప్రతి ఒక్క రాత్రి సాయంత్రం ప్రార్థన, ఇషా తర్వాత చేసే స్వచ్ఛంద ప్రార్థన. ఇది అత్యంత సిఫార్సు చేయబడిన సున్నత్ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మసీదులు ఈ ఆశీర్వాద మాసంలోని ప్రతి రాత్రి పురుషులు మరియు మహిళల కోసం తారావీహ్ ప్రార్థనలను నిర్వహిస్తాయి. నమాజ్_ఇ_తారావీహ్_రోజు_3_ పారే జహీరాబాద్ మస్జిద్ బాగ్దాదీ టైమింగ్ 08-15. మస్జిద్ అబ్దుల్ హకీమ్ జమాలీ 08-15. మసీద్ సయ్యద్ తాజుద్దీన్ 08-15. మసీద్ అయేషా పాత ఆర్టిఓ చెక్పోస్ట్ 08-అర్ఫా 15వ చెక్పోస్ట్ 08 మస్జిద్ గాడి రోజు నమాజ్_ఇ_తారావీహ్_రోజు_3_పారే పూర్తి చేస్తారని మత పెద్దలు చెప్పారు.
తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరుచౌరస్తాలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపెల్లి బాలయ్య ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల కు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈరోజు తాడూరుచౌరస్తాలో నివాళులర్పించడం జరిగిందని తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రభుత్వపరంగా ఎస్సీ వర్గీకరణఅమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరవీరులకు నివాళులర్పించారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపెల్లి బాలయ్య ప్రధాన కార్యదర్శి అవునూరి రమేష్ పసుల దుర్గయ్య గుండేటి రాము సవనపల్లి రాకేష్ గుండు ప్రేమ్ కుమార్ ములిగే శేఖర్ సిరిసిల్ల పరిసయ్య ఎడ్ల రవి కోసపురం సురేష్ పరశురాములు కృష్ణ భగవాన్ శ్రీకాంత్ కృష్ణ అరుణ్ కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
MRPS
తంగళ్ళపల్లి పద్మనగర్లో గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం… తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ భవనంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశం జరిపి వారికి సంబంధించిన సమస్యలపై తెలుసుకొనిపలు సమస్యలపై చర్చించారు ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముడారి పోచయ్య మండల ఆఫీస్ నుండి రాధాకృష్ణ ఎమ్మార్వో ఆఫీస్ నుండి రాధాకృష్ణ విఆర్ఓ వెంకటేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రాచణ్ణి స్వామి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానము
• జాతర మహోత్సవముల ఆహ్వాన
జహీరాబాద్. నేటి ధాత్రి:
స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరము పాల్గుణ శు. పంచమి తేది|| 04-03-2025, మంగళవారం నుండి ఫాల్గుణ శు. సప్తమి తేది|| 06-03-2025 గురువారం వరకు
బడంపేట నివాసాయ శ్రీ రాచరాయ చిద్విలాసయ: శ్రీ తపోజనపోష శ్రీ పార్వతీరాచరాయ నమః త్రైలోక్య సంపదలేఖ్య సమాలేఖన బిత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ పరబ్రహ్మణే నమః
స్థల పురాణము
సమస్త భక్త మహాశయులందరికి మనవి చేయడము ఏమనగా శ్రీ రాచణ్ణ స్వామి దేవాలయము సంగారెడ్డి జిల్లా. గ్రా॥ బడంపేట్, తా జహీరాబాద్ నుండి 16 కిలో మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో అతి సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ రాచణ్ణ స్వామి ఆపర వీరభద్ర అవతారము భక్తులకు దర్శనమిచ్చి సంతృప్తిని శాంతిని ప్రసాదించు చున్నారు. భక్తులారా! బడంపేట పుణ్యక్షేత్రములో ఋషులు మహామును మహాతపస్సంపన్నులు తపస్సు చేసుకొనిన అతి పురాతనమైన దివ్యక్షేత్రము ఇక్కడ కోనేరు పవిత్రమైన గంగాతీర్థం. ఈ కోనేరులో భక్తులు స్నానమాచరించి ముక్తిని సంపాదించుటకు సులువైనది. శ్రీ స్వామి వారి ఆలయం ప్రశాంత వాతావరణం కలిగి ఎత్తయిన చెట్లు, గుట్టలు, చెరువులు మరియు సశ్యశ్యామలమైన ప్రదేశంలో నెలవైయున్నది. శ్రీ రాచణ్ణ స్వామి చరిత్రను తేలియజేయుచున్నాము. అయ్యగని అను దివ్వస్థలము బడంపేట అడవిలోకలదు.ఇది దేవస్థానమునకు అర కిలోమీటరు దూరంలో వున్నది. ఇప్పటికి కూడా భక్తులు తిలకించవచ్చును. అక్కడ శ్రీ రాచట్టు స్వామి ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినో ఎప్పటికి చెలియదు. శిల్పసంపదలచే ఆకర్షింపబడుచున్నది.
శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానములో ప్రతి నిత్యమువేలాది మంది భక్తులు జనసందడితో నిత్యపూజలతో కళకళలాడు చున్నది. భక్తుల కోరికలు తీర్చుచు పూజలు అందుకొనుచు కొలువు తీరివున్నారు. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి ఫాల్గుణ శుద్ధ సప్తమి వరకు స్వామి బ్రహ్మోత్సవాలు జరుగును శాలివాహన శఖం 1946 స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పంచమి మంగళవారం తేది|| 04-03-2025 నుండి 06-03-2025 ఫాల్గుణ శుద్ధ సప్తమి గురువారం వరకు
సంగారెడ్డి జిల్లాలో 4 కొత్త పోలీస్ స్టేషన్లకు ప్రతిపాదనలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో నాలుగు కొత్త పోలీస్ స్టేషన్ లకు పోలీసు శాఖ ప్రతిపాదనలు శనివారం పంపించింది. కొత్త మండలాలైనా చౌటకూర్ నిజాంపేటలో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పేర్కొన్నారు.ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అమిన్ పూర్, జహీరాబాద్ లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ కార్యాలయం ప్రతిపాదనలు చేసింది.
మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్ – పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి మార్చి 1: “నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు… నిజమైన నాయకుడు ప్రజల కష్టాలను తనవిగా భావించి సహాయం చేయగలగాలి.” ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు.కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన కుకట్ల పొశం మల్లీశ్వరి, కుటుంబాన్ని పోషించేందుకు మందమర్రిలోని ఇందు గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె అంజలి వివాహం ఈ నెల 9న జరగనుండగా, పెళ్లి ఖర్చులను ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళనతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న బండి సదానందం యాదవ్, సహాయ హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. తన స్వగృహంలో మల్లీశ్వరి దంపతులకు రూ. 50,000 నగదు మరియు పెళ్లి బట్టలు అందజేశారు. కాబోయే వధువు అంజలిని తన కుటుంబ సభ్యులా భావించి, ప్రేమతో ఆశీర్వదించారు.
“ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం”
ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, “నాయకత్వం కేవలం రాజకీయాలకు పరిమితం కావాలి కాదు, సహాయం అవసరమైన వారి కోసం నిలబడటమే నిజమైన నాయకుడి లక్షణం. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు, ఇలాంటి సందర్భాల్లో తమ వంతు సహాయం అందించాలి అని పిలుపునిచ్చారు.
ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మానవతా గుణం
సదానందం యాదవ్ చేసిన మానవీయ చర్య స్థానిక ప్రజల హృదయాలను హత్తుకుంది. “ఇలాంటి నాయకుల వల్లే సమాజం బాగుపడుతుంది” అని వార్డు పెద్దలు, మహిళలు ప్రశంసించారు. “అధికారంలో లేకున్నా పేదల కోసం నిలబడే నేతలు అరుదుగా కనిపిస్తున్నారు. సదానందం నిబద్ధతకు హృదయపూర్వక నమస్కారం” అంటూ పలువురు వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అండగా నిలిచే గొప్ప మనస్సు ఉన్న నేతగా బండి సదానందం యాదవ్, సామాజిక సేవకు చిరునామాగా మారారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పాత్రపురం గ్రామంలో తుడుం దెబ్బ అత్యవసర సమావేశం వెంకటాపురం మండల అధ్యక్షులు బాడిస. కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో,తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు మాట్లాడుతూ రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టు బాటు ధర కల్పించాలని అన్నారు. రైతు శ్రమను గుర్తచక కంపెనీల పేరుతో అగ్రిమెంట్ లేకుండా వ్యవసాయం చేయిస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. విత్తనాలు విత్తనా శుద్ధి లేకుండా రైతులకు సరఫరా చేసి రైతులను నట్టేట ముంచారాని అయన అన్నారు. రైతులకు, సమస్త కు మధ్య ఒప్పంద పత్రాలు రాసుకోవాలి. రైతులకు పంట నష్టం జరిగినప్పుడు పోయినప్పుడు,సమస్యే రైతులకి నష్టపరిహారం అందించాలని అయన నన్నారు. .సంబంధిత అధికారులపర్యవేక్షణ లోపించిందని అయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం ద్రుష్టి సారించి చాలని అయన డిమాండ్ చేశారు . ఈకార్యక్రమంలో ప్రశాంత్, సతీష్, నర్సింహారావు, రాంకి, గణేష్, తిలక్ తదితరులు పాల్గొన్నారు.
`టీడీపీ విజయం సాధిస్తే లోకేష్ కు పట్టాభిషేకం వాయిదా పడొచ్చు!
`ఓడిపోతేనే లోకేష్ కు లైన్ క్లియర్ కావొచ్చు!
`ఇలాంటి పరిస్థితి చాలా విచిత్రమైనది.
`ఏ రకంగా చూసినా లోకేష్ సిఎం కావడానికి మార్గం పడేదే!
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలుగు దేశం పార్టీ శ్రేణులు సంతోషపడే వార్త. సంబరాలు చేసుకోవాల్సిన వార్త. చినబాబు మంత్రి లోకేష్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమౌతున్నదనే విషయం స్పష్టమౌతున్న వార్త. అవును..చాలా తొందరగానే లోకేష్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం నిర్వహించే సమయం ఆసన్నమౌతోంది. అందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సై అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కూడా పంచుకున్నట్లు తెలుస్తోంది. ఏపి రాజకీయాలలో నవ శకం రావాలంటే యువ తరం రాజకీయాలు పురుడు పోసుకోవాలని పవన్ కూడా అభిప్రాయపడుతున్నట్లు అర్థమౌతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని, వైసిపిని మరో పదిహేళ్ల పాటు నిలువరించాలంటే కూటమి వుండాలని పవన్ బలంగా కోరుకుంటున్నట్లు స్వయంగా చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కూటమికి బీటలు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని కూడా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఏపి బాగుపడాలన్నదే తన తపన అన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం ఎలాంటి త్యాగాలైనా చేయడానికి తాను సిద్దమని పవన్ చెప్పారు. ఎందుకంటే ఎన్ని రోజులైనా, ఇంకెంత కాలమైనా తెలుగు దేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్ మాత్రమే. ఆయనను కాదని మరెవరూ అధ్యక్షుడు కాలేరు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి ఇంకా ఎన్ని సార్లు వచ్చినా ముఖ్యమంత్రి కావాల్సింది లోకేష్ మాత్రమే. ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్పష్టంగా తెలుసు. పవన్ మొదటి నుంచి చెబుతూనే తన శ్రేణులను సమాయత్తం చేస్తూనే వున్నాడు. అయితే కొంత మంది జనసేన నాయకులు పవన్ వ్యాఖ్యలకు నొచ్చుకుంటున్నారు. పవన్ ఇలా నిర్ణయం తీసుకుంటే మా భవిష్యత్తు ఏం కావాలి? అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. అయినా పార్టీ పచ్చగా వుంటేనే నాయకులు, కార్యకర్తలు వుంటారు. పార్టీ అధికారంలో వుంటే జిందాబాద్ లు కొడతారు. గతంలో వుండే పరిస్థితులు ఇప్పుడు లేదు. ప్రతిపక్షంలో వుంటే నాయకులు, శ్రేణులు ఎంత కాలమైనా పార్టీని కాపాడుకునే వారు. ఇప్పుడు ఆ రోజులు లేవు. తనేమిటో తన పార్టీ పరిస్థితి ఏమిటో పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. కలలు కొన్ని నిజాలు కాకపోవచ్చు. అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా దూరదృష్టితోనే కూటమి ఎల్లకాలం కొనసాగుతుందని చెప్పి వుండొచ్చు. అంటే లోకేష్ సిఎం కావడానికి పవన్ ఒప్పుకున్నట్లే! అనే మాటలు వినిపిస్తున్నాయి. సిఎం కావడానికి లోకేష్ కు లైన్ క్లియరైనట్లే!!అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. లోకేష్ కు సిఎం గా పట్టాభిషేకమే! అని పార్టీలో వినిపిస్తోంది. అయితే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం కూడా చేయొద్దు. నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు. వాళ్లు మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదు. అందుకు పవన్ కళ్యాణ్ అతీతుడు కాదు. ఆయనలోనూ మార్పు రాదనే హామీ ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే రాజకీయమే అవకాశవాదానికి చిహ్నం. రాజకీయాలలో ఆశావాదమే కాదు, అవకాశ వాదం లేకపోతే ముందుకు వెళ్ళలేదు. పదవులు కావాలనుకున్నప్పుడు గాలి ఎటు వీస్తే అటు మళ్లితేనే అందుతాయి. ఎలాంటి నాయకుడైనా తాను అందరికంటే ఎత్తులో వుండాలనే కోరుకుంటారు. నేను మరో నాయకుడి పల్లకి ఎల్ల కాలం మోస్తానని చెబితే అబద్దమే అవుతుంది. రాజకీయాలలో నీతి, నిజాయితీ అనే పదాలకు చోటు ఎప్పుడూ వుండదు. పైకి సిద్దాంతాలు, రాద్దాంతాలు ఎన్ని మాట్లాడినా అవకాశ వాదాన్ని మించిన రాజకీయం ఎప్పుడూ ముందు పడదు. అందువల్ల పరిస్థితుల ప్రభావం అని పవన్ ఎప్పుడైనా మాట తప్ఫొచ్చు. నాకు ప్రాధాన్యత తగ్గుతుందని అలక చెందొచ్చు. పక్కనుండే నాయకులు కలత చెందవచ్చు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తారా? ప్రశ్నించొచ్చు. మీ నాయకత్వం కోసం పని చేస్తామే కానీ మరో పార్టీ కండువా కప్పుకోమని జనసేన నాయకులు అనవచ్చు. అప్పుడు పవన్ కళ్యాణ్ కు తప్పకపోవచ్చు. పార్టీ శ్రేణుల ఒత్తిళ్లంటూ పవన్ మాట మార్చవచ్చు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఎక్కడా వుండరు. పవన్ ఇప్పటి వరకు పెట్టుకున్న పొత్తులను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. గతంలో తెలుగు దేశం తో సాగారు. తర్వాత వామపక్షాలతో కూడారు. మరి కొంత కాలం తర్వాత బిఎస్పీ అధినేత మాయావతి కాళ్లకు దండం పెట్టారు. పొత్తుకు సై అన్నారు. వాస్తవ రాజకీయాలను బాగా గమనించి మళ్ళీ కూటమికి సై అన్నారు. సామ్యవాద రాజకీయం నుంచి సనాతన ధర్మం వైపు దారి మార్చుకున్నాడు. తెలుగు దేశం పొత్తు తో తొలిసారిగా అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. ఎందుకంటే అవసరాల కోసం దారులు వెతుక్కునే పదవులే వుంటాయి. పదవి కాంక్ష లేకుండా రాజకీయాలు పవన్ కళ్యాణే కాదు ఎవరూ చేయరు. కాలం గడిస్తే పవన్ మాట మీద నిలబడతాడా? అన్నది డౌటే! అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత తొందరపడితే అంత మంచిది. ఆలస్యం అమృతం విషం. లోకేష్ ను సిఎం చేయడానికి పవన్‌ను ఒప్పించే ప్రయత్నం పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదు. లోకేష్ ను సిఎం చేయొద్దనే హక్కు పవన్‌కు లేదు. లోకేష్ ను సిఎం చేయొద్దు అనేది పొత్తు ధర్మంలో లేదు. అందుకే ఈ ఏడాదిలోనే లోకేష్ ను సిఎం చేయాలని టిడిపి పట్టు పడుతోంది. అయితే పవన్ కొంత సమయం కోరుతున్నారా? అనేది తేలాల్సి వుంది. అయితే యుపి ఎన్నికలయ్యేదాకా సాగ దీయాలని పవన్ చూస్తున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలో బిజేపి అప్రతిహతంగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వెళ్తోంది. మూడోసారి ఉత్తర ప్రదేశ్ ను బిజేపి గెలుచుకుంటే ఇక దేశంలో ఆ పార్టీకి తిరుగుండదు. అప్పుడు పవన్‌కు కూడా బలం పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. యూపిలో బిజేపి హాట్రిక్ సాధిస్తే లోకేష్ ఆశలు ఆవిరౌతాయని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. అంతే కాకుండా శాసనమండలి ఎన్నికలు కూడా ప్రభావం చూపొచ్చు. కాకపోతే ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మండలి ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తే లోకేష్ కు పట్టాభిషేకం వాయిదా పడొచ్చు! ఒకవేళ టిడిపి ఓడిపోతేనే లోకేష్ కు లైన్ క్లియర్ కావొచ్చు! గెలిస్తే ప్రజల మద్దతు మనకే వుందని చంద్రబాబు నాయుడే కొంత ఆలస్యం చేయొచ్చు. ఇలాంటి పరిస్థితి చాలా విచిత్రమైనది. కానీ ఏ రకంగా చూసినా లోకేష్ సిఎం కావడానికి మార్గం పడేదే!అది ఎప్పుడు అనేది చంద్రబాబు నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి వుంది.
ప్రపంచ వ్యాప్తంగా గూగూల్, వీకీపీడియాల్లో రికార్డు స్థాయిలో సెర్చ్‌లు
హైదరాబాద్,నేటిధాత్రి:
‘యద్భావం తద్భవతి’ అన్న నానుడిని నిజం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగిసింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా తర్వాతి మహోత్సవం 2157లో జరుగనుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకోమారు వచ్చే కుంభమేళాలు 12 ముగిసిన తర్వాత 144 సంవత్సరాలకు వచ్చేదే మహా కుంభమేళా. ఇది కేవలం ప్రయాగ్ రాజ్‌లో మాత్రమే జరుగుతుంది. కుంభమేళాలు నాలుగు రకాలు. నాలుగేళ్లకోమారు జరిగేది కుంభమేళా, ఆరేళ్లకోమారు వచ్చేది అర్థ కుంభమేళా, 12 ఏళ్లకోమారు వచ్చేది పూర్ణ కుంభమేళా అదేవిధంగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహా కుంభమేళా. ఇప్పుడు ప్రయాగ్ రాజ్ లో జరిగింది మహా కుంభమేళా. మొత్తం 45రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవంలో ఫిబ్రవరి 26 వరకు 66.21 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య దేశంలోని మొత్తం హిందూ జనాభాలో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, భూటాన్ రాజు సైతం ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాటలో 30 మంది మరణించడం, ఢల్లీి రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటలో మరో 18మంది దుర్మరణం వంటివి మనసుకు బాధకలిగించేవే. ఇక్కడ విపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రభుత్వ వైఫల్యం కాదు, ప్రజల్లో క్రమశిక్షణా రాహిత్యం ఇటువంటి అనుకోని దుర్ఘటనలకు కారణమవు తున్నాయన్నది పరిస్థితులను గమనిస్తే తెలుస్తుంది. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగిసిన కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమం వద్ద ఇచ్చిన మహా హారతితో 144 సంవత్సరాలకోమారు వచ్చే ఈ మహా క్రతువు ముగిసింది. మహాశివరాత్రి రోజున కేవలం ఒక్కరోజునే 1.53కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు.
మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం
ఈసారి మహాకుంభమేళా ముగింపు రోజైన మహాశివరాత్రి పర్వదినాన కేదార్‌నాథ్ దేవాలయాన్నితెరిచే రోజును ప్రకటించారు. వచ్చే మే 2వ తేదీన ఉదయం ఏడుగంటలకు వృషభ లగ్నంలో కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరచుకుంటాయి. దీంతో చార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. గుజరాత్‌లోని సోమనాథ్, నాగేశ్వర్ ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల మల్లికార్జున క్షేత్రం, మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర, ఓంకారేశ్వర ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం, మహారాష్ట్రలోని భీమశంకర, త్రయంబకేశ్వర ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం, జార్ఖండ్‌లోని వైద్యనాథస్వామి ఆల యం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్ ఆలయం…వీటిని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు.
తొలిసారి కుంభమేళా ప్రస్తావన
క్రీ.శ.629ా645 మధ్యకాలంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ లేదా జియాంజంగ్ రచనల్లో తొలిసారి చారిత్రకంగా కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. ఇంపీరియర్ గెజిట్ ఆఫ్ ఇండియా ప్రకారం 1892లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సంద ర్భంగా పెద్దఎత్తున కలరా సోకింది. అప్పటి అధికార్లు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు అమ లచేసారు. ఇందులో భాగంగా హరిద్వార్ పునరుద్ధరణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 1903 కుంభమేళాకు సుమారు నాలుగు లక్షలమంది హాజరుకాగా, 1954 కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1998 ఏప్రిల్ 14న హరిద్వార్‌లో జరిగినకుంభమేళాకు పదిమిలియన్ల మంది ప్రజలు హాజరయ్యారు. 2001లో అలహాబాద్ (ప్రయాగ్ రాజ్) కుంభమేళాకు ఆరవై మిలియన్ల మంది హాజరుకాగా వీరిలో ఒక మిలియన్ ప్రజలు విదేశాలవారు కావడం విశేషం.
పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ ప్రకారం 1892లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా ఆయన గురువు యుక్తేశ్వర్ మహరాజ్ తొలిసారి మహావతార్ బాబాను కలుసుకున్నారు. 1989లో కుంభమేళా సందర్భంగా ఫిబ్రవరి 6న ప్రయాగ్ రాజ్‌లో 1.5కోట్ల మంది హాజరు కావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
సినిమాలు, డాక్యుమెంటరీలు
1982లో దిలీప్‌రాయ్ తీసిన ‘అమ్రిత కుంభేర్ సంథానే’ చిత్రంలో కుంభమేళాను చూపించారు. 2001లో మెరీజియో బెనజో, నిక్‌డేలు కుంభమేళాపై ‘‘ది గ్రేటెస్ట్ షో ఆన్ ది ఎర్త్’’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తీశారు. దీనితో పాటు నదీముద్దీన్ 2004లో ‘‘సాంగ్స్ ఆఫ్ ది రివర్’’, ‘‘ఇన్వొకే షన్’’, ‘‘కుంభమేళా’’ పేరుతో తీసిన డాక్యుమెంటరీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సి.బి.ఎస్.సండే మార్నింగ్ అనే ప్రముఖ అమెరికన్ మార్నింగ్ షో 2010 ఏప్రిల్‌లో 18న ప్రసారం చేసిన కార్యక్రమంలో హరిద్వార్ కుంభమేళాను ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు పాల్గనే మతకార్యక్రమంగా వర్ణించింది.
అఖాడాల నిర్వహణలో
మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ప్రారంభమయ్యే వరకు ఈ కుంభమేళాలను ‘అఖాడా’లు నిర్వహించేవి. కుంభ స్నానాల సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పించేవారు. అంతేకాదు హిందువులకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపేవారుగా ఈ అఖాడాలకు చెందిన సాధువులను పరిగణించేవారు. 17వ శతాబ్ద కాలంలో ఈ అఖాడాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగేదని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డులను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా 1760లో హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో శైవ సాధువులైన గోసాయిన్లు, వైష్ణ వ సాధువులైన బైరాగుల మధ్య ఘర్షణ జరిగినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డుల్లో నమోదైంది. మరాఠా పీష్వా ముద్రించిన రాగి శాసనంలో 1789లో నాసిక్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా శైవ సన్యాసులు, వైష్ణవ బైరాగి సాధువుల మధ్య గొడవలు జరిగినట్లు పేర్కొనివుంది. ఈవిధంగా అఖాడాల మధ్య నిరంతరం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఈస్ట్‌ఇండియా కంపెనీ కలుగ జేసుకొని ఈ కుంభమేళాల సందర్భంగా క్యాంపులను ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు కంపెనీ అధికార్లు ఏ అఖాడా ఎప్పుడు స్నానం చేయాలన్న నియమనిబంధనలను అమలుచేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కుంభ మేళాకు వచ్చేవారిపై ‘యాత్రపన్ను’ విధించడం ద్వారా ఆదాయం పొందే కోణంలోనే ఆలోచిం చింది. చివరకు 1870 నాటికి కుంభమేళా నాటి బ్రిటిష్ ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం విధిస్తున్న పన్నులను ప్రయాగ్‌వాల్ పండాలు (ప్రయాగ్‌రాజ్‌లోని బ్రాహ్మణులు) తీ వ్రంగా వ్యతిరేకించారు. పన్నులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం సదుపాయాల గురించి పట్టించుకునేది కాదు. చివరకు 1938లో లార్డ్ ఆక్‌లాండ్ ఈ యాత్రపన్నును రద్దు చేయడంతో కుంభ మేళాకు హాజరయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదిలావుండగా 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో, బ్రిటిష్ ప్రభుత్వం ఈకుంభమేళాలను తిరుగుబాటును ప్రోత్సహించే కేం ద్రాలుగా పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకునేది. కాగా 1895లో అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత, వ్యాసకర్త మార్క్ ట్వైన్ ( అసలు పేరు సామ్యూల్ లాంఘోర్న్ క్లీమెన్స్) ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాను సందర్శించాడు. ‘‘ఈ కుంభమేళా సమాజానికి ఆధ్యాత్మితను, ఐకమత్యాన్ని, భక్తిని, విలువలను ప్రభోదిస్తాయి’’ అని ఆయన తన రచనల్లో పేర్కొన్నాడు. అంతేకాదు కుంభమేళా సందర్భంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు కూడా జరిగేవి. బుఖారా, కాబూల్, తుర్కిస్తాన్, అరబ్‌లు, పర్షియన్లు హరిద్వార్ కుంభమేళాలో పాల్గని తమ వ్యాపారాలను నిర్వహించేవారు. ఆహారధాన్యాలు, నిత్యావసరాలు, బమ్మలు వంటివి వ్యాపారులు అమ్మ కాలు జరిపేవారు. రెండో ప్ర పంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం కుంభమేళాను నిషేధించింది. ఇంధన కొరత ఏర్పడు తుందన్న భయమే ఇందుకు కారణం. ఇదేసమయంలో జపాన్ కుంభమేళా జరిగే ప్రాంతంపై బాంబు వేస్తుందన్న ప్రచారం జరగడంతో 1942 కుంభమేళాకు చాలా తక్కువమంది ప్రజలు హజరయ్యారు.1947 దేశ స్వాతంత్య్రం తర్వాత అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కుంభమేళా నిర్వహణ బాధ్యతలను నిర్వహించడం మొదలుపెట్టాయి.
తొక్కిసలాటలు, తప్పిదాలు
1820లో హరిద్వార్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 485 మంది మరణించారు. తర్వాత కంపెనీ ప్రభుత్వం తొక్కిసలాటలను నివారించేందుకు ఘాట్లను అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకుంది. 19`20 శతాబ్దాల్లో తొక్కిసలాటలు అడపాదడపాచోటుచేసుకున్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపును అప్పటి ప్రభుత్వాలు చేపట్టాయి. ఇదిలావుండగా 1885లో ఒక హుస్సేన్ అనే అధికారిని కుంభమేళా మేనేజర్‌గా నాటి బ్రిటిష్ ప్రభుత్వం నియమించడం వివాదానికి దారితీ సింది. ఇతను యూరోపియన్ పురుషులు, మహిళలకోసం విలాసవంతమైన బోట్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వీటిల్లో యువతులతో నృత్యాలు, మద్యం, బీఫ్‌ను ఏర్పాటు చేయడంతో, వారు విలాసంగా వీటిల్లో ప్రయాణిస్తూ, స్నానం చేస్తున్న భక్తులను వీక్షిస్తూ ‘ఎంజాయ్’ చే శారని అప్పటి దినపత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో ప్రభుత్వ చర్య రచ్చకు దారితీసింది.
లక్ష్యానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి చేయాలి – హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్
– వివిధ శాఖల ప్రభుత్వ ఆర్డర్లు, ప్రొడక్షన్ పై సమీక్ష
– హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల,(నేటి ధాత్రి):
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయాలని హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ సూచించారు. సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెందిన యజమానులు, ఆసాములు, కార్మికులు, టెక్టైల్ పార్క్ పరిశ్రమల యజమానులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల వివరాలను వెల్లడించారు. ఇప్పటిదాకా ఎంత ఉత్పత్తి చేశారో ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, సమగ్ర శిక్ష అభియాన్, మహిళా శక్తి చీరల ఆర్డర్లపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా శాఖలకు ఆయా శాఖల నుంచి సిరిసిల్ల వాసన పరిశ్రమకు అందించిన ఆర్డర్లలో 50 శాతం మార్చి 15వ తేదీలోగా అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా వస్త్రాల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. గతంలో తాము ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని, సెస్ విద్యుత్తు బ్యాక్ బిల్లింగ్ సమస్య పరిష్కరించాలని, యంత్రాల కొనుగోలు తదితర అంశాలకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ మాట్లాడుతూ జిల్లాలోని యజమానులు, ఆసాములు, కార్మికుల్లో అర్హులైన వారందరికీ బ్యాంకుల నుంచి రుణాలు అందజేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన బకాయిలను త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. విద్యుత్ బ్యాక్ బిల్లింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆరు నెలల పాటు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనికి అనుగుణంగా సిరిసిల్లలోని పరిశ్రమ బాధ్యులు ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి చేయాలని, మిగతా రోజుల్లో ప్రైవేట్ మార్కెట్ నుంచి ఆర్డర్లు పొందేలా సిద్ధం కావాలని సూచించారు. మార్కెట్ అనుగుణంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమకు సంబంధించి వివిధ సమస్యలపై చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారని గుర్తు చేశారు. వస్త్ర పరిశ్రమ బాధ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆయా శాఖల ఆర్డర్లు తీసుకుని పూర్తి చేసి అందజేయాలని ఆదేశించారు. దీంతో ఇంకా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. ఆలస్యం అయితే పరిశ్రమపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన యార్న్ బ్యాంక్ నుంచి ముడి సరుకు పంపిణీలో ఇబ్బందులు త్వరలోనే అన్ని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిఎం టీ.జీ.ఎస్.కో రఘునందన్, ఎ.డి టీ.జీ.ఎస్.కో సందీప్ జోషి గౌతమ్, ఏ.డి. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సాగర్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి వైపుగా వెళ్తున్న ఒక బజాజ్ ఆటోలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి ఆటోను పరిశీలించగా సదరు వ్యక్తులు ఆటో వదిలి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని ఆటోని పరిశీలించగా అందులో 10 సోలార్ బ్యాటరీలు లభ్యం అయ్యాయి. పట్టుబడిన నిందితులను వారితో ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టుబడిన వారిలో పర్వతగిరి మండలానికి చెందిన భూక్య నవీన్, అల్లాడి దుర్గ స్వామి, సంగెం మండలం తీగరాజు పల్లి కి చెందిన గూడూరు అరవింద్, కర్నే అఖిలాష్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుండి 10 బ్యాటరీలు సహా ఒక ఆటో స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు .
సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపందా సిద్ధాంతకర్త కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధంతి బహిరంగ సభ పోస్టర్లను గుండాల సెంటర్ లో శుక్రవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, నాయిని రాజు , పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ లు మాట్లాడుతూ భారత విప్లవ ఉద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)కు ఉందన్నారు. గోదావరి లోయ పరిహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల పోడు భూములను గిరిజనులు గిరిజనేతర పేద ప్రజలకు సాధించడంలో రవన్న పాత్ర క్రియాశీలకమైందని వారన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కరెంటు, రహదారి , విద్య, వైద్యం అభివృద్ధి చెందాలని అనేక ప్రజా పోరాటాలు నిర్వహించడంలో కామ్రేడ్ రవన్న చూపిన మార్గదర్శకం పార్టీకి అమోఘంగా ఉందని వారన్నారు. కామ్రేడ్ రవన్న భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే రష్యా తరహా పెట్టుబడిదారీ దేశంగా ఇండియా ఉందని ఈ మారిన పరిస్థితి అనుగుణంగా పార్టీ కార్యక్రమం, పందా, నిబంధవాలిని మార్చుకోవాలని సిద్ధాంతికరించిన గొప్ప నాయకుడని వారు కొని యాడారు. భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలను చేయాలని వారు ఆశించారని, దాని ద్వారానే విప్లవం విజయవంతం అవుతుందని నమ్మిన సిద్ధాంతకర్త అని అన్నారు. కామ్రేడ్ రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను ఖమ్మం పట్టణంలో మార్చి తొమ్మిదో తారీఖున నిర్వహిస్తున్నామని ఈ వర్ధంతి సభకు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాచర్ల సత్యం, కొమరం శాంతయ్య, వాంకుడోత్ అజయ్,బోర్ర ఎంకన్న,గోగ్గిల వెంకటేశ్వర్లు,తెల్లేం రాజు,ఈసం చంద్రన్న, పూనెం మంగయ్య,సనప కుమార్,దుగ్గి రాంబాబు,మోకాళ్ళ అజాద్,ఈసం సమ్మన్న,పూసం రాంబాబు, కోడూరి జగన్, ఎట్టి రాంబాబు,యనగంటి గణేష్,కల్తి పాపన్న, కల్తి రామన్న,ధనుసరి సమ్మయ్య,ఏడూర్ల రామనాథం తదితరులు పాల్గొన్నారు,
ఆర్డీఓ కార్యాలయం,ఎమ్మార్వో,మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట చెరువు మత్తడి వాగుకు సంబంధించిన వాగుభూమిని కబ్జా చేసి వే బ్రిడ్జి నిర్మించి అక్రమ కట్టడాలు చేపడుతున్నారని మున్సిపాలిటీ పరిధిలో గల 17 వార్డు ద్వారకపేట గ్రామస్తులు ఆరోపించారు.అలాగే మా గ్రామానికి సంబంధించిన స్మశానవాటిక కు వెళ్ళే దారి భూమిని అక్రమంగా అక్రమించుకున్నారని వారిపై చర్యలు తీసుకొని మా భూములను కాపాడాలని వేడుకుంటూ అలాగే ఇటీవల ‘విలువైన మత్తడి వాగు కబ్జా.. ఆపై వే బ్రిడ్జి నిర్మాణం” అనే నేటిధాత్రి దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందించిన గ్రామస్తులు శుక్రవారం నర్సంపేట ఎమ్మార్వో రాజేష్,మున్సిపల్ కమిషనర్ కు వేరు వేరుగా పిర్యాదులు చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ
cheruvu
ద్వారకపేట పరిధిలోని ఎంఎఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర గల కాలువ ఆక్రమునకు గురికావడం జరిగిందని దీంతో 17వ వార్డు ఎస్సీ కాలనీ సంబంధించిన ఇండ్లు కాలువ వరదకు గురైతున్నదని ఆరోపించారు. కాలువకు ఆక్రమణకు కారకులైన వారిపై తక్షణ చర్యలు తీసుకొని కాలువపైన అక్రమంగా నిర్మాణం చేసిన పైపులైన్లను తీసివేయాలని వారు డిమాండ్ చేశారు.మరియు ద్వారకపేట ఆరో వార్డు, 17వ వార్డు వద్దగల స్మశానవాటికకు సంబంధించిన దారిభూమిని కబ్జాచేశారని దీంతో ప్రజలను దాన సంస్కరాలకు పోనీయకుండా పత్తిమిల్లు యజమాని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.స్మశాన వాటికకు సంబంధించిన దారిభూమిని కబ్జా చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సి కాలని వాసులు,గ్రామస్తులు డిమాండ్ చేశారు.వెంటనే స్పందించిన ఎమ్మార్వో రాజేష్ వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు వేల్పుల మల్లయ్య, వేల్పుల శ్రీనివాస్, వేల్పుల భాస్కర్, పొన్నాల వీరస్వామి,పొన్నాల ఎల్ల స్వామి, ఇస్రాం బాబు,చింత సాంబయ్య, ఓరుగంటి నాగరాజు, ఆవుల వెంకట నరేందర్ తెలిపారు
మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్ లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్య తరువాత రానున్న నాలుగు సంవత్సరాల సమయమని చాలా విలువైనదని అన్నారు. మీ భవిష్యత్తు బాగుండాలని, మీ తల్లిదండ్రుల లాగా మీరు కష్టపడకూడదని.. వారు కూలీ పనులు చేస్తూ.. వ్యవసాయ పనులు చేసుకుంటూ.. వాళ్ళు పడే కష్టాలను సైతం ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిగా చదువుకొని జీవితంలో మీరు స్థిరపడాలని ఆయన సూచించారు. మీకోసం మీ తల్లిదండ్రులే కాకుండా మేము కూడా తపన పడుతున్నామని, మీరంతా మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని
Avoid bad friends
కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు మీకోసం ఇంజనీరింగ్, నీట్ ఎంట్రెన్స్ పరీక్షలకు క్రాష్ కోర్స్ ఏర్పాటు చేస్తామని.. ఈ కోర్సులో చేరిన వారికి ఉచితంగా వసతి భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న పాపిరెడ్డి శుక్రవారము పదవీ విరమణ సందర్భంగా ఆయన ను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ చేసి ఆల్ ది.. బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, టిజిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.రామకృష్ణ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం మండల కేంద్రం లోని కస్తూర్బ పాఠశాల యందు జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా పాఠశాల ఇంచార్జి పొన్నం సునీత మాట్లాడుతూ ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలు రంగవల్లులు క్విజ్ పోటీలు ప్రముఖ శాస్రవేత్తలు మరియు ఆవిష్కరణలు సైన్స్ అంశాలపై వ్యక్తిత్వ ప్రసంగం పోటీలు వినియోగం విద్యార్థులచే చేయబడిన నమూనాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం లో సైన్స్ ఉపాధ్యాయులు తోట రాధిక వెంగల విజయలక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు
శాయంపేట మండల కేంద్రంలోని బాలికల కళాశాల లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఈ ఆర్థిక క్రమశిక్షణ రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను తీసుకొని పొదుపు చేయాలని, ఇప్పుడు చేస్తున్న ఈ పొదుపే మీ యొక్క భవిష్యత్తు అవసరాల కోసం చాలా ఉపయోగపడు తుందని ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని ఉండదు అని అన్నారు, అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోతు న్నాయి వాటి నుండి తస్మాత్ జాగ్రత్త అని విద్యార్థులకు తెలియజేశారు, ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు పంపించిన లింక్స్ గాని ఓటీపీలు గాని ఎవరికి షేర్ చేయవద్దని అన్నారు, ఒకవేళ తెలియక సైబర్ నేరాల వలలో పడినట్లయితే వెంటనే గుర్తించి బ్యాంకును గాని పోలీసులను గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని తద్వారా మీకు సహాయం చేయడానికి వీలుగా ఉంటుందని తెలియజేశారు. ఇదే రోజున ఈ హాస్టల్లో సైన్స్ వేర్ నిర్వహించడం జరిగింది, విద్యార్థుల యొక్క ప్రతిభను చూసి విద్యార్థులను అభినందించడం జరిగింది
students
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా అదృష్టవంతులని ఈ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులే అన్ని రంగాల్లో రాణిస్తారని తెలియజేశారు. నేను కూడా గురుకుల పాఠశాలలోనే చదివి ఈరోజు బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నాను, ఈ పాఠశాలలో చదువుకు న్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని అదేవి ధంగా మీరందరూ కూడా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని మరియు సిబ్బంది, మరియు ప్రభుత్వ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు, మరియు విడ్స్ స్వచ్ఛంద సంస్థ కౌన్సిలర్స్ మారపెల్లి క్రాంతికుమార్, విజయ్, ప్రసాద్ పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.