అందోల్ లో మీనాక్షి నటరాజన్ పర్యటన…

అందోల్ లో మీనాక్షి నటరాజన్ పర్యటన ను విజయవంతం చేయాలి

◆:- ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి . సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.

◆:- మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాదయాత్ర లో స్వచ్ఛందంగా కార్యకర్తలు వేలాది గా పాల్గొనాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T115254.204.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి వెల్లడించారు . ఎ ఐ సి సి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆగస్టు 1 న సాయంత్రం 5 గంటలకు అందోల్ నియోజక వర్గంలో చేపట్టిన పాదయాత్ర తో పాటు ఆగష్టు 2న జరిగే శ్రమదానం , పార్టీ కార్యకర్తల తో సమావేశం ను విజయవంతం చేయటానికి జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అన్ని విభాగాల శ్రేణులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి.పార్టీ ముఖ్య నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డి. మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని ఉజ్వల్ రెడ్డి కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version