రామకృష్ణ గౌడ్ ను పరామర్శించిన ప్రజా సంఘాల నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం మండల అధ్యక్షులు నేరెళ్ల రామకృష్ణ దంపతులు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుండి కిందపడి గాయాలు కాగా వారిని ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ, సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ కన్వినర్ అరకొండ రాజయ్యలు పరామర్శించి వారికి మనోదైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబాల రమేష్, మాజీ సర్పంచ్ నేరెళ్ల చేరాలు తదితరులు పాల్గొన్నారు..