కేటీపీపి లో జాతీయ జెండాను ఎగరవేసిన చీఫ్ ఇంజనీర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ. వారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ విద్యుత్ ఉద్యోగులు అందరికీ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సుపరింటెండింగ్ ఇంజనీర్లు, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు వివిధ ట్రేడ్ యూనియన్స్, అసోసియేషన్స్ నాయకులు విద్యుత్ ఉద్యోగులు అర్టీజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కెటిపిపి ముఖద్వారం అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ఎస్సీ & ఎస్టీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కూడా చీఫ్ ఇంజనీర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు విధులు నిర్వహిస్తున్న 20 మంది సెక్యూరిటీ సిబ్బందికి కెటిపిపి ఉత్తమ ఉద్యోగి అవార్డు సర్టిఫికెట్ ను అందించారు