అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికురాలు రత్నమ్మ గారి కుమారుడు అంజి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,నాయకులు అంజన్న,రాములు,గోపాల్,వెంకట్,బాల్ రాజు,నర్సింలు,కృపాకర్ , తదితరులు ఉన్నారు .
