ఇందిరాగాంధీకి జహీరాబాద్ లో కాంగ్రెస్ ఘన నివాళి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు మండల అధ్యక్షుడు నర్సింహ రెడ్డి నాయకులు ఖాజమియా కేబుల్ శేఖర్ సుజాత తదితరులు పాల్గొన్నారు,
