బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజున 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి.
జాతీయ గీతలాపన అనంతరం స్వీట్లు పంచి వేడుకలను ఘనంగా జరిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలో భవిత డిగ్రీ కాలేజ్ ఆవరణలో, కాలటెక్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.ఏఎంసి చౌరస్తా వద్ద స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రివర్యులు కాక గడ్డం వెంకటస్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ
అందరూ మహనీయులు త్యాగాలు ఫలితమే భారత దేశ స్వతంత్రం అని అన్నారు వారి సేవలను గుర్తు చేసుకోవాలని కోరారు
ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తి కోసం
పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలనాయకురాలు,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.