ఝరాసంగంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం లోని ఝరాసంగం రైతు వేదికలో శనివారం నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు-2025 కోసం ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో MPO స్వాతి, మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో TOT, MOT లుగా సురేష్, క్రిష్ణ, శంకర స్వామి లు ఎన్నికల అధికారులకు విధులు బాధ్యతలు, ఎన్నికల చట్టాలు పలు అంశాలపై శిక్షణ అందించారు. శిక్షణ కార్యక్రమంలో 100 మంది ఎన్నికల్లో విధులు నిర్వహించబోయే అధికారులు, మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.