శిక్షణ పొందితే సాధించనిది ఏమీ లేదు.

శిక్షణ పొందితే సాధించనిది ఏమీ లేదు.

#కుటుంబానికి భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలి.

#కంపెనీలు రాకతో ములుగు జిల్లా అభివృద్ధి.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

 

యువతి, యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు పొందాలని, యువత కుటుంబాలకు భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ పొందిన 100 మంది నిరుద్యోగులలో పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన 51 మంది యువతకు నియామక పత్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పలు కంపెనీల ద్వారా శిక్షణ పొంది ప్రతిభ పెంపొందించుకుంటే సాధించనది ఏమీ లేదని అన్నారు.
ఎక్కువ వేతనం రావడం లేదని నిరాశ చెందకుండా వచ్చిన ఉద్యోగ అవకాశాలను చేస్తూనే ఎక్కువ వేతనం వచ్చే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పలు కంపెనీలను కాపాడుకుంటూనే ఇతర కంపెనీలు రావడానికి ప్రయత్నించాలని, కంపెనీలు రాకతో ములుగు నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతిభ పెంపొందించుకోవడానికి టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరు నెలల క్రితం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇప్పటికీ శిక్షణ పొందిన వంద మందిలో 51 మంది యువతక
ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు. టాస్క్ సెంటర్ ఆవరణంలో శ్రీయ ఇన్ఫోసియస్ కంపెనీ ఏర్పాట్లు చేసి అందులో ముగ్గురికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. నేడు యువత నిరక్షరాస్యత నుండి అక్షరాస్యతకు ఎదిగి ఉద్యోగ అవకాశాలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 40 కంపెనీలకు చెందిన యజమానులు ములుగు జిల్లాలో పర్యటించారని, 10 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు.
ఈ రోజున 16 కంపెనీ లు పాల్గొన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి సీతక్క ఒక శక్తి లాగా పనిచేస్తూ ఇప్పటికే పలు కంపెనీలు రావడానికి కృషి చేయడంతో పాటు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారని, కంపెనీలు ఎదగడానికి ఉద్యోగులు కృషి చేస్తే వేతనాలు పెరుగుతాయని అన్నారు. ఎదుగుదలకు హద్దులేదని, చిన్న ఉద్యోగమని చులకన చేయవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సిన్హా – టాస్క్ సిఇఒ
ప్రదీప్ రెడ్డి – టాస్క్ ప్లేస్‌మెంట్ డైరెక్టర్
సేవ్న్ రెడ్డి – టాస్క్ రీజినల్ సెంటర్స్ హెడ్
సుధీర్ – టాస్క్ క్లస్టర్ మేనేజర్
రవి – సిఇఒ, శ్రీయా ఇన్ఫోటెక్
వినోడ్ – సిఎస్ఆర్ ఇన్‌ఛార్జి
బాలా – కాగ్నిజెంట్ సిఎస్ఆర్ బృందం, డొమైన్: ఐటి, ఐటిఇఎస్, ఫార్మా, బ్యాంకింగ్, మార్కెటింగ్, అమ్మకాలు, వ్యవసాయం, ఫైనాన్స్ మరియు నాన్ బ్యాంకింగ్, కంపెనీలకు చెందిన యాజమాన్యాలు టాస్క్ రీజినల్ సెంటర్ లో శిక్షణ పొందిన 100 మంది యువత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత గొడవలకు పార్టీకి సంబంధం లేదు.

వ్యక్తిగత గొడవలకు పార్టీకి సంబంధం లేదు

జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్

జమ్మికుంట:నేటిధాత్రి

 

 

 

హుజరాబాద్ నియోజకవర్గం లో గత కొద్ది రోజులుగా ఇల్లంతకుంట మండలంలో ఇటు జమ్మికుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు దాడులు చేసుకుంటారని కొంతమంది గిట్టని వాళ్లు పార్టీలో విభేదాలు ఉన్నాయి వాళ్లకు వాళ్లకే పడతలేదు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది ప్రణవ్ మద్దతుదారులని బల్మూరు వెంకట్ వర్గమని బద్నాం చేస్తున్నారు అలాగే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి అన్ని కార్యక్రమాలు నడిపించినటువంటి పత్తి కృష్ణారెడ్డి నీ ఇందులోకి లాగుతున్నారు హుజురాబాద్ నియోజకవర్గం లో మాది ఒకటే పార్టీ ఒకరే లీడర్ ఆది మా ప్రణవ్ బాబే బల్మూర్ వెంకట్ మా పార్టీ ఎమ్మెల్సీ మేమందరం ఐక్యతతో పని చేస్తాం మా పార్టీలో ఎలాంటి చీలికలు లేవు గొడవలు వ్యక్తిగతంగా పెట్టుకున్నవి పార్టీకి సంబంధం లేదని ఈ పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version