సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణ
ఏరియా జియం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
వోల్వో డంప్ ట్రక్కు ఆపరేటర్ కోసం పదవ తరగతి ఉత్తీర్ణులై, కనీసం మూఢు సంవత్స రాల,అనుభవం కలిగివున్న హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి నిరుద్యోగ యువకులైన సింగరేణి ఉద్యోగుల పిల్లలు, మాజీ ఉద్యోగుల పిల్లలు, పరిసర గ్రామాల ప్రజలు, భూనిర్వాసితుల కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు . దీనికి ముడునెలలకు ఒక బ్యాచ్ కు 60 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు పదవ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన సంవత్సరం, మెరిట్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు . ఎస్సీ, ఎస్టీ వారికి రూల్ ఆఫ్ రిజర్వేషన్, వయస్సు మినహాయింపు ఉంటుందని తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారికి ఎటువంటి స్టెఫండ్ కానీ భృతి కానీ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తిగా వారి సొంత పూచికత్తు మీదనే ఆధారపడి ఉంటుందని తెలియజేశారు.ఈ దరఖాస్తులను అక్టోబర్ 20 లోపు సంబంధిత భూపాలపల్లి సింగరేణి ఎంవీటీసీ (మైన్ వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్) లో అందజేయాలని తెలియజేశారు .
