ఆపరేషన్ సిందూర్‌లో అగ్నివీరులు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని భారత సైన్యం ప్రకటించింది.
అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్లపాటు సైన్యంలో సేవలందించే అగ్నివీరుల పనితీరు ఆధారంగా, వారికి మరింత స్థిరమైన అవకాశాలు కల్పించే మార్గాలను సైన్యం పరిశీలిస్తోంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, అగ్నివీరులలో గరిష్టంగా 25 శాతం మంది మాత్రమే మెరిట్ మరియు సైన్య అవసరాల ఆధారంగా శాశ్వతంగా నియమించబడతారు. 2026 చివరికి తొలి బ్యాచ్ సేవలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో, శిక్షణ, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా అగ్నివీరుల నిలుపుదలపై సవరణలు చేయాలని సైన్యం భావిస్తోంది.