*వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం..
తిరుపతి నేటి ధాత్రి:
ఎస్వీ వైద్య కళాశాల 2025 మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ, మరియు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారి ఆదేశాల మేరకు వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంపొందించడానికి (ఈజ్) అనే ఎమోషనల్ అసెస్‌మెంట్ ఇన్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్,
అంశం మీద అవగాహన కార్యక్రమం,*ఎస్వీ వైద్య కళాశాల డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో ఈజ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
మానసిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు వైద్య విద్య ఎంతో ఒత్తిడితో కూడిన వైద్య విద్య అని వైద్య విద్యార్థులు భావిస్తారు, కానీ ప్రతిరోజు వారు నేర్చుకున్న వైద్య విద్యను ఎప్పటికప్పుడువైద్య అధ్యాయపకులతో చర్చించుకుని వారి కావలసిన విధంగా తర్ఫీదైనట్లయితే వైద్య విద్య ఎంతో సులువైనదని, అప్పుడే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎంతో ఆనందం కలుగుతుందనిఒత్తిడికి గురికాకుండా ఉండడానికి వైద్య విద్యను అన్ని విధాలుగా క్రమం తప్పకుండా వైద్య లైబ్రరీ లాంటి వాటిలో సమయము వృధా చేయకుండా చదువుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ట్రైనర్ డాక్టర్ నెల్సన్ వివిధ అంశాల వారీగా మెంటల్ హెల్త్, ఆత్మహత్యల నివారణ పైశిక్షణ ఇచ్చారు.
ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలిగుర్తించాలి అనే అంశాలను, మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు ఆయన తర్ఫీదు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డి ఎస్ ఎన్ మూర్తి, డాక్టర్ మల్లికార్జున రావు డాక్టర్ జాహ్నవి , యూజీ, పీజీ, వైద్య విద్యార్థులు, డాక్టర్ మహేష్ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ జి.మురళి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ. వీర కిరణ్ తదుతరులు పాల్గొన్నారు.
