విద్యార్థులలో గ్రంథాలయ పఠనంపై అసక్తిని పెంచే శిక్షణ
మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలోని కేసముద్రం విలేజ్ ఉన్నత పాఠశాలలో 25 జూలై మరియు 26 జూలై తేదీలలో జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ మరియు జడ్పీహెచ్ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు పాఠశాల గ్రంధాలయాలను ఏర్పాటు చేయడం మరియు గ్రంథాలయాల నిర్వహణ, పాఠశాలలో గ్రంథాలయ పఠన కార్యక్రమాలను నిర్వహించడం, విద్యార్థులలో పఠనంపై ఆసక్తిని కలిగించడం మొదలగు అంశాలపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, మరియు ఇనుగుర్తి మండల విద్యాశాఖాధికారి జంగా రూపారాణి, జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాంనర్సయ్య, జెడ్ పి హెచ్ ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, ఆర్పీలుగా ఎం సురేష్ నాయుడు, వి భాస్కరరావు, రాజ్ కుమార్, సి.ఆర్.పి.లు సుల్తానా, స్వాతి, సరిత, నాగవాణి పాల్గొన్నారు,