వనపర్తి లో విద్యార్థులతో భద్రత గురించి ప్రతిజ్ఞ డి ఎస్పీ..

వనపర్తి లో విద్యార్థులతో భద్రత గురించి ప్రతిజ్ఞ డి ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి .

పాలన ప్రగతి ప్రణాళికలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాలలో సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ లో
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వనపర్తి పోలీస్ డిఎస్పీ వెంకటేశ్వరరావు సీఐ, రత్నం విద్యార్థులతో కలిసి మానవహారం పోలీసులు, వాలంటీర్లు కలిసి హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు ట్రాఫిక్ నియమాలపై చర్చించి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్బంగా డి ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ఒక చట్టం మాత్రమే కాదుఅది మన జీవితానికి రక్షణ కవచం అని అన్నారు.సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సురక్షితంగా రోడ్డు దాటే విధానం హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై బస్సుల్లో జాగ్రత్తలు పాఠశాలల వద్ద వేగ నియంత్రణ గురించి, మైనర్ల వాహనాలు నడపటం డ్రైవింగ్‌పై నిషేధం
ట్రిపుల్ రైడింగ్‌పై చర్యలు ఉంటాయని డి ఎస్పీ అన్నారు
ఈ కార్యక్రమంలో సీఐ, సుగంధ రత్నం, వనపర్తి జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, చిన్నమ్మ తామస్, వనపర్తి టౌన్ ఎస్సై, హరిప్రసాద్, వనపర్తి ట్రాఫిక్ ఎస్సై, సురేందర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి…

వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి

ఎమ్మెల్యే గండ్రసత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో గల రైతు వేదిక ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు పోలీ స్ శాఖ మహోత్తరమైన కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహన దారు లకు తెలియజేశారు వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ప్రమా దాల సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చు హెల్మెట్ ఒకటే ప్రధానమని అన్నారు. ప్రధాన రహదారులపై ద్విచక్ర వాహనాల సహాయంతో ఇంటికి చేరుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరి.

మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు

ఎస్సై పరమేష్

రహదారిపై ప్రయాణించే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్మెట్ పెట్టుకోవడం ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఎస్ఐ పరమేష్ కోరారు రోడ్డు భద్రత ప్రగతి ప్రణాళిక,నియంత్రణ ప్రణాళిక గురించి ప్రజలకు వివరిం చాడు. ఒకవేళ మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామనీ హెచ్చరించారు

రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

జైపూర్, నేటిధాత్రి:

 

మైనర్‌లకు వాహనాలు ఇవ్వరాదు

సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత…సీపీ అంబర్ కిషోర్ ఝా

జైపూర్ మండల కేంద్రంలోని దుబ్బ పల్లి ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పించి కంటి పరీక్షలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం,తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు చేపట్టిన“అరైవ్ అలైవ్ ఫేజ్-3” కార్యక్రమంలో భాగంగా సోమవారం జైపూర్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన“అరైవ్ అలైవ్”కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డుభద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యమని తెలిపారు.ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు,కంటి వైద్య శిబిరాలు,ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన యువకులు, కార్మికులు,విద్యార్థులు రోడ్డు భద్రతపై తెలుసుకున్న విషయాలను తమ గ్రామాలు,కాలనీలు, స్నేహితులు,కుటుంబ సభ్యులకు,సహచరులకు తెలియజేసే దూతలుగా మారాలని సూచించారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించేలా చైతన్యవంతం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.మద్యం సేవించి వాహనాలు నడపకూడదని,హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు.మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరిస్తూ,వారి భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని,రోడ్డుపై నడిచే వారిని గమనిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.కనీస జాగ్రత్తలు పాటిస్తే రోడ్డుప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరి సహకారంతో రామగుండం కమిషనరేట్‌ను ప్రమాదరహిత ప్రాంతంగా మార్చాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,జైపూర్ సీఐ నవీన్,చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్,చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ,జైపూర్ ఎస్సై రాజశేఖర్,శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్,భీమారం ఎస్సై రాజేందర్ పోలీస్ అధికారులు,సిబ్బంది,ప్రజలు యువత పాల్గొన్నారు.

ఓదెలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

ఓదెల మోడల్ స్కూల్ రోడ్డు భద్రతా అవగాహన : ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి

ఓదెల మోడల్ స్కూల్, మోడల్ జూనియర్ కాలేజీల్లో పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనం నడపడం చట్ట విరుద్ధమే కాకుండా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ము స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని, మైనర్లు వాహనాలు నడపరాదని, సరైన డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారే వాహనాలు నడపాలని తెలిపారు. రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి చర్యలు ప్రాణాలకే ముప్పు తెస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేయించగా, నోటీస్ బోర్డుల్లో రోడ్ సేఫ్టీ పోస్టర్లు అతికించారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలో రోడ్డు భద్రతపై పోస్టర్లు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version