రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన: నిదానంగా ప్రయాణించండి
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం ప్రమాదాలకు కారణమని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాహనాలు నడపాలని, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, నిదానంగా ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
వాహనం నడిపేటప్పుడు సిగ్నల్‌ను అతిక్రమించవొద్దన్నారు. రోడ్డుపై పార్కింగ్ చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెల్‌ఫోన్ మా ట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలు, లైసెన్సులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డైవర్లు పాల్గొన్నారు.
