రోడ్డు నిబంధనలు పాటించండి: సీఐ సదాకర్

*రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలి: జగిత్యాల రూరల్ సిఐ సాధాకర్

రాయికల్ ఏప్రిల్ 15. నేటి ధాత్రి:

 

తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్-అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లిపూర్ లో బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *జగిత్యాల రూరల్ సీఐ సదాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుండే ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ‘అతి వేగం ప్రమాదకరం’ అని గుర్తిస్తూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ఉండాలని తెలిపారు.
**మండల విద్యాధికారి ఎం ఈ ఓ. రాఘవులు మాట్లాడుతూ.. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు, ఇరుగుపొరుగు వారికి వివరించి సామాజిక బాధ్యతను చాటాలని పిలుపునిచ్చారు.
*పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్ * మాట్లాడుతూ.. విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు సామాజిక స్పృహ కల్పించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం చేసినందుకు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో రాయికల్ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ రావు, గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి -వెంకటేష్, ఉప సర్పంచ్ వినయ్, గ్రామ వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version