ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరుకోవడమే… అరైవ్… అలైన్ ప్రధాన ఉద్దేశం… సిఐ సత్యనారాయణ
కేసముద్రం/ నేటి ధాత్రి
రైతు వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అరైవ్, అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, వైస్ చైర్ పర్సన్ అల్లం రామ నాగేశ్వర్ రావు.జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ఉదేశీస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ,
ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవడమే ‘అరైవ్ అలైవ్’ ప్రధాన ఉద్దేశం”. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి క్షేమంగా తిరిగి రావడం ముఖ్యం అని అన్నారు.
అతివేగం, మొబైల్ వాడకం, తాగి వాహనం నడపడం ( డ్రంక్ అండ్ డ్రైవ్) వంటి పనులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మునిసిపాలిటీ ప్రజలందరూ మన ప్రాణాలకు సంబంధించిన బాధ్యత హెల్మెట్, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి అని అన్నారు.
మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి అని పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒకరిది బాధ్యత అని అన్నారు.
వేగం కన్నా ప్రాణం ముఖ్యం…అనే సందేశాన్ని అందరికీ తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ టీ.శ్రీనివాస్ స్థానిక ఎస్సై.నరేష్, వార్డ్ కౌన్సిలర్స్ వీరష్ యాదవ్, కిషోర్, వేముల భారతి, ఉమా, కనుకుల సుభద్ర, విజయ, శరత్ యాదవ్, రాము, కృష్ణ, అరుణ, శారద,అధికారులు, వార్డ్ ఆఫీసర్, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.
వాహనదారులు, ప్రజల భద్రతకు అరైవ్.. అలైవ్ కార్యక్రమాలు అమలు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
పోలీస్ శాఖ ఆద్వర్యంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ లో అరైవ్.. అలైవ్ కార్యక్రమం
గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు
భద్రత ప్రతిజ్ఞ, బ్లాక్ స్పాట్స్, ప్రమాదకర రోడ్ల గుర్తింపు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు భద్రంగా.. సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆద్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ నుంచి వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు పోలీసుల ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో సోమవారం అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు.
ముందుగా అరైవ్.. అలైవ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి వీడియో సందేశం వినిపించారు. రోడ్డు ప్రమాదాలతో ఓ కుటుంబం పడుతున్న ఇబ్బందుల ఆధారంగా రూపొందించిన సందేశం వీడియో ఆలోచింపజేసింది. గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి.. గ్రామస్తులతో అరైవ్.. అలైవ్ పై ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక*లో భాగంగా పోలీస్ శాఖ ఆద్వర్యంలో *అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి సందేశం ప్రకారం యుద్ధాలు, వ్యాధుల ఇతర కారణాలతో ఎక్కువ మరణాలు జరగడం లేదని, రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మేజర్లకే జాగ్రత్తలు చెపుతూ వాహనాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, భవ్యిషత్ ప్రణాళికలు రచించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పారిశుధ్య పనులు, రెసిడెన్షియల్ విద్యార్థులు, ప్రజలకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించామని, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, ప్రతి వాహనదారుడు ఇంటి నుంచి వెళ్లింది మొదలు ఇంటికి వచ్చే వరకూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పిలుపు నిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని వివరించారు. సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటివల డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభించామని తెలిపారు. యువత, విద్యార్థులు ఆటలు ఆడాలని.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే సీఎం కప్ పేరిట 40 విభాగాల్లో పోటీలు నిర్వహించామని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 300 కోట్ల జీరో టికెట్లపై ప్రయాణం చేసి.. రూ. 10వేల కోట్లు ఆదా చేశారని తెలిపారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రూ. 2 లక్షల లోపు రుణ మాఫీ చేశామని గుర్తు చేశారు. ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, వేములవాడ నియోజకవర్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో భాగంగా వివిధ నీటి పారుదల ప్రాజెక్ట్ ల పనులు కొనసాగుతున్నాయని, మల్కపేట ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేశామని తెలిపారు. నూతన రేషన్ కార్డులు ఇస్తున్నామని, నూతన కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అవుతున్నాయని వెల్లడించారు. రేషన్ కార్డ్ లు ఉన్న అందరికీ సన్న బియ్యం ఇస్తున్నామని, రాష్ట్రంలో 86 శాతం మందికి పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొదటి స్థానం.. రాష్ట్రంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదని.. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక ప్రణాళిక.. ఆచరణ కార్యక్రమాలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన జాబితాలో జిల్లా మొదటి స్థానంలో ఉందని కొనియాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ గ్రామంలో 44 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, లబ్ధిదారులకు రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇస్తున్నామని వెల్లడించారు. త్వరలో ఇందిరా ఆత్మీయ భరోసా.. బీమా పథకం అమలు చేయనున్నామని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమానికి చట్టం తీసుకువచ్చామని, త్వరలో కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు.వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు.
టీబీ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లాకు వచ్చిన మొబైల్ ఎక్స్ రే యంత్రం ప్రారంభించామని, నిర్దేశిత గ్రామాల్లో పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో గత ఏడాది 4,80,000 ప్రమాదాలు జరిగాయని, దానిలో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రతి డ్రైవర్ రోజు వాహన భద్రత ప్రతిజ్ఞ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని సూచించారు. తమ కుటుంబ, పిల్లల బాద్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వెళ్లాలని పేర్కొన్నారు. అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా రోడ్డు సేఫ్టీ కమిటి మీటింగ్ ఆర్అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా, ఆర్టీసీ అధికారులతో సమావేశం పెడుతున్నామని, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నివారణ చర్యలు, సైన్ బోర్డ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వాహనం ఎక్కినప్పటి నుంచి కింద దిగే వరకూ సెల్ ఫోన్ వినియోగించవద్దని వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య సహాయం అందించే వారికి ప్రభుత్వం రహవీర్ కింద రూ. 25 వేల సహాయాన్ని అందిస్తుందని, రోడ్డు ప్రమాద బాదితులను ఆసుపత్రిలో వైద్యం పొందే సదుపాయం ఉందని వెల్లడించారు. స్కూల్ ఆటోలు, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని వెల్లడించారు. నో హెల్మెట్.. నో ఎంట్రీ కార్యక్రమాన్ని గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు అందరి రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు తమ తండ్రికి హెల్మెట్ ఉపయోగం చెప్పాలని పేర్కొన్నారు.
రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ.. రోడ్ సేఫ్టీ.. లైఫ్ సేఫ్టీ అని ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తోనే అవుతున్నాయని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. వాకథన్, డ్రైవర్లకు కంటి పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఈ వారంలో పోలీస్ శాఖ తరఫున వివిధ కార్యక్రమాలు చేస్తామని వివరించారు. గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఎక్కడైనా రోడ్లపై ఇబ్బందులు, గుంతలు, వీధి దీపాల సమస్య, రోడ్డు వెంట బావులపై నివేదిక పంపాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సైకిల్ నడిపే పిల్లలు దానికి వాడే హెల్మెట్ వినియోగించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపవద్దని ఒకవేళ నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అసలు ప్రమాదాలే జరవద్దని ఆకాంక్షించారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్ చేయవద్దని సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ ఛైర్మన్ తాళ్ళపల్లి ప్రభాకర్, గ్రామ సర్పంచ్ శ్రీహరి, సర్పంచులు ఫోరం మండలాద్యక్షుడు బోయిని దేవరాజ్, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.