సర్కారీ బడి పిల్లలు సత్తా కలిగిన పిడుగులు.

సర్కారీ బడి పిల్లలు సత్తా కలిగిన పిడుగులు…

సువిశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన…

ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ…

ఇంగ్లీష్ మీడియంలో బోధన…

పుష్టికరమైన మధ్యాహ్న భోజనం…

డిజిటల్ క్లాసు రూములు…

ఉచిత యూనిఫాం అందజేత

నేటి ధాత్రి గార్ల:

ప్రైవేటు పాఠశాలల్లో లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజ్ఞపాటవ పోటీలకు ఒత్తిడి లేని శిక్షణ ప్రభుత్వ బడులల్లో ఇస్తున్నట్లు ఎంపీడీవో మంగమ్మ, ఎంఈఓ వీరభద్రరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్ద కిష్టాపురం పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో అంగరంగ వైభవంగా పునః ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ,బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలని కోరారు.సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేకుండా విద్యార్థి కేంద్రీకృత విధానంలో మెరుగైన విద్యాబోధన నేర్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా వారి తల్లిదండ్రులకు ప్రోత్సహించాలని సూచించారు.నేడు విద్యారంగం వ్యాపార వస్తువుగా మారిందని, కొనుక్కునే వాడికే విద్య అందుబాటులోకి వచ్చిన ఫలితంగా పేద,మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారని వారు అన్నారు. ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ప్రాథమిక పాఠశాల పెద్దకిష్టాపురం లో సు విశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు మరియు స్పోర్ట్స్ డ్రస్సులు అందజేయడమే కాకుండా ఉచిత పాఠ్య పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.సర్కారు బడిలో సన్నబియ్యంతో కూడిన రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం మరియు రాగి జావా వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ మీడియం లో బోధిస్తూ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం ద్వారా ప్రగతిని అంచన వేస్తూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూన్నట్లు తెలిపారు. గ్రామంలోని బడియిడు పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ తద్వారా సమగ్ర గ్రామాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగుగులోత్ వీరభద్రం, బానోత్ చంద్రమోహన్, టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాలోత్ శివ నాయక్,గంగావత్ రాంసింగ్ నాయక్,ఉపాధ్యాయులు బి. రామ, నాగేశ్వరావు,వేణుకుమార్, రాంబాబు,రాజ్ కుమార్, స్వాతి, మాలోత్ సురేష్, గంగావత్ సంత్ర, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి.

అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి.

 

నాగర్ కర్నూల్  నేటి ధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగర్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా నేను కృషి చేస్తానని తెలిపారు. అలాగే నిరుపేదలు ఎవరు ఉన్నా సరే వారు ఏ పార్టీలో కొనసాగుతున్న వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎవరు అధైర్య పడకూడదు అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.

 

 

 

 

Whether you choose to walk or run, you are a child.
Whether you choose to walk or run, you are a child.

ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున
ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.

ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.

రైతుల పండుగ ఎరువక.

ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.

కార్పొరేట్ బడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.

కార్పొరేట్ బడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. (అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రయివేటు యాజమాన్యాలు)…

◆ టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం

*జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేయకుండా ఈ నెల 12 నుండి బడి బాట కార్యక్రమం చేపట్టడంలో అర్థమేం ఉన్నది ప్రయివేటు పాఠశాలల్లో నర్సరీ,ఎల్.కే.జి, యూ.కె.జి,3 సంవత్సరాలు చదివిన పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఎలా చేరతారు, గతంలో మన ఊరు మన బడి పేరుతో ప్రతి పాఠశాలలో సౌకర్యాలు పెంచాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ అది పూర్తి కాకుండానే అసంపూర్తిగానే మిగిలింది,ఇప్పటికే ప్రభుత్వం విద్యను పేదలకు దూరం చేస్తు ప్రయివేటు పాఠశాలల అభివృద్ధికి పరోక్షంగా కృషి చేస్తున్నట్లు అందరికి కనబడుతున్నది,ప్రభుత్వ బడుల్లో నైపుణ్యం గల టీచర్లు ఉన్నారు,ప్రయివేటు బడుల్లో నైపుణ్యం లేని టీచర్లతో బోధన చేస్తున్న ప్రయివేటు బడులపై ఎందుకు మొగ్గు చూపుతున్నారు.

ప్రయివేటు యాజమాన్యం టీచర్లకు తక్కువ జీతాలు చెల్లించి వారితో వెట్టి చేయిస్తారు వారికి విద్యార్థులను కొత్తగా చేర్పించాలని టార్గెట్ లు పెట్టి వేదిస్తారు లేనిచో విధుల నుండి తొలగిస్తామని బెదిరిస్తారు,విద్యార్థుల ఫీజులను కూడా ఒక్కో పాఠశాలలో ఒక్కోరకంగా వారి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు విద్యార్థుల దశల వారిగా చెల్లించాల్సిన ఫీజులు సమయానికి చెల్లించనిచో వారిని మానసికంగా వేధిస్తూ పై తరగతుల విద్యార్థులను నర్సరీ,ఎల్.కె.జి,యూ.కె.జి,తరగతులలో కూర్చోబెట్టి వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.

ఈ విదంగా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం బరితెగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అధిక ఫీజులతో అవస్థలకు గురిచేస్తున్న దీనిపై ప్రభుత్వం కాని అధికారులు కాని ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ప్రభుత్వం ప్రయివేటు పాఠశాలలను నియంత్రిచి ప్రభుత్వ అజమాషీలో నడిచే విదంగా చర్యలు చేపట్టాలి ప్రతి తరగతికి ఒక నిర్ణిత ఫీజును ప్రభుత్వంమే నిర్ణయించాలి,అన్ని ఫీజులను ఒకే అకౌంట్లో జమ చేసే విదంగా మరియు అన్ని ఫిజులను ఒకే రశీదుపై ఇచ్చే విదంగా మరియు టీచర్ల విధ్యార్హతలు వారికి ఇచ్చే జీతాలను ప్రభుత్వం నమోదు చేసుకోవాలి బహిరంగ పరిచి ప్రయివేటు పాఠశాలలను కట్టడి చేయాలని డిమాండ్

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి..

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి.

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాఅధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరానికి గాను (ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి) అంటూ

 

quality education

ఇంటర్మీడియట్ అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేష ను) సిరిసిల్ల ..కళాశాల అధ్యాపకులు స్థానిక వెంకంపేట ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రభుత్వం కల్పించే వసతులను పొందాలని వారు తెలిపారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు ఉచిత పుస్తకాలు, నాణ్యమైన విద్య, ఎంసెట్ తదితర విషయాలలో నైపుణ్యాలు అందించడమే కాకుండా ఇంటర్మీడియట్ అనంతరం ఇంజనీరింగ్ విద్యలో ఉచిత విద్యను పొందవచ్చు అని వారు తెలిపారు. ఈ అడ్మిషన్ డ్రైవ్ లో ప్రిన్సిపాల్ శ్రీ విజయ రఘునందన్,అధ్యాపకులు సామల వివేకానంద ,ఆంజనేయులు ,శ్రీనివాస్ ,
చంద్రశేఖర్ ,రాజశేఖర్ పాల్గొన్నారు.

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

సీఎం రేవంత్ రెడ్డికి నర్సంపేట డిపో జేఏసీ విజ్ఞప్తి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జూన్ 5 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగు మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణు సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావాలని 40 వేల మంది యావత్ ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సహా విశేష కృషి చేశామని, గెలుపులో భాగస్వామ్యం అయ్యామని వారు గుర్తు చేశారు.

ఆర్టీసీ ప్రభుత్వ విలీనం అయితే తమ జీవితంలో అద్భుతం జరుగుతుందని కార్మికులు ప్రతి రోజు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం అయినటువంటి ప్రభుత్వ విలీనం అడుగు దూరంలో ఆగిందని, దాన్ని కేబినెట్ సమావేశంలో “విలీనం అమలు తేదీ” ని సగర్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలని వారు కోరారు.

CM Revanth Reddy.

 

 

 

మహిళా ప్రయాణీకుల కోసం ఉచిత మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి, ప్రభుత్వానికి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు.

పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని, ప్రతి నెల మహాలక్ష్మి డబ్బులతోనే ట్రెజరరీ నుండి జీతాలు సులభంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం చెల్లించవచ్చని వారు అన్నారు.

విలీనంతో పాటు రెండు పీఆర్సీలు 2021 మరియు 2025 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులందరం జీవితాంతం ఋణపడి ఉంటామని రంగయ్య, వేణు తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం చేసే మిల్లులపై కఠిన చర్యలు

పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్న రైస్ మిల్లులు సగానికి పైగా డిఫాల్ట్ అయి ఉండటం ధాన్యం సేకరణకు ప్రధాన సమస్యగా మారిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్ అన్నారుమంగళవారం ఉదయం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐ.డి. ఒ సి. సమావేశ మందిరంలో వరి కొనుగోలు పై వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు, మిల్లర్లు ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నాగర్ కర్నూల్ వనపర్తి అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్య నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో వస్తుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం వనపర్తి జిల్లాలో 184 రైస్ మిల్లులు ఉండగా సగానికి పైగా డిఫాల్ట్ అయి ధాన్యం తీసుకోవడంలో దూరంగా ఉండటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారున్నాగర్ కర్నూల్ జిల్లాలో సైతం సగానికి పైగా మిల్లులు డిఫాల్ట్ అయ్యాయన్నారువనపర్తి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అయితే మిల్లింగ్ చేయడానికి మిల్లులు లేకపోతే
బియ్యం ఎవరు చేస్తారని మిల్లర్ల ను ప్రశ్నించారు తాత్కాలికంగా గోదాముల్లో నిల్వ చేసినప్పటికీ అంతిమంగా తిరిగి మిల్లులకు చేయాల్సిందేనని
స్పష్టం చేశారు.ప్రభుత్వం నుండి వడ్లు తీసుకోకుండా గట్టిగా ప్రైవేట్ వడ్లు తీసుకొని మిల్లింగ్ చేస్తున్న డిఫాల్ట్ మిల్లుల పై చర్యలు కఠినంగా ఉంటాయని మిల్లర్లను హెచ్చరించారు.
మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు మిల్లుకు రాకపోవడం వల్ల క్వింటాలుకు 67 కిలోలు రావాల్సిన బియ్యం 62 కిలోలు మాత్రమే వస్తుందని, తద్వారా మిల్లరు నష్టపోతున్నారని ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తెచ్చారు సమీక్షలు పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా రైతులు వరి పండిం చారని అన్నారు.జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ అమరేందర్, వనపర్తి సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం లు, జిల్లా అధికారులు, మిల్లర్లు, ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ.

ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

నిజాంపేట నేటి ధాత్రి:

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పలు పార్టీల కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తాహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీనివాసులు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజీరెడ్డి, పార్టీ కార్యాలయాల్లో కాంగ్రేస్ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మవురం రాజు, గ్రామాలలో నూతన గ్రామ అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 11 వసంతాలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నస్కల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మద్దికుంట శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొమ్మాట బాబు, దేశెట్టి సిద్ధ రాములు, గుమ్ముల అజయ్, శ్రీనివాస్,లక్ష్మా గౌడ్ ,బక్కనగారి లింగం గౌడ్, దేవరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలo.

ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలo

ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇ పరిస్థితి

ధాన్యం కటింగ్ లపై ఎమ్మెల్యే మాట్లాడాలి

వేరే జిల్లాలకు ధాన్యం సరఫరా చేయాలి

గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో ధాన్యం సేకరణ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గణపురం మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు గణపురం మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఇ పరిస్థితి ఏర్పడిందని, ప్రతిసారి వేరే జిల్లాలకు ధాన్యం సరఫరా చేసేవారని, ఇసారి మాత్రం అలా జరగలేదని, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్, పి పి సి ఇంచార్జి లకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని అన్నారు, గత ప్రభుత్వంలో కటింగ్ లపై మాట్లాడిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు చెప్పాలని, కటింగ్ లపై స్పందించాలని పూర్ణచంద్రారెడ్డి అన్నారు
వెంటనే ప్రభుత్వ గోదాములు తీసుకొని ధాన్యం నిలువ చెయ్యాలని,
ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే , జిల్లా మంత్రి చొరవ తీసుకొని ధాన్యం సరఫరా వేగవంతం చేయాలని, ప్రభుత్వం మాటలు చెప్పకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు

ప్రభుత్వ పథకాలపై మంత్రుల సమీక్ష.

ప్రభుత్వ పథకాలపై మంత్రుల సమీక్ష

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధ్యక్షతన మహబూబ్ నగర్ మరియు నారాయణపేట జిల్లాల అధికారులతో వ్యవసాయ కార్యాచరణ వడ్ల కొనుగోలు, సీజనల్ అంటు వ్యాధులు, భూభారతి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై గౌరవనీయులు జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, శ్రీ దామోదర్ రాజనర్సింహ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంత్రులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన ఇంచార్జీ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.

 

MLA Yennam Srinivas Reddy

 

ఈ కార్యక్రమంలో నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి, డాక్టర్ పర్ణికా రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు అధికారులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు కలెక్టర్ మోహన్ రావు , మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి.

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

కేసముద్రం మండలంలోని పలు విత్తన దుకాణాలను కేసముద్రం మండల టాస్క్ఫోర్స్ టీం మండల వ్యవసాయ అధికారి కేసముద్రం మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసముద్రం వారు తనిఖీ చేయడం జరిగింది, పలు దుకాణంలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీ విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లు,బిల్ బుక్కులు,ఇన్వైసులు లైసెన్సులు, స్టార్ బోర్డు, గోదామును తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ

 

House Officer Muralidhar Raj

 

డీలర్లు విత్తన చట్టం 1966 ప్రకారం వారి యొక్క క్రయవిక్రయాలు జరుపుకోవాలని, ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలని, ప్రభుత్వం అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని వారు సూచించారు, రైతులకు కనిపించే విధంగా, లైసెన్సులు,స్టాక్ బోర్డు, మైంటైన్ చేయాలని వారు, సూచించారు, ఎవరైనా డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే, విత్తన చట్టం 1966 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ మురళీధర్ రాజ్ మండల వ్యవసాధికారి బి వెంకన్న, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన.!

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్

నేటిధాత్రి ఐనవోలు :-

 

 

 

ఐనవోలులోని ప్రభుత్వ యునాని వైద్యశాల నీ సందర్శించిన రిజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ (RDD) డాక్టర్. ప్రమీల దేవి సందర్శించారు. జూన్ 21 న జరిగే
అంతర్జాతీయ యోగ దినోత్సవ
దశబ్ది వేడుకలు – 2025 దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 రోజుల పాటు నిర్వహించేలా యోగ దశబ్ది వేడుకల ప్రణాళికను రూపొందినట్లు ఐనవోలు యునాని ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.ఈ మేరకు ఆరోగ్య మందిరాలు, వైద్య సబ్బంది, అంగన్వాడీ టీచర్లు,పిల్లలు,పెద్దలు,
గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘ యోగ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ ‘అనే నినాదంతో యోగ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్, ఫార్మాసిస్ట్ శంకర్, యోగ శిక్షకులు అర్చన, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిద్దాం బంగారు భవిష్యత్తును.!

పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిద్దాం బంగారు భవిష్యత్తును కల్పిద్దాం

టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు పిలుపు

నమోదు కొరకు ప్రచార జాతా ప్రారంభం

చర్ల నేటిధాత్రి:

 

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు పిలుపునిచ్చారు.

గురువారం తేది 29మే 2025 నాడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యుటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాతాను స్థానిక అంబెడ్కర్ సెంటర్ భద్రాచలం నందు జెండా ఊపి సీనియర్ నాయకులు పి లక్ష్మి నారాయణ ప్రారంభించారు.
జాతాను ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని విశాలమైన తరగతి గదులు ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేశారు.

విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే
కొఠారి కమిషన్ చెప్పినట్లు దేశ జీడీపీలో ఆరు శాతం రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం విద్య కు కేటాయించాలి కానీ దేశ బడ్జెట్లో 2.9 శాతం రాష్ట్ర బడ్జెట్లో 7.5 శాతం మాత్రమే కేటాయింపులు జరుగుతున్నది.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు వర్క్ బుక్కులు ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని నాణ్యమైన మధ్యాహ్న భోజనం వారానికి మూడు సార్లు కోడిగుడ్లు రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను.

ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలియజేశారు గుడి మసీదు చర్చిల నిర్మాణం కోసం ఐకమత్యంగా కదిలే ప్రజలు ఊరి బడి కోసం కూడా ఏకమై బడిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు.
గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని టీఎస్ యుటిఎఫ్ శ్రేణులు ఈరోజు నుండి జూన్ 5 వరకు ప్రచారం నిర్వహిస్తాయని తెలియజేశారు.
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు తల్లిదండ్రుల ఆశను ప్రైవేటు విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని
చదువుల నాణ్యతలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అని మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌళిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు.
ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం.

సన్నాహాలు చేస్తోందని ఏఐ ఆధారిత బోధన డిజిటల్ తరగతి గదులు లైబ్రరీ లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందని పిల్లల మానసిక ఆరోగ్యానికి వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలియజేశారు పిల్లలకు నాణ్యమైన విద్య.

ఉచితంగా అందుతుంది తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుంది కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని బి రాజు పిలుపునిచ్చారు చర్ల మండలంలో దేవరపల్లి.
కుదునూరు ఆర్ కొత్తగూడెం సత్యనారాయణపురం తేగడ చర్ల పట్టణం ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార జాతాలో సంఘం జిల్లా అధ్యక్షులు బి మురళీమోహన్ ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర.

జాయింట్ సెక్రటరీ ఎన్ కృష్ణ జిల్లా కార్యదర్శులు డి తావుర్య ఎస్ విజయ కుమార్ వెంకటేశ్వర్లు చర్ల మండల అధ్యక్షులు కాక రాంబాబు సకినం బాలకృష్ణ రాధ జలంధర్ సీనియర్ నాయకులు పి నరసింహరావు గోపాలరాజు హిమగిరి రవికిషోర్ శ్రీలక్ష్మి వర్షిణి  పాల్గొన్నారు.

బండిల దొడ్డి లాగా మారుతున్న ప్రభుత్వ బడులు.

బండిల దొడ్డి లాగా మారుతున్న ప్రభుత్వ బడులు , కనీసం పాఠశాలలు ప్రారంభమయ్యే వరకైనా కనీస మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్……….

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిటిఎల్ రవి

మంగపేట నేటి ధాత్రి:

 

ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభం అయ్యేవరకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ మండపేట మండల కమిటీ మంగపేట తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ ఏసుపాదం కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి, ఎల్. రవి మాట్లాడుతూ. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.. కనీసం పాఠశాల ప్రారంభం అయ్యేవరకు మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే వర్షాలు ప్రారంభమై పాఠశాల ఆవరణ లో గదులలో ప్లడ్డు చేరి విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ఆవరణలో పాఠశాలలను పరిశుభ్రం చేసి మరుగుదొడ్లు నిర్మించి , కరెంటు, త్రాగు నీరు, ఉచిత టెక్స్ట్ ,బుక్స్ నోట్, యూనిఫార్మ్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను పరిశుభ్రంగా ఉంచాలి ,అలాగే పాఠశాలలో పరిశుభ్రం లేకపోవడం, టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం వలన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేరే పరిస్థితి చేయి దాటిపోయిందని ఇలాగే జరిగితే ముందు ముందు ప్రభుత్వ పాఠశాలలో కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని వెంటనే బాత్రూంలు ,మరుగుదొడ్లు అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని వారన్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇసుక ర్యాంపు లు ఎక్కువ ఉండటం వలన లారీలు విపరీతంగా రావడం వల్ల ఆక్సిడెంట్లు బాగా అవుతున్నాయి జూన్ 12న నుంచి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి 5 గంటల వరకు లారీలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల విద్యార్థులంతా ఏకమై భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.. అదేవిధంగా మంగపేట మండలంలో ఉన్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులనువారి వారి మాతృ పాఠశాలలోనే ఉంచాలని కానీ ఎటువంటి డిప్యూటీషన్లో ఇతర పాఠశాలకు అధికారులు పంపించకూడదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లంజపల్లి సిద్దు, కాట ముకుందం, తోకల మురళి తదితరులు పాల్గొన్నారు

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు.!

గుట్ట పై షెడ్డును కూల్చారు…మరి ఆశ్రమ కబ్జా కట్టడం పై చర్యలేవి..??

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు??

రెవెన్యూ అధికారుల కబ్జా నివేదిక పైన చర్యలేవి??

అధికారుల అత్యుత్సాహం కేవలం గుట్ట పైనేనా??

ఆశ్రమ భూ కబ్జా లో ముడుపులేమైన ముట్టాయా అని ప్రజల మాట ముచ్చట…

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:

ఎల్లారెడ్డిపేట మండలం లో రెండు వేరు వేరు ప్రదేశాలలో భూకబ్జా సమస్య. వెంకటాపూర్ గ్రామంలో ఒక ఆశ్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేశారని ఆ విషయంలో రెవెన్యూ అధికారులు నివేదిక ఉన్నతాధికారులకు పంపిన , హై కోర్ట్ సంగెం బాలయ్య భూమి కబ్జా గురి అయిందని అక్కడ ఉన్న అక్రమ కట్టడం కూల్చి వేయాలని ఆర్డర్ ఉన్న కూడా అధికారులు మౌనం వహిస్తున్నారు.ఆ మౌనానికి ముడుపులేమైన ముట్టాయా అని మండల ప్రజలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ నెల 14,15 వ తేదీలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని సింగారం గ్రామం లో కుల,మతాలకు అతీతంగా దర్శావళి గుట్ట పైన ప్రతి సంవత్సరం లాగే గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న దర్గా లకు ఉర్సు పండుగ అంగరంగ వైభవంగా జరిపారు.ఈ క్రమంలో విశిష్ట అతిధుల ఆహ్వానం ఉండడం వలన అక్కడ ఉన్న గుట్టను చదును చేసి షెడ్ ని నిర్మాణం చేశారు. అది ప్రభుత్వ భూమిలో ఉందని కొద్దిరోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఒక పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

poor farmers

ప్రభుత్వ భూమిలో షెడ్ నిర్మాణం జరిగింది అని మే 27 న ఉదయం అధికారులు, పోలీసుల సమక్షంలో జెసిబి తో ఆ నిర్మాణాన్ని కూల్చారు.ఈ రెండు సమస్యలో కబ్జా అనేది కనిపిస్తున్న అధికారులకు,ఆ పార్టీ నాయకులకు కేవలం దర్శావళి గుట్ట ను రాజకీయం చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ భూమి, పేద రైతు భూమి కబ్జాకు గురై అధికారుల నివేదిక,హై కోర్ట్ ఆర్డర్ లు ఉన్న కూడా పట్టించుకొని అధికారులకు దర్శావళి గుట్ట పైన షెడ్ నిర్మాణం కబ్జా భూమి లో జరిగిందని అధికారుల అత్యుత్సాహాన్ని చూస్తే ఓ మౌజయ ఆశ్రమానికి సంబంధించి ముడుపులు ఏమైనా ముట్టాయ అని ప్రజలు నుండి సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. అధికారుల తీరు ప్రజల సందేహాలకు తగ్గట్టుగానే ఉండడం, ఒక పార్టీ నాయకులు కుల,మతాధిపత్యం పరంగా ఫిర్యాదులు చేస్తూ మతాల మధ్య చిచ్చులు రేపే విధంగా గొడవలు సృష్టించాలని రాజకీయం చేస్తున్నారని సింగారం గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలోనే
నాణ్యమైన విద్య

నిజాంపేట నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో సోమవారం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాల ఆవశ్యకతను విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. విద్యతో పాటు పౌష్టికాహారం కూడా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, దశరథం లు ఉన్నారు.

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం.

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం..

ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్.

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బహిరంగ సభలో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్స్ సవరణ బిల్లు ఎక్కువ రోజులు నిలువదని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, కర్ణాటక రాష్ట్ర మంత్రి మహమ్మద్ రహీం ఖాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ అన్నారు. వర్ఫ్ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు.వర్షంలోనే అతిధులు అదరకుండా బెదరకుండా సమావేశంలో మాట్లాడడం పట్ల ప్రజలు కుర్చీలను తమ నెత్తిపై పెట్టుకుని సభలో పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన అనంతరం కొన్ని వర్గాలపై రోజుకోరకమైన చట్టాలు నియమాలు నిబంధనలు తీసుకువచ్చి అణగదొక్కెందుకు కృషి చేస్తుందన్నారు. రబ్బర్ బాలు గోడకు కొడితే ఆ బాలు తిరిగి అదే వేగంగా వస్తుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని అన్నారు.

వక్స్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఉదయం 3 గంటల వరకు పార్లమెంటులో ఉండి ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు.త్వరలోనే కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తుంది ఈ విధమైన బిల్లులన్నీ చెల్లకుండా పోతాయన్నారు. లౌకికత్వాన్ని పూర్తిస్థాయిలో పాటించేది అన్ని వర్గాలకు సమాన ప్రతిపాదికన గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ ముయ్యద్దీన్,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు తైవుల్లా, లతోపాటు మాజీ టి ఎస్ ఐ డి సి చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షులు మొహమ్మద్ అత్తర్ అహ్మద్,అశోక్ అప్పారావు, తాసిల్దార్ దశరథ్, మత పెద్దలు పుర ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వర్షంలోనే కొనసాగిన సదస్సు

జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేక నిరసన సదస్సు వర్షంలోనే కొనసాగింది. వక్తలు వర్షంలో తడుచుకుంటూ ప్రసంగాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సవరణ బిల్లు కంటే ఈ వర్షం కఠినమైంది కాదని ఇలాంటి వర్షాలను తాము ఇలాంటి ఎన్నో కష్టాలు సహిస్తామని వక్తలు ప్రకటించారు.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

-చదువు అన్నారెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి

 

కాలేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కుట్రలకు తెరలేపిందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశాడని, రైతుల సాగునీటి ఘోష తీర్చేందుకు భగీరథుడిలా కంకణం కట్టుకున్నారన్నారు. తెలంగాణను ధాన్యకారంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. కేసీఆర్ తెలంగాణకు ఏం అన్యాయం చేశాడని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. వీటిని ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు నోటీసులుగానే పరిగణిస్తామని తెలిపారు. విచారణ పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే..తెలంగాణ మరోసారి మర్ల పడుతుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా..ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను ఇబ్బందులు పెడితే..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

ఫలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయత్నం.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే మాధవరెడ్డి వినతి..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందనతో..వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన సివిల్ సప్లై కమిషనర్..

6350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జీఓ జారీ..

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు.

రైతుల అభివృద్దే నా లక్ష్యం.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

అకాల వర్షాలతో నోటికాడికచ్చిన పంటలు నీటిపాలయ్యాయి.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద,వ్యయసాయ మార్కెట్ వద్ద, వరి కళ్ళాల వద్ద రైతులు ఆరబోసిన,అమ్మకాలకు సిద్ధంగా ఉంచిన వరిదాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయ్యాయి.రైతుల కష్టాలను చూసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెంటనే స్పందించారు.రాష్ట్ర మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదారాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని, తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయాలని ఈ నెల 22 న వినతిపత్రం సమర్పించి వేడుకొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభ్యర్థన మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కాగా రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు.నిజామాబాద్ జిల్లాకు 7500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఉత్తర్వులు ఇవ్వగా వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల తడిసిన వరిధాన్యాన్ని బాయిల్డ్ వరిధాన్యంగా పరిగణించి వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన కాఫీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో వాటిని చూసిన రైతులు,సమాచారం పలువురు నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

రైతుల అభివృద్దే నా లక్ష్యం…. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

Narsampet MLA Donthi Madhav Reddy..

 

నర్సంపేట నియోజవర్గంలో రైతుల అభివృద్దే లక్ష్యంగా కృషిచేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.యాసంగి సాగులో అనుకూల పంటలు పండించిన రైతులను వరిధాన్యం అమ్మకాల సమయంలో రైతులకు మేలు జరిగినప్పటికీ కొందరి రైతులకు అకాల వర్షాలతో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నది ఎమ్మెల్యే పేర్కొన్నారు.గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నియోజకవర్గం పరిధిలోని సుమారు 4 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని తెలిపారు.రైతుల కన్నీళ్లను తుడ్చాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర మార్కెటింగ్ , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయాలని విన్నవించుకోగా సానుకూలంగా స్పందించి వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జీవో జారీచేయండం చేయడం నర్సంపేట ప్రాంత రైతులకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రత్యేక చొరవతో నియోజకవర్గ రైతులను ఆదుకున్నందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Farmer Varanganti Praveen Reddy..

 

 

రైతులను ఆపదలు ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను అమ్మకాలు చేపట్టే వద్ద అకాల వర్షాల తీవ్రనష్టం చేశాయని, ఈ నేపథ్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రభుత్వంతో కోట్లాడి
రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక జీ.ఓ తెప్పించారని నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు వరంగంటి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలకు నిల్వ ఉంచిన ధాన్యం గత ఐదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయని దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వాపోయారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయడానికి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ నుండి ఉత్తర్వులు జారీచేయడం రైతుల్లో ఆనందం వెళ్ళబుచ్చితోందని రైతు ప్రవీణ్ రెడ్డి తెలియజేశారు.

సకాలంలో రైతులకు అండగా ప్రభుత్వం ఉండడం అభినందనీయం..

Coffee issued by the government.

 

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్..

గత వారం రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలకు నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని రైతులు అరుగాలం పండించిన వారి ధాన్యం పట్ల నష్టపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణిస్తూ కొనుగోలు చేయాలని జీవో జారీ చేయడం అభినందనీయమని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గం పరిధిలో వరిధాన్యం రైతులకు నష్టం వాటిల్లుతుందనే పిర్యాదులు సమాచారం మేరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి ఈనెల 22న రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కలిసి ప్రత్యేక మెమోరండం అందించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దొంతి సూచనల మేరకు వెంటనే స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారని తెలిపారు. రైతుల కోసం ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రభుత్వంపై చేపట్టిన విజయంగా భావిస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

Palai Srinivas, Chairman of Narsampet Market

 

 

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని సి.పి.ఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముషాం రమేష్ మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం తీవ్రంగా తడిసి మొలకెత్తడం జరిగినది. అని తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. అన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యానికి మొత్తం కొనుగోలు చేయాలని సి.పి.ఎం పార్టీ డిమాండ్ చేస్తుంది
ప్రతి సీజన్లో పంట పండించిన రైతుకు మొత్తం పంట ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా పంటకు ఎప్పుడు ఏమైతదో అని భయం గుప్పిట్లో బతకవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
గతంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న రైతుల రైతుల బతుకులు ఎలాంటి మార్పు జరగడం లేదు.
బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల. జెండాలు వేరైనా మోసాలు ఒకటే. విధానాలు ఒకటే రైతే రాజు అని
రైతులను మోసం చేసి రైతుల ఓట్లతో అధికారం లోకి వస్తున్నాయి. రైతులు పండించిన పంటకు నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళిక చేయకపోవడంతోనే ప్రతి పంట సీజన్ లో వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.ఇప్పటికైనా రైతులకు నష్టాలు జరగకుండా పండిన పంటను వెంట వెంటనే కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు ఈ సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి,కోడం రమణ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version