ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం.

ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం
… సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం*

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాసిల్దార్ సునీత డి ఎం ఎం ఓ డి సి ఎస్ ఓ తో కలిసి ప్రారంభించారు ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

MLA Gandra Satyanarayana Rao.

రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఎమ్మెల్యే అన్నారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు.అనంతరం మండలంలోని సిఎం రిలీఫ్ ఫండ్ 63 మంది లబ్దిదారులకు రూ.17,63,500/చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఆసుపత్రిలో వైద్యము చేయించుకొని డబ్బు లేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి కాంగ్రెస ప్రభుత్వం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తుందని ఎమ్మెల్యే గారు అన్నారు.ఈ కార్యక్రమములో సొసైటీ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ సీనియర్ నాయకులు మోటే ధర్మారావు తక్కలపల్లి రాజు క్యాథరాజు రమేష్ నీరటి మహేందర్ మండల కాంగ్రెస్ నేతలు, అధికారులు రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు

సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ

ధనవంతులే కాదు… పేదలు సన్న బియ్యం తినాలి

ముదిగుంట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో ఉగాది కానుకగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి మాట్లాడుతూ ఇప్పటివరకు ధనవంతులు తినే సన్నబియ్యం ఇకపై ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తుంది.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,పోషక విలువలతో కూడిన సన్న బియ్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.అలాగే సన్న బియ్యం పథకం ప్రారంభించడం పేదలు అదృష్టంగా భావిస్తున్నారు.సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుందని సరైన గిట్టుబాటు ధరలు కూడా వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి పాండరి, మాజీ ఎంపీపీ గోదారి రమాదేవి లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు చేలుకల పోశం,గుండా సురేష్ గౌడ్, కొట్టాల మల్లయ్య పోతుగంటి సుమన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం.

కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం

దేవరకద్ర నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు స్ప్రింక్లర్లు, పైపులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. అనంతరం కొత్తకోటలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ

సమయానికి హాజరుకాని సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు

 

పాలకుర్తి నేటిధాత్రి

 

పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితిని నేరుగా పరిశీలించిన వారు అక్కడి నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో హాజరు కాని పరిస్థితిని గమనించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి డిఎం అండ్ హెచ్ ఓ కి ఫోన్ చేసి, డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే విధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరించటం సరికాదు. సమయానికి విధులకు హాజరు కావడం ప్రతి ఉద్యోగి బాధ్యత. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన ఔషధాల సరఫరా, శానిటేషన్ మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, మాతా-శిశు విభాగాన్ని కూడా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, పనితీరు పట్ల ప్రజల్లో దీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తికి ఈ ఆకస్మిక తనిఖీ ఓ సందేశంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం.

పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బిజెపి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఆరోపణలకు వాడుకున్నకాంగ్రెస్, బీఆర్ఎస్

చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసిన బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావించని భూపాలపల్లి ఎమ్మెల్యే

తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని
తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ అన్నారు.

శుక్రవారం గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బుధవారం నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి సమయం సరిపోతుందన్నారు.

రాష్ట్రంలో తాగు సాగు నీరందక రైతాంగం ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీశారని ఆమె అన్నారు.

రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యమైందని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కీర్తి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమైందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం తిరిగి కాంగ్రెస్ బిఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం జరిగిందే తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని అన్నారు.

చట్టసభల సమయం వృధా అవ్వడం తప్ప ప్రజా సమస్యలపై చర్చించిన పాపాన పోలేదన్నారు.

అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంలో విఫలమయ్యారని మొక్కుబడిగా కొన్ని విషయాలు మాత్రమే అసెంబ్లీలో ప్రస్తావించారని కీర్తి రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

ముఖ్యంగా మండలంలోని గాంధీ నగర్ లో ఇండస్ట్రియల్ కార్యులర్ కోసం శిలాఫలకం వేసి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నిశిదర్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వినర్ ప్రసాద్ రావు, గణపురం మండల శాఖ అధ్యక్షులు ఊర నవీన్ రావు,రేగొండ మండల మాజీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి,సోషల్ మీడియా కన్వినర్ దుగ్యల రామ్ చందర్ రావు, నాయకులు మంద మహేష్, ప్రవీణ్, రాజు, విప్లవ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు

జహీరాబాద్ .నేటి ధాత్రి:

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించిన బిల్లు రద్దు చేయాలని కోరుతూ ముస్లిం కమ్యూనిటీ వారు శుక్రవారం నమాజ్ తరువాత నల్లబ్యాడ్జీలు కట్టు కొని నిరసన తెలిపారు. వక్ఫ్ (సవరణ) బిల్లు,ను వ్యతిరేకించడానికి శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో వివిధ ముస్లిం సంస్థలు ఏకమయ్యాయి.

Central Government.

పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన ఈ బిల్లు, వక్ఫ్ బోర్డు పనులను క్రమబద్ధీకరించడం మరియు వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుందాని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ప్రతిపాదిత సవరణ తమ విశ్వాసంపై ప్రత్యక్ష దాడి అని వారు పేర్కొన్నారు మరియు దానిని ఆమోదించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. “రాబోయే రోజుల్లో మేము మరింత శక్తితో ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఈ బిల్లును అనుమతించబోమని సందేశం వ్యక్తం చేశారు
ఇది ముస్లింల ఆస్తి ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ను ముస్లింల పెద్దలు తన వాటాలో ఉన్న భూమి దానమిచ్చిన ఆస్తి ఇది అన్నారు ఇది ప్రభుత్వ ఆస్తులు కాదన్నారు. బిల్లును ఆమోదిస్తే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో దేశమంతా ధర్నాలు నిరాసనాలు జరుగుతాయన్నారు.

కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం.

* కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం…………..

భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు* –

అజయ్ రెడ్డి యార నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం(కాంగ్రెస్ ప్రభుత్వం) రైతుకు న్యాయం జరగాలి అని 2 లక్షల రూపాయలు ఏక కాలంలో రుణ మాఫీ చేసి రైతు భరోసాను పది వేల నుండి పన్నెండు వేల రూపాయలకు పెంచి చిన్న సన్న కారు రైతులకు ఎంతో మేలు జరిగేలా చేస్తుంది.

అంతే కాకుండా నిరు పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది మరియు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది.

రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గృహ అవసరాలకు ఇవ్వడం జరుగుతుంది మరియు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచి కార్పోరేట్ హాస్పటల్ లో పేద ప్రజలు చికిత్స పొందేలా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న విద్యార్థులకు 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి నియామక పత్రాలు అందజేశారు. అంతే కాకుండా నిరుద్యోగులకు 4 లక్షల వరకు 60 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మరెన్నో ప్రయోజనాలు అందించాలని, నిత్యం ప్రజల ప్రయోజనాల కోసం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇందుకు గాను భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు యార అజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.

పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం.

ప్రభుత్వ పాఠశాలలో పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ…ప్లాస్టిక్ వినియోగం నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని జోగాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యర్థ పేపర్లను వినియోగించి పేపర్ బ్యాగులు, పేపర్ ఫైల్ తయారుచేయడంలో విద్యార్థులకు ఉపాధ్యయుడు మేడికాల అంజయ్య రెండు రోజులు శిక్షణనిచ్చాడు. విద్యార్థులు పలు రకాల బ్యాగులు, వివిధ రకాల పత్రాలు బధ్రపరచుకోవడానికి పేపర్ ఫైల్లను తయారు చేసి ప్రదర్శించారు. తమ గ్రామంలో ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగ్ లు , పేపర్ ఫైల్ వాడతామని చెప్పా రు. శిక్షణను అందించిన ఉపాద్యాయుడు అంజయ్య మాట్లాడుతూ త్వరగా మట్టిలో కలిసిపోయో పేపర్ బ్యాగ్ లు పర్యవరణానికి ఎంతో మేలు చేస్తాయని వీటి తయారికి ఎలాంటి ఖర్చు ఉండదు కావున విద్యార్థులకు అవగాహన కల్పిస్తే భావితరాలకు కలుష్య రహిత సమాజాన్ని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించవచ్చన్నారు. ప్లాస్టిక్ వలన మన దేశంలో ప్రతి యోట లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా త్వరగా మట్టిలో కలిసి పోయో పేపర్ బ్యాగ్ లు,జూట్ , బట్ట సంచులను విరివిగా వాడాలని ఉపాధ్యాయుడు అంజయ్య పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా శిక్షణనను అందించిన ఉపాద్యాయుడు అంజయ్యను ప్రధానోపాద్యాయులతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు శ్రీధర్ రాజు, ఉపాధ్యాయులు జావీద్, మహేశ్, శ్రీనివాస్ , పద్మ, నర్సయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన DMHO.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

 

పాలకుర్తి నేటిధాత్రి

 

జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. మల్లికార్జున రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య సూచనలు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని తల్లి శిశువు మరణాలను తగ్గించాలని అన్నారు. కుక్కకాటు,పాము కాటు, తేలు కాటు కు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవిలో ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రతి సెంటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మందులు అందుబాటు లో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి ఇన్చార్జి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

• మైనార్టీలకు మోసం కాంగ్రెస్ ప్రభుత్వం..

• టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్ మాట్లాడుతూ… మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక మైనారిటీకి మంత్రి పదవి లేకపోవడం చాలా బాధాకరం మీకు మైనారిటీల ఓట్లు కావాలి కానీ మైనారిటీల మంత్రి పదవి వద్ద గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మైనార్టీలకు తోహ ఇచ్చారు. మరియు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మైనారిటీ అవసరం లేదా అని మీ యువ నాయకుడు షేక్ సోహెల్ ప్రశ్నిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి :

 

KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న 82% విద్యార్థులకు 2వ తరగతి బుక్స్ చదవడం రావడం లేదు, 8వ తరగతి చదువుతున్న 65% మంచి విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్ పైన అవగాహన లేదు, బీహార్ జార్ఖండ్,ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం విద్యావ్యవస్థలో అధమ స్థానంలో ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ, 5వ, 8వ,10వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహించే పరీక్షలో టాప్-5 వరస్ట్ పర్ఫామెన్స్ రాష్ట్రాల్లో తెలంగాణను ఉంచిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 2017-18 నుండి పర్ఫామెన్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇండెక్స్ సూచిక ద్వారా రాష్ట్రాల విద్య వ్యవస్థ పనితీరుకు ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది, ఈ ఇండెక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం జాతీయలోనే అధమ స్థానంలో నిలిచింది. 2022 సూచిక ప్రకారం సెకండరీ విద్య తర్వాత డ్రాప్ అవుట్ లలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, జాతీయస్థాయిలో ఈ సగటు 13.2% గా ఉంటే,తెలంగాణ రాష్ట్రంలో 22.2% గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు నారాయణ,శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు.

కెసిఆర్ హయంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాభివృద్ధికి రూ.23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం కే ప్రతిపాదించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ప్రారంభించాలని సంకల్పించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 8 వేల పై చిలుకు టీచర్ ఉద్యోగాలనే భర్తీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ బదిలీలు, మోషన్లు చేపట్టలేదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్లను కల్పించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షణ చేయడానికి గత ప్రభుత్వం హాయంలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లను నియమించలేదు. కేజీ టు పీజీ విద్య నేపంతో ప్రారంభించిన సంక్షేమ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆనాటి బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వారి కోళ్ల ఫారాలు, అభ్యభవనాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం. గత దసరా సమయంలో టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్న భవనాలకు అద్దె చెల్లించలేదని ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ ద్వారా భవనాలకు మధ్య చెల్లిస్తామని, పాఠశాలలు నడవకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో తిరిగి ప్రారంభించారు. శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండా ప్రారంభించిన ఈ పాఠశాలలతో రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు చాలావరకు మూతపడ్డాయి, ఉన్న పాఠశాలల్లో సరైన విద్యార్థులు లేకుండా పోయింది.

కెసిఆర్ హయంలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థను తిరిగే గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. కులం,మతం,ఆర్థిక సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విధమైన విద్యను అందజేయడానికి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయం. విద్య ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందన్న అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు డబ్బులు ఉన్న పిల్లలకే ఐఐటీ,నీట్ అనే విధానం పోవాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నీళ్ల చారు అన్నం తినవలసి వచ్చింది. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించడానికి డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది.

భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం.

భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు మానేరు రచయిత సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు.

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

సిరిసిల్ల జిల్లాలోని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో మరియు మానేరు రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో సిరిసిల్ల సిరివెలుగులు డా, నలిమెల భాస్కర్ మరియు జూకంటి జగన్నాథం సమాలోచన రెండు రోజుల జాతీయ సాహిత్య సదస్సు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య రవికుమార్ జాస్తి,అగ్రహారం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్, డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, మరియు ఎస్.ఆర్.ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలవకుంట రామకృష్ణ, టి.టి.సి.జి.టి.ఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్, కాడూరు సురేందర్ రెడ్డి, దక్షిణ ప్రాంత ఆఫీసర్ ఇంచార్జ్ ఎన్బిటి డాక్టర్ పత్తిపాక మోహన్,
సదస్సు కన్వీనర్ కటుకం శారద, రచయిత అన్నవరం దేవేందర్ , మరియు మానేరు రచయితల సంఘం అధ్యక్షులు టీవీ నారాయణ, కార్యనిర్వాహ అధ్యక్షులు ఎలుగొండ రవి, మానేరు రచయితల సంఘం సభ్యులు బూర దేవానందం,ఆడెపు లక్ష్మణ్, చిటికెన కిరణ్ కుమార్, జి.శ్రీమతి,అనిత మాడూరి, దూడం గణేష్, రొండి అర్జున్, మల్యాల దీపిక, ఈడపు సౌమ్య, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

బడ్జెట్ లో హామీలకు నిధులవ్వని ప్రభుత్వం,

బడ్జెట్ లో హామీలకు నిధులవ్వని ప్రభుత్వం,

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నిన్న 3లక్షల 4000కోట్ల బడ్జెట్ ను 2025-26 కు ప్రవేశ పెట్టడం జరిగింది ఇది కేవలం అంకెల గారడీలాగే ఉన్నది.గత.సంవత్సరం 2024- 25 లో 2లక్షల91000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టినారు కాని ఖర్చు చేసింది మాత్రం 2లక్షల 20 వేల కోట్లే అంటే 71వేల కోట్లు ఖర్చు పెట్టకుండా వదిలేశారు ఈ బడ్జెట్ లో ఎంత ఖర్చు పెడతారో?

ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తగ్గిపోయింది ఉ: రియల్ ఎస్టేట్ రంగం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పడిపోయింది, రిజిస్ట్రేషన్ ల వల్ల వచ్చే ఆదాయం ప్రాధానమైనదిగా ఉండేది గత బడ్జెట్ లో 13000 కోట్లు వస్తాయని అంచనా వేసిన కాని కేవలం 5000 కోట్లు మాత్రమే వచ్చింది.ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఎన్నో హామిలిచ్చి వాటికి బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదు ప్రధానంగా 6 గ్యారంటీలకు కేటాయింపులు లేవు.ఎస్సిలను మర్చిపోయారు దళిత బందును ఆటకెక్కించారు దాని స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం అని పెట్టి ఎస్సి,ఎస్టి లకు 12 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు మర్చిపోయారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున కేటాయింపులు చేస్తామన్నారు అది మర్చిపోయారు,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు దాని ఊసేలేదు,మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు రూ 2500 ఇస్తామన్నారు దానికి కేటాయింపులు లేవు,విద్యా ఆరోగ్యం నకు పెద్ద కేటాయింపులు లేవు అన్ని అన్నారు తెలంగాణ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మాజీ వై నరోత్తం అన్నారు.

ప్రభుత్వ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు.

ప్రభుత్వ స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాల నైన్ పాక లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నిర్వహించడం జరిగింది. పాఠశాల విద్యార్థిని విద్యార్థులుఒకరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడుగా వ్యవహరించి వారి ప్రతిభను ప్రదర్శించారు.దీనికి సంబందించిన సమావేశంలో ఒకరోజు ప్రధానోపాధ్యాయులు గా వ్యవహరించిన ఎండీ సన మాట్లాడుతూ ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించడానికి గత 3 రోజుల నుండి కష్ట పడి తరగతి గదిలో పాఠం చెప్పడం చాలా భయం వేసిందని, రోజూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కష్టపడే విధానం నాకు నచ్చిందని చెప్పడం జరిగింది. మిగతా విద్యార్థులు కూడా వారి వారి అనుభవాలు చెప్పడం జరిగింది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాముకుంట్ల తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షనతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఊర్మిళ గారు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా ఎంపీపీఎస్ కొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు బి నాగరాజు గారు వ్యవహరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ కైరున్నీసా హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్, ఇక్రమోద్దీన్, సదానందం, అనిల్ గవస్కర్, హసీనా, రాజేష్ మరియు ఒక్కరోజు ఎంఈఓ గా రేపాల శ్రేయాన్షి ఉపాధ్యాయులుగా , సాత్విక్, తనుశ్రీ, అనుశ్రీ, హర్షవర్ధన్, శ్రీ తేజ, యువీన, చైత్ర, శార్వాణి, సోను, నిహారిక, వైష్ణవి, జనని, తదితరులు పాల్గొన్నారు అనంతరం ఒక్కరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బహుమతులు అందజేయడం జరిగింది.

ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు.

దత్త గిరి ఆశ్రమంలో పూజలు నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామము, దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం నాడు దత్తగిరి మహారాజ్ 46వ అమర స్థితి పురస్కరించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ సలహాదైనా కేశవరావు ఆలయానికి రాగానే ఆలయ పూజారులు ఆలయ పీఠాధిపతి ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం కేశవరావు యజ్ఞ పూర్ణహౌతులో పాల్గొని పూర్ణాహుతి చేశారు. ఆలయ పీఠాధిపతి ఒక్క వెయ్యి ఎనిమిది వైరాగ్య శిఖామని అవధూత గిరి మహారాజ్, మహా మండలేశ్వర్ సిద్దేశ్వర స్వామీజీలు ఆయనను సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దత్తమేర మహారాజ్ ఆశ్రమ అధ్యక్షులు అల్లాడి వీరేశం గుప్తా విశ్వ మానవ ధర్మ ప్రచార అధ్యక్షులు శేరి నర్సింగ్ రావు రాజు పటేల్ జిల్లా శివశక్తి అధ్యక్షుడు శ్యామ్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు…

ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు…

●సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ,

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం ప్రభుత్వ పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో, కస్తూర్భా బాలికల విద్యాలయంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సూరి కృష్ణ నిర్వహించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించి, సూచనలు చేశారు. న్యాయమూర్తి న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధి చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో చట్టాల ఉపయోగం, సైబర్ క్రైమ్, సమాచార హక్కు చట్టం, మోటారు వాహనాల చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులందరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ గోపాల్ , వైస్ ప్రెసిడెంట్ మానెన్న సీనియర్ న్యాయవాది పాండురంగా రెడ్డి న్యాయ వాదులు రుద్రయ్య స్వామి సయ్యద్ షకీల్ లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు.!

కల్వకుర్తిలో..ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

కల్వకుర్తి /నేటి ధాత్రి.

Govt

కల్వకుర్తి పట్టణంలో కొందరు వ్యాపారస్తులు ప్రభుత్వ ఆదేశాలను అధిక్రమిస్తున్నారని పట్టణవాసులు అన్నారు. స్థానికులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ నిబంధన ప్రకారం.. అనుమతి తీసుకుని, వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు చేపడుతున్నారని పట్టణవాసులు తెలిపారు. రాకపోకులకు పార్కింగ్ కు ఎలాంటి స్థలం వదలకుండా.. షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నారన్నారు. దీనివల్ల రాకపోకులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆర్డీఏంఏ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా… స్పందించిన అధికారులు మున్సిపల్ అధికారులకు చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. స్థానిక మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడంలేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలు కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మొజార్ల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం.

మొజార్ల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

వనపర్తి నెటిదాత్రి:

పెద్ద మందడి మండలం మోజర్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు విద్యార్థులే ఉపాధ్యాయులుగా వారి తోటి విద్యార్థులకు చదువు చెప్పారు . డి ఈ ఓ గా సాయి చరణ్ ఎం ఈ ఓ గా మనోజ్ హెడ్మాస్టర్ గా వైష్ణవి, 7 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు గా వ్యవహరిం చారు ఈ కార్యక్రమం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యుగంధర్, ఉపాధ్యాయులు వెంకటేష్ రాజేశ్వరి ప్రైమరీ ఉపాధ్యాయురాలు కరుణ , మద్దిగట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజ్ ప్రధాన ఉపాధ్యాయులు, కృష్ణయ్య, శశివర్ధన్
పాల్గొని విద్యార్థులను అభినందించారు

గ్రామాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

గ్రామాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం రోజు న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది, మండలంలోని గోపాలపురం ముచనిపర్తి చల్లగరిగే, జూకల్, తిర్మలాపూర్, చిట్యాల, మోడల్ స్కూల్ ఆవరణలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తుందని, రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపారు,మరిన్ని అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజాపాలన జరుగుతుంద ని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హేమ, ఎంపీడీవో జయ శ్రీ ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మాదిగలకు మరియు అన్ని కులాలకు న్యాయం చేయాలి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమిమ్  అక్తర్ గారి రిపోర్టులో ఉన్న లోపాలను సరి చేసి మాదిగలకు మరియు అన్ని కులాలకు న్యాయం చేయాలి …

-అబ్రహం మాదిగ
మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

మహాజన నేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు
ఇచ్చిన కార్యాచరణలో భాగంగా జహీరాబాద్ పట్టణ కేంద్రంగా ఐబీ నుండి అంబేద్కర్ కూడలి వరకు  ఉల్లాస్ మాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మైసగాళ్ళ బుచెంద్ర ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు మట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణ కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 ఏళ్లుగా జరిగిన పోరాటం మాదిగలకు న్యాయంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ వాట రావాలని పోరాటం చెయ్యటం జరిగిందని కానీ ఇప్పుడు తెలంగాణాలో అత్యధికంగా జనాభా ఉన్న మాదిగలకు 11 శాతం రావల్సి ఉండగా కమిషన్లో ఉన్న లోపం కారణంగా మాదిగలకు 9 శాతం మాత్రమే వచ్చిందని దానిని వెంటనే సవరించి మాదిగల జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మరియు రేపు ప్రభుత్వం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని లేని పక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతమని హెచ్చరించారు. మరియు ఉమ్మడి ఎస్సీలను మూడు గ్రూపులుగా కాకుండా గతంలో ఉండే విధంగా నాలుగు ఏబిసీడీ లుగా వర్గీకరణ చెయ్యాలని కోరారు.

justice

ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పిఎస్ జహీరాబాద్,ఝరాసంగం, కోహీర్ మండల అధ్యక్షులు టీంకు  మాదిగ, మైకల్ మాదిగ, రవి మాదిగ, రాంచందర్ mef జిల్లా అధ్యక్షులు,ఎమ్మెఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు జైరాజ్ మాదిగ, నవీన్ కుమార్ ఎంజేఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ,మంచేందర్ PACS చైర్మన్, జైరాజ్, భాస్కర్ జడ్పీటీసీ, శ్రీనివాస్,ప్రవీణ్ ఏఈ,నర్సిoములు, రాజు,చిన్న, సుదీష్ కుమార్, అజయ్, కుమార్, పవన్, లాజర్, సురేష్, విల్సన్, ప్రభాకర్, మనోజ్, సంపత్, ప్రణయ్, కిట్టు, జనార్దన్, ప్రవీణ్, చిట్టీ, లాజర్, శ్రీనివాస్,శాంసన్, ఇమ్మానుయేల్, అభిషేక్, ప్రణయ్, నర్సింహా, సూర్యకాంత్, రమేష్, దిలీప్, దింపుల్, అబ్రహం,ప్రశాంత్, జ్యోతుల్, షాలేం,మనీష్, సురేష్, మూర్జల్, ధనరాజ్, విద్యాసాగర్, సోను, జనార్దన్, మాణిక్యం,అజీమ్, మహేష్, బన్నీ,పెంటన్న,నిర్మల్,దేవయ్య,జైపాల్,సుధాకర్, జీవన్,అనిల్, ప్రభాకర్, అమృత్,శ్యామ్ సుందర్,రాజేందర్,సతీష్, రాహుల్, అనిల్, పవన్, ముత్తర్గల్లా రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version