అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి.
నాగర్ కర్నూల్ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగర్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా నేను కృషి చేస్తానని తెలిపారు. అలాగే నిరుపేదలు ఎవరు ఉన్నా సరే వారు ఏ పార్టీలో కొనసాగుతున్న వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎవరు అధైర్య పడకూడదు అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.