చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.!

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాదుని సత్యనారాయణ …..

నేటి ధాత్రి .,,……………..

 

 

జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండల గ్రామం ఎల్లారెడ్డి పల్లెలో చేనేత కార్మిక కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న పద్మశాలి సంఘం నాయకులు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాధుని సత్యనారాయణ మాట్లాడుతూ రోజంతా శ్రమించి కార్మికులకు రోజు 300 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని కావున ప్రభుత్వం నెలకు 20 వేల రూపాయలు అయ్యేవిధంగా పని కల్పించాలని మరియు ఇందిరమ్మ గృహాలు హెల్త్ కార్డు అందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు వరంగల్ జిల్లాలో ఏర్పాటు అవుతున్న కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో పద్మశాలీలకు మరియు చేనేత కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలిపి కల్పించాలని 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు పవర్ రూమ్ కార్మికులకు విద్యార్థి పింఛన్ వెంటనే మంజూరు చేయాలని మరియు మగ్గం వేసే ప్రతి కార్మికునికి జియో ట్రాక్ తో సంబంధం లేకుండా చేనేత మిత్ర కింద 2500 అందించి చేనేత కార్మికులకు ఆర్థిక ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం.!

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో అక్రమంగా నివసిస్తున్న నిషేధిత పాకిస్తానీలను వెంటనే దేశం విడిచి పంపేల చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ నిర్ణిత సమయం ఇచ్చిన కూడా పాకిస్థానీ దేశస్తులు భారత దేశంలో అక్రమంగా ఉంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు, వెంటనే వారిని గుర్తించి దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని వారి జాబితా తయారు చేసి బహిష్కరించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ నాయకులే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కారుపాకాల అంజిబాబు, అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేమ్ కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను.!

ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలని ఒగ్గు కథ

ప్రధానోపాధ్యాయులు -అచ్చ సుదర్శన్

నడికూడ,నేటిధాత్రి:

 

కథలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరని ముఖ్యంగా ఒగ్గు కథలంటే తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టమని తెలుసుకున్న నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు నర్ర సతీష్ యాదవ్ బృందం చే ఒగ్గు కథ పాట ను ఆదివారం రోజున చెప్పించడం జరిగింది.నర్ర సతీష్ యాదవ్ సామాన్య జనాల మనసుకు అతుక్కు పోయే విధంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రత్యేకతలను ఒగ్గు కథ రూపంలో వివరించడం జరిగింది.అదేవిధంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించాలని,ఆ పాఠశాల యొక్క ప్రత్యేకతలను తల్లిదండ్రులకు ఒగ్గు కథ పాట ద్వారా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒగ్గు కథ పాట ఉపాధ్యాయ గ్రూపులలో మరియు గ్రామాల గ్రూపు లలో వాట్సాప్ లో చెక్కర్లు కొడుతున్నది.సామాజిక మాధ్యమాల ద్వారా బడిబాటను ప్రచారం చేస్తున్న చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయ బృందమును, ఒగ్గుకథ కళాకారుడు నర్ర సతీష్ యాదవ్ ను మరియు అతని బృందాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషిని నడికూడ మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు అభినందించారు.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ప్రధానోపాధ్యాయురాలు ఏ.భద్రమ్మ తెలిపారు.

 

Students

ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 19 వరకు నిర్వహించబడుతుందని చెప్పారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డ్రాయింగ్, డాన్స్ క్రాఫ్ట్ కరాటే, గేమ్స్ మరియు స్పోర్ట్స్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పలు శిక్షణలు ఉంటుందన్నారు.ఈకార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులుజ్ మాజీ సర్పంచ్, గ్రామ కార్యదర్శి దేవేందర్,ఉపాధ్యాయులు కృపాల్,దేవేందర్,తాజుద్దీన్,కిషన్, పద్మశ్రీ,వాలంటీర్స్ పాల్గొన్నారు.

వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

వనపర్తి నేటిధాత్రి :

 

అకాల వర్షాల వల్ల తడిసిన వడ్లను ప్రభుత్వం కొంటుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అన్నారు.
శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన వర్షానికి చిట్యాల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రానికి వచ్చిన వడ్లు తడిసి పోయాయని అన్నారు శనివారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి తడిసిన వడ్ల ను పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్, పౌరసరఫరాల శాఖ అధికారులకు తడిసిన వరి వడ్లను ఆరబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రంలో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.
రైతులకు అవసరమైన టార్ఫాలిన్ లు అందజేయాలని మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గాలివానకు దెబ్బతిన్న వరి,మామిడి,మిర్చి ఇతర నేలకొరిగిన పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అలాగే రైతుల పక్షపతి కాంగ్రెస్ ప్రభుత్వం అని,ప్రజలు అధైర్య పడొద్దని,ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

దేశవ్యాప్త కుల గణన చారిత్రాత్మక నిర్ణయం అని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు గత రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్త కులగనన చేయడం హర్షించదగ్గ విషయమని శుక్రవారంనాడు చిట్యాల మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి బీసీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి రుణపడి ఉన్నారని ఎన్నో సంవత్సరాలుగా బీసీలను జెండాలు మోసే బానిసలుగానే వివిధ రాజకీయ పార్టీలు చూసాయని కానీ భారతీయ జనతా పార్టీ బీసీలకు రాజ్యాధికారం అందాలని ప్రతి ఒక్క బిసి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఆశించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నారని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ అని ఆయన అన్నారు ఇప్పటికైనా మిత్రులందరికీ ఏకతాటి మీద నిలబడి నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ ఓదెల శ్రీహరి నల్ల శ్రీనివాస్ రెడ్డి, మైదం శ్రీకాంత్ అనుప మహేష్ వల్లల ప్రవీణ్ కేంసారపు ప్రభాకర్ రావుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన…..

రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)

 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెరుగైన విద్యా బోధన అందించడం జరుగుతుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంగ్లీష్, జువాలజీ అధ్యాపకులు యాదగిరి, స్వామి అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధనపై వారికి అవగాహన కల్పించారు. రామాయంపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవం గల అధ్యాపకుల తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. విశాలమైన తరగతి గదులతో పాటు ఇతర వసతులు ఉన్నాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరాలని వారు సూచించారు. ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు బస్ పాస్ సౌకర్యం ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కళాశాలలో బైపిసి, ఎంపీసీ, సి ఈ సి, హెచ్ ఈ సి గ్రూపులతో పాటు ఒకేషనల్ విభాగంలో ఎలక్ట్రికల్, ఆఫీస్ అసిస్టెంట్ షిప్, అకౌంటెంట్ టాక్సేషన్ గ్రూపులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయని విద్యార్థులకు వివరించారు. అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలలో చేరి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు. ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా లెక్చరర్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల సత్తా….

ప్రభుత్వ పాఠశాలల సత్తా….

8 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత

మండల టాపర్ ఎల్లారెడ్డి

నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ
తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, బర్దిపూర్, ఎల్గోయ్, జీర్లపల్లి, ఈదులపల్లి, ఝ రాసంగం, ఆదర్శ పాఠశాల, కేజీబీవీ, మహాత్మ జ్యోతి రావు పూలే పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. కుప్పానగర్ పాఠశాలలో 99% శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మండల వ్యాప్తంగా 402 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 401 మంది ఉత్తీర్ణత సాధించారు. కుప్పానగర్ పాఠశాలకు చెందిన ఒక్క విద్యార్థి మాత్రమే ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

 

Education

మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థి ఎల్లారెడ్డికి 581 మార్కులు సాధించి మండల టాపర్గా గెలిచాడు. తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన ఎస్. రాధిక 574 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. మండ లానికి చెందిన 30 మందికి పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. జడ్పీహెచ్ ఎస్ ఝరాసంగం పాఠశాలకు చెందిన రాహుల్ 556, సీహెచ్. భవాని 548, జి. భువనేశ్వరి 529, కె. త్రిష 527, ఎలిజబెల్ రాణి 526 మార్కులు సా ధిం చారు. ఈ విద్యార్థులను మండల విద్యాధి కారి శ్రీనివాస్, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ .

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 19 మంది లో బాలురు(13) బాలికలు(6 )గురు విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అధిక మార్కులు సాధించి ఉత్తీర్ణత అయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని పేద మధ్య తరగతి విద్యార్థులు అధిక మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరును తీసుకొచ్చారని అన్నారు.అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలు,పాఠశాల విద్య కమిటీ చైర్మన్ గుండా సునీత,ఉపాధ్యాయులు చూపిన చొరవతో అధిక మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.

పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం.

పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం

మండల ర్యాంకులు సాధిం చిన బాలికల పాఠశాల విద్యార్థులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల విద్యార్థులు నామని అక్షయ 549, డి. సాయి శ్రీ 546, ఎండి అమ్రీన్ 527 మార్కులు సాధిం చి స్కూల్ టాపర్లుగా మరియు మండల స్థాయిలో ఒకటవ, రెండవ, నాలుగవ స్థానాలు కైవసం చేసుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు శ్రీలత తెలిపారు. పాఠశాలలో 16 మందికి గాను 15 మంది పాసయ్యారు. 94% ఉత్తీర్ణత సాధించారు జడ్పీ హెచ్ఎస్ బాలుర పాఠశాల రంగు సంజయ్ 529 సాధించారు.

Students

 

16 మందికిగాను 15 మంది పాసయ్యారు. 94% ఉత్తీర్ణత సాధించారు. గురు కుల పాఠశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు విద్యార్థుల మార్కులు 567, రెండవ స్థానం 560 మార్కు లతో పాటు 500 పైగా మార్కులు 38 మంది విద్యార్థులు సాధించారు. కేజీవిపి ప్రభుత్వ పాఠశాలలో 504మార్కులు సాధించారు. పెద్దకోడేపాక పాఠశాలలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాల ప్రధానో పాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల కృషి క్రమశిక్షణ అంకితభావంతో సహా అత్యు త్తమ ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫలితాలు సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి ప్రభుత్వం..

ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి ప్రభుత్వం..

:__ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

వరంగల్ తూర్పులో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమం.

వరంగల్, ఖిలా వరంగల్ మండలాల పరిధిలో “భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు”లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

వరంగల్ తూర్పు, నేటిధాత్రి.

 

 

ప్రజా పాలన, ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని వరంగల్ మండలం, ఖిలా వరంగల్ మండలం పరిధిలోని రైతులకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఉర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో మంగళవారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ, ముఖ్య అతిథులుగా వరంగల్ ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ పౌరసరఫరాల శాఖ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వరంగల్ నగరంలో నిర్వహించిన, భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా దేవి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ, వరంగల్ సబ్ కలెక్టర్, వరంగల్ ఆర్డిఓ, అలాగే వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు, వరంగల్ తూర్పు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వరంగల్ ఖిలా వరంగల్ మండలాల రెవెన్యూ అధికారులు, రెండు మండలాల రెవెన్యూ సిబ్బంది, రెండు మండలాల నుండి రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ….

భూ భారతి అవగాహన సదస్సులో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఈరోజు వరంగల్, ఖిల్లా వరంగల్ మండలాలకు సంబంధించిన భూ భారతి కార్యక్రమం ఏర్పాటు శుభసూచకం అని అన్నారు. గత ప్రభుత్వంలో ధరణి చట్టం కేవలం వాళ్ళ నాయకుల దౌర్జన్యాలకు, కబ్జాలకు మాత్రమే ఉపయోగపడిన చట్టం అని అన్నారు. రైతులను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీ మట్టికొట్టుకుపోయింది అని, భూభారతి చట్టంతో ప్రతి ఒక్క రైతుకు మేలు జరుగుతుంది అని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన మోసాలు ఇప్పుడు జరిగే అవకాశం లేదు అని, వరి వేస్తే ఉరి వేసుకోవాలన్న కేసీఆర్ కు రైతులు తగిన బుద్ధి చెప్పారు అని, ఇక నుండి భూ భారతి ద్వారా ప్రజల వద్దకు నేరుగా అధికారులు వచ్చి మీ సమస్యలు కనుక్కొని వాటిని పరిష్కారం చేస్తారని తెలిపారు.

 

Government

 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…

గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి 2020 చట్టంతో ప్రతి ఒక రైతు పడిన ఇబ్బందులు చూసాము. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ధరణితో ఇబ్బంది పడిన ప్రతి రైతుల సమస్యలు తీర్చాలన్న అభిప్రాయంతో భూభారతి చట్టం తీసుకువచ్చాం. తరతరాల నుండి ఉన్న భూ సమస్యలు, ధరణితో వచ్చిన దరిద్రాన్ని పారద్రోలడానికి భూభారతి చట్టం వచ్చింది.. ధరణి చట్టంతో రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూభారతి చట్టంలో రెవెన్యూ శాఖ అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది అని అన్నారు. ధరణి చట్టంలో నమోదు కాబడిన పొరపాట్లు అన్నింటిని భూభారతి చట్టం ద్వారా సరిచేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ధరణిని అడ్డుపెట్టుకొని వేలాది ఎకరాలను కొల్లగొట్టిన బిఆర్ఎస్ నాయకులకు భూభారతి చట్టం బుద్ధి చెబుతుంది అని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలన్నీ అమలుపరుస్తున్నాం అని తెలిపారు. పేదల సంక్షేమం కొరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాము అని, నాడు ధనిక రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. బిఆర్ఎస్ ప్రభుత్వo అప్పుల తెలంగాణగా మార్చింది అని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాలలో అధికారులను పర్యటింపజేసి చట్టాలలో ప్రవేశపెట్టాం అని, తండ్రులు తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని పట్టా చేసుకునే పరిస్థితి లేదు. భూభారతితో అనేక సమస్యలు పరిష్కరించుకుని వీలు ఉంది అని, చట్టాలు రూపొందించడంతో పాటు విధి విధానాలు రూపొందించి వంద రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. మొదటగా రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో, నాలుగు మండలాలు తీసుకొని, ఆ మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేసి సమస్య ప్రభుత్వమే వెళ్లి పరిష్కరించింది అని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చిన నాలుగు మండలాల దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరిస్తాం అని తెలిపారు. మిగిలిన జిల్లాలలో కూడా జూన్ రెండవ తేదీ నాటికి అన్ని జిల్లాలలో భూ భారతి చట్టాన్ని అమలు చేస్తాం అని అన్నారు. జూన్ రెండో తేదీ నుండి ప్రతి రెవెన్యూ గ్రామాన్ని, ఎమ్మార్వో సందర్శించి ఇక్కడే సమస్యలు పరిష్కరిస్తారు. రైతులకు కానీ, భూములున్న ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి ఇందిరమ్మ రాజ్యంలో ఉండదని పొంగులేటి అన్నారు. మొదటి విడతలో నాలుగు లక్షల ఇండ్లు మే 5వ తేదీ లోపు అర్హులైన లబ్ధిదారులకు అందిస్తాం. భూభారతి తెలంగాణలో కాదు దేశంలోనే ఆదర్శంగా వంద సంవత్సరాల పాటు ఉండబోతుంది అని అన్నారు. మల్లి ధనిక రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దిశగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది అని అన్నారు.

తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.

ఝరాసంగం గ్రామంలో తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండల కేంద్రమైన బంగ్లా గడ్డ కాలోనీ వాసులు ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతున్న సంఘటనలు మండల కేంద్రంలో చోటుచేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ బంగ్లా గడ్డ కాలనీ వాసులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే ఎండాకాలం భానుడి భగభగ తో మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు సాధారణంగా అరకొరగా సప్లై అవుతున్న మంచి నీరు ఎండాకాలం వచ్చేసరికి మంచి నీటి సరఫరాలో తీవ్ర అంతరాయము ఏర్పడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురైతూన్నట్లు ప్రజలు తమ గోస చెప్పారు. జిల్లా కలెక్టర్‌ గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా మండల, గ్రామ స్థాయి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.6రోజుల నుంచి గ్రామంలో గల వేసిన బోరులో నీరు రావడం లేదని, మిషన్‌ భగీరథ నీటి సరఫరా కూడా మాత్రం రావడం లేని వల్ల బంగ్లా గడ్డ కాలనీ గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

 

Summer Season.

గ్రామంలో ఒకటి బోరు ఉన్నా,ఆ బోరులో నీళ్లు సరిగా లేవని స్థానిక అధికారులు తెలిపారు.ఈ విషయమై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు.

దీంతో పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న బోర్ల యజమాన్యులను అడిగి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్‌ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నో నీరు వృథాగా పోతున్నది.

అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు తెలిపారు.

వేసవి కాలంలో నీరు వృథా చేయడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరపడిన గ్రామాలకు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ఆకునూరు జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ ఆధ్వర్యంలో బడిబాట

చేర్యాల నేటిధాత్రి..

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. సోమవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆకునూరు గ్రామంలోనీ ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో అన్ని వార్డులలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విధ్య లభిస్తుందని, ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు ఉచిత సౌకర్యాలతోపాటు టెక్నాలజీతో బోధన చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్ధలకు వెళ్లి తల్లిదండ్రులు కష్టపడి సంపాందించిన డబ్బులను వృధా చేయవద్దన్నారు. విద్యార్ధులకు దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనాన్ని సర్కారు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి రోగులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు నేహా ఫరీద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల “సిబ్బంది” ఆచారం

మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటి దాత్రి

 

 

 

“దోస్ట్” ద్వారా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ లు చేసుకోవాలని కోరుతూ ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున ఆ కళాశాల సిబ్బంది సంయుక్తంగా వెంకట్రావుపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.

వెంకట్రావుపేట ప్రధాన రహదారి, గ్రామ పంచాయితీ కార్యాలయం, హనుమాన్ దేవాలయం తదితర ప్రాంతాల్లో గల ఇండ్లలోనికి నేరుగా వెళ్ళి,మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 -2026 విద్యా సంవత్సరంలో బీ ఏ; బీ కాం (కంప్యూటర్) ప్రథమ సంవత్సరం కోర్సులలో చేరాలని సిబ్బంది ప్రజలకు సూచించారు.

ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు,ఇంటర్మీడియెట్ డ్రాప్ అవుట్స్ వంటి విద్యార్థులు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని సూచించారు.

ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవని, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, క్రీడలు, ఉపకార వేతనాల మంజూరు,సాధారణ విజ్ఞాన పరీక్షల నిర్వహణ వంటి సౌకర్యాలతో పాటు అనుభవం మరియు నెట్ , సెట్, స్లెట్, పీ హెచ్ డి వంటి అధిక విద్యార్హతలు గల బోధకులు ఉన్నారని,

ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది “దోస్త్” ద్వారా అడ్మిషన్ ల కోసం ఇంటింటి ప్రచారం చేయటం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, కళాశాల కామర్స్ హెచ్ ఓ డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు గట్టయ్య, అంజయ్య, సత్తయ్య, రికార్డు అసిస్టంట్ వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వెంకట్రావు పేట గ్రామంలో “దోస్త్” ద్వారా అడ్మిషన్ల ల కోసం చేసిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ప్రిన్సిపల్ కే వెంకయ్య తెలిపారు.

పేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం.

పేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం

సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని

సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకు వరంగల్ మారిందని

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన దారకొండ నాగరాజు నివాసంలో గ్రామానికి చెందిన నాయకులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బడిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం రోజున వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండియర్ లో 90%, ఫస్ట్ ఇయర్లో 62% ఉత్తీర్ణతతో మంచి ప్రదర్శన కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీదేవి తెలియజేశారు.ఎంపీసీ సెకండ్ ఇయర్ లో జి అనిల్ 969/1000, ఎన్ సౌమ్య 924/1000, ఏ నవ్య 900/1000,
బైపిసి సెకండియర్ లో ఏం శ్రీవాణి 900/1000, ఎన్ ప్రియాంక 880/1000, బి అజయ్ 880/1000, సీఇసి సెకండ్ ఇయర్ లో ఏ శివ 608/1000, హెచ్ ఈ సి సెకండ్ ఇయర్ లో పి చందు 632/1000,
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఎన్ అంజలి 457/470, జి మానసి 446/470, ఏం అంజలి 432/470, ఏం శరణ్య 427/470,
బైపిసి ఫస్ట్ ఇయర్ ఎం హర్షిత 405/440, ఏ వైష్ణవి 393/440,
ఫస్ట్ ఇయర్ ఇ రాహుల్ 362/500, ఓ సమత 354/500 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ బి శ్రీదేవి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, లెక్చరర్లను ప్రిన్సిపాల్ శ్రీదేవి అభినందించారు.

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం.!

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం

ఎంపీసీ ప్రథమ సంవత్సరం భానుశ్రీ 450 మార్కులు

శాయంపేట నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాయంపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది.

results

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ మాట్లాడుతూ ఇంటర్ ప్రధమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు అన్నారు ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కుల గాను భానుశ్రీ 450 మార్కు లతో కాలేజ్ టాపర్ గా, బూర వరుణ్ 444 మార్కులు సాధించారు.

results

అదేవిధంగా బైపిసి రెండవ సంవత్సరం ఇంజపూరి కావ్య శ్రీ 1000మార్కులకు గాను 623, కొమ్ముల కీర్తన 585 మార్కులను సాధించారు. సి ఈ సి రెండవ సంవత్సరం మహమ్మద్ యాశ్రిన్ 723, వంగరి ప్రవళిక 706 మార్కులు సాధించారు.

results

ఏడాది ఇంతటి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు సహకరించిన అధ్యాపకులు వారి తల్లిదండ్రు లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మన్నారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో మరిన్ని గొప్ప ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

దర్జాగా “ప్రభుత్వ భూమి కబ్జా”…?

దర్జాగా “ప్రభుత్వ భూమి కబ్జా”…?

రెవెన్యూ అధికారులు “బోర్డు”లు పాతిన ఫలితం శూన్యం..?

ఐ….య్యామ్ డోంట్ కేర్ అంటున్న కబ్జాదారుడు

అన్ని సక్రమమే అయితే, అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు ఎందుకు పాతిండ్లు?

“ఐలయ్య”… ఇదేందయ్యా “బోర్డు” అంటున్న ప్రజలు?

దేశాయిపేట శివారు, జర్నలిస్ట్ కాలనీ డబల్ బెడ్ రూమ్ ల పక్కన గల సర్వే నంబర్ 81లో గల ప్రభుత్వ భూమిని, “ఓ అయ్య” కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి..

తప్పుడు భూరికార్డులతో యథేచ్ఛగా దేవాదాయ శాఖ భూమి “అక్రమ రిజిస్ట్రేషన్”.

“అయ్య”కు అండగా దేవాదాయ శాఖ భూములను రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి ఓ “సబ్ రిజిస్ట్రార్”?

“ఆక్రమించిన” ప్రభుత్వ భూమిలో, “అక్రమంగా అమ్మకాలు” జరిపిన ఘనుడు.?

కబ్జా చేసిన ప్రభుత్వ భూముల్లో, కొనుగోలు చేసి “అక్రమ నిర్మాణం చేపట్టిన ఓ వైద్యురాలు?”

“మున్సిపల్ పర్మిషన్” లేకుండానే నిర్మాణం చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం..

దేవాదాయ భూముల్లో “బొక్క” లు ఏరుకుంటున్న ఓ మధ్యవర్తి?

అక్రమంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు

ఈ తతంగం వెనక లక్షల రూపాయలు చేతులు మారినట్లు వినికిడి..?

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

పేదోళ్లు గూడు కోసం, అసైన్డ్ భూముల్లో గుడిసెలు వేస్తే అధికారులు నానా హంగామా చేసి వాటిని తొలగించి కేసులు పెట్టి జైలుకు పంపుతారు. అలాంటిది రూ.5 కోట్లకు పైగా విలువ చేసే రెండు ఎకరాల దేవాదాయ శాఖ ప్రభుత్వ భూమిని ఒకరు కబ్జా చేసి, అమ్మకాలు జరిపి, యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు మొదలు పెట్టడం చూస్తే, మున్సిపల్ శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అని ఆరోపణ.

 

Government

 

వివరాల్లోకి వెళితే దేశాయిపేట శివారు, లక్ష్మి మెగా టౌన్షిప్ ఆనుకొని, నూతనంగా ఏర్పాటు అయిన జర్నలిస్ట్ కాలనీ డబల్ బెడ్ రూమ్ ల పక్కన గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 81లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తి కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ముందు వైపు ఒక వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్ళేంతా ఎంట్రెన్స్ పెట్టిన తీరు చూస్తే ఆశ్చర్యానికి గురిగాక తప్పదు.

Government

 

కబ్జా విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ స్థలం ప్రభుత్వ భూమి అని గుర్తించి, అందులో బోర్డు పాతి, ఆక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలకు పిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులు బోర్డు పాతిన స్థలం ఎక్కడ అని అక్కడే ఉన్న ఓ వ్యక్తిని అడిగితే ఇందులో కాదు, వేరే దగ్గర అంటూ చెప్పిన తీరు, తీరా కనుక్కుంటే ఆ వ్యక్తి సైతం “అయ్య”కు అనుచరుడు అని తెలిసింది.

Government

 

 

కబ్జా విషయం బయటకు రాకుండా, జాగ్రత్త పడుతున్న కబ్జాదారుడు అతని అనుచరులు.. బోర్డును పాతిన ప్రభుత్వ భూమిని, ఓ “పెద్దయ్య” 2017లో తప్పుడు పత్రాలతో అప్పటి ఓ “సబ్ రిజిస్ట్రార్” అండతో సర్వే నంబర్ 81లో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం, అందులో కొంత అమ్మకాలు జరిపి యదేచ్చగా నిర్మాణాలు సైతం చేపట్టడం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది అని రెవెన్యూ అధికారులకు సమాచారం రాగానే, విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమి అని బోర్డు పాతి, ఆక్రమించిన వారికి చర్యలు తప్పవు అని బోర్డు పాతి వెళ్ళారు.

 

Government

అయినా కానీ అందులో నిర్మాణం ఆపకుండానే పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా నిర్మాణం చేపడుతుంటే మున్సిపల్ అధికారులు చోద్యం చూడటం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఘనుడు ఎవరు? ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయడంలో ఆ అధికారి దిట్ట అనే చెప్పొచ్చు. అప్పట్లో పహాని కాపీలతో సైతం రిజిస్ట్రేషన్ చేసి, చేసి, ఆ సబ్ రిజిస్ట్రార్ పేరు మారుమోగింది. అయితే ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వ్యక్తి, ఓ రాజకీయ నాయకుడు పేరు చెప్పడం, సదరు నాయకుడికి సైతం ఈ విషయం తెలువకపోవడం గమనార్హం. ఇదేంది “అయ్య” అని అన్నట్లు సమాచారం. రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.. “అయ్య”గారీ ఆక్రమణలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది?. సదరు అయ్య కబ్జాలపై ప్రత్యేక విచారణ చేయాల్సిందిగా టాస్క్ఫోర్స్ పోలీసులకు నగర ప్రజల విజ్ఞప్తి.

 

Government

 

తప్పుడు రికార్డులతో కబ్జా?

మునిసిపాలిటీలు, మండల కేంద్రాల పరిధిలో ఉన్న భూముల ధరల రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వీటి విలువ వందల కోట్ల రూపాయాల్లో ఉంటుంది. పట్టణాలు, గ్రామాల విస్తరణతో ఈ భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. కొన్ని భూముల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. మరికొన్ని చోట్ల దాతల పేరుతో ఉండడంతో వారు అమ్మినట్లు భూముల రికార్డులను సృష్టించి ఆ భూములను దొడ్దిదారిని ఆక్రమించుకుంటున్నారు. భూములు ధరలు గణనీయంగా పెరగడంతో కొన్ని చోట్ల దానంగా ఇచ్చిన భూముల అసలు వారసులు రంగ ప్రవేశం చేసి ఆవి మావేనని కోర్టుల్లో కేసులు వేశారు. అవి ప్రస్తుతం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌, కోర్టుల్లో ఆ కేసులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.

ఇదేందయ్యా “మసి”…?

రెండు ఎకరాలు దర్జాగా కబ్జా.. దేవాదాయ శాఖ భూములపై “మసి” మరక?

కాసులు ఇస్తే కాదేది రిజిస్ట్రేషన్.. పహాని కాపీలతో సైతం రిజిస్ట్రేషన్ చేసిన ఘనుడు ఆ “సబ్ రిజిస్టర్”..

ఒక్కో ఫ్లాట్ “ఇద్దరికీ” సైతం రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర కలిగిన “సబ్ రిజిస్ట్రార్”..?

ఏదైనా భూమి కానీయి, రిజిస్ట్రేషన్ చేయడం ఆయనకు “వెన్నతో పెట్టిన విద్య” ఆ సబ్ రిజిస్టర్ కే సొంతం..?

ఎవరా “సబ్ రిజిస్ట్రార్”? ఎవరా “అయ్యా”?

పూర్తి వివరాలు “నేటిధాత్రి ప్రత్యేక కథనం” త్వరలో..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version