నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి…

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు.పనుల నిర్వహణలో శ్రేష్టమైన సిమెంట్,ఇసుకను వినియోగించాలని,పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల,సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన విద్యుత్ వ్యవస్థ,మూత్రశాలలు, భోజనశాల ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.చెన్నూరు పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్థానిక ప్రజలకు వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు

బుగులోని జాతర పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T133352.737.wav?_=1

 

బుగులోని జాతర పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం రేగొండ మండలం తిరుమలగిరిలో బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్
మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మెట్ల వెడల్పు , కోనేరు, మంచినీరు బావి పనులకు మంజూరి ఇవ్వడం జరిగిందని కొత్తపల్లి నుండి బుగులోని జాతరకు రోడ్డు, తిరుమలగిరి నుండీ బుగులోని జాతర వరకు రోడ్డు జగ్గయ్య పేట నుండి బుగులోని జాతర వరకు రోడ్డు నిర్మాణ పనులకు 5.5 కోట్ల రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగిందని ఇట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు గుత్తేదారులకు సూచించారు

అనంతరం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినారు. అనంతరం దేవాలయం నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో బుగులోని జాతర చైర్మన్ గంగుల రమణ రెడ్డి భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య, ఎన్ ఎస్ ఆర్ సంస్థల అధినేత నాయినేని సంపత్ రావు పంచాయతీ రాజ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు…

ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ తొలి శాసన సభాపతి, శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, సిరికొండ అభిమానులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచినారు అనంతరం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిప ల్ మాజీ చైర్మన్ బండారి సంపూర్ణ రవి మాట్లాడుతూ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భూపాలపల్లి జిల్లా ఏర్పాటు కావడానికి సిరికొండ మధుసూదన్చారి అనేక కృషి చేశారు నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన సిరికొండ పేరు స్థిర స్థాయిగా ఉంటుంది ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఆనాడు కెసిఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గం రోడ్లు అనేక అభివృద్ధి పనులను చేసిన నాయకుడు సిరికొండ చెంచు కాలనీ వాసులకు ఇండ్లు కట్టించినారు వారిని అసెంబ్లీకి ప్రత్యేక బస్సులు పెట్టి తీసుకపోవడం జరిగింది అలాంటి నాయకుడిని ఎవరు మర్చిపోలేరు కావున వారి చేసిన అభివృద్ధి పనిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బండారి సంపూర్ణ రవి, శశి కాంత్, ఖలీద్, అగుర్ల శ్రీనివాస్, సూర రాజేష్, సదానందం, మాకోటి ఓదెలు, కిరణ్, తాళ్ళ శ్రీనివాస్, సుధాకర్, అనిల్, రంజిత్, పూర్ణ యాదవ్, మహిళ నాయకురాలు మేకల రజిత, ఓరుగంటి లక్ష్మీ,జెరుపుల గంగ, మియాపురం స్వప్న తదితరులు పాల్గొన్నారు.

కందకంలో సమీకృత కూరగాయల మార్కెట్ ను నిర్మాణం చేపట్టాలి…

కందకంలో సమీకృత కూరగాయల మార్కెట్ ను నిర్మాణం చేపట్టాలి
వనపర్తి నేటిదాత్రి

వనపర్తి పట్టణం లో 10, 21 వ వార్డు మధ్యలో ఆగిపోయిన సమీకృత కూరగాయల మార్కెట్ అఖిల్ పక్ష ఐక్యవేదిక నాయకులు సందర్శిం చారు ఈసందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 21వ వార్డులో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు కొంత పూర్తి చేశారని తెలిపారు నిర్మాణం పూర్హి చేసి కూరగాయల వ్యాపారులకు ఇస్త వనపర్తి లో ట్రాఫిక్ సమస్య ఉండదని అన్నారు కందకంలో నీరు నిలిచి ప్రజలు రోగాల కు గురి అవుతున్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి కందకము లో కురాగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టాలని కోరారు సతీష్ యాదవ్ వెంట వెంకటేశ్వర్లు,తెలుగుదేశం కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, రామస్వామి, కురుమూర్తి, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T143001.704.wav?_=2

కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు బాధితులు సహకరిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెల్ 9849905923 నెంబర్ తెలిపారు ఈ మేరకు నష్టపోయే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ సహకరించిన బాధితుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో రోడ్డు విస్తరణకు సహకరిస్తున్నామని బాధితుడు దన్నోజిరావ్ తెలిపారు

ఆలయం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న మంత్రి సీతక్క…

ఆలయం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న మంత్రి సీతక్క

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ దేవాలయం లో అభివృద్ధి పనులకు అటవీశాఖ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు
కోటి యాభై లక్షల రూపాయల తో పలు అభివృద్ధి పనులకు కృషి చేస్తున్న మంత్రి సీతక్క
రూపురేఖలు మారనున్న గుంజేడు ముసలమ్మ దేవాలయం
సకల సౌకర్యాలు ఏర్పాటు కు కృషి చేస్తున్న సీతక్క
నవంబర్ చివరి
నాటికల్ల పనులు పూర్తి జరుగుతాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ముసలమ్మ దేవాలయం పరిధిలో
10 షాపింగ్ రూములు
రెండు హోమ్ షెడ్లు మినరల్ వాటర్ ప్లాంట్ పార్కింగ్ ప్లస్
రోడ్డుకుఇరువైపులా ఫెన్సింగ్ ముసలమ్మ గుట్టకు దారి.తదితరులు అభివృద్ధి పనులు త్వరగతిగా కొనసాగుతున్నయి…

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది…

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది…

జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ ,విమోచన దినోత్సవాన్ని సైతం స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా
6 గ్యారెంటీలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.మంత్రి మంగళవారం మున్సిపాలిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారని, అమృత్ స్కీం కింద ఆర్కేపి,గద్దెరాగడి ఏరియాలలో 2 వాటర్ ట్యాంక్ లు ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తామని అన్నారు. రెండు ఏరియాలకు శ్మశాన వాటికలు సైతం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అఫ్జల్ లాడెన్,బొద్దుల ప్రేమ్ సాగర్,మేకల శ్రీను, గోపు రాజం,ఎల్పుల సత్యం,భైర మల్లేష్,ఎల్పుల మల్లేష్,బత్తుల శ్రీనివాస్,రామస్వామి, రామ కృష్ణ, బోనగిరి రవీందర్,పందిరి లింగయ్య,సరేష్,లచ్చులు,హరిప్రసాద్, శారద తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T153147.271.wav?_=3

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

#నాడు పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నం…

#ఇచ్చిన మాట ప్రకారం 80% పనులను పూర్తి చేయగలిగినం..

#4,53 వ డివిజన్ లలో 92.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 4 వ డివిజన్ జ్యోతి బసు నగర్ మరియు 53 వ డివిజన్ సరస్వతి నగర్ లో రూ.92.50 లక్షలతో అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.స్థానిక నాయకులు,ప్రజలతో కలసిన కాలనీల పరిస్థితులను పరిశీలించారు .

 

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతు నాడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ 80% పనులను పూర్తి చేశామని తెలిపారు.శంకుస్థాపన చేసిన అనతికాలంలో పనులు పూర్తి అయ్యేలా చేస్తున్నామని అన్నారు.గతంలో వర్షాకాలం వస్తే వరదలో హనుమకొండ అనే శీర్షికలు ఉండేవి అని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక్వత్వంలో ఒకటి రెండు మినహా వరద ప్రభావిత ప్రాంతాలు లేకుండా చేసుకున్నామని చెప్పారు.రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజల సహకారం ఉండాలని వెల్లడించారు.
ఈ కార్యక్రమలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు, జిల్లా ఆర్టిఏ మెంబర్ పల్లకొండ సతీష్,మాజీ కార్పొరేటర్ బోడ డిన్న,ఎర్రం మహేందర్ ఆయా డివిజన్ ల అధ్యక్షులు శ్రీధర్ యాదవ్,బాబాయ్ మరియు స్థానిక నాయకులు,కార్యకర్తలు,అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

అత్యవసరమైన ప్రతి పనిని పూర్తి చేస్తున్నాం..

అత్యవసరమైన ప్రతి పనిని పూర్తి చేస్తున్నాం..

#రెండేళ్లలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి పనులు..

#58 డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

#57 వ డివిజన్ గోకుల నగర్ ప్రాంతంలో కమిషనర్ తో కలిసి పరిశీలన …

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ ఈ రోజు 58 వ డివిజన్ పరిధిలోని స్నేహ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు.గడిచిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అత్యవసర ప్రాంతాలకు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు,నివారణ చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. ఏబీసీ లుగా పనులను గుర్తించి ఒక్కటిగా చేస్తున్నామని తెలిపారు.వర్షాలలో సైతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాలలో తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రతి కార్యక్రమంలో ప్రజల సహకారం వలనే సాధ్యమైందని అన్నారు.
నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ మేరకు 57 వ డివిజన్ గోకుల్ నగర్ ప్రాంతంలో నగర కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ తో కలసి ప్రాంతాలను పరిశీలించారు.వరద ప్రవాహానికి అడ్డుగా ఉండే ప్రాంతాలకు గుర్తించి పరిష్కార మార్గాలను చూడాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ భవనం,పీహెచ్ సి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T160734.964-1.wav?_=4

 

అంగన్వాడీ భవనం,పీహెచ్ సి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

 

 

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు
పనుల జాతర 2025 (పనుల ప్రారంభోత్సవం కొత్తగా ప్రారంభించే పనులకు భూమిపూజ కార్యక్రమం) లో బాగంగా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో అంగన్ వాడి భవనమునకు శంకుస్థాపన,పిఎచ్ సి భవనము ప్రారంభోత్సవం,జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు సైన్స్ ల్యాబ్ కు భూమి పూజ కార్యక్రమం, క్యాటింన్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన,అలాగే రాయపర్తి గ్రామంలో అంగన్వాడి భవనం ప్రారంభోత్సవంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని,ప్రతి గ్రామంలో మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన ధ్యేయం అని అన్నారు.గత ప్రభుత్వంలో శిలాఫలకాలకే పరిమితమయ్యారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతిన్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సురేఖ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-56-3.wav?_=5

అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం : మంత్రి కొండా సురేఖ

వరంగల్, నేటిధాత్రి.

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొత్తం రూ. 5.87 కోట్లు వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ నిధులు, జనరల్ ఫండ్ మరియు ఎస్ఎఫ్సి పథకాల కింద రూ. 4.87 కోట్ల విలువైన పలు పనులను ప్రారంభించారు. వీటిలో బస్తీ దవాఖాన, బీఆర్ నగర్లో సీసీ రోడ్లు, ఎన్ఎన్ నగర్, జ్యోతినగర్లో సీసీ రోడ్లు, అంబేడ్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, బీరన్నకుంట కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బట్టలబజార్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కిచెన్ షెడ్, రంగశాయిపేటలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం ఉన్నాయి. అదనంగా ఆర్అండ్బి శాఖ కింద రూ.

Minister Konda Surekha

కోటి వ్యయం తో మషూఖ్ రబ్బానీ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదనంగా, బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి, మేయర్, జిల్లా కలెక్టర్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్తో కలసి మధ్యాహ్న భోజనం వడ్డించారు. తరువాత కరీమాబాద్ పరపతి సంఘ భవనంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గంలో 2690 కొత్త కార్డులను జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6815 రేషన్ కార్డులు మంజూరు, వాటిలో 26766 కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు వివరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ….

Minister Konda Surekha

ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందజేస్తోందని, గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నారని,
లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అదనంగా, జిల్లాలోని విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు రామకృష్ణ మిషన్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో 123 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమం ప్రారంభించామన్నారు.

Minister Konda Surekha

మొదటి విడతలో కరీమాబాద్ సహా 55 పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో సమగ్ర అభివృద్ధి చేయడానికి మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ముంపు నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.నియోజకవర్గంలో అర్హులైన పేదల కోసం 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు, మరో 3500 ఇళ్లు ఈ సంవత్సరం కేటాయించనున్నట్టు వెల్లడించారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలోని అన్ని దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు, బల్దియా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Minister Konda Surekha

స్ధానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.

స్ధానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.

బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు.

కాశీబుగ్గ నేటిధాత్రి

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం ఆత్మకూరు మండలంలోని ఆగ్రాంపాడ్,లింగమడుగుపల్లె గ్రామాల్లో గ్రామకమిటీ అధ్యక్షులు శీలం సాంబయ్య, డుకిరే నాగేశ్వరరావు అధ్యక్షతన,మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశాల్లో మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన పనులు,సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో మట్టి అమ్ముకుంటున్నారని,దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, మాజీ ఏ ఏం సి చైర్మన్లు బొళ్లబోయిన రవియాదవ్,కాంతాల కేశవరెడ్డి,సర్పంచ్ ల ఫోరమ్ మాజీ మండల అధ్యక్షుడు సావురే రాజేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు బత్తిని వంశీగౌడ్, రెండు గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల సేవలు అభినందనీయం….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-31-5.wav?_=6

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల సేవలు అభినందనీయం….
మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దివంగత నేత దుగ్యాల శ్రీనివాసరావు సేవలు అభినందనీయమని తొరూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని స్థానిక దుగ్యాల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెల్తూరి మల్లేశం, మిట్ట కోల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలకోట్ల రూపాయలు తెచ్చి తొరూర్ మరియు పాత చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తొర్రూర్ మండలంలో కోర్టు మరియు డిగ్రీ కాలేజ్ సెంట్రల్ లైటింగ్, తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రైతుల కోసం సబ్ స్టేషన్ల నిర్మాణానికి కృషి చేశాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుమాండ్ల.నరేందర్ రెడ్డి , మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు మల్లేశం గౌడ్, దేవరకొండ శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు…

కేటీఆర్ పై బిజెపి చేసిన అనుచిత వాక్యాలు సరికాదు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23.wav?_=7

కేటీఆర్ పై బిజెపి చేసిన అనుచిత వాక్యాలు సరికాదు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్ లో
Ktr పై జిల్లా బీజేపీ నాయకులు చేసిన వాక్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన BRS సిరిసిల్ల పట్టణ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్…. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ రెండు కలసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అధికారం లో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ని నీలాదీయడం మానేసి ప్రతి పక్షం లో ఉన్న KTR ని విమర్శించడం వారి విజ్ఞత కే వదిలి వేస్తున్నాం. Ktr సిరిసిల్ల నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రతి గ్రామం లో మేము చూపిస్తాం మీ నాయకుడు మంత్రి హోదా లో ఉన్న బండి సంజయ్ ఏమి చేసారో కనీసo ప్రతి మండలం లో అయినా చూపెట్టే దమ్ము మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం.బండి సంజయ్ తనకు తాను పెద్ద నాయకుడు అనే భ్రమలో ఉన్నాడు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే వ్యక్తి బండి సంజయ్ కాదు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే శక్తి కూడా కాదు అటువంటి నాయకుడి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ KTR లేదు అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఇంకెన్ని రోజులు దేవుడి పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడతారు గల్లీ లో మాట్లాడడం కాదు ప్రజా సమస్యేలపై పార్లమెంట్ లో మాట్లాడాలని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు పాస్ అని తప్పించుకొని పోకుండా పోరాటం చేయాలనీ బండి సంజయ్ కోరుతున్నాను. ktr సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి కి ఏంతగానో కృషి చేసారు మళ్ళీ అధికారం లో కి వచ్చాక మరింత ముందుకు తీసుకెళ్లే దమ్ము ktr కి ఉంది బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రం లో కేంద్ర పరిది లో ఉన్న ఒక ఫ్లై ఓవర్ దాదాపు 8 సంవత్సరము లుగా పనులు పూర్తి గాక అసంపూర్తి గా ఉండి అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది అది కూడా పూర్తి చేయని అసమర్ధత కలిగిన Mp మనకు ఉండటం మన దౌర్భాగ్యం కేంద్ర పరిది లో ప్రజలకు అవసరంమైన ఎన్నో అభివృద్ధి పనులు ఉంటాయి వాటిని తీసుకు రాకుండ మీ కుటుంబం వచ్చి గుడి లో ప్రమాణం చేస్తే మా కుటుంబం వచ్చి ప్రమాణం చేస్తుంది ఇవ్వా ఒక కాబినెట్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు..అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం లో జిల్లా నాయకులు మెట్ట రాజు,కత్తెర వరుణ్ కుమార్, BRSV పట్టణ అధ్యక్షులు షేక్ సికిందర్, వడ్లురి సాయి, సూర్య, జోయేల్, వడ్లురి వేణు, ఆరుట్ల శరన్ పాల్గొన్నారు.

ఏఐఎంఐఎం నాయకులు సమస్యలపై మెమోరాండం అందించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-11T131810.969-2.wav?_=8

దారుస్సలాంలో అసదుద్దీన్ ఓవైసీ కౌసర్ మొహియుద్దీన్‌ కు జహీరాబాద్ ఏఐఎంఐఎం నాయకులు సమస్యలపై మెమోరాండం అందించిన

◆:- జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ,

◆:- దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, ఏఐఎంఐఎం క్రియాశీల నాయకుడు, జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ మరియు దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్, హైదరాబాద్‌లోని దారుస్సలాంలో అధ్యక్షుడు మజ్లిస్-ఇ-వర్కర్ పార్లమెంట్ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు అసెంబ్లీ సభ్యుడు మరియు మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ కౌసర్ మొహియుద్దీన్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో జహీరాబాద్ రాజకీయ వాతావరణంలో కొత్త కదలిక వచ్చింది.
ఈ సెషన్ కేవలం పరిచయ కార్యక్రమం కాదు. జహీరాబాద్‌లోని వివిధ మున్సిపల్ వార్డుల పరిస్థితి, ప్రజా సమస్యలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని చర్చించాల్సి ఉంది, అది జహీరాబాద్ అయినా లేదా కోహిర్ అయినా. వాజిద్ చర్చను లోతుగా చేస్తూ, ఎంపీటీసీ, జడ్పిటిసి గ్రామ పంచాయతీ మరియు వార్డు సభ్యుల పనితీరుపై వెలుగునింపారు మరియు షేఖాపూర్, మాడ్గి, దగ్వాల్ మరియు ఝరాసంగం యొక్క సర్పంచ్‌లు మరియు ఎన్నికైన ప్రతినిధులు ఈ ప్రాంత అభివృద్ధి మరియు అభివృద్ధిలో అందించిన గత సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు కౌసర్ మొహియుద్దీన్ జమాత్ ఈ అంశాలను తీవ్రంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో జమాత్ ప్రతినిధులకు ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించినట్లే, ఈసారి కూడా వ్యవస్థీకృత మరియు ఉత్సాహభరితమైన ప్రచారంతో రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని వారు తమ ప్రసంగంలో చెప్పారు. రాబోయే రోజుల్లో జహీరాబాద్ మరియు కోహిర్ ఝరాసంగం లలో ఏఐఎంఐఎం రాజకీయ కార్యకలాపాలు మరింత ముమ్మరం అవుతాయనే వాస్తవానికి ఈ సమావేశం ఒక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.

 

సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో.!

సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ పాల్గొని మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాలకు దెబ్బతిన్న ఉల్లేపల్లి గ్రామపంచాయతీలోని చెక్ డాం మర్మంతులకు,పురుషోత్తమాయ గూడెం చెక్ డాం మరమ్మతుకు, అబ్బాయి పాలెం రోడ్డుకు సెంటర్ లైటింగ్ మరమ్మకు, మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులకు మొత్తం సుమారు 3 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, పేద ప్రజలకు విద్య వైద్యం అందాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమన్నారు, అభివృద్ధిలో డోర్నకల్ నియోజకవర్గం ముందంజలో ఉంచామని పేద ప్రజల చిరకాల వాంఛ ఐనా ఇందిరమ్మ ఇండ్లు,నూతన రేషన్ కార్డులు వంటి కార్యక్రమాల్ని చేయడం జరుగుతుంది అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, పురుషోత్తమాయగూడెం తాజా మాజీ సర్పంచ్ నూకల అభినవరెడ్డి,శ్రీపాల్ రెడ్డి,నల్లు శ్రీకాంత్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, అంబరీష్య రామ్లాల్,మెంచు అశోక్ కుమార్, అబ్జల్,టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్,మాజీ సర్పంచులు,మాజీ కౌన్సిలర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు,ప్రజా ప్రతినిధులు,స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version