అంగన్వాడీ భవనం,పీహెచ్ సి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నడికూడ,నేటిధాత్రి:
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు
పనుల జాతర 2025 (పనుల ప్రారంభోత్సవం కొత్తగా ప్రారంభించే పనులకు భూమిపూజ కార్యక్రమం) లో బాగంగా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో అంగన్ వాడి భవనమునకు శంకుస్థాపన,పిఎచ్ సి భవనము ప్రారంభోత్సవం,జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు సైన్స్ ల్యాబ్ కు భూమి పూజ కార్యక్రమం, క్యాటింన్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన,అలాగే రాయపర్తి గ్రామంలో అంగన్వాడి భవనం ప్రారంభోత్సవంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని,ప్రతి గ్రామంలో మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన ధ్యేయం అని అన్నారు.గత ప్రభుత్వంలో శిలాఫలకాలకే పరిమితమయ్యారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతిన్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.