స్విమ్స్ లో చనిపోయిన తల్లి నేత్రలు దానం –
కందారపు కుటుంబ సభ్యులు.
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 11:
ఎస్వీ వైద్య కళాశాల, స్విమ్స్ ఆసుపత్రి లో కందారపు. రాజమ్మ అనారోగ్యం తో చికిత్స పొందుతూ మరణించారు, చనిపోయిన కందారపు
రాజమ్మ సుమారు 80 సంవత్సరాలు , యశోద నగర్, తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్విమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది.ఆమె కుమారులు కందారపు .మురళి, కందారపు
సురేంద్ర తన తల్లి నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం జరిగినది.
రుయా కంటి విభాగము విభాగాధిపతి డాక్టర్. చలపతి రెడ్డి అధ్వర్యంలో నేత్రాలను సేకరించి నేత్ర విభాగ, నేత్ర నిధి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది,
నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, చనిపోయిన వ్యక్తి కుమారులు సమ్మతితో ఆమై నేత్ర లు తీసుకోవడం జరిగినది. వెంటనే నేత్ర విభాగ టెక్నీషియన్ ఎస్,రమేష్, నేత్రాలను సేకరించి, నేత్ర బ్యాంకులో భద్రపరచడం జరిగినది.తన తదనంతరం అవయవ దానాలకు, నేత్ర దానాలకు, ముందుకు రావడం,
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేత్రాలను సేకరించడం జరుగుతున్నదిఅని నేత్ర విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి తెలిపారు. రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జే. రాధా మాట్లాడుతూ
వారి కుటుంబ సభ్యులు,ఈ విధంగా ప్రభుత్వ వైద్యశాలలకు నేత్రాలు, అవయవాలు దానం చేయడం వలన పేద రోగులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఈ అవయవాలను వారికి ఉచితముగా అమర్చడానికి ఇలాంటి అవయవ దానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పుర ప్రజలు ఎవరైనా నేత్ర దానం చేయాలంటే ఈ క్రిందిఫోను నెంబర్ కు సంప్రదించవచ్చును.
సెల్ నెంబర్: 8500880126,ఈ కార్యక్రమంలో ఎల్.వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఎస్,
రమేష్,మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర.ఓ.
వీర కిరణ్ పాల్గొన్నారు.