ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఏఐఎంఐఎం నాయకులు…

ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఏఐఎంఐఎం నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు మన సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కార్వాన్ ఎమ్మెల్యే జనాబ్ కౌసర్ మొహియుద్దీన్ సూచనల మేరకు, ఈరోజు మునిసిపల్ జహీరాబాద్‌లో కమిషనర్ ఎంసీజెడ్ తహశీల్దార్ జహీరాబాద్‌తో జరిగిన ఎన్నికల సమావేశంలో ఏఐఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అథర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొహియుద్దీన్ ఘౌరి సహబ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్మత్ పాషా మరియు పార్టీ క్యాడర్‌తో కలిసి పాల్గొన్నారు

చైనా మాంజా విక్రయంపై నిషేధం….

చైనా మాంజా విక్రయంపై నిషేధం….!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండల చరక్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాలలో చైనా మాంజా (నైలాన్‌/ప్లాస్టిక్‌ పూతతో తయారు చేసిన ప్రమాదకర మాంజా) వినియోగం, విక్రయాలపై నిషేధం అమలులో ఉందని జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నిషేధాన్ని ఉల్లంఘించి విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చైనా మాంజా కారణంగా పిల్లలు, యువకులు, పాదచారులు, బైక్‌పై వెళ్లేవారు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా మెడ, ముఖం, చేతులకు గాయాలవుతున్నాయన్నారు.

విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు

చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి

చరక్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో చైనా మాంజా (నైలాన్‌/ప్లాస్టిక్‌ పూతతో తయారు చేసిన ప్రమాదకర మాంజా) వినియోగం, విక్రయాలపై నిషేధం అమలులో ఉందని చరక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నిషేధాన్ని ఉల్లంఘించి విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చైనా మాంజా కారణంగా పిల్లలు, యువకులు, పాదచారులు, బైక్‌పై వెళ్లేవారు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా మెడ, ముఖం, చేతులకు గాయాలవుతున్నాయన్నారు.అలా గే పక్షులు, విద్యుత్‌ తీగలు, ప్రజల ఆస్తులకు కూడా నష్టం జరుగుతోందన్నారు. చైనా మాంజా విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు నియోజకవర్గంలో అన్ని మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి, దుకాణాలు, గోదాములు, తాతాలిక స్టాళ్లు, ఆన్‌లైన్‌ విక్రయాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీల్లో మాంజా బయటపడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని హెచ్చరించారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయించడంతో పాటు, దుకాణాలు, గోదాములను సీజ్‌ చేస్తామన్నారు. ఎక్కడైనా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్‌ 100 లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి గ్రామ స్వాములు…

శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి గ్రామ స్వాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి స్వాములు ఝరా సంఘం మండలంలోని చిలేపల్లి గ్రామ యువకులు సోమవారం ఉదయం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకొని ఆలయ అర్చకుల సమక్షంలో నియమనిష్టాలతో మాలధారణ వేశారు 41 రోజులు పాటు కొనసాగే మండల శివ దీక్షను శివ స్వాములు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. శివదీక్ష ప్రారంభించిన చీలపల్లి స్వాములు చిలపల్లి గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర దేవాలయంలో 41 రోజు పాటు మండల దీక్షను కొనసాగిస్తారు. అక్కడ నాగిరెడ్డి గురుస్వామి గారి ఆధ్వర్యం అనిల్ శివ స్వామి నర్సింలు శివ స్వామి నరేందర్ రెడ్డి శివ స్వామి భాస్కర్ రెడ్డి శివ స్వామి సిద్దు స్వామి సంగమేశ్వ రెడ్డి స్వామి కార్తిక్ స్వామి తదితర స్వాములు ఉంటున్నారు,

 గ్రూప్-1 ఉద్యోగం ఇప్పిస్తానని భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు….

 గ్రూప్-1 ఉద్యోగం ఇప్పిస్తానని భారీ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు

 

ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన జాబ్ ఫ్రాడ్ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ‘అబ్దుల్ కలామ్ ఓఎస్డీ’ అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, గ్రూప్ వన్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన జాబ్ ఫ్రాడ్ ఘటన (Hyderabad Job Fraud Case) హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ‘అబ్దుల్ కలామ్ ఓఎస్డీ’ ( Abdul Kalam OSD) అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, గ్రూప్ వన్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో (Banjara Hills Police Station) ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గ్రూప్–1 వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షలకు (Group-1 Exam) సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఫిర్యాదు వివరాలిలా..

బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రూప్–1 అభ్యర్థిని సయ్యద్ హైదర్ హుస్సేన్ అనే వ్యక్తి సంప్రదించాడు. తనకు ఢిల్లీలో ఉన్నత స్థాయిలోని నేతలతో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. ప్రభుత్వ పెద్దలతో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ తనకు నమ్మకం కలిగించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను అబ్దుల్ కలామ్ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేశానని చెప్పాడని తెలిపారు. గ్రూప్–1 ఉద్యోగం ఖచ్చితంగా ఇప్పిస్తానని భరోసా ఇచ్చినట్లు బాధితుడు వెల్లడించారు.

రూ.7 లక్షల వసూలు..

తనకు గ్రూప్–1 ఉద్యోగాన్ని 2022లో ఇప్పిస్తానని సయ్యద్ హైదర్ హుస్సేన్ చెప్పాడని తెలిపారు. బాధితుడి నుంచి రూ.7 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో పరీక్షలు రెండుసార్లు రద్దు అయ్యాయని వివరించారు. తనకు కొంత సమయం ఇవ్వాలని సయ్యద్ హైదర్ హుస్సేన్ మాటలు దాటవేశాడని బాధితుడు ఆరోపించారు. పరీక్షలు రద్దు కావడంతో ఉద్యోగం ఆలస్యమవుతోందని చెప్పాడని పేర్కొన్నారు. మరికొంత కాలం తనను వేచిచూడాలని కోరినట్లు తెలిపారు.

బెదిరింపులు..

తాను చెల్లించిన డబ్బులకు సంబంధించి చెక్ రాసి ఇవ్వాలని తాను ఒత్తిడి తెచ్చినప్పటి నుంచి సయ్యద్ హైదర్ హుస్సేన్‌లో పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా, తనను బెదిరింపులకు గురిచేస్తున్నాడని గ్రూప్–1 అభ్యర్థి ఆరోపించారు. డబ్బులు అడిగితే తనను చంపేస్తానని భయపెట్టాడని చెప్పుకొచ్చారు. తనకు ఆయన నుంచి ప్రాణహాని ఉండటంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని గ్రూప్–1 అభ్యర్థి ఫిర్యాదులో తెలిపారు.

బంజారాహిల్స్ పోలీసుల చర్యలు..

గ్రూప్–1 అభ్యర్థి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సయ్యద్ హైదర్ హుస్సేన్ పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. డబ్బుల లావాదేవీలు, బాధితుడు చూపించిన ఫొటోలు, చెప్పిన హోదా నిజమేనా అనే అంశాలపై కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సయ్యద్ హైదర్ హుస్సేన్‌ వల్ల ఇంకా ఎవరైనా మోసపోయారనే వివరాలు కూడా వెలికితీస్తామని బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.

ఉద్యోగాల పేరుతో మోసాలు

ఈ ఘటన ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై మరోసారి హెచ్చరికగా మారింది. గ్రూప్–1, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసే మధ్యవర్తులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా పారదర్శక పరీక్షా విధానాల ద్వారానే వస్తాయని స్పష్టం చేశారు. ఎవరైనా సిఫార్సు, పెద్దల పరిచయాలు అంటూ డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్న నేపథ్యంలో బాధితులకు న్యాయం జరుగుతుందని పోలీసులు భరోసా ఇచ్చారు.

అభ్యర్థుల్లో ఆందోళన..

గ్రూప్–1 వంటి ప్రతిష్ఠాత్మక ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటన యువత మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వారిని నమ్మకుండా, చట్టబద్ధమైన మార్గాల్లోనే ముందుకు సాగాలని బంజారాహిల్స్ పోలీసులు సూచించారు.

మేనేజర్ ఓవరాక్షన్.. ఉద్యోగి దిమ్మతిరిగే రియాక్షన్‌..

మేనేజర్ ఓవరాక్షన్.. ఉద్యోగి దిమ్మతిరిగే రియాక్షన్‌..

 

రాజకీయమైనా.. ఉద్యోగమైనా.. ప్లేస్ ఏదైనా.. తమ కింద పనిచేసే వ్యక్తులను, కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే పైవారికి విలువ ఉంటుంది. వారిపట్ల విధేయత, విశ్వాసం చూపుతారు. అలాంటి పరిస్థితి లేకుండా.. కేవలం విమర్శనాత్మక ధోరణి, చులకన భావంతో వ్యవహరిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: రాజకీయమైనా.. ఉద్యోగమైనా.. ప్లేస్ ఏదైనా.. తమ కింద పనిచేసే వ్యక్తులను, కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే పైవారికి విలువ ఉంటుంది. వారిపట్ల విధేయత, విశ్వాసం చూపుతారు. అలాంటి పరిస్థితి లేకుండా.. కేవలం విమర్శనాత్మక ధోరణి, చులకన భావంతో వ్యవహరిస్తే.. గౌరవం కాదు కదా.. కనీసం విలువ కూడా ఇవ్వని పరిస్థితి ఉంటుంది. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే వెలుగులోకి వచ్చింది. సెలవు కోరితే.. చులకనగా మాట్లాడిన మేనేజర్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది ఓ ఉద్యోగిని. ఈ ఘటన గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..సదరు పోస్టులో ఏ ప్రాంతంలో జరిగింది అనే వివరాలు పేర్కొనలేదు గానీ.. ఓ ప్రైవేటు బ్యాంకులో చాలా సంవత్సరాల నుంచి ఓ మహిళ ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఆమె తల్లి అనారోగ్యానికి గురవడంతో.. ఆమెకు సహాయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తనకు కొద్ది రోజులు సెలవు కావాలని.. తన తల్లికి అనారోగ్యం కారణంగా సహాయంగా ఉండాలని మేనేజర్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే, దీనికి స్పందించిన మేనేజర్ అమార్యదకరంగా మాట్లాడాడు. ‘ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్‌లో గానీ, షెల్టర్ హోమ్‌లో గానీ ఉంచి ఆఫీసుకు వచ్చేయండి. సెలవులు ఇవ్వడం కుదరదు.’ అని సమాధానం ఇచ్చాడు. మేనేజర్ మాట్లాడిన విధానంతో మనస్తాపానికి గురైన సదరు ఉద్యోగిని.. ఉద్యోగం కంటే తనకు తన తల్లే ముఖ్యం అని భావించింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఈ విషయాన్ని Mr_Moulick అనే రెడిట్ యూజర్ r/IndianWorkplace సబ్‌రెడిట్‌లోని పోస్ట్‌ చేశారు. రిజైన్ చేసిన ఉద్యోగిని కొన్ని సంవత్సరాలపాటు బ్యాంకులో పని చేశారని.. అలాంటి వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సరైదేనా? పని ప్రదేశాలలో ఇలాంటి వాతావరణం, మాటలు సమర్థనీయమేనా అంటూ తన పోస్టులో ప్రశ్నించారామె.

అజంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్…

అజంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామంలో అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు బిపి, షుగర్,గుండె పరీక్ష,కంటీ పరీక్ష చేయించి అర్హులు అయిన వారికి కళ్ళజోడు ఇవ్వడం జరిగింది.దానికి గెస్ట్ గా గణపురం స్టేషన్ ఎస్సై రేఖ అశోక్ , సర్పంచ్ సునీత- శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్ మాట్లాడుతూ ఆరోగ్యంలేని మనిషి జీవితంలో ఏదీ సాదించలేడు, మనకు రోగం బారిన పడితే తప్ప ఆరోగ్యం గురించి ఆలోచన రాదు, దాని కోసం ఎల్లవేళలా గ్రామ ప్రజలు బాగుండాలి అని ఈ నిర్ణయం అజంతా యూత్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అజంతా యూత్ అసోసియేషన్ ఉప అధ్యక్షులు చిన్న కుమార్, కోశాధికారి కుక్కమూడి నవీన్, ప్రధాన కార్యదర్శి మట్టెవాడ హరీష్, కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, ప్రచార కార్యదర్శి కన్నూరి రంజిత్, సలహాదారులు కుర్రి రాజు,కుక్కమూడి అశోక్,కుక్కమూడి కుమార్ , రమేష్, కళ్యాణ్, నవీన్, నరేష్,సాయి, మహేష్, గణేష్,గ్రామ పెద్దలు, ఉపసర్పంచ్, వార్దుమెంబెర్స్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి…

దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హనుమకొండ:నేటిధాత్రి

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న తమ భూమిలోకి బాట లేదని వెళ్లనివ్వకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన బొక్క తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు . తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 133 ఏ, 133 బి, 148b2, 148సి/1/1/3 సర్వే నెంబర్లలో మొత్తం మూడు ఎకరాల రెండు గుంటల భూమి ఉండగా గత 45 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నామని కానీ గత కొంతకాలంగా తమ భూమి లోకి వెళ్లకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. ఇదే విషయంపై గతంలోనే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్ కు రిఫర్ చేసిందని దానితో స్థానిక ఆర్డిఓ తహసిల్దార్ విచారణ చేసి గతంలో లాగానే వ్యవసాయ పనుల నిమిత్తం మోహన్ రెడ్డి భూమి నుండి తమ భూమి లోకి వెళ్లే విధంగా తీర్పు ఇచ్చారని దానికి మోహన్ రెడ్డి సైతం ఒప్పుకున్నాడని అన్నారు. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తూ వ్యవసాయ పనులకు తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని అన్నారు. గతంలో తమను తీవ్రంగా కులం పేరుతో దూషించడంతో పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని దానిని ఇప్పుడు ఉపసంహరించుకోమని తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు.దీని పూర్తి వివరాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి…

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి.

#గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే.

#బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

పల్లెల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి గ్రామపంచాయతీలో గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని తప్పనిసరిగా పెట్టాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూపర్డెంట్ ఆలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే 14వ, 15వ ఆర్థిక సంఘం ద్వారానే గ్రామపంచాయతీలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అందుకనే నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో ప్రతి గ్రామ పంచాయతీ లో మీమే ఫోటోను పెడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, జిల్లా నాయకుడు బచ్చు వెంకటేశ్వరరావు, నాయకులు మురికి మనోహర్, ఓదెల అశోక్, ఊటుకూరి చిరంజీవి, శివ, కొండ్లె రమేష్ నవీన్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం…

కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 5 :

 

 

 

మున్సిపల్ ఎన్నికలు లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఉందని మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు – మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మూడుచింతల పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి కమిటీని సోమవారం ప్రకటించారు. కమిటీ మండల అధ్యక్షుడిగా దోసకాయల వెంకటేశం, ఉపాధ్యక్షులుగా పుర్రెలి నరసారెడ్డి, గుర్రం బసవ రెడ్డి, నర్సింగ్ రావు గౌడ్, మర్యాల వీరేశం గుప్తా, తడిసిన వీరారెడ్డి, మహమ్మద్ జాఫర్ ప్రధాన కార్యదర్శిగా, వంగ భూపాల్ రెడ్డి, బండి జగన్నాథం, కమ్మరి బాలకృష్ణ, కామెడీ శశిధర్ రెడ్డి, కార్యదర్శులుగా సుంకు బుచ్చిరెడ్డి, కాషామైన ప్రవీణ్ కుమార్, కీసరి నర్సింహులు, తునికి వెంకటేష్ , ముద్రం పాపిరెడ్డి, స్పోర్ట్స్ పర్సన్ గా రవీందర్, ట్రెజరర్ గా బుద్ధి సదానందం, కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గా వంగ దామోదర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా జయల పాండు బీసీ సెల్ అధ్యక్షులుగా
గుండపల్లి శ్రీకాంత్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా దాసరి నాగేశ్వర్, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా కేతావత్ శ్రీకాంత్ నాయక్, మైనారిటీ సెల్ అధ్యక్షులుగా మహమ్మద్ యూషఫ్, సేవా దళ్ అధ్యక్షులుగా భానుచందర్ రెడ్డి లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాలరావు, కొల్తూరు గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహ, గోవర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పట్టా బాల నరసింహ, కరుణాకర్, దుర్గం ప్రవీణ్ యాదవ్, గురువయ్య, నల్ల శిల్పా యాదగిరి, వంగ వెంకటరమణారెడ్డి, తూము వేణుగోపాల్, సురేష్, మధుసూదన్ రెడ్డి, జగన్ గూడ రవీందర్, జలీల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు

హనుమకొండ:నేటిధాత్రి

 

తమపై దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ గుండ్ల సింగార నికి చెందిన బౌతు అన్నపూర్ణ సోమవారం ప్రజావాణిలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అన్నపూర్ణ తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ గుండ్ల సింగారం సర్వే నెంబర్ 175 లోని ప్లాట్ నెంబర్ 22ను తమ 2017లో కటకం కవిత దగ్గర కొనుగోలు చేసి దానిలో ఇల్లు నిర్మించుకున్నామని దాని పక్కనే ఉన్న ఫ్లాట్ నెంబర్ 26 ఖాళీగా ఉండేది దానిని ధార సీత కొనుగోలు చేసి అప్పటి నుండి తన కొనుగోలు చేసిన స్థలంలోని కొంత భాగం తమ ఇంటి లోపల ఉంది అని దౌర్జన్యం చేస్తూ గొడవకు దిగుతుందని ఆరోపించారు. ఇదే విషయమై గతంలో తహసిల్దార్ కు ఫిర్యాదు చేయగా వారు వచ్చి సర్వే చేసి హద్దులు నిర్ణయించారని కానీ హద్దులు కరెక్ట్ కాదు అని మళ్లీ తమ పహారి గోడను కూలగొట్టి తమ ఇంటి లోపల పిల్లర్ వేసిందని అన్నారు. తాము భయభ్రాంతులకు గురై డయల్ 100కు కాల్ చేయగా పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వినకుండా తమపై బెదిరింపులకు దిగుతుందని అన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న మహిళపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బానోతు సారంగపాణి…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బానోతు సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యూత్ నాయకుడు ఎర్ర సుమన్ తండ్రి మోహన్ రెడ్డి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్తివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, నాయకులు లే0కాలసాయిలు, చల్ల రాజన్న, మెరుగు రాజు, చిన్నాల మల్లేష్, కడుదూరీ సురేందర్, కూ స కళింగ రాజు, లింగయ్య, చంద్రమౌళి, రవి తదితరులు ఉన్నారు.

వరంగల్ జిల్లా భూకొలతదారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక..

వరంగల్ జిల్లా భూకొలతదారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక

వరంగల్, నేటిధాత్రి

 

వరంగల్ జిల్లా అనుమతి పొందిన భూకొలతదారుల సంఘం–2025 నూతన కార్యవర్గ ఎన్నికలు రంగశాయిపేటలోని ఓ కార్యాలయంలో జనవరి 4వ తేదీ రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికలను న్యాయ సలహాదారులు గోనె విజయ్ రెడ్డి, బర్ల పూర్ణచందర్ పర్యవేక్షించారు.
ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా దేవునూరి రాజు ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రంగు శివ, ఉపాధ్యక్షుడిగా జినికిరి రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గజవెల్లి ప్రదీప్, వరంగల్ విభాగ సమన్వయకర్తగా మామిడాల సాయిరామ్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా బొమ్మెర రమ, మరుపట్ల ఏకాంబరం, కోశాధికారిగా ధర్మసోత్ కిరణ్, సలహాదారుగా ఆవునూరి శివకుమార్‌ను నియమించారు.
మహిళా విభాగం సమన్వయకర్తగా బలుగురి దీపిక, నర్సంపేట విభాగం సమన్వయకర్తగా పెంతల విష్ణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలోని పదమూడు మండలాలకు పదమూడు మంది సమన్వయకర్తలు బాధ్యతలు స్వీకరించారు.
ఎన్నికల అనంతరం అధ్యక్షుడు దేవునూరి రాజు మాట్లాడుతూ, త్వరలోనే డెబ్బై గ్రామాల్లో పునః భూకొలతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తామని, భూకొలతదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సభ్యులందరూ ఐకమత్యంతో నిరంతరం కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కీ సన్మానం…

మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కీ సన్మానం

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లెల భాగ్యమ్మ ను సోమవారం మహిళా మండలి వివో (VO) అధ్యక్షులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు సర్పంచ్‌కు శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలియజేశారు.
​ఈ కార్యక్రమంలో .. సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ కొత్తగూడ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు, తనను గౌరవించిన మహిళా సంఘాల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి వివో ప్రతినిధులు, సీసీ విజయ, వివోలు సురేష్, ప్రమీల, జానకి,గ్రామ ప్రముఖులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

వట్టివాగులోకి చేరిన ఎస్సారెస్పీ జలాలు..

వట్టివాగులోకి చేరిన ఎస్సారెస్పీ జలాలు

అర్పణపల్లి చేరిన ఎస్సారెస్పీ కెనాల్ సాగునీరు

పసుపు కుంకుమలతో స్వాగతం…గ్రామ సర్పంచ్ చీర వెంకటమ్మ వీరస్వామి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఎస్సారెస్పీ కాలువ చివరి భూములకు నీరందించాలన్న ఆశయంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. యాసంగి పంటలకు గాను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నేరుగా కాకతీయ మెయిన్ గీసుకొండలోని కాలువ ద్వారా డీబీఎం-40 ఎస్సారెస్పీ కాలువ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటితో పరవళ్లు తొక్కింది. గూడూరు మండలంలోని గుండెంగ, గాజులగట్టు, తీగలవేణి గ్రామల మీదుగా కేసముద్రం మండలంలోని అర్పణపల్లి చెరువులు, కుంటల్లోకి ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు వచ్చి చేరుతోంది. యాసంగిలో చివరి గ్రామాలకు నీరందించేందుకు ప్రభుత్వ ముఖ్యసల హాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్లు చొరవతో కేసముద్రం మండలంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ కెనాల్ ద్వార నీరు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదట సారి ప్రభుత్వం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి స్వగ్రామంలో ఊర చెరువు లోకి ఎస్సారెస్పీ నీరు అందడంతో గ్రామస్తులు హార్షం వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీర వెంకటమ్మ విరస్వామి , ఉపసర్పంచ్ కంచ రాధికా శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామగోని సారయ్య, మాజీ సర్పంచ్ గంధసిరి వెంకన్న, గంధసిరి వెంకటద్రి చీర భద్రయ్య,వార్డ్ మెంబెర్ చీర బుచ్చివీరం, తగురు వెంకటనర్సు, సాయిబాబా, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

నూతన సర్పంచ్ కు ఘన సన్మానం..

నూతన సర్పంచ్ కు ఘన సన్మానం

మైలారం మున్నూరు కాపు కిసాన్ సంక్షేమ సంఘం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం మైలా రం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నూనె దివ్య తిరుపతినీ మున్నూరుకాపు కిసాన్ సంక్షేమ సంఘం అధ్య క్షుడు పంచగిరినర్సయ్య మరి యు ఉపాధ్యక్షులు నూనె శ్రీనివాస్ మున్నూరు కాపు సభ్యులు వీరికి అభినందనలు తెలిపి వారిని శాలువాతో సన్మానించారు.అనంతరం గ్రామ ప్రజలు మీపై నమ్మకంతో మిమ్మల్ని సర్పంచ్ ఎన్నుకు న్నారు రాజకీయాల కతీతంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పనకు కృషిచేయాలని అదేవిధంగా గ్రామ అభివృ ద్ధికోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు…

అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు.

#కెనాల్ సరిహద్దు వదిలి నిర్మాణాలు చేసుకోవాలి.

#అక్రమ నిర్మాణాలు చేసేవారికి నోటీసులు జారీ.

#డిబిఎం 38 కెనాల్ భూమిపై భారీ వాహనాలు వెళ్ళకూడదు.

#రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసిన ఏ ఈ పవిత్ర.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

డిబిఎం 38 కెనాల్ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏ ఈ పవిత్ర పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న కెనాల్ భూమిని ఎలాంటి సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు అందడంతో నిర్మాణం చేపడుతున్న స్థలాలతోపాటు గతంలో నిర్మాణం చేపట్టిన వారికి శాఖ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కెనాల్ హద్దులు దాటి భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్మాణాలు చేపడుతున్న వారు తక్షణమే నిర్మాణాలు ఆపివేయాలని సంబంధితలను ఆదేశించారు.

#భారీ వాహనాలతో ధ్వంసం అవుతున్న సిసి రోడ్.

మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారి నుండి కస్తూరిబా గురుకుల పాఠశాలకు డిబిఎం 38 కెనాల్ పై నుండి రహదారి కోసం సిసి రోడ్ నిర్మాణం చేయగా. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే సీతా రామాంజనేయ స్వామి ఆలయం ప్రక్కన రెడ్ మిక్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చే దుమ్ము దూళితో విద్యార్థులు, భక్తులు, చుట్టు ప్రక్కన ఉన్న ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు కర్మాగారానికి వాహనాలు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో సంబంధిత శాఖ అధికారుల అనుమతి లేకుండానే కెనాల్ పై భారీ వాహనాలు నడపడంతో గురుకుల పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందు పడుతున్నారని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తక్షణమే కెనాల్ దారి వెంబడి వాహనాలు నడపరాదని జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ప్లాంట్ నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు ఏఈ పవిత్ర తెలిపారు. ఆమె వెంట రెవిన్యూ ఏఆర్ఐ చామంతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక.

తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక.

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

తెలంగాణ జాగృతి దాదాపుగా 20 సంవత్సరాల క్రితం పిరియడ్ మందితో మొదలై, తెలంగాణ ఉద్యమంలో మమేకమై పోరాడినటువంటి సంస్థలో, ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీల సహకారంతో జాగృతి అంచలంచెలు ఎదిగిన విషయం వాస్తవం. అప్పటి బడుగు బలహీనవర్గాల కార్యకర్తల కృషితో కల్వకుంట్ల కవిత అధికారం వచ్చిన తర్వాత అందలమెక్కి, అధికార గర్వంతో కార్యకర్తల భుజాలను తొక్కి విలాసవంతమైన జీవితం అనుభవించి, తన గురించి పని చేసిన కార్యకర్తలను మరిచి, అప్పుడు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఈరోజు తమ ఉనికి చాటుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా జాగృతి జనం బాట అనే కార్యక్రమంతో రావడం సిగ్గుచేటు. జాగృతి జనం పాట కార్యక్రమంలో భాగంగా రేపు సిరిసిల్ల జిల్లా పర్యటన కి వచ్చే సందర్భంలో ఎక్కడ కూడా ఆదరణ లభించకపోవడంతో డబ్బులు పంచి, జనాలను మభ్యపెట్టి కొంతమందిని కూడా పెట్టి ఉనికి చాటుకోవడం కోసం మాత్రమే ఈ పర్యటన. పర్యటనకు ముందు సాహితీవేత్తలను, కళాకారులను, బడుగు బలహీన వర్గాలను, మేధావులతో సమావేశాలు పెడతా అని చెప్పి కనీసం వీరిలో ఎవరిని కలవడం లేదు. ఎందుకంటే వీరెవరు కూడా కవితతో కలవడానికి ఇష్టం లేక ముఖం చాటేస్తున్నారు. అందుగురించి ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడికి వెళ్లి వారిని కలవడానికి కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. గుడిలోకి పోతే భక్తులతో, హాస్పిటల్ కి వెళ్తే రోగులతో, స్కూల్లోకి వెళితే విద్యార్థులతో కలిసి మాత్రమే మాకు చాలా ఆదరణ ఉందని చెప్పుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి అధికారం కోల్పోయిన తర్వాత రావడం సిగ్గుచేటు. సిరిసిల్లలో ఉన్న బీడీ కార్మికులకు కనీసం పెన్షన్ విషయంలో ఇంతవరకు మాట్లాడని కవిత ఈరోజు మాట్లాడానికి వస్తుండడం మనం ఆలోచించాలి. రాష్ట్రంలో మహిళా సాధికారత గురించి కృషి చేస్తా అన్న కవిత రాష్ట్రంలో ఎంతోమంది మహిళలకు అన్యాయం జరిగినప్పుడు పని నెత్తి కూడా మాట్లాడలేదు. ఖమ్మం జిల్లా చింతపల్లి మండలంలో మరియమ్మ లాక్ అప్డేట్ గాని, ఎల్బీనగర్ లో లక్ష్మీ అనే మహిళను అప్పటి పోలీసులు విచక్షణారహితంగా కొట్టినప్పుడు మాట్లాడలేదు, గ్రూప్ వన్ అభ్యర్థిని చనిపోయినప్పుడు కనీసం పరామర్శించిన పాపాన పోలేదు, వరంగల్ విద్యార్థిని చనిపోయినప్పుడు కూడా సానుభూతి తెలియజేయలేదు. ఇలాంటి అంశాలు ఎన్నింటినో జాగృతి బాధితుల ఐక్యవేదిక నుండి ప్రతి జిల్లాలో ఎండ కట్టడానికి జాగృతి బాధితులు మరియు వారి కుటుంబాలు కవితను ప్రశ్నించడానికి ఐక్యవేదికగా ఏర్పాటు చేయనున్నాం.

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

మృతుల కుటుంబాలను పరామర్శించిన విష్ణు రెడ్డి..

#తదుపరి కాజీపేటలో సీసీ కెమెరాల ప్రారంభం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన నాయకులు విష్ణు రెడ్డి ఆదివారం రోజున 47వ, 62వ డివిజన్‌లలో వివిధ కారణాలతో మృతి చెందిన దబ్బేట ఐలేష్,గద్దల కోర్నెల్,దాట్ల బాబు,బంగారి రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు కాజీపేట పెద్దమ్మతల్లి హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు)ను ఎసిపి ప్రశాంత్ రెడ్డి, సిఐ సుధాకర్ రెడ్డి తో కలిసి విష్ణు రెడ్డి ప్రారంభించారు. ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సంబంధిత డివిజన్‌ల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పార్టీలో యువతకు అవకాశం ఇవ్వండి…

పార్టీలో యువతకు అవకాశం ఇవ్వండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టి పి సి సి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తన నివసరంలో కలిసి శాలువాతో సన్మానం చేసిన డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త బీసీ ఉద్యమ నేత . మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో మా ప్రాంతం నుండి బీసీ యువకుడినైన నాకు జడ్పిటిసిగా అవకాశం కల్పిస్తే అంతఃకరణ శుద్ధితో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ హక్కుల కొరకు కృషి చేస్తానని ఝరాసంగం మండల కొల్లూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధన్ రాజ్ గౌడ్ అన్నారు మాలాంటి యువతను రాజకీయంగా ప్రోత్సహించాలని మహేష్ కుమార్ గౌడ్ గారిని వారు అభ్యర్థించారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమానత్వం ఉంటుంది యువతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వడం జరిగిందని డా: ధన్ రాజ్ గౌడ్ అన్నారు అనంతరం మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ధన్ రాజ్ గౌడ్,

ప్రజావాణిలో దరఖాస్తులు స్వకరించిన కలెక్టర్..

ప్రజావాణిలో దరఖాస్తులు స్వకరించిన కలెక్టర్

సీ ఎం కార్యలయము ప్రజా వాణి నుండి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కార్యాలయంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తులను కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వకరించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి లో 40 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్ ప్రజాభవన్ నుండి ప్రజావాణిలో వచ్చిన, దరఖాస్తులు పరిష్కరించాలని జిల్లా లో ని అధికారులను కలెక్టర్ ఆదేశించారు

error: Content is protected !!
Exit mobile version