జహీరాబాద్ ఆస్తి, వాణిజ్య పన్నులు: 31వ తేదీలోపు చెల్లించకపోతే కఠిన చర్యలు…

జహీరాబాద్ ఆస్తి, వాణిజ్య పన్నులు: 31వ తేదీలోపు చెల్లించకపోతే కఠిన చర్యలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి, వాణిజ్య పన్నులను ఈ నెల 31వ తేదీలోపు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జైత్ రామ్ బుధవారం సూచించారు. పన్ను వసూలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో లేదా ఇంటికి వచ్చే బిల్ కలెక్టర్లకు పన్నులు చెల్లించవచ్చు.
గడువులోగా పన్నులు చెల్లించకపోతే తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సూచన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గానికి వర్తిస్తుంది.

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ ఏర్పాట్ల పరిశీలన..

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ ఏర్పాట్ల పరిశీలన..

గీసుకొండ ఎంపీఓ పాక శ్రీనివాసులు

సుమారు నాలుగు లక్షల మంది భక్తుల దర్శనం

*నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో
గీసుకొండ ఎంపీఓ పాక శ్రీనివాసులు ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రథోత్సవం జరిగే క్రమంలో భక్తులకు సౌకర్యాలు కలిగించాలని సూచించారు. జాతరలో పారిశుద్ధం లోపించకుండా జాగ్రత్తలు పడాలని తెలిపారు. ఆదివారం భక్తుల రద్దీనీ దృష్టిలో పెట్టుకొని మంచినీటి సౌకర్యం పట్ల సిబ్బందితో పర్యవేక్షించాలని పంచాయతీ కార్యదర్శి శంకర్ రావుకు సూచించారు.

శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారన్నారు. రథోత్సవం సందర్భంగా శనివారం రాత్రి ఆదివారం రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన జమున ప్రవీణ్, దేవాలయ ప్రధాన అర్చకులు
రామాచార్యులు,ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుకు ఆహ్వాన పత్రికను అందజేసిన మేడ్చల్ మాజీ మంత్రి…

ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుకు ఆహ్వాన పత్రికను అందజేసిన మేడ్చల్ మాజీ మంత్రి,

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కొణింటి మాణిక్ రావును ఆహ్వానించారు. చామకూర మల్లా రెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం (స్వర్ణోత్సవం).
ఈ కార్యక్రమం ఈ నెల 19న జరుగుతుంది.
ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

అక్రమ పశువదశాల పట్టించుకోని అధికారులు…

అక్రమ పశువదశాల పట్టించుకోని అధికారులు.

◆-: అనుమతులు లేకుండా నిర్వహణ…..

◆-: స్థానిక అధికారులతో కుమ్మక్కు……

◆-: మాంసం విక్రయ జీరో దందా…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం లోని నాల్కల్ మండలంలో అక్రమ పశువాదశాల కొనసాగుతున్న అధికారులు పట్టించు కోవడంతీలేదని తెలిసింది. న్యాల్కల్ మండలం మల్లీ గ్రామ శివారులో వెలసిన ఈ పశువర్ధశాల లో బర్రెలు ఆవులు ఎడ్లు వధించి వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పరిసర ప్రాంతమంతా దుర్గంధం వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పశువాదశాల కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటం వల్ల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పశువాదశాల నుండి మాంసాన్ని హైదరాబాద్ బీదర్ జహీరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పశువాదశాలలో పరిసర ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా ఏవైనా పశువులు చనిపోతే వాటిని తీసుకువచ్చి వాటిని మాంసాన్ని కూడా ఎగుమతి చేస్తున్నారు.

పశువుల తో పాటు కుక్కలను కూడా తీసుకువచ్చి వాటి మాంసాన్ని కూడా మేక మాంసంల హైదరాబాద్ తో పాటు వివిధ పట్టణాలకు మేక మాంసంల ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. బీదర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మల్లీ న్యాల్కల్ మండలం కు చెందిన శివారులో ఈ పశువాదశాల ఉండటం వల్ల ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెళ్లి వాటి గురించి అడగగా వారిని బెదిరింపులకు గురి చేస్తూ గుండాయిజం చేస్తున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు తెలిపారు. ఈ పశువాదశాల గురించి అధికారులకు గ్రామ ప్రజలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పశువాదశాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ ప్రాంతానికి పోలీసులు కూడా వెళ్లడం లేదని అటువైపు కన్నెత్తి కూడా చూడరని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈ పశువాదశాల నుండి ప్రతిరోజు టన్నులకొద్దీ మాంసాన్ని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నప్పటికీ ఇలాంటి ప్రభుత్వానికి టాక్స్ కూడా చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా గండి పడుతుంది. ఏది ఏమైనా పనికి జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి మళ్లీ గ్రామంలో ఉన్న ఈ పశువాదశాలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

శ్మశానవాటిక ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన, ట్రాక్టర్ స్వాధీనం…

శ్మశానవాటిక ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన, ట్రాక్టర్ స్వాధీనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం రుకుమాపూర్ గ్రామంలో పురాతన ముస్లిం శ్మశానవాటికను ఆక్రమించే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు రావడంతో జహీరాబాద్ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అతర్ అహ్మద్ అక్కడికి తమ నాయకులతో చేరుకొని మరియు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పత్రికేయులతో మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు తమ భూమికి మార్గం చేసుకునేందుకు శ్మశానవాటిక భాగాన్ని కూల్చివేసి ఆక్రమించేందుకు ప్రయత్నించారని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ప్రభు తెలిపారు. స్థానిక ముస్లిం ప్రతినిధులు, గ్రామస్తులు భూమిని రక్షించి, బాధ్యులపై కఠిన మైన అధికారిక చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం…

మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం
పి ఎం శ్రీ జవహర్ నవోదయ నల్గొండ

నేటిధాత్రి చలకుర్తి క్యాంప్:

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ జిల్లా పి ఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ చిలకుర్తి క్యాంపులో మహిళా ఉద్యోగులందరికీ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శంకర్ గారి ఆధ్వర్యంలో పూల మొక్కలు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. ఈ సమాజంలో మహిళల యొక్క పాత్ర అన్ని రంగాలలో ముందు ఉండాలని ఉపాధ్యాయులు వారి యొక్క ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులైన ఓఎస్ జానకి ,చంద్రకళ, పి ఈ టి మంజుల రాధా, ఆర్ట్ విజయదుర్గ , టిజిటి ఇంగ్లీష్ రీమా, పి జి టి కెమిస్ట్రీ కళ్యాణి, పిజిటి హిస్టరీ మమత, పిజిటి ఇంగ్లీష్ రాఘవి , మహిళా కౌన్సిలర్ స్రవంతి , కంప్యూటర్ సైన్స్ భాగ్య రేఖ, స్టాఫ్ నర్స్ నిర్మల, అటెండర్ అరుణమ్మ , మట్రన్స్ సరిత, విజయ, మరియు మెస్ వర్కర్స్ సాలమ్మ ,మంగమ్మ,ముత్తమ్మ మొదలగు మహిళా ఉద్యోగులను ఘనంగా శాలువాలు కప్పి సన్మానం చేశారు.
ఉపాధ్యాయులైన భాస్కరాచారి, అమరలింగా చారి, సంతోష్ ,శేఖర్ శర్మ ,గురప్ప, విష్ణుశర్మ ,ఆచార్యులు, రాజేష్ ,మోహన్ , విష్ణు అమోల్ గోజే, మురళి, హేమంత్ , లక్ష్మయ్య తదితర ఉపాధ్యాయ ఉపాధ్యాయేత బృందం కలిసి మహిళా ఉద్యోగులను సన్మానించడం జరిగింది. ఆచార్యులు తెలుగు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉన్నారని ఏదైనా సాధించగలరని గడిచిపోయిన కాలానికి ప్రస్తుత కాలానికి ఆడవాళ్ళ పాత్రను గురించి ప్రసంగించడం జరిగింది. విష్ణు శర్మ తెలుగు ఉపాధ్యాయులు స్త్రీ యొక్క గొప్పతనం గురించి ‘యంత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్రదేవత’ అంటూ కవిత్వాన్ని వినిపించడం జరిగింది. పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ స్త్రీ యొక్క గౌరవం గురించి సమాజంలో స్త్రీ యొక్క పాత్ర గురించి పాఠశాలలో మహిళా ఉద్యోగులు నిర్వర్తిస్తున్న విధులను గురించి ప్రసంగించడం జరిగింది. అలాగే శేఖర్ శర్మ మాట్లాడుతూ మగవారు లేకపోయినా ఆడవారు సంసారాన్ని సమాజాన్ని తన శక్తిని ఉపయోగించి ముందుకు తీసుకెళ్లగలుగుతుందని గౌతమ బుద్ధుని భార్య అయిన యశోదర గురించి చెప్పడం జరిగింది. అన్ని ఆలోచించగల ధైర్యం ఆడవారికి ఉంది అని శేఖర్ శర్మ సైన్సు ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. అలాగే సత్యనారాయణ టీజీటీ హిందీ ఉపాధ్యాయులు తన యొక్క కవిత్వాన్ని వినిపించడం జరిగింది. గురప్ప మహిళా దినోత్సవాన్నీ పురస్కరించుకొని మాట్లాడుతూ తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా స్త్రీ యొక్క పాత్రను గురించి వివరించడం జరిగింది. సమాజంలో ఆడవారికి ఉండే పాత్రను గురించి అందరూ మాట్లాడారు తర్వాత మహిళా ఉద్యోగులందరికీ శాలువాలు మరియు పువ్వుల మొక్కలు ఇచ్చి వారిని సన్మానించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

నాగర్ కర్నూల్ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు పాల్గొని పరిశుభ్రత పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే గారు తానే స్వయంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ తో పాటు మున్సిపల్ స్టాప్ కలిసి చీపురు పట్టి శుభ్రత పనుల్లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కోసం ప్రత్యేక లోగోను రూపొందించారని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా చర్చలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్ కౌన్సిలర్స్ వార్డ్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ ఏ ఈ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత…

మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత

మంత్రి వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

మహిళా సంక్షేమం,అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ గౌడ్ ,డి సి సి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి లతో కలిసి గ్రామైఖ్య సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమం,అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ఈ క్రమంలో 30 లక్షల రూపాయల వ్యయంతో 3 గ్రామైఖ్య సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు.చెన్నూరు నియోజకవర్గంలో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో 35 భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్,పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు,పెరటి కోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాలలో ప్రోత్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తుందని తెలిపారు.మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించి,బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు.రుణం పొందిన స్వయం సహాయక సంఘాలు సకాలంలో చెల్లించి తిరిగి రుణం పొంది తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.మహిళలు తాము చేపట్టిన వ్యాపారాలను క్రమ పద్ధతిలో నిర్వహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాయితీ గ్యాస్ సిలిండర్,గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.జైపూర్ మండలానికి 753 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 200 ఇండ్లు స్లాబ్ స్థాయిలో ఉన్నాయని,ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని  అర్హులైన లబ్ధిదారులకు వచ్చే విడతలో అందించడం జరుగుతుందని తెలిపారు.15 సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు ప్రభుత్వం హెచ్ పి వి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందని, భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.జైపూర్ మండలంలో చేపట్టిన 1 వెయ్యి 250 మెగా వాట్ల  పవర్ ప్లాంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని,ప్లాంట్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన పట్టాదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా దాదాపు 13 వేల కోట్ల రూపాయలతో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ప్రజలతో చెన్నూర్ నుండి హైదరాబాద్ వరకు బస్సు సర్వీసులను నిర్వహించడం జరుగుతుందని,అదనంగా మరొక బస్సు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని,ప్రజా సంక్షేమంలో భాగంగా గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రజా ప్రతినిధులు,అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పారిశుధ్యం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్,ఆరోగ్యం, అరైవ్ అలైవ్,సంక్షేమం,పిల్లల భద్రత,వ్యవసాయం,విద్య, యువత,మహిళలు,పర్యావరణం తదితర అంశాలపై ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి జిల్లాలోని గ్రామపంచాయతీల సర్పంచ్ లు, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపల్ కార్పొరేటర్లు/కౌన్సిలర్లకు జిల్లా కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం మండలంలోని 39 మంది కళ్యాణలక్ష్మి /షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.నిరుపేద ఆడపడుచులకు వివాహానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని,మండలంలో ఇప్పటివరకు 375 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు కలెక్టర్ కుమార్ దీపక్

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వ్యాపార రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళలు ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా అదనపు ఆదాయం పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.గ్రామపంచాయతీలలో కార్యాలయ భవనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మహిళా సమాఖ్య భవనాల ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చర్యలు చేపట్టడం జరుగుతుందని,అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యులను  చేయడం జరిగిందని,తద్వారా ప్రభుత్వ పాఠశాలలను 3 శాతం విద్యార్థుల సంఖ్య పెంపొందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామైఖ్య సంఘాల మహిళలు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సిససా ఆధ్వర్యంలో 17న ఉగాది కవి సమ్మేళనం…

సిససా ఆధ్వర్యంలో 17న ఉగాది కవి సమ్మేళనం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమితి గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళి ధర్ తెలిపారు.బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈనెల 17న గాంధీ నగర్ లోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి హాజరు కానున్నారు.ఈ కవి సమ్మేళనంలో పాల్గొనే కవులకు రచయితలకు, ఉగాది పురస్కారంతో పాటు సన్మానం చేయడం జరుగుతుందన్నారు.
ఈ ఉగాది కవి సమ్మేళనంలో కవులు,రచయితలు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, రచయితలు నేరోజీ రమేష్, సి.సా. స ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ లు
పాల్గొన్నారు.

ద బెస్ట్ రైటర్ అవార్డు అందుకున్న జర్నలిస్టు సమ్మయ్య…

ద బెస్ట్ రైటర్ అవార్డు అందుకున్న జర్నలిస్టు సమ్మయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

సీనియర్ జర్నలిస్టు డాక్టర్ తాళ్లపల్లి వెంకటసమ్మయ్య గౌడ్ ను,
దబెస్ట్ రైటర్ ఆఫ్ దిఇయర్
2026 అవార్డు డాక్టర్ రమేష్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది సికింద్రాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్
లో సిటీకల్చరల్ ఆడిటోరియం వేదికపై మంగళవారం రాత్రి ఆయనకు, ఈ విశిష్ట పురస్కారం అందుకోవడంతోపాటు ఘనంగా సన్మానం చేయడం జరిగింది
31డిసెంబర్ 2024న
టివి సమ్మయ్య గౌడ్ అరుదైన గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా ,మండల కేంద్రమైన గణపురంకు చెందిన ఆయన గత 30 సంవత్సరాలకు మిoచి ఇప్పటిదాకా వివిధ పత్రికలలో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు.ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించిన నారద పత్రిక కు చీఫ్ బ్యూరోగా వ్యవహరిస్తున్నారు.సుమారు 200మించిన కథలు, సామాజిక హితం కోరి, చైతన్యవంతమైన అనేక స్ఫూర్తిదాయక గేయాలు, కవితలు కూడా రాసిన
ఆయన చేసే సాహిత్య సేవను గుర్తించిన స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి,
దబెస్ట్ రైటర్ ఆఫ్ దిఇయర్ 2026గా,ఆయననీ సత్కారం అందుకున్నారు. ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరర్ అండ్ స్ఫూర్తి రీసెర్చ్ అకాడమి సంస్థ ఆయననీ అవార్డుకు ఎంపిక చేసి,శాలువతో ఘనంగా సత్కరించిoది.సంస్థ ఫౌండర్,లయన్ డాక్టర్ ఆకుల రమేష్ , ఆయనీ అవార్డుకు ఎంపిక చేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వుదయం పత్రిక, ఎడిటర్ సిరికొండ ఆగస్యన్,నారద పత్రిక సిఈఓ శ్రీనివాస్ లు అభినందించి సత్కరించారు.

పశువులకు గాలి కుంట టీకాలు వేయించాలి…

పశువులకు గాలి కుంట టీకాలు వేయించాలి

మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని జంగేడులో జాతీయ పశువ్యాధుల నివారణ ఉచిత గాలికుంటువ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ముఖ్యఅతిగా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య పశువర్ధక డాక్టర్ తిరుపతి హాజరైనారు ఈ సందర్భంగా పశువులకు గాలికుంట టీకా వ్యాధులు వేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పశువులలో కాళ్ళలో పుండ్లు ఏర్పడి నడవలేకపోవడం
నోటిలో పుండ్లు ఏర్పడి మేత మేయకపోవడం ఈ వ్యాధి వలన తీవ్రమైన జ్వరం, పాడి పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, పునరుత్పత్తి సామర్థ్యం పని సామర్థ్యం తగ్గడం వల్ల రైతుకు అపారమైన ఆర్థిక నష్టం కలుగుతుంది. వారు అన్నారు
3 నెలలు పైబడిన అన్ని గోజాతి మరియు గేదెజాతి పశువులకు ఈ టీకాలు వేయించండి.
ఈ టీకాలు చూడి పశువులకు కూడా సురక్షితమైనవి.
టీకాలు వేసిన ప్రతి పశువుకు గుర్తింపు చెవిపోగు వేసి వాటి వివరాలు, పశుపోషకుల వివరాలు భారత్ పశు దాన యాప్ లో నమోదు చేయించండి.
రైతులు, పశుపోషకులు అందరూ తప్పక మీ పశువులన్నింటికీ టీకాలు ఇప్పించుకుని మీ విలువైన పశుసంపదను గాలికుంటు వ్యాధి నుండి రక్షించుకోగలరు.
గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తింపు సాధిద్దాం- పశు ఉత్పత్తులకు విలువను పెంచుదాం వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు

క్రీడా పాఠశాల ప్రవేశ ఎంపిక పోటీలు…

క్రీడా పాఠశాల ప్రవేశ ఎంపిక పోటీలు

విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి… ఎంఈఓ కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు ఈనెల 13 వ తేదీ శుక్రవారం కేసముద్రం మండలానికి చెందిన విద్యార్థులకు కేసముద్రం స్టేషన్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ లోని క్రీడా పాఠశాలల్లో నాలుగవ తరగతిలో అడ్మిషన్ల కోసం విద్యార్థులు 12వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, దీనికోసం టి జి ఎస్ ఎస్ తెలంగాణ ప్రభుత్వం అనే వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31 తేదీ మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు.

పరిగి బీజేపీ సారథి ఎవరు…

పరిగి బీజేపీ సారథి ఎవరు?

 

పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు.

నడిపించే నాయకుడు లేక కార్యకర్తల్లో అయోమయం

పరిగి(వికారాబాద్): పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు. పార్టీలో ఏళ్లనుంచి కొనసాగుతున్న కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయకపోయినా కమలం గుర్తు 16వేలకుపైగా ఓట్లు సాధించించింది. లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కంటే బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించింది. ఇటీవలి పురపాలక ఎన్నికల్లోనూ ఉనికి చాటింది. రెండు వార్డుల్లో గట్టి పోటీనిచ్చింది. కొందరు అభ్యర్థులు స్వల్ప ఓట్లతో ఓడారు. పోలైన ఓట్లలో తొమ్మిది శాతం(1,659) సాధించింది. అయితే నాయకత్వలోపం సమస్యగా మారిందని కార్యకర్తలు అంటున్నారు. గతంలో ఎప్పు

డూ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో పది వేలలోపే ఓట్లు పడేవి. అయితే క్రమంగా పార్టీ బలపడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.

దానం నాగేందర్‌, కడియం శ్రీహరికి ఊరట…

దానం నాగేందర్‌, కడియం శ్రీహరికి ఊరట

 

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత (MLA Disqualification Verdict) పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాల్లేవని.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు.

దళితుల భూములకు దారేది?

`అంజనా టౌన్ షిప్ మూసేసిన దారి?

`జమ్మికుంటలో జగజ్జంత్రి భూ మాయాజాలం!

`దారి మూసి అంజనా అక్రమ దందా!

`దారి మూసి.. వరినాట్లేసి..

`అంజనా టౌన్ షిప్ కబ్జా కహాని!

`అధికారులకు పట్టదు.. దళితుల గోడు వినరు?

`లోకా యుక్త ఆదేశాలు పాటించరు?

`మీడియాలో వార్తలు వస్తే నాలుగు రోజులు హడావుడి!

`అధికారులు వచ్చి హద్దులు పాతేస్తారు?

`యధావిధిగా నాలుగు రోజులకు వెంచర్ నిర్వాహకులు తొలగిస్తారు?

`అదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారు?

`ప్రాణాలు తెస్తామని హెచ్చరిస్తుంటారు?

`దళితులకు న్యాయం చేసేదేవరు?

`రాజకీయ ముసుగులో అక్రమ దందా చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు?

`మూడేళ్లుగా అధికారులు పదే పదే హద్దులు పాతుతున్నారు?

`హద్దులు తొలగించిన వారి మీద కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు?

`ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారు?

`అంజనా టౌన్ షిప్ కు అనుమతి 9 ఎకరాల, 30 గుంటలు మాత్రమే.

`సర్వే నంబర్లు 94, 95,100 లో మాత్రమే అనుమతి వుంది?

`103 సర్వే నంబర్ భూమిని టౌన్ షిప్ లో కలిపేసుకున్నారు?

`ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు.. దారి మూసి భూ దోపిడీ చేశారు?

`అందులో గ్రామ నక్షా బాట వుంది.

`అమాయకులను మోసం చేసి అంటగట్టారు!

`అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు!

`తూ తూ మంత్రంగా ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారు!

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                        

 నమ్మకం ముసుగులో నాటకాలు, అమ్మకం ముసుగులో అరాచకాలు బాగా అýవాటు చేసుకుంటున్నారు. రియల్ వ్యాపారమంటేనే మోసం అని రుజువు చేస్తున్నారు. రాజకీయ నాయకులు మరీ దిగజారిపోతున్నారు. అక్రమ సంపాదనలకు తెగబడుతున్నారు. ఓ వైపు ప్రజా ప్రతినిధులై సేవ చేస్తామంటారు. ప్రజలకు కష్టం రాకుండా పాలిస్తామంటారు. కాని ప్రజలను వంచించే మోసాలు చేస్తున్నారు. రియల్ వ్యాపారాలు మొదలు పెట్టి జనానికే కుచ్చు టోపి పెడుతున్నారు. పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటి కల నెరవేర్చుకుందానకునే పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. జీవిత కాలం ఆ కల నెరవేరకుండా చేస్తున్నారు. నమ్మకంగా సాగాల్సిన వ్యాపారంలో అవకతవకలు చేస్తున్నారు. నాయకుడని నమ్మినందుకు నట్టెట ముంచేస్తున్నారు. ఎన్నికల నాడు దళితులకు అండగావుంటామంటారు. వారికి రక్షణగా వుంటామని మాట ఇస్తారు. కాని గెలిచిన తర్వాత మొదట అన్యాయం ఆ దళితులకే చేస్తారు. ఆ దళితుల జీవితాలతోనే ఆడుకుంటుంటారు. రాజకీయాలలో ఓట్లు కొని గెలుస్తుంటారు. వ్యాపారాలు చేసి ప్రజలను మోసం చేసి కోట్లు కూడబెట్టుకుంటారు. ఒకప్ప్పుడు వ్యాపారులే రియల్ వ్యాపారం సాగించేవారు. ఆ రియల్ వ్యాపారులు ప్రజలకు ఏదైనా అన్యాయం చేస్తే నాయకులు కాపాడుతుండేవారు. కాని ఇప్ప్పుడు వ్యాపారులు కనుమరుగైపోయారు. నాయకులే వ్యాపారుల అవతారం ఎత్తుతున్నారు. న్యాయం చేయాల్సిన నాయకులే అన్యాయం చేస్తున్నారు. ప్రజలు తమ గోడును చెప్ప్పుకునే దిక్కులేకుండా చేస్తున్నారు. ఒకప్ప్పుడు అధికారులు తప్ప్పు చేసినా నాయకులే కాపాడుతుండేవారు. ఇప్ప్పుడు నాయకులే తప్ప్పు చేస్తుంటే అధికారులు వెనకేసుకొస్తున్నారు. మొత్తం మీద అటు అధికారులు, ఇటు నాయకులు కలసి జనాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. పేద వారిని మాట లేకుండా చేస్తున్నారు. పేదల జీవితాలను చిదిమేస్తున్నారు. సరిగ్గా అలాంటిదే ఈ సంఘటన. నాయకులంటే అదికారులకు హడల్..అందుకే వారికే అండదండలు కల్పిస్తుంటారు. నాయకులకు ఇబ్బందులు రాకుండా కొమ్ము కాస్తుంటారు. ఇక్కడా అదే జరుగుతోంది. నాయకుడి సేవలో తరించేందుకు ఏకంగా మ్యాపులే అధికారులు మాయం చేశారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వ రికార్డులను కూడా మాయం చేసి, నాయకుడి వ్యాపారానికి అండగా నిలవడం జమ్మికుంటలో కలకలరం రేపుతోంది. కరీంనగర్‌కు చెందిన ఓ బడా నాయకుడు జమ్మికుంట శివారులో వున్న ధర్మారం పరిధిలో ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే వుంది. ఆ వెంచర్ వుండాల్సింది కేవలం 9 ఎకరాల 30 గుంటలు మాత్రమే. ఆ సర్వేనెంబర్లు 94,95,100. కాని అదనంగా ఈ వెంచర్‌లోకి 103 సర్వే నెంబర్ వచ్చి చేరింది. ఇదెలా సాద్యమైందో అధికారులే చెప్పాలి. ఈ వెంచర్ కోసం రిజిస్ట్రేషన్ జరిగింది మూడు సర్వేనెంబర్లే అయితే నాలుగో సర్వే నెంబర్ ఎలా చేరిందన్న దానిపై ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. కొంత మంది ఆ అక్రమ వెంచర్ మీద మూడేళ్లుగా ప్రజా పోరాటం చేస్తున్నారు. 103 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి. అందులో బాట వుంది. కొన్ని శతాబ్దాలుగా ఆ బాటను రైతులు వినియోగించుకుంటున్నారు. ఆ వెంచర్‌కు కొంత దూరంలో దళిత వాడ వుంది. ఆ వాడకు వెళ్లడానికి శతాబ్దాలుగా దళితులు ఆ బాటనే నడుస్తున్నారు. కాని వెంచర్ ముసుగులో ఆ బాటను అంజనా వెంచర్ నిర్వాహకులు మూసి వేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. భయపెడుతున్నారు. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా కొంత మంది ధైర్యం చేసి లోకాయుక్తను ఆశ్రయించారు. అప్ప్పుడు కదిలిన యంత్రాంగం రంగంలోకి దిగినట్లే దిగింది. హడావుడి చేసింది. మళ్లీ ఆ వెంచర్ పెద్దలకు వంత పాడింది. జనం ముందు ఒక మాట చెబుతున్నారు. నాయకుడికి మాటకు నో చెప్పకుండా వుంటున్నారు. గ్రామ నక్ష ప్రకారం వున్న భూమిని ఆక్రమించడమేమిటని అనేక మంది ప్రశ్నిస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా కావడం లేదు. పేదలకు న్యాయం చేయాలన్న సోయి రావడం లేదు. జనం ఒత్తిడిని తట్టుకోలేక, లోకాయుక్త ఆదేశాలతో ఒకటి రెండుసార్లు ఆ బాటకు అధికారులు హద్దులు పాతారు. కాని ఏం జరిగింది. అటు అధికారులు హద్దులు పాతడం, మరునాడు వెంచర్ నిర్వాహకులు వాటిని తొలగిండచం కామనైపోయింది. ఆ బాట వుందన్న విషయాన్ని గతంలోనే అధికార గణం నిర్దారణ చేసింది. 9 ఎకరాల్సిన వెంచర్‌లోకి 103 సర్వే నెంబర్‌ను కలిపేసుకొని 11 ఎకరాల 4 గుంటలు లేఅవుట్ పర్మిషన్ వుందని అబద్దాలు ప్రచారం చేశారు. అదికారులు కూడా ఆ వెంచర్ అధినేతతో చేతులు కలిపారన్న ఆరోపణలు అనేకం వున్నా స్పందన లేదు. విచిత్రమేమిటంటే అక్రమంగా ఆక్రమించిన 103 సర్వే నెంబర్ భూమిలో కూడా ఆ వెంచర్ నిర్వాహకులు ప్లాట్లు చేసి విక్రయించేశారు. అమాకులను మోసం చేశారు. దానిపై కొంత మంది సామాజిక కార్యకర్తలు పోరాటాలు చేస్తే జిల్లా కలెక్టర్ కదిలారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. 103 సర్వే నెంబర్‌లో ఎట్టి పరిస్దితుల్లోనూ ఇంటి నిర్మాణాలకు అవకాశంలేదని, మున్సిపల్ అధికారులు ఎలాంటి అనుమతులు జారీ చేయొద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో బాట పోవడం తో గ్రామ ప్రజలు, ముఖ్యంగా దళితులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ భూమి అని తెలియక, వెంచర్ నిర్వాహకుల మోసానికి కొనుక్కున వారు బలయ్యారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ప్లాటు కొనుక్కుంటే ఇల్లు కట్టుకోవడానికి వీలులేకుండాపోయిందని వారు లబోదిబోమంటున్నారు. అయితే అది ఆషామాషీ నాయకుడు వేసిన వెంచర్ కాదు. ఆయన రాజకీయాల్లో పెద్ద నేత. జిల్లా రాజకీయాల్లో కీలక నేత. అందుకే ఆయనకు దళితుల దారిని మూసేయడం పెద్ద లెక్కకాలేదు. చ{్టమంటే ఆయనకు భయం లేదు. అందుకే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు. అసలు దారి మూసి దరిద్రపు దందా చేయాల్సిన అవసరం లేదు. కాని సొమ్మంటే ఎవరికి చేదు. అక్రమంగా లక్షలు వస్తున్నాయంటే ఎవరు ఊరుకుంటారు అన్నట్లే వుంది. ఆ నాయకుడి వ్యవహారం. వెంచర్ మధ్యలో ప్రభుత్వ భూమి వుందని, అది ప్రజలకు ఉపయోగపడే దారి అని తెలిసినా ఆక్రమించారంటే ఎంత జగజ్జంత్రీ నాయకుడో అర్ధం చేసుకోవచ్చు. నన్ను ఎదరించే ధైర్యం ఎవరికి వుందన్న అహం కూడా తోడు కావడంతో ఇదంతా జరుగుతోంది. అదికారులు , నాయకులు కలిస్తే ఎలా వుంటుందో ఈ వెంచర్‌ను చూస్తేనే అర్దమౌతోంది. అసలు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం ఒక ఎత్తైతే, దానిని ప్రైవేటు వ్యవసాయ భూమి అని వరి నాట్లు వేయడం మరీ విడ్డూరం. విచిత్రం. సామాజిక కార్యకర్తల ఒత్తిడి తట్టుకోలేక అధికారులు వచ్చినట్లు రావడం, వరి నాట్లు చూసి ఇప్పటికిప్ప్పుడు చర్యలు తీసుకోలేమని వెళ్లిపోవడం అలవాటుగా మారింది. దళిత వాడకు వెళ్లే ప్రజలకు శాపమైంది. అసలు లోకాయుక్త ఆదేశాలను కూడా అదికారులు అమలు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. అయినా పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? రెవిన్యూ యంత్రాంగం ఏం చేస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడితో ప్రభుత్వ భూమిని కబ్జాపెట్టిన నాయకుడికి, ప్రజా ప్రభుత్వంలో కూడా ఎలా అండదండలు కొనసాగతున్నాయనేదానికి సమాధానం చెప్పే వారు లేరు. దళితులకు న్యాయం చేయాలని అడిగే నాయకుడు లేకుండాపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. అదికారుల మీద ఒత్తిడి తేవడం లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అంజనా టౌన్ షిప్‌లో భాగమని చూపిస్తున్న ప్రభుత్వ భూమికి సంబంధించి రెవిన్యూ అదికారులు, పోలీసు శాఖ ఎందుకు ఇంత వరకు బోర్డు ఏర్పాటు చేయడంలేదు. అది ప్రభుత్వ భూమి, ఎవరూ కొనుగోలు చేయొద్దని అదికారులు ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హద్దులు చెరిపేస్తే చట్ట పరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రభుత్వం అధికారికంగా పాతిన హద్దులను చెరిపేసేంత ధైర్యం ఆ నాయకుడు ఎలా చేస్తున్నాడు? అధికారులు చేతులు కట్టుకొని చోద్యం ఎందుకు చూస్తున్నారు? ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారులు ఏం సంకేతాలిస్తున్నారు? అమాయక ప్రజలకు తోడుగా నివాల్సిన అదికారులు టౌన్ నిర్వాహకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?

నరేందర్ రెడ్డి కీ శుభాకాంక్షల వెల్లువ…

నరేందర్ రెడ్డి కీ శుభాకాంక్షల వెల్లువ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఎంపిక కావడం పట్ల నర్సంపేట ప్రాంతంలో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో అసెంబ్లీ డిలిమిటేషన్‌కు ముందు మానుకోట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా సేవలందించిన వేం నరేందర్ రెడ్డి, నెక్కొండ మండల ప్రజలకు మరియు స్థానిక నాయకులకు సుపరిచితుడు.
ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నేతృత్వంలో భూంపల్లి దేవేందర్ రావు, చల్ల శ్రీపాల్ రెడ్డి కలిసి వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాజ్యసభలో తెలంగాణ సమస్యలను బలంగా ప్రస్తావిస్తూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలందించాలని ఆకాంక్షించారు.
వేం నరేందర్ రెడ్డి రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం రాజ్యసభలో రాష్ట్రానికి మరింత ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

పక్కగా భూ హక్కులకోసం రీసర్వే జిల్లా అదనపు కలెక్టర్ నగేష్..

పక్కగా భూ హక్కులకోసం రీసర్వే జిల్లా అదనపు కలెక్టర్ నగేష్..

పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు..

రామాయంపేట మార్చ్ 10 నేటి ధాత్రి (మెదక్)

 

మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు.

ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు.
భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు…

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/ZJjBTyuVhcQ?si=VyRoN5ZtE9KdMQDl

జయశంకర్ జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ మారేపల్లి కొమురయ్య అధ్యక్షతన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య సిపిఐ ఎం ఎల్ లిరీబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డీలర్ స్వరూప విచ్చేసి ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లయ్య సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లీ మల్లేష్ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను మూఢనమ్మకాలను రూపుమాపుతూ అందరికీ విద్యను అందిస్తూ వారి హక్కుల కొరకు పోరాడిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని అన్నారు. ఆమె మహారాష్ట్రలోని సతార జిల్లాలో 1831 జనవరి 3న జన్మించి 18 97 మార్చి 10 ప్లేగు వ్యాధితో మరణించిందని తెలిపారు. ఆమె బాలికలకు మహిళలకు అందరికీ సమానంగా విద్యను అందించి వారి హక్కులు మూఢనమ్మకాలు కుల నిర్మూలన కొరకు పోరాడిన మహనీయులన్నారు. సావిత్రిబాయి పూలే తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే ద్వారా చదువు నేర్చుకుని 1848లో మొదటి పాఠశాలను ఏర్పాటు చేసిందనీ తెలిపారు. 1852లో మహిళ సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసిందన్నారు అలాగే 1853లో వితంతు మహిళ అనాధ శిశువుల కోసం సేవాసదానం ప్రారంభించింది అన్నారు 1872లో బ్రాహ్మణ వితంతు కుమారుడి యశ్వంత్ ని పిల్లలు లేనందున దత్తత తీసుకున్నారని చెప్పారు. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ తన కుమారుడికి కులాంతర వివాహం జరిపిందన్నారు. 1896లో కరువు వచ్చి అల్లాడిపోతున్న ప్రజలను రక్షిస్తూ మరో పక్క ప్లేగు వ్యాధిత బాధపడుతున్న ప్రజలకు అన్ని విధాల ప్లేగు వ్యాధి నుంచి కాపాడిందని తెలిపారు. చివరకు సావిత్రిబాయి పూలే కు ప్లేగు వ్యాధి సోకి 1897 మార్చి 10న మరణించిందనీ తెలిపారు
ఈ కార్యక్రమంలో టేకుమట్ల సర్పంచ్ మాట్ల శ్రీనివాస్ బూర్ణపెళ్లి సర్పంచ్ నేరెళ్ల రామకృష్ణ సర్పంచ్ తోట సాగర్ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామ్ చందర్ అంబేద్కర్ యువజన సంఘం టౌన్ మాజీ అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ మాజీ ఉపసర్పంచ్ నిమ్మల స్వామి మాజీ ఉప సర్పంచ్ మచ్చ రాజయ్య తదితరులు పాల్గొన్నారు

పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం ఎమ్మెల్యే జీఎస్సార్….

పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పశువుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టారు.గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పశువులకు సోకే గాలికుంట వ్యాధి నివారణకు టీకా కార్యక్రమాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి పశువులకు టీకాలు వేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. గాలికుంట వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా టీకాలు వేయించడం అవసరమని సూచించారు. ప్రభుత్వం రైతుల పశుసంపదను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంటోందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్, ఉపసర్పంచ్ మారబోయిన ఐలయ్య,ప్రజాప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ గ్రామస్థులు పాల్గొన్నారు.

మరణించిన కుటుంబానికి కోటిరుపాయల భీమా చెక్కు అందజేత…

మరణించిన కుటుంబానికి కోటిరుపాయల భీమా చెక్కు అందజేత

పరకాల,నేటిధాత్రి

పరకాల డిపోకు చెందిన కోచ్ బిల్డర్ దివంగత పి.రవి ఈనెల 1న జరిగిన ప్రమాదంలో మరణించగా ప్రమాద మరణ బీమా క్లెయిమ్ కింద కోటి రూపాయల విలువైన చెక్కును వరంగల్ రీజనల్ మేనేజర్ దర్శనం విజయ భాను సమక్షంలో యూనియన్ బ్యాంక్ హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ టి.కామేశ్వర్ రావు మరియు యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.కమలాకర్ తో కలిసి అందజేశారు.ఈ సందర్బంగా రీజనల్ మేనేజర్ దర్శనం విజయ భాను మాట్లాడుతూ ఉద్యోగులు ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండాలని తమ కుటుంబ భద్రత దృష్ట్యా బీమా పథకాలను వినియోగించుకోవడం చాలా అవసరమని తెలిపారు.అలాగే యూనియన్ బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీ రేట్లతో అందిస్తున్న గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు,విద్యా రుణాలను ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్)భాను కిరణ్, పరకాల డిపో మేనేజర్ రామ్ ప్రసాద్,వరంగల్1డిపో మేనేజర్ అర్పిత,పర్సనల్ ఆఫీసర్ సైదులు,అకౌంట్స్ ఆఫీసర్ రవీందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version