ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్
కోటగిరి సతీష్ గౌడ్ టేకుమట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు ప్రకారం నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ కేబినెట్ మంత్రి వర్గానికి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో పాల సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జిఎస్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం. ఈ సందర్భంలో ఇంత గొప్ప పార్టీలో ఒక బీసీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని సతీష్ గౌడ్ తెలిపారు.గత అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి,అన్ని పార్టీలతో మంతనాలు జరిపి రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేలా చొరవ చూపిన మంత్రులు,ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.విద్యా, ఉద్యోగరంగం తో పాటు రాజకీయంగా,ఇతర అన్ని అంశాల్లో బీసీ రిజర్వేషన్ అందుబాటులోకి వస్తే ఎంతో ఉన్నతి చెందుతారని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయించి ఫలాలను అందించేలా కృషి చేయాలని అన్ని పార్టీల నేతలను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.