కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

* 22,00,352 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

నేటిధాత్రి, చేవెళ్ల :

 

 

 

 

చేవెళ్ల మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కాలే యాదయ్య కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న పేద కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఉపశమనంగా నిలస్తుందన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీపరిధికి చెందిన మొత్తం 22 మంది లబ్ధిదారులకు రూ.22,00,352 లక్షల విలువైన చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఆర్థిక భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అన్నారు. పేద కుటుంబాల పెళ్లి అవసరాలకు ప్రభుత్వం సహాయం అందించడం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి. కృష్ణయ్య, చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ 15వ వార్డు కౌన్సిలర్ బండారి శైలజా ఆగిరెడ్డి, మాజీ డిసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల్ పి. ఏ. సి. ఎస్ చెర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆలంపల్లి వీరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు యాదిరెడ్డి, క్రిష్ణ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు, రాంరెడ్డి, శంకర్, ప్రభాకర్, టేకులపల్లి శ్రీనివాస్, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

పేదింటి కలను నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యం..

పేదింటి కలను నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యం

* ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

నేటిధాత్రి,చేవెళ్ల:

 

ప్రతి పేద కుటుంబం సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. బుధవారం
చేవెళ్ల మండల పరిధిలోని దుద్దాగు గ్రామంలో నూతనంగా నిర్మించిన గూడెం చంద్రకళ, ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రామ సర్పంచ్ కావలి లక్ష్మి ప్రసన్న శేఖర్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలంటే సొంత ఇల్లు అవసరమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు లబ్ది పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా సర్పంచ్ కావలి లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెంటయ్య గౌడ్,చేవెళ్ల మండల నాయకులు, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పడాల ప్రభాకర్,మాజీ ఎంపీటీసీ న్యాలట బుచ్చయ్య,సింగప్పగూడెం,సర్పంచ్ రవి,తల్లారం దుద్దాగు ఉప సర్పంచ్ మొహమ్మద్ నవాజ్ వార్డు నెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికబద్దంగా గ్రామాల అభివృద్ధి…

ప్రణాళికబద్దంగా గ్రామాల అభివృద్ధి

* ఎమ్మెల్యే కాలే యాదయ్య
* శంకర్పల్లి మండలంలో 1కోటి అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో 1.కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని ప్రణాళికాయుతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. లక్ష్మారెడ్డిగూడ 25లక్షలు, గాజులగూడ 35లక్షలు, ,అంతప్పగూడ 25లక్షలు ,కొత్తపల్లి 25లక్షలు, గ్రామాలలో కోటి రూపాయల విలువైన ( సీసీ రోడ్డు & స్ట్రీట్ లైట్స్)వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేశారు. ఈ కార్యక్రమాలలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version