దిగ్విజయంగా 180వ వారం అన్నదాన కార్యక్రమం.పాల్గొన్న హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ

దిగ్విజయంగా 180వ వారం అన్నదాన కార్యక్రమం.పాల్గొన్న హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

సమాజం పట్ల బాధ్యతతో, మానవతా దృక్పథంతో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని స్థానిక ప్రజలు కొనియాడారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గత 180 వారాలుగా కొనసాగుతున్న ఉచిత అన్నదాన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది.
​ఈ వారం అన్నదాన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ పాల్గొని భక్తులకు, పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వారం క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోప్ సభ్యులు తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయమని అన్నారు.
​అత్యధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసినప్పటికీ, క్రమశిక్షణతో అందరికీ భోజన వసతి కల్పించడం ఫౌండేషన్ యొక్క అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడమే పరమావధిగా చైర్మన్ కొండా విజయ్ కుమార్ చేపడుతున్న అనేక ఇతర సేవా కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా స్థానికులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపిన…

ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపిన

విద్యార్థినిలను సన్మానించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి

 

వనపర్తి నేటిదాత్రి .

 

ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మైనార్టీ విద్యార్థినిలు ఇంటర్ లో మార్కులు సాధించ డము తో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారిని శాలువతో సన్మానించారు ఎం.పి.సి మొదటి సంవత్సరంలో అఫ్సా ఖైరన్ 470మార్కులకు 459మార్కులు సాధించింది. ఎం.పి.సి రెండవ సంవత్సరంలో సాయిదా అతియా మహమూది 1000మార్కులకు 916 మార్కులు సాధించింది.సి.ఈ.సి రెండవ సంవత్సరంలో 1000మార్కులకు గాను843 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు చదువులోనే కాకుండా విద్యార్థులు పరిసరాలు,సమాజం ,కుటుంబం పట్ల అవగాహన కల్పించుకొని సమాజ అభివృద్ధికి తోడుపడుతూ పుట్టిన ఊరికి,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారువిద్యార్థినులకు నిరంజన్ రెడ్డి స్వీట్స్ పంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమములో అధ్యాపక బృందం నాజియా బేగం,అబ్దుల్ రెహ్మాన్
నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,నందిమల్ల.అశోక్,కె.మాణిక్యం,బండారు.కృష్ణ,జోహెబ్ హుస్సేన్,సయ్యద్.జమీల్, స్టార్.రహీమ్,అస్లాం,మాధవ్ రెడ్డి, వెంకట్ సాగర్,మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము,అలీమ్,తోట.శ్రీను తదితరులు ఉన్నారు.

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వం…

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వం

33 శాతం మహిళా రిజర్వేషన్లు బేషరతుగా అమలు చేయాలి

వరంగల్‌లో ఎంసిపిఐ(యు) నిరసన ర్యాలీ

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి :

దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా రాజ్యాంగ సవరణలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపడుతోందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆందోళన వ్యక్తం చేశారు. 2023లో తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును బేషరతుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కమిటీ పిలుపుతో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమం జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత రాజ్యాంగాన్ని బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అశాస్త్రీయ పద్ధతుల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు రాజ్యాంగ సవరణలకు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు.మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా, దాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా తీసుకొస్తున్న విధానాలపై ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల గౌరవం ఉంటే ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి హంసారెడ్డి, నర్ర ప్రతాప్, మాలోత్ సాగర్, కర్ర రాజిరెడ్డి, ముక్కెర రామస్వామి, చుంచు జగదీశ్వర్, మహమ్మద్ మహబూబ్ పాషా, ఎగ్గని మల్లికార్జున్, చీపురు ఓదెలు, మాలి ప్రభాకర్, అప్పనపురి నరసయ్య, బాబు రామస్వామి, జట్టి రాజు, అడపా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరాదిపై దక్షిణాది విజయం!బిల్లు ఎలా వీగింది..

ఉత్తరాదిపై దక్షిణాది విజయం!బిల్లు ఎలా వీగింది?

డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం యావత్తు దేశాన్ని తట్టి లేపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేంటంటే… ఉత్తరాది ప్రాధాన్యాన్ని మరింతగా పెంచుతూ దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే దిశగా జరుగుతున్న ఎన్డీఏ ఎత్తులన్నీ చిత్తు అయ్యాయయన్నదే ఆ విశ్లేషణ సారాంశం.

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ఎన్డీఏ ఆలోచనతో ఒక్కసారిగా పెద్ద చర్చకే తెర లేసింది. జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాదిలో లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గిపోతుందని, అదే సమయంలో ఇప్పటికే అధిక సంఖ్యలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లోక్ సభ సీట్ల సంఖ్య మరింగా పెరుగుతందన్న ఆందోళన మొదలైంది. ఇదే జరిగితే… కేంద్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకునే పార్టీలు ఇకపై దక్షిణాది రాష్ట్రాల్లోని లోక్ సభ సీట్లతో సంబందం లేకుండానే తమ పని ముగించుకుంటాయన్న వాదనా వినిపించింది. వెరసి దక్షిణాది రాష్ట్రాలకు అసలేమీ ప్రాధాన్యం దక్కదని, నిధుల విడుదలలో భారీ అంతరం చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదని నిపుణులు విశ్లేషించారు.

గురు, శుక్రవారాల్లో జరిగిన చర్చల్లో ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకూ తీరని నష్టం జరుగుతుందన్న వాదనను వినిపించారు. ఈ క్రమంలో విపక్షాల్లోని దక్షిణాది భయాందోళనలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి… జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ను చేయడం లేదని చెప్పింది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత లోక్ సభ స్థానాలకు అదనంగా 50 శాతం సీట్లు పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే ఆ విషయాన్ని మాటమాత్రంగా కాకుండా బిల్లులో లిఖితపూర్వకంగా చేపట్టాలని విపక్షాలు కోరాయి. 

ఆ తర్వాత జరిగిన ఓటింగ్ లో విపక్షాలకు చెందిన సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేసినా… మూడొంతుల్లో రెండు వంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోయింది. బిల్లు వీగిపోయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ సీఎంలు ఎంకే స్టాలిన్, ఎనుముల రేవంత్ రెడ్డిలు హర్షం ప్రకటించారు. వెరసి ఉత్తరాది వాదనపై దక్షిణాది విజయం సాధించిందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తించాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version