స్కూల్ లో ఫుడ్ ఫెస్టివల్
నిజాంపేట, నేటి ధాత్రి
నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల రిషిక్ పబ్లిక్ స్కూల్ లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించడం జరిగిందని కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, స్వామి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. కార్యక్రమంలో సంధ్య, స్వప్న, భాగ్యలక్ష్మి, లావణ్య టీచర్లు ఉన్నారు.
