రక్త దానం చేద్దాం ప్రాణాలను కాపాడుదాం.

రక్త దానం చేద్దాం ప్రాణాలను కాపాడుదాం.

#రక్తదాతల సేవ స్ఫూర్తి అభినందనీయం.

#జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవ స్ఫూర్తి ప్రశంసా నియమని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు.
శనివారం ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ -టి జి ఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ దేవాలయ సమీపంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర
టి.ఎస్.సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని, రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని, అది ఒక గొప్ప సామాజిక సంస్కృతిగా మారాలని ఉద్ఘాటించారు. జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్స లలో ఎంతో కీలకమని, ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య సేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందని అన్నారు.
జిల్లాలోని ప్రజలు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు,యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావులు రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, డి ఆర్ డి ఓ చంద్రశేఖర్, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్, ఉద్యోగ సంఘ ప్రతినిధులు, యువత, వైద్య బృందం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేడు రక్తదాన శిబిరం..

నేడు రక్తదాన శిబిరం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, జనవరి 11: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ నెల 12న స్థానిక పద్మశాలి భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పద్మశాలి యువజన సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. సోమవారం ఉదయం 8.30 నుండి 1.00 వరకు రక్తదాన శిబిరం కొనసాగుతుందని, 60 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఎవరైనా ఈ శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేయవచ్చని పేర్కొన్నారు. రక్తం దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదాతగా నిలుస్తారని శిబిరంలో రక్తదానం చేసినవారికి ధ్రువపత్రం కూడా జారీ చేయబడుతుందని వివరించింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు రావాలని పిలుపునిచ్చింది.

రక్తదానం ప్రాణధానంతో సమానం…

రక్తదానం ప్రాణధానంతో సమానం

– అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరై, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేసి, రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్వచ్చందంగా యువత ,ప్రజలు,ఆటో డ్రైవర్లు,పోలీస్ అధికారులు, నేతాజీ డిగ్రీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది సుమారు 460 మంది రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందించదగ్గ విషయమని, విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లోను ముందు వరసలో వుంటారని, ముఖ్యంగా రక్తదానంపై వున్న ఆపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో,ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మధుకర్, నటేష్,ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు, డాక్టర్ సంధ్యారాణి,కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గుడ్లరవి,పెండ్యాల కేశవరెడ్డి, బుస్స ఆంజనేయులు ,కరీంనగర్,సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు…

పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు – యువకులు ముందుకు రావాలని వర్ధన్నపేట పోలీసుల విజ్ఞప్త

వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థంగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని యువజన సంఘాలు, యువకులు స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనాలని వర్ధన్నపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఈ నేపథ్యంలో వర్ధన్నపేట పోలీస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 29, 2025 (బుధవారం) ఉదయం 10 గంటల నుండి పాలకుర్తి బసారత్ ఫంక్షన్ హాల్ వద్ద ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడనుంది.
వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఉప పోలీస్ అధికారి ఎన్. సాయి బాబు మాట్లాడుతూ —
“దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగానికి గౌరవం తెలపడానికి రక్తదానం చేయడం ఒక మహత్తరమైన సేవ. ప్రతి గ్రామంలోని యువజన సంఘాలు, విద్యార్థులు, ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. మనం ఇచ్చే ఒక్క సీసా రక్తం ఎవరికో కొత్త జీవం అందించగలదు” అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక యువజన సంఘాలు, సామాజిక సేవా సంస్థలు చురుకుగా పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. రక్తదానం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని, ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.
ఈ రక్తదాన శిబిరం నిర్వహణలో స్థానిక వైద్యులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సహకారం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. సంప్రదించవలసిన వారి నెంబర
SI ఎన్. సాయి బాబు – 8712685215
PC అజయ్ – 8712552532

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version