ప్రజాస్వామ్యాన్ని మంత్రి వివేక్ ఖూనీ చేస్తున్నారు
అంగబలం,అర్థబలం,అధికార మదంతో దౌర్జన్యంచేస్తున్నా మంత్రి వివేక్ ఖబర్దార్
మంత్రి వివేక్ బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ములుగు జిల్లా బిఆర్ఎస్ దళిత నాయకులు
మంగపేట,నేటిధాత్రి
చెన్నూరు మున్సి పాలిటీలో ప్రజలు తీర్పు ఇచ్చి కార్పొరే టర్లను గెలిపిస్తే ఆ తీర్పును గౌరవించా ల్సింది పోయి పోలీసుల అండతో అధికార మదంతో ప్రతిపక్ష నాయకులు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ చేపించ డం అక్రమంగా నిర్బం ధించడం ప్రజాస్వా మ్యానికే గొడ్డలి పెట్టని ములుగు జిల్లా బిఆ ర్ఎస్ దళిత నాయ కులు చీట్టిమల్ల సమ్మయ్య అన్నారు. ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్య క్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు మంగపేట మండల రాజుపేటలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకుల సమావేశం అయన మాట్లాడుతూ తెలంగాణ రాజకీ యాల్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ప్రజాస్వామ్యమా?లేక ధనస్వామ్యమా? అనే అనుమానం కలగక మానదు అధికారం.. అహంకారం అక్రమ నిర్బంధంతో ఉద్యమ నాయకుడు బాల్క సుమన్‌పై జరుగుతున్న దాడులు ఆయనను అక్రమంగా జైల్లో పెట్టడం కేవలం భయాం దోళనలను సృష్టించే పిరికిపంద చర్య మంత్రి వివేక్ తనకున్న వేల కోట్ల ఆస్తుల అహంకా రంతో పోలీసులను పావులుగా వాడు కుంటూ సామాన్యు లపై, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనా యించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో తొక్కి,ఆర్థిక బలంతో రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటు పదవుల కోసం పాకులాట విలువలు లేని రాజకీ యంపూటకో పార్టీ మారి పదవుల కోసం ఎవరి కాళ్ళకైనా మొక్కే సంస్కృతి మంత్రి వివేక్ ది అని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కేవలం రాజ కీయ కక్ష సాధింపులే ధ్యేయంగా పని చేస్తు న్న ఈ కాంగ్రెస్ ప్రభు త్వానికి కాలం దగ్గరప డింది అర్థబ లంతో అధికారాన్ని కొనాలని చూస్తే,అదే ప్రజలు రేపు మిమ్మల్ని కాలగర్భంలో కలిపే యడం ఖాయం అని హెచచ్చరిం చారు.ఈ కార్యక్ర మంలో బిఆర్ఎస్ దళిత నాయకులు బియ్యం శ్రీను,నిమ్మగడ్డ ప్రవీణ్,కర్రీ శ్రీను,బోడ ప్రసాద్,నిట్ట శ్యాం ప్రసాద్,పతేమ్ సందీప్, పాల్గొన్నారు.
