నిరుపేదల పెన్నిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలు ఉన్నాయని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిజాంపేట గ్రామానికి చెందిన పాక ప్రియాంక కు చెందిన చెక్కును 60వేల రూపాయలు పాక స్వామికి సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదల పెన్నిధిగా సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట పట్టణ అధ్యక్షులు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్, జ్వాల శ్రీకాంత్, శ్రీకాంత్ గౌడ్ లు ఉన్నారు.
మిషన్ భగీరథ వాటర్ మెన్ లకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక.
జడ్చర్ల / నేటి ధాత్రి
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసే విషయంలో నిర్లక్ష్యం వహించే వాటర్ మెన్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కూడా హెచ్చరికలు చేసినా తమ వైఖరిని మార్చుకోని వాటర్ మెన్ లను విధుల నుండి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేసవి కాలంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది పైనే ఉందని చెప్పారు. ఈ విషయంగా శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మిషన్ భగీరథ వాటర్ మెన్ ల పనితీరుపై తమకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. కొంతమంది వాటర్ మెన్ లు సకాలంలో నీటిని విడుదల చేయకపోవడం, నిర్ణీత వేళలలో తగినంత సమయం నీటి సరఫరా చేయకపోవడం వల్ల పలు గ్రామాలలో ప్రజలు త్రాగునీటి కి ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతాలలో ప్రజలకు తక్కువ నీటిని సరఫరా చేసి తమకు కావాల్సిన పరిశ్రమలకు ఎక్కువ నీటిని పంపిణీ చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయన్నారు.ప్రత్యేకించి బాలానగర్, జడ్చర్ల మండలాల్లో వాటర్ మెన్ లపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వాటర్ మెన్ లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉన్నా మానవతా దృక్పథంతో తాము ఆ పని చేయలేదన్నారు. అయితే ప్రస్తుతం వేసవిలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వాటర్ మెన్ ల కారణంగా ప్రజలు నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తాను సహించేది లేదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇకనైనా వాటర్ మెన్ లు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ నిర్ణీత వేళలలో నీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కాగా మిషన్ భగీరథ వాటర్ మెన్ ల కారణంగా ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడి నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటే ప్రజలు జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అనిరుధ్ రెడ్డి ప్రజలకు సూచించారు. మిషన్ భగీరథ అధికారులు కూడా నీటి సరఫరాను, వాటర్ మెన్ ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరారు.
భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు జై భీమ్ జై సంవిధానం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో శనివారం రోజున గొల్లపల్లి బస్వ రాజుపల్లి రవినగర్ జంగుపల్లి, భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు,జై భీం,జై సంవిధాను లో బాగంగా మండలం గ్రామంల లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,రాజ్యాంగ పిటికలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రేపాక రాజేందర్, ఆధ్వర్యంలో కార్యక్రమ మండల ఇన్చార్జి పంతకాని సమ్మయ్య మాజీ ఎంపీటీసీ కాటారం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమారస్వామి, గణపురం మండలం వైస్ ఎంపీటీసీ విడదనేని అశోక్, మండల అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని అన్నారు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ,అణగారిన వర్గాల హక్కులు కాలరాస్తున బీజేపీ వైఖరి నశించాలని నినదించారు. భారత రాజ్యాంగమును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆద్వర్యంలో నెల రోజులు మండల వ్యాప్తంగా జరిగే యాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు,విద్యావంతులు పాల్గొని విజయంతం చేశారు గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఉడిగే అరుణ్ కుమార్, కోటంచ డైరెక్టర్ ఏనుగుల సంపత్, సీనియర్ నాయకులు మర్రి ఐలయ్య, పోలు బుచ్చయ్య, బైకాని రాజ్ కుమార్, లక్కం రాములు, భూతం సంపత్, పాల్గొన్నారు. బసరాజ్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కట్ల మల్లయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ రమేష్, మాజీ ఎంపీటీసీ జంగిల్ భవిత మాజీ వైస్ ఎంపీటీసీ చింతకుంట్ల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ బుగ్గ తిరుపతి, సైన్డ్ల సమ్మయ్య, సైన్డ్ల తిరుపతి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు రవినగర్-జంగుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు జంగా వెంకట నరసయ్య, మాజీ సర్పంచ్ మంజుల- భాస్కరరావు, మానుక మధు, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు
దళితుల హక్కుల కోసం పోరాడిన సంఘసంస్కర్త డాక్టర్ జగ్జీవన్ రామ్
ఆయన జీవితం యువతకు స్ఫూర్తి దాయకం
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
సమాజంలో దళిత బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు గొప్ప సంఘ సంస్కర్త జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ధూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన జయంతిని పురస్క రించుకొని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహానుభా వుడు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించడమే కాకుండా స్వాతంత్ర అనంత రం చిన్న వయసులో కేంద్ర క్యాబినెట్ లొ కార్మిక కమ్యూని కేషన్ మంత్రిగా పని చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకొనిపనిచేయా లని అన్నారు ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు మారపల్లిరవీందర్ ,చిందం రవి దుబాసి కృష్ణమూర్తి, కట్టయ్య, మార్కండేయ, మస్క కుమారస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలు దంతులను సన్మానం చేసిన బీజేపీ నేతలు వనపర్తి నేటిదాత్రి :
హిందూ రాష్ట్ర సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్ శ్రీమతి నారాయణ దాస్ జ్యోతి రమణ దంపతులను ఎంపికైనందున వనపర్తి పట్టణ 11 వ వార్డు రామ్ నగర్ కాలనీ కి చెందిన కాటమోనీ కృష్ణ గౌడ్ బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో 11వ వార్డు రాంనగర్ కాలనీ బిజెపి నాయకులు బోడా భాస్కర్ పట్టణ కార్యదర్శి అక్కల శివ గౌడ్ పట్టణ బీజేవైఎం నాయకులు అడ్డాకుల రాణా ప్రతాప్ 11వ వార్డు బూత్ అధ్యక్షులు 11వ వార్డు బిజెపి నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ చంద్రకాంత్ రాజు రవి తదితరులు ఉన్నారు
సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా తోట ఆగయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశయ జ్యోతిగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల నుండి అందనంత ఎత్తుకు ఎదిగినటువంటి మహా ఉద్యమ శాలి మరియు తన ఆశయాలు తన బాటలో నడవాల్సిందిగా జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ అరుణా రాఘవరెడ్డి మాజీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి,కుంభలా మల్లారెడ్డి, మాట్ల మధు, అగ్గి రాములు, కొయ్యడ రమేష్, చిరంజీవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీనియర్ నాయకులు చర్లపల్లి శ్రీధర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పని చేస్తుందని, ఇచ్చిన మాట నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పేద ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుందని గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల లింగారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ రేషన్ షాప్ డీలర్ మండల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తాహసిల్దార్ జాలి సునీత హాజరై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ సీనియర్ నాయకులు నల్ల లింగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నిరుపేద కుటుంబానికి ఉగాది రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ..సంవత్సరంన్నర కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఎవరు తినకపోయేదని అట్టి బియ్యాన్ని దళారులకు అమ్ముకునే వారిని తెలిపారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్యం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గిరిదారు శివరామకృష్ణ గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ చర్లపల్లి శ్రీధర్ మాజీ ఉపసర్పంచ్ నాగరాజు సిపిఐ మండల కార్యదర్శి నిమ్మల రాజయ్య ఏ ఐ టి యు సి మండల కార్యదర్శి చంద్రమౌళి డాక్టర్ చారి కలపెల్లి స్వామి వనపర్తి ముండయ్య కల్లపల్లి కొమురయ్య రేషన్ కార్డు హోల్డర్లు తదితరులు పాల్గొన్నారు
కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
భూక్య రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూక్యా రమేష్ నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, పిసిసి సభ్యులు దశ్రు నాయక్,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బండారు దయాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,మాజీ సర్పంచ్ సారయ్య, ఎలేందర్,గ్రామ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది
భూక్య రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూక్యా రమేష్ నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, పిసిసి సభ్యులు దశ్రు నాయక్,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బండారు దయాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,మాజీ సర్పంచ్ సారయ్య, ఎలేందర్,గ్రామ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల ఎస్టిపిపి లో అనేక ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా సింగరేణి శాఖలో గత పది సంవత్సరాల కు పైబడి ఒకే దగ్గర ఒకే హోదాలో విధులు నిర్వహిస్తున్న అనేకమంది ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ కి బిఏంఎస్ యూనియన్ తరపున యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ ఎస్టిపిపి లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న అటెండర్ నుండి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నా వారందరూ ఒకే సంస్థలో ఒకే దగ్గర ఒకే విధంగా విధులు నిర్వహిస్తున్న వారిని వెంటనే గుర్తించి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఒకే దగ్గర పది సంవత్సరాల కు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేసే జీవో ఉందని ఆ జీవోను మళ్లీ సమీకరించి ఐదు సంవత్సరాలకు పైబడిన వారిని కూడా బదిలీ చేసే విధంగా ఒక కొత్త జీవోను తీసుకురావాలని బలరాం నాయక్ ని కోరారు.సంస్థలలో ఒకే దగ్గర విధులు నిర్వహించడం వల్ల సింగరేణి పవర్ ప్లాంట్ లో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ నాయకులు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ లక్ష్మారెడ్డి,ప్రధాన కార్యదర్శి దుస్సా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లికి చెందిన గిత్త సాయిచరణ్ తండ్రి ప్రసాద్ అనే యువకుడు పూర్తి వికలాంగుడు తండ్రి కూడా చిన్నతనంలో చనిపోయారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయిచరణ్ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి తనకు చాలా ఇబ్బంది అవుతుందని ఎలక్ట్రికల్ చార్జింగ్ వెహికల్ కోసమని రెండు రోజుల క్రితం చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యంని కలువగా వెంటనే స్పందించి వికలాంగుల జిల్లా సంక్షేమ సంఘం అధికారితో ఫోన్ లో మాట్లాడి సాయిచరణ్ కు వెహికిల్ తొందరగా అందచేయాలని అధికారులతో మాట్లాడి శుక్రవారం ఎలక్ట్రీకల్ ఛార్జింగ్ వెహికిల్ ను అందజేసిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్.మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా సాయి చరణ్ మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు.
విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం • ఎమ్మెల్యే రోహిత్ రావు
నిజాంపేట: నేటి ధాత్రి
విద్య, వైద్యన్నీ అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించి జై బాపు, జైసంవిధాన్ లో భాగంగా మండలం లో ర్యాలీ నిర్వహించారు. అలాగే సన్న బియ్యం, ఆరోగ్య ఉప కేంద్రన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధినీ కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపిస్తుందని కొనియడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్య కళాశాల ను కాంగ్రెస్ హయాంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమాదేవి, కాంగ్రెస్ నాయకులు చౌదర సుప్రభాతరావు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్, సత్యనారాయణ, లింగం గౌడ్, గుమ్ముల అజయ్, దేశెట్టి సిద్దారములు, సత్యనారాయణ రెడ్డి,శ్యామల మహేష్, అధికారులు ఉన్నారు.
చొప్పదండి శాసనసభ్యులు డా.మేడిపల్లి సత్యంకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి
యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా నాయకులు మామిడి దిలీప్ కుమార్
కరీంనగర్, నేటిధాత్రి:
ఎఐసిసి అగ్రనేతలు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలని యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి, పిహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకుని విద్యారంగం మీద అపారమైన పట్టు ఉన్న నాయకులు మేడిపల్లి సత్యంకు రాష్ట్ర విద్యాశాఖ భాద్యతలను అప్పగిస్తే విద్యాశాఖలో కీలక అభివృదిని సాధించగలరని మామిడి దిలీప్ కుమార్ పేర్కొన్నారు.
వనపర్తి లో మృతురాలు కుటుంబాన్ని మాజీ చీఫ్ విప్ రావుల పరామర్శ.
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తిలో 23వ వార్డుకు చెందిన శారద విద్యామందిర్ అధినేత ,ఉపాధ్యాయురాలు శ్రీమతి వి.యస్.కళావతి గారు ఇటీవల గుండెపోటుతో మరణించారు ఈ.విషయం తెలుసుకున్న మాజీ చీఫ్ విప్ రావుల చంద్రశేఖర్ రెడ్డి మృతు రాలు నివాసానికి వెళ్లి కుమారులు శ్రీను,మురళీ పాండులను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు . రావుల వెంట మీడియా ఇంచార్జి నందిమల్ల.అశో క్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,నందిమల్ల. రమేష్, జోహే బ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి, తోట.శ్రీను తదితరులు ఉన్నారు
పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం:ఎమ్మెల్యే కడియం దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఓ చారిత్రాత్మక నిర్ణయం అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.చిల్పూర్ మండలంలోని శ్రీపతి పెళ్లి, మల్కాపూర్, చిన్న పెండ్యాల గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డుదారులకు శుక్రవారం సన్న బియ్యం పంపిణీ చేసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు.రాష్ట్రంలో పెద్దవాళ్లు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే రకమైన అన్నం తినాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
Sanna Rice
ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి ఎన్టీ రామారావు ఎలా గుర్తుండిపోయారో ఈ రోజు సన్న బియ్యం పంపిణీ చెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా అదే స్థాయిలో గుర్తిండిపోతుందని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ మార్గల్లో రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే బియ్యం పేదల కడుపు నింపాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఒక్కరికీ 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందని అన్నారు.సన్న బియ్యం పంపిణీ లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని ప్రభుత్వం అందించే సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే వర్షాకాలంలోపు మల్లన్న గండి లిఫ్ట్ పనులను పూర్తి చేసి చిల్పూర్ మండలానికి సాగునీరు అందించే బాధ్యతనాదని హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి ప్రతీ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాని వెల్లడించారు.ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాలువల వెంట తిరుగుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కాలువల నిర్మాణం, పూడికతీత, చెట్ల తొలగింపు వంటి పనులను వేగవంతం చేసి పంటలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మరో ఏడాది కాలంలో నియోజకవర్గం లోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్దే నా ఏకైక ఎజెండా అని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే వరకు విశ్రమించనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,మండల రేషన్ డీలర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం మాదాయ పల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప్పలా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. రూ. 3 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ హైమావతి రామస్వామి, యాదయ్య, సుధాకర్, దశరథం, లక్ష్మీనారాయణ, పరంజ్యోతి, యాదయ్య, శేఖర్, యాదయ్య, పెంటయ్య, రామస్వామి, మైసయ్య, జంగయ్య, మైసయ్య, లక్ష్మయ్య, మల్లేష్, పరుశరాములు, పర్వతాలు, సత్యం, రాజు, రవి, కుమార్, భగవంతు, రమేష్, శ్రీశైలం, అశోక్, వినోద్, సతీష్, ప్రశాంత్, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
జైబాపు, జై భీమ్, జైసం విధాన్ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు
శాయంపేట నేటిధాత్రి:
MLA lays foundation stone for construction of Indiramma’s houses
శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు పాల్గొన్నారు. రైస్ మిల్లు నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మనదేశ రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాం క్షలు నెరవేరటంలేదని, ప్రధా నికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్,గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్రగ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగా న్ని బీజేపీపార్టీ అనగాదొక్కా లని చూస్తుందని అన్నారు అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాల ను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. గట్లకానిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న పథకాలలో ఒకటి ఇందిర మ్మ ఇండ్లు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఉన్నవా రికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగిం చుకోవాలని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పదేళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమా లల్లో వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చలో HCU కార్యక్రమానికి తరలిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు. క్యాంపస్‌లో 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఇందిరమ్మ పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ ఆపాలని HCU భూములను రక్షించాలన్నారు. విద్యార్థుల గొంతును నొక్కాలని చూస్తే, తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మరింత మిన్నంటుతుంది! రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువత ఏకమై ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.